|
|
Home >> Parenting
చదువు తక్కువ, టి.వి ఎక్కువ!
మీ పిల్లలతో మీకు ఎదురవుతున్న సమస్యలు, మానసిక ఇబ్బందులు, వారి ప్రవర్తనలో అర్థంకాని అంశాలు, విద్యాపరమైన విషయాలను క్లుప్తంగా రాసి పంపండి. దశాబ్దాల పాటు ప్రభుత్వ సర్వీసులో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేసిన డా॥ నిరంజన్ రెడ్డి ప్రస్తుతం రిటైరై హైదరాబాద్‌లోని రోష్ని కౌన్సిలింగ్ సెంటర్‌లో క్లినికల్ సైకాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. -ఎం. విజయశ్రీ, హైదరాబాద్. జ - ![]() చిన్న వయస్సులోనే నా ఉద్యోగ రీత్యా పాపను స్కూల్‌కు పంపుతున్నాను అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ పాప కన్నా చిన్న వయస్సులో ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు ‘బేబీకేర్ సెంటర్స్’కు పంపుతున్నారు. మారుతున్న ఈకాలంలో మనుషుల అవసరాలు మారుతున్నాయి. వీటితోపాటు జీవన శైలి మారడం కూడా సహజమే కదా. చిన్నతనంలోనే స్కూల్‌కు పంపడం ఈ కాలంలో పరిపాటిగా మారింది. దీని వల్ల అనర్థాలు రాకుండా ఉండాలంటే పేరెంట్స్ కొన్ని నియమాలు పాటించాలి. ప్రఖ్యాత సైకాలజిస్ట్ అయిన ‘‘ ఎరిక్ ఎరిక్సన్’’ వ్యక్తి పెరుగుదలను ఎనిమిది భాగాలుగా విభజించాడు. ప్రతి దశలో కుటుంబం, పరిసరాలు, సవ్యంగా ఉంటే, వ్యక్తి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ఎదిగిపోతాడు. ఈ పెరుగుదలలో మొదటిది ‘శిశువు దశ’. ఈ దశలో తల్లి, శిశువు బేసిక్ అవసరాలను సత్వరంగా తీర్చాలి. అప్పుడే శిశువుకు ఎదిగిన తర్వాత, తల్లిదండ్రుల పైనే కాదు, సమాజంపైన కూడా నమ్మకం కలుగుతుంది. నాకు అవసరం ఉన్నప్పుడల్లా కావాల్సిన సహకారం లభిస్తుందని, మనస్సులో నాటుకు పోతుంది. శిశువు-తల్లి మధ్య ఏర్పడే ఈ సాన్నిహిత్యాన్ని ‘‘బౌల్ బై’’ అనే బయాలజిస్టు ‘‘అటాచ్‌మెంట్’ (attachment) అని తెలిపాడు. ఈ అటాచ్‌మెంట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్టు కూడా పేర్కొన్నాడు. మీకిది వర్తించకపోయినా కొందరు పేరెంట్స్ ఇది తెలుసుకుని, తల్లి-పిల్లల మధ్య అనుబంధాన్ని బలంగా ఉంచాలి. ఇలా జరిగితే, చిన్న వయస్సులో కూడా పిల్లవాడు తల్లికి కొంత సేపు దూరంగా ఉన్నా ఎలాంటి సమస్య కూడా ఉండదు. పరిస్థితులు సవ్యంగా సాగిపోతే, పిల్లవాడు రెండు, మూడో స్టేజ్‌కి వెళ్తాడు. మీ పాప ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉంది. ఈ వయస్సులో కూడా ‘అటెన్షన్’ అవసరమే. అయినా ‘‘ఎంత సమయం పాపకు కేటాయించాలి’’ అన్న విషయం ముఖ్యం కాదు. ‘‘ఎలాంటి అటెన్షన్ ఇవ్వాలి’’ అన్నది ముఖ్యం. దీని అర్థం ‘‘క్వాంటిటీ ఆఫ్ అటెన్షన్’’ కాదు. ‘‘క్వాలిటీ ఆఫ్ అటెన్షన్’’ ఉండాలి. మాట్లాడుతున్నప్పుడు, మాటల్లో ఉరుములు ఉరుముతుంటే, చూస్తున్నప్పుడు చూపుల్లో కోపం రగులుతుంటే, ఎంత అటెన్షన్ ఇచ్చినా వ్యర్థమే. పాపతో ఉన్నప్పుడు, మాటల్లో మృదుత్వం, ప్రేమ తొణికి సలాడితే.. కళ్ళల్లో మమకారం దోబూచులాడితే.. తక్కువ సమయం కేటాయించినా ఫర్వాలేదు. తల్లి ప్రేమతో శిక్షణ ఇవ్వాలే తప్ప శిక్షించకూడదు. చివరిగా మీరు పాపను చేర్చిన పే స్కూల్ ఎలాంటిది, అక్కడ చక్కటి ట్రెయిన్డ్ టీచర్లు, ఆయాలు, ఇతర సిబ్బంది ఉన్నారా? అన్న విషయం గమనించండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, మీరు నిర్భయంగా ఉండొచ్చు. ప్ర- మా అబ్బాయి రోహిత్‌కు 14 ఏళ్లు. వాడికి చదువంటే బోర్. టి.వి. అంటే క్రేజ్. ఎంతసేపూ టి.వి. ముందే ఉంటాడు. ఎంత చెప్పినా వినడు. స్కూలు నుండి వచ్చిన తర్వాత ఒక పుస్తకం ముట్టడు. మేము చెప్పాలని చూస్తే మా మీద అరుస్తాడు? - ఉపేంద్ర, సికింద్రాబాద్. జ - దురదృష్టవశాత్తు, కొందరు పిల్లలు విద్య కన్నా వినోదం పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలా జరిగితే పిల్లల భవిష్యత్తు ముళ్లబాటగా మారుతుంది. మీ బాబు ప్రవర్తనలో మార్పులు రావడానికి మీరు ‘టోకెన్ ఎకానమీ’ అనే ఒక ‘బిహేవియర్ మాడిఫికేషన్’ లోని టెక్నిక్ వాడండి. ఈ టోకెన్ ఎకానమీ ఉపయోగించ డానికి, మీ బాబులోని ఎలాంటి ప్రవర్తనల్లో మార్పులు రావాలో నిర్ణయించుకోండి. బహుశా ఈ మార్పులు కేవలం ఒక గంట టి.వి. చూడడం, కొన్ని గంటలు చదువుకోవడం అని అనుకుందాం. ఆ తర్వాత మీ బాబుకు ఎలాంటి వాటి పట్ల ఎక్కువ ఇష్టమో, వాటన్నింటిని నోట్ చేసుకోండి. ఉదాహరణకు, మీ బాబుకు టి.వి. చూడడం, జూ పార్క్‌కెళ్లడం, కొత్త షూ కొనడంలాంటివనుకుందాం. అనంతరం, మీరు ఒక రూల్ పెట్టండి. ఏ రోజైతే బాబు కేవలం ఒక గంట మాత్రమే టి.వి. చూసి, కొన్ని గంటలు చదువుకుంటాడో అతనికి ఒక టోకెన్ (ఒక ప్లాస్టిక్ చిప్) ఇవ్వండి. ఇలా చెయ్యకపోతే ఈ టోకన్ ఇవ్వకండి. ఈ రోజు బాబు టోకెన్ సంపాదిస్తేనే, రెండో రోజు బాబును ఒక గంట టి.వి. చూడనివ్వండి లేదా టి.వి. కనెక్షన్ రెండో రోజులు తీసెయ్యండి. పది రోజులు ఈ రూల్ పాటిస్తే, మీ బాబుకు పది టోకెన్స్ వస్తాయి. ఈ పది టోకెన్స్ సంపాదిస్తూపోతే, మన లిస్టులో రాసుకున్న అతనికిష్టమైనవి ఇస్తూపోండి. అతనికిష్టమైనవి పొందడం లేదా పొందకపోవడం, కేవలం అతని చేతిలోనే ఉంది. ఈ పద్ధతి పాటించడం మొదలు పెడితే, మొదట్లో మీ బాబు మీకు సహకరిం చకపోవచ్చు. తన కోపతాపాలు మరింత పెరగొచ్చు. అయినా మీరు ఢీలా పడిపోకూడదు. మీ నిర్ణయానికి మీరు కచ్చితంగా కట్టుబడి ఉండండి. క్రమంగా బాబులో మీరు ఆశించిన మార్పులు వస్తాయి.
Other News
|
|||||