గ్రూప్-IV జాగ్రఫ్రీ-2
గ్రూప్-IV జనరల్ స్టడీస్‌లో కీలకం జాగ్రఫ్రీ
గ్రూప్-4 పరీక్షా విధానంలో జనరల్ స్టడీస్ విభాగానికి 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. దీనిలో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్‌సైన్స్, జి.కె, కరెంట్ అఫైర్స్, నూతనంగా చేర్చబడిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలుంటాయి. ఈ పేపర్‌లో కీలకమైన విభాగాలుగా జాగ్రఫీ, హిస్టరీ, నూతనంగా చేర్చిన విపత్తు నిర్వహణను పేర్కొనవచ్చు, ఇవి అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి, సిలబస్ విషయంలో ప్రశ్నలస్థాయి ఇంటర్మీ డియట్ స్థాయి వరకు అని పేర్కొనబడినప్పటికీ 2010, 2012 లలో జరిగిన గ్రూప్-4 దృష్ట్యా ప్రశ్నల స్థాయి ఎపిపిఎస్‌సి నిర్వహించే జనరల్‌స్టడీస్ స్థాయి అంటే డిగ్రీ స్థాయిలోనే ప్రశ్నలు ఇచ్చారు. కాబట్టి ఆయా సబ్జెక్టులు ప్రిపేరయ్యేటప్పుడు ప్రీవియస్ ప్రశ్నలు గమనించాలి. జాగ్రఫీ విషయంలో భారత భూగోళశాస్త్రం, నైసర్గికస్థితి, శీతోష్ణస్థితి, నేలలు, అడవులు, నీటి పారుదల, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు చదవాలి. వీటితో పాటు ప్రపంచ భౌగోళికాంశాలు, సౌరకుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రహాలు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రకృతి సిద్ధమండలాలు చదవాలి.
1)భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత ఎంత? ( )
1) 160 సెంటిగ్రేడ్ 2) 130 సెంటిగ్రేడ్
3) 180 సెంటిగ్రేడ్ 4) 240 సెంటిగ్రేడ్
2)ప్రపంచంలో అతి పెద్ద నీటి పారుదల పథకం ఏది? ( )
1) త్రిగోర్జెస్ 2) బాక్రానంగల్
3) హిరాకుడ్ 4) నాగార్జునసాగర్
3)ఈ క్రిందివాటిలో అతి పెద్ద సముద్రం ఏది? ( )
1) కాస్పియన్ సముద్రం 2) ఎర్రసముద్రం
3) మద్యధరా సముద్రం 4) దక్షిణ చైనా సముద్రం
4)ప్రపంచంలో తగరం (టిన్)ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ( )
1) సింగపూర్ 2) మాల్దీవులు
3) మలేషియా 4) థాయ్‌లాండ్
5)మైకా, ముగ్గురాళ్లు అత్యధికంగా ఏ దేశంలో లభిస్తాయి? ( )
1) ఆఫ్ఘనిస్తాన్ 2) ఇండియా
3) మలేషియా 4) చైనా
6)ఈ క్రిందివానిలో భిన్నమైన దానిని గుర్తించండి ? ( )
1) గ్రీన్‌లాండ్ 2) బాల్కన్
3) సౌది అరేబియా 4) అలస్కా
7)ప్రపంచంలో పొడవైన జలసంధి ఏది? ( )
1) టార్టార్ జలసంధి 2) బాస్ జలసంధి
3) టొర్రస్ జలసంధి 4) జీబ్రాల్టర్ జలసంధి
8)సహారా ఎడారిలో నివసించే ఆదివాసులను ఏమని పిలుస్తారు? ( )
1) హామైట్లు 2) హట్టన్ టాట్స్
3) ముసాయిలు 4) బిడౌనియిన్లు
9)ఆస్ట్రేలియాలో ఉన్న ఉష్ణమండల గడ్డిభూములను ఏమని పిలుస్తారు? ( )
1) లానోలు 2) డౌనులు
3) కంపాలు 4) వెల్డులు
10)కంపాలు (సమశీతల గడ్డిభూములు) ఎక్కడ విస్తరించి ఉన్నాయి? ( )
1) అర్జెంటీనా 2) యురేషియా
3) ఆస్ట్రియా 4) ఉత్తర అమెరికా
11)కలహారి ఎడారి ఏ ఖండంలో ఉంది? ( )
1) ఆస్ట్రేలియా 2) ఆసియా
3) ఆఫ్రికా 4) దక్షిణ అమెరికా
12)ఆసియాను యూరప్ నుండి వేరుచేస్తున్న పర్వతాలు ఏవి? ( )
1) జురా పర్వతాలు 2) అపలేచియన్ పర్వతాలు
3) పెనిన్స్ పర్వతాలు 4) ఆల్ఫ్స్ పర్వతాలు
13)లండన్ నగరం ఏ నది ఒడ్డున కలదు? ( )
1) థేమ్స్ 2) రోస్
3) రైన్ 4) పో
14)డాన్యుబ్ నదిని అంతర్జాతీయ నది అంటారు. ఇది ఏ సముద్రంలో కలుస్తుంది? ( )
1) ఎర్రసముద్రం 2) మద్యధరా సముద్రం
3) దక్షిణ చైనా సముద్రం 4) నల్ల సముద్రం
15)స్ట్రంబోలి అగ్ని పర్వతాన్ని మద్యధరా సముద్ర లైట్‌హౌస్ అంటారు. ఇది ఏ దేశంలో ఉంది? ( )
1) ఫ్రాన్ 2) గ్రీస్
3) ఇటలీ 4) మొరాకో
16)ఎడారి ప్రాంతాలు లేని ఏకైక ఖండం ఏది? ( )
1) ఆస్ట్రేలియా 2) యూరప్
3) ఆసియా 4) దక్షిణ అమెరికా
17)ఈ క్రింది వానిలో నదీ క్రమక్షయ స్వరూపం ఏది? ( )
1) అగాధదరి 2) డోల్‌డ్రమ్
3) అగ్రం 4) యార్డాంగ్స్
18)ఈ క్రిందివానిలో అతిపెద్ద రేవు పట్టణం ఏది? ( )
1)లండన్ 2) టోక్యో
3) న్యూయార్క్ 4) ముంబాయి
19)అత్యధికంగా కాగితపు గుజ్జు, కాగితాన్ని ఉత్పత్తి చేయుదేశం ఏది? ( )
1) కెనడా 2) బ్రెజిల్
3) అర్జెంటీనా 4) చైనా
20)సూర్యునిననుసరించి వర్షపాతం అని ఏ ఖండానికి పేరు? ( )
1) ఉత్తర అమెరికా 2) ఆస్ట్రేలియా
3) దక్షిణ అమెరికా 4) యూరప్
21)భారతదేశ ప్రామాణిక కాలమాన రేఖాంశం ఏది? ( )
1) 821/20 తూర్పు రేఖాంశం
2) 861/20 పశ్చిమ రేఖాంశం
3) 891/20 దక్షిణ రేఖాంశం
4) 921/20 ఉత్తర రేఖాంశం
22)భారతదేశ సాగుభూమి విస్తీర్ణంలో కరువు సంభవించే ప్రాంతం ఎంత ? ( )
1) 60% 2) 70%
3) 50% 4) 40%
23)దేశంలో సగటున ఏడాదికి ఒక హెక్టారులో ఎంతవరకు సారవంతమైన మట్టి క్రమ క్షయానికి గురవుతుంది? ( )
1) 14 టన్నులు 2) 15.2 టన్నులు
3) 16.4 టన్నులు 4) 17.2 టన్నులు
24)ఆంధ్రప్రదేశ్ సహజవాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం ఉన్న ప్రదేశం? ( )
1) విజ్జేశ్వరం 2) విజయవాడ
3) రామగుండం 4) కొత్తగూడెం
25) ఈ క్రింది వానిలో ఏ పంటను శీతాకాలపు పంట (రబీ) అంటారు? ( )
1) వరి 2) జొన్న
3) మొక్కజొన్న 4) గోధుమ
26) ఈ క్రింది వానిలో ఏ ప్రాంతాన్ని ‘భారతదేశపు రూర్’ అంటారు ? ( )
1) చోటా నాగపూర్ 2) ఆరావళి
3) చత్తీస్‌ఘడ్ 4) కర్ణాటక
27)ఈ క్రింది వానిలో ఉత్పాదక పంటకు దేనిని ఉదాహరణగా చెప్పవచ్చు ? ( )
1) పత్తి 2) జనుము
3) పొగాకు 4) అన్నీ
28)భారతదేశంలో నీటి పారుదల సౌకర్యంగా ఉపకరిస్తున్న అతి పెద్ద కాలవ? ( )
1) మయూరాక్షి కాలువ 2) పెన్ గంగా కాలువ
3) ఇందిరా సాగర్ 4) జవహర్ కాలువ
29)దేశంలో రైలు మార్గాల నిడివి అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది ?
1) పశ్చిమ బెంగాల్ 2) మహారాష్ట్ర ( )
3) ఉత్తరప్రదేశ్ 4) తమిళనాడు
30)సౌరకుటుంబంలో అత్యంత శీతల గ్రహమేది ? ( )
1) బుధుడు 2) శుక్రుడు
3) యురేనస్ 4) నెప్ట్యూన్
31)సౌరకుటుంబంలో ఉపగ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహమైన ‘గానెమీడ్’ ఏ గ్రహానికి ఉపగ్రహంగా ఉంది? ( )
1) శని 2) గురుడు
3) అంగారకుడు 4) యురేనస్
32)ఈ క్రింది వానిని జతపరుచుము ? ( )
ఆవరణం అంశము
i) ట్రోపో ఆవరణం ఎ) రేడియో తరంగాలు
ii) స్ట్రాటో ఆవరణం బి) జెట్ విమానాలు
iii) ఐనో ఆవరణం సి) వాతావరణం
1) ఎ,బి,సి 2) సి, బి, ఎ
3) బి, ఎ, సి 4) సి, ఎ, బి
33)ఈ క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి?( )
1) 1800 తూర్పు, పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు.
2) గ్రీనిచ్ కాలమానానికి, భారత కాలమానానికి 5 గంటల 30 నిమిషాలు వ్యత్యాసముంటుంది.
3) సమశీతోష్ణ మండలాన్ని డోల్‌డ్రమ్ అంటారు.
4) ఈశాన్య వ్యాపార పవనాలు కుడివైపు వంగి ప్రయాణిస్తాయి.
ప్రీవియస్ క్వశ్చన్స్
1)బొకారో ధర్మల్ పవర్ ప్లాంట్ ఉన్న ప్రదేశం?
నగూప్-4, 2012) ( 3 )
1) బీహార్ 2) ఛత్తీస్‌ఘడ్
3) జార్ఖండ్ 4) ఒడిసా
2)సూర్యునిలో శక్తి ఉత్పన్నమగుశక్తి ప్రక్రియ?
నగూప్-4, 2012) ( 3 )
1) యురేనియం విచ్చిత్తి 2) హీలియం కలయిక
3) హైడ్రోజన్ కలయిక 4) పైవన్నీ
3)ఆంధ్రప్రదేశ్ చైన్నై నగరానికి కృష్ణ నీటిని పంపిన ప్రాజెక్టు? నగూప్-4, 2010) ( 3 )
1) స్వజలధార ప్రాజెక్టు 2) నీర్‌కుటీర్ ప్రాజెక్టు
3) తెలుగు గంగ ప్రాజెక్టు 4) ఏదీ కాదు
4)ఏటికొప్పాక దేనికి ప్రసిద్ధి? నగూప్-4, 1998) (1)
1) లక్కబొమ్మలు 2) గంధపు చెక్క బొమ్మలు
3) తివాచీలు 4) చేతి పరిశ్రమలు
5)రైల్వేబ్రాడ్‌గేజ్ లైన్ వెడల్పు ఎంత?
నగూప్-4, 1998) ( 2 )
1) 1.57 మీ. 2) 1.67 మీ.
3) 1.70 మీ. 4) 1.75 మీ.
6)తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలను కలుపుతూ విస్తరించిన కొండలేవి? నగూప్-4, 1996) ( 2 )
1) కార్డిమమ్ కొండలు 2) నీలగిరి కొండలు
3) అన్నామలై కొండలు 4) పళిని కొండలు
Other News