|
|
Home >> Parenting
మా పిల్లలు పోట్లాడుకుంటున్నారు!
ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరి మధ్య రెండేళ్ళ గ్యాప్ ఉంది. మా సమస్యల్లా ఎప్పుడూ వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు. ఒకరిపైన మరొకరు చాడీలు చెబుతారు. ఒకరంటే మరొకరికి అసూయ, ద్వేషం. ఎందుకు ఇలా జరుగుతోంది? - ఎం. రమాకాంతరావు, ఖమ్మం. జ ః చిన్నా, చితకా సమస్యలకు కుటుంబంలోని పిల్లలు తగాదా పడడం, తిట్టుకోవడమూ లేదా కొట్టుకోవడాన్ని, sibling rivalry (సహోదర స్పర్థ) అని సైకాలజీలో చెలామణి అవుతోంది. ఈ స్పర్థ ‘అన్న-తమ్ముడు, లేదా అక్కా-చెల్లెలు’ మధ్య జరిగే అవకాశాలే ఎక్కువ. అలాగని, అక్కాతమ్ముడు, అన్నా - చెల్లెలు మధ్య ఈ స్పర్థ ఉండదని చెప్పలేము. ఈ sibling rivalry రావడానికి, పిల్లల స్వభావం, పిల్లలూ - తల్లిదండ్రుల మధ్య ఉండే అనుబంధం, కుటుంబ వాతావరణం, ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఇద్దరు పిల్లలకి దురుసు స్వభావం ఉంటే, తరుచుగా తగాదాలు వస్తుం టాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే రిలేషన్‌షిప్, రెండవ కారణం. ఉదాహరణకు, కొందరు అమ్మా - నాన్నలు ఏవో కొన్నికారణాల వలన, ఇద్దరు పిల్లల్ని ఒకే మాదిరిగా చూడకుండా, ఒకరిని ఎక్కువ ఇంకొకరిని తక్కువగా చూస్తుంటారు. దీనితో తక్కువ అటెన్షన్ పిల్లలు, ‘మా అక్క నాకు పోటీదారు. ఈమె వలన నాకు అమ్మా - నాన్నల ఆదరణ లభించడం లేదు’. అనే ఆలోచన మొదలౌతుంది. ఆ ఆలోచన అసహనానికి, అగ్రెషన్‌కు దారి తీస్తుంది. ఈ సమస్యను సరిచేయాలంటే, తొలి దశలో ఈ వివాదాల్ని ఇగ్నోర్ చెయ్యాలని, దానివలన తగాదాల్ని ఎలా సాల్వు చేసుకోవాలన్న విషయం పిల్లలు అర్ధం చేసుకుంటారని Broday, Stonman అనే behavioral psychologists తెలిపారు. అబ్బాయకి పన్నెండేళ్ళు చదువులో మంచి చురుకు, కబుర్లు చెబుతూ, చలాకిగా అందరిలో చక్కగా కలిసిపోతాడు. కానీ ఎక్కువగా ఉహలు చేస్తుంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఊహాలోకాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంటుంది అని అంటుంటాడు. ఏ పని లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వీడి తరహా ఇంతే. ఇలా ఊహల్లో ఉంటే వాడి భవిష్యత్తు ఎలా ఉంటుందోనని భయంగా ఉంటోంది? - సరిత, వరంగల్ జః Sigmund Freud ఈ ఉహాగానాన్ని ఒక డిఫెన్స్ మెకానిజం అంటాడు. ఇతని అభిప్రాయంలో డిఫెన్స్ మెకానిజం అంటే మన మనసును రక్షిస్తూ, మనిషికి సంతృప్తి, సంతోషాన్ని కలిగించే ప్రక్రియ. అప్పుడప్పుడు ఈ ఫాంటసీని ఉపయోగించడంలో తప్పేమి లేదు. కానీ మీ బాబులాగా మితిమీరిన ఉహా ప్రపంచంలో విహరించడం మంచిదికాదు. వీలైనంత వరకు మీ బాబును ఒంటరిగా ఉండనీయకండి. ఒంటరిగా ఉంటే ఏదో ఒక పనిలో ఉండేట్టు చూడండి. సృజనాత్మక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేట్టు చూడండి. మార్పు కనిపిస్తుంది.
Other News
|
|||||