Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> Parenting
పాప ప్రవర్తన మాకు నచ్చడం లేదు!

Cheekatiమా అమ్మాయికి నాలుగు ఏళ్లు. అమ్మాయి పొరపాటు చేసినప్పుడు, పెద్దవాళ్లు కోపగించుకుంటే, తనూ ఎదురు తిరుగుతోంది. పెద్దవాళ్లను అలా అనకూడదని తనకు తెలియదు. ఇంట్లో తాత, పిన్ని, అక్కయ్య ఎవరైనా వారి మీద అరుస్తోంది. అమ్మాయికి ఏ విధంగా చెప్పాలి. మేము ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?: పి. హేమలత, జగిత్యాల.

జ ః పిల్లల ప్రవర్తనను అనువంశితక (heredity), పరిసరాలు ఈ రెండూ నిర్ణయిస్తాయి. చైల్డ్ సైకాలజిస్ట్‌లు అప్పుడే పుట్టిన పసికందుల ప్రవర్తన గమనిస్తే, వాళ్లలో కొందరు కలవరపడడం, ఎక్కువగా ఏడవడం, ఎక్కువ చురుకుగా ఉండడాన్ని గమనించారు. ఈ పరిశీలన వలన పుట్టుకతోనే పసికందుల స్వభావాల్లో కొన్ని తేడాలు ఉంటాయని నిరూపించబడింది. ఈ కోణంలో నుంచి గమనిస్తే మీ పాప స్వాభావికంగా కోపిష్టి అనిపిస్తోంది.

పిల్లలోని ఈ స్వాభావికా బేధాలను పరిసరాలు ప్రభావితం చేస్తాయి. ఈ స్వాభావిక ప్రవర్తనలు బలపడడం, ఇలాగే కొనసాగడం, లేదా బలహీనం అవడం కుటుంబ వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. పెద్దలను ఎదురించడం, కోపగించుకోవడం, అరవడం లాంటివి, మీ పాప స్వాభావిక లక్షణాలు అని అనుకోవచ్చు. ముందు ముందు పాప ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది, మీరు పాపను పెంచే విధానం, ఇంటిలోని మిగతా సభ్యుల ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది.

మనం సర్కస్‌లో కోతి సైకిల్ తొక్కడం, ఏనుగు ఫుట్‌బాల్ ఆడడం, కుక్క విన్యాసాలు చేయడం చూస్తున్నాం. ఇదెలా సాధ్యపడింది? అభ్యసన సూత్రాలు (learning principals) ఉపయోగించి, వాటికి ఈ ప్రవర్తనలు నేర్పారు. మరి ఈ అభ్యసన సూత్రాలు ఉపయోగించి జంతువుల ప్రవర్తన మార్చగలిగినప్పుడు, పిల్లల ప్రవర్తన మార్చలేమా? మీ పాప ప్రవర్తన మార్చడం సులభమే కదా! మీ పాప ప్రవర్తనను మార్చాలంటే మీరు ప్రేమ, కరుకుదనము రెండూ ఉపయోగించాలి. ప్రవర్తన బాగుంటే ‘శభాష్, నీవెంత మంచి పాపవు’ అంటూ ప్రేమ కనబరచాలి. నవ్వుతూ ఎత్తుకోవాలి. ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటే, కరుకుదనం చూపాలి. సీరియస్‌గా ముఖం పెట్టి, కోప్పడాలి. దీనిని సైకాలాజీ ‘పాజిటివ్, నెగెటివ్ రీఎన్‌ఫోర్స్ అని తెలుపుతుంది. ఎప్పుడూ ఇలా చెయ్యడం వలన, పాప ఏదీ సత్ప్రవర్తనో, ఏది కాదో తెలుసుకుంటుంది. వీ ఈ ప్రయత్నం ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. కొన్ని సార్లు స్పందించి, కొన్ని సార్లు పట్టించుకోకుండా ఉండకూడదు. స్థిరంగా లేకపోతే, ఈ ప్రవర్తన మంచిదా, కాదా’ అనే అనుమానం పాపకొచ్చి తాను అయోమయా నికి గురవుతుంది. ఈ విధానం ఫలించకపోతే ఒక క్లినికల్ సైకాలజిస్ట్‌ను సంప్రదించండి. సైకాలజిస్ట్ ఉపయోగించే ‘బిహేవియర్ మోడిఫికేషన్ టెక్నిక్స్’, మీ పాప ప్రవర్తనను మారుస్తాయి. అంతేగాని కోపంతో పాపను కొట్టడం మాత్రం చేయకండి.

మీ సందేహాలు పంపవచ్చు
మీ పిల్లలతో మీకు ఎదురవుతున్న సమస్యలు, మానసిక ఇబ్బందులు, వారి ప్రవర్తనలో అర్థంకాని అంశాలు, విద్యాపరమైన విషయాలను క్లుప్తంగా రాసి పంపండి. దశాబ్దాల పాటు ప్రభుత్వ సర్వీసులో క్లినికల్ సైకాలజిస్ట్‌గా పనిచేసిన డా॥ నిరంజన్ రెడ్డి ప్రస్తుతం రిటైరై హైదరాబాద్‌లోని రోష్ని కౌన్సిలింగ్ సెంటర్‌లో క్లినికల్ సైకాలజిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు.
email: [email protected]

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine