Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Parenting
గెలుద్దాం... గ్రూప్-4 పేపర్-1 ఎకానమీ-1

గ్రూప్-II పరీక్షా విధానంలో జనరల్ స్టడీస్‌లో భాగంగా ఉన్న ఎకానమీలో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. భారత పంచవర్ష ప్రణాళికలు, భారత ఆర్థిక విధానాలు, స్వాతంత్య్రం పూర్వం, స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, భారత ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ద్రవ్య విధానాలు, బ్యాంకింగ్, పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పై ప్రశ్నలుంటాయి. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రశ్నల కాఠిన్యత ఉంటుంది. ప్రణాళికలపై ప్రశ్నలు గణాంకాల ఆధారంగా, పేదరికం, నిరుద్యోగంపై ప్రశ్నలు సంక్షేమ పథకాల గురించి, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం, ఆర్థిక విధానాలపై ప్రశ్నలు కాన్సెప్టు ఆధారంగా ఉంటాయి.
1. భారతదేశంలో ఏ రకమైన ఆర్థిక వ్యవస్థ అమలులో ఉన్నది?
1. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ( )
2. గాంధేయవాద ఆర్థిక వ్యవస్థ
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
4. స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ
2. భారతదేశంలో ఎక్కువగా కనిపించే నిరుద్యోగితా రకం ఏది? ( )
1. వ్యవసాయపరమైన నిరుద్యోగం
2. సంఘృష్ట నిరుద్యోగం
3. చక్రీయ నిరుద్యోగం
4. ప్రచ్ఛన్న నిరుద్యోగం
3. భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని దేనిలో నిర్ధేశించారు? ( )
1. భారత రాజ్యాంగంలో
2. రెండవ పంచవర్ష ప్రణాళికలో
3. 1948 పారిశ్రామిక తీర్మానంలో
4. ఏదీ కాదు
4. భండారీ కమిటీ దేనికి సంబంధించినది? ( )
1. టెలి కమ్యూనికేషన్ రంగంలో ప్రైవేట్ సంస్థకు ప్రవేశం కల్పించుటకు
2. రైల్వే అకౌంట్స్ 3. అయిల్ ధరలు
4. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పునర్ నిర్మాణం
5. భారత ఆర్థిక వ్యవస్థ మరింత పోటీతత్వం కలిగి సమర్థవంతంగా పనిచేయుటకు ఏ సంస్థ నుంచి ‘‘స్ట్రక్చు రల్ అడ్జస్ట్‌మెంట్’’ ఋణాలను పొందుతున్నది? ( )
1. ప్రపంచబ్యాంకు 2. బ్యాంక్ ఆఫ్ అమెరికా
3. ఆసియా అభివృద్ధిబ్యాంకు 4.అంతర్జాతీయ ద్రవ్యనిధి
6. భారతదేశంలో మూలధన సమీకరణకు ప్రధాన వనరులు ఏవి? ( )
1. గృహసంబంధ పొదుపు 2. ప్రభుత్వరంగ పొదుపు
3. ప్రభుత్వ రెవెన్యూ మిగులు 4. కార్పొరేట్ పొదుపు
7. ఇండియాలో సాధారణ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరు చేసిన సంవత్సరం? ( )
1. 1924-25 2. 1947
3. 1921 4. 1950-51
8. స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా వర్ణించవచ్చును? ( )
1. అభివృద్ధి చెందని ఆర్థిక వ్యవస్థ
2. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
3. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థ
4. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ
9. ‘‘భారత్ నిర్మాణ్ యోజన’’లో కలుపబడని గ్రామీణ సెక్టారు క్రింది వానిలో ఏది? ( )
1. నీటిపారుదల సౌకర్యం 2. విద్య
3. టెలిఫోను 4. ఏదీకాదు
10. ప్రైవేట్ ఆస్తి గురించి గాంధీజీ చేసిన వ్యాఖ్య ఏది? ( )
1. నాశనం చేయాలి
2. దానిపై నియంత్రణ ఉండాలి.
3. రాజ్యం స్వాధీనం చేసుకొని ప్రజలందరికీ సమానంగా పంచాలి
4. ప్రైవేట్ ఆస్తి ఉన్నప్పటికీ యజమానులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ సాధారణ ప్రజలకు ఉపయోగపడాలి
11. భారత దేశంలో ప్రభుత్వరంగ పరిశ్రమలు ఏ రంగంలో ఆధిక్యం కలిగి ఉన్నవి? ( )
1. రవాణా రంగం
2. ఉక్కు ఉత్పత్తి
3. వాణిజ్య బ్యాంకింగ్
4. ఋణాలు అందించే ఆర్థిక సంస్థలు
12. భారతదేశంలో మొదట స్థాపించిన సహకార సంఘాలు ఏవి? ( )
1. గృహ సహకార సంఘాలు 2. మార్కెటింగ్ సంఘాలు
3. పరపతి సంఘాలు 4. సేద్యపు సంఘాలు
13. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని లెక్కకట్టేందుకు ఆయా శాఖలు క్రింద తెలిపిన దేనిని ఆధారంగా చేసుకొని లెక్కిస్తారు?
1. ఉత్పత్తి 2. ఆదాయం ( )
3. వ్యవయం
4. పై మూడు విధానాల్లో ఏదో ఒక దానిని అవలంభిస్తారు
14. 11వ ప్రణాళిక కాలం? ( )
1. 2005-10 2. 2007-12
3. 2006-11 4. 2008-13
15. మహాత్మాగాంధీ ఆర్థికతత్వం ప్రకారం పూర్ణ స్వరాజ్యం ఏ విధంగా సాధించబడుతుంది? ( )
1. యంత్రాలను నాశనం చేయటం
2. అత్యధిక ఉపాధి అవకాశాలను కల్పించటం
3. గ్రామీణ పరిశ్రమలను నెలకొల్పటం 4. ఏదీకాదు
16. ఆధునిక ఆర్థిక వ్యవస్థ ఒక? ( )
1. బహిరంగ ఆర్థిక వ్యవస్థ
2. నగదు ఆర్థిక వ్యవస్థ
3. పరపతి ఆర్థిక వ్యవస్థ
4. ప్రణాళికాయుత ఆర్థిక వ్యవస్థ
17. ఈ క్రింది వానిలో ఏ సూచీసంఖ్య ఆధార సంవత్సరముల భారములను ఉపయోగిస్తుంది ( )
1. పాషిసూచీ 2. ఫెషర్ సూచి
3. మార్షల్ ఎడ్జ్‌వర్త్ సూచీ 4. లాస్సేయర్ సూచీ
18. ‘ఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా’ గ్రంథ రచయిత ( )
1. ఎమ్. విశ్వేశ్వరయ్య 2. ఆర్.సి.దత్
3. జవహర్ లాల్ నెహ్రు 4. దాదాబాయ్ నౌరోజీ
19. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో? ( )
1. ధనికుల, పేదల మధ్య అంతరం తగ్గింది
2. నిరోద్యోగిత తీవ్రత తగ్గింది
3. పేదరికం తగ్గింది
4. పొదుపు, పెట్టుబడుల రేటు పెరిగింది

ప్రీవియస్ ప్రశ్నలు
1) గ్రామీణ పారిశ్రామికీకరణను వృద్ధి చేయడానికి, భారత ప్రభుత్వ మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్‌ను ప్రారంభించాలని నిర్ణయించిన స్థలం? నగూప్-4 - 2010) ( 2 )
1) హైదరాబాద్ 2) వార్థా
3) కోల్‌కతా 4) పోర్‌బందర్
2) కేంద్ర, ప్రభుత్వ ఖర్చులో అధికంగా పెరుగుతున్న వ్యయభారం? నగూప్-4 - 2010) ( 1 )
1) రక్షణ 2) వడ్డీ చెల్లింపులు
3) సబ్సిడీలు 4) ప్రకృతి వైపరిత్యాలు
3) విపరీతమైన ఆర్థికమాంద్యం ఏర్పడిన సంవత్సరం? నగూప్-4 - 1998) ( 3 )
1) 1910 2) 1920
3) 1929 4) 1945
4) ఈ క్రింది వాటిలో భారతదేశ జనాభా వృద్ధి చరిత్రలో గొప్ప విభాజక సంవత్సరంగా భావించే సంవత్సరం? నగూప్-4 - 1998) ( 2 )
1) 1911 2) 1921 3) 1931 4) 1951
5) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటి.ఒ) ఆవిర్భవించిన తేదీ? నగూప్-4 - 1998) ( 2 )
1) 1-1-1993 2) 1-1-1995
3) 15-8-1995 4) 15-4-1994

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine