గెలుదాం....గ్రూప్-4(పేపర్-1 జాగ్రఫీ)
గ్రూప్-4 జనరల్ స్టడీస్‌లో కీలకం జాగ్రఫీ
గ్రూప్-4 పరీక్షా విధానంలో జనరల్ స్టడీస్ విభాగానికి 150 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. దీనిలో జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామీ, జనరల్‌సైన్స్, జి.కె, కరెంట్ అఫైర్స్, నూతనంగా చేర్చబడిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలుంటాయి. ఈ-పేపర్‌లో కీలకమైన విభాగాలుగా జాగ్రఫీ, హిస్టరీ, నూతనంగా చేర్చ బడిన విపత్తు నిర్వహణను పేర్కొనవచ్చు, ఇవి అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోషిస్తాయి, సిలబస్ విషయంలో ప్రశ్నలస్థాయి ఇంటర్మీ డియట్ స్థాయి వరకు అని పేర్కొనబడినప్పటికీ 2010, 2012 లలో జరిగిన పరీక్షల గ్రూప్-4 దృష్ట్యా ప్రశ్నల స్థాయి ఎపిపిఎస్‌సి నిర్వహించే జనరల్‌స్టడీస్ స్థాయి అంటే డిగ్రీ స్థాయిలోనే ప్రశ్నలు ఇచ్చారు. కాబట్టి ఆయా సబ్జెక్టులు ప్రిపేరయ్యేటప్పుడు ప్రీవియస్ ప్రశ్నలు గమనించాలి. జాగ్రఫీ విషయంలో భారత భూగోళశాస్త్రం, నైసర్గికస్థితి, శీతోష్ణస్థితి, నేలలు, అడవులు, నీటి పారుదల, వ్యవసాయం, ఖనిజాలు, పరిశ్రమలు, రవాణా సౌకర్యాలు చదవాలి. వీటితో పాటు ప్రపంచ భౌగోళి కాంశాలు, సౌరకుటుంబం, అక్షాంశాలు, రేఖాంశాలు, గ్రహాలు, ఖండాలు, మహాసముద్రాలు, ప్రకృతి సిద్ధమండలాలు చదవాలి.
1) భూకంప తీవ్రత ఈ క్రింది ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది? ( )
1) భూకంపనాభి 2) అధికేంద్రము
3) భూకేంద్రం 4) భూ ఉపరితలం
2) ఈ క్రింది ఏ ప్రక్రియ వల్ల వాతావరణపొరలు వేడెక్కుతాయి? 1) సౌర వికరణం 2) సౌర స్థిరాంకం
3) భూ వికరణం 4) సూర్య పుటం ( )
3) సమశీతోష్ణ మండల గడ్డి భూములను దక్షాణాఫ్రికా దేశంలో ఏ పేరుతో పిలుస్తారు? ( )
1) పంపాలు 2) డౌన్‌లు
3) స్టెప్పీలు 4) వెల్డులు
4) ద్వితీయ శ్రేణి రకానికి చెందిన బొగ్గు ‘లిగ్నైట్’ ఈ క్రింది ఏ క్షేత్రం లో విరివిగా లభిస్తుంది? ( )
1) నైవేలీ 2) ఝురియా
3) మయూర్‌భంజ్ 4) రాణిగంజ్
5) దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారానికి ఏదేశం సహయ సహకారాలు అందించింది? ( )
1) జర్మనీ 2) బ్రిటన్
3) రష్యా 4) అమెరికా
6) ఈ దిగ్గువ ఇవ్వబడిన గ్రహాలలో భిన్నమైన వానిని గుర్తించండి? ( )
1) బుధుడు,భూమి 2) శుక్రుడు,యురేనస్
3) గురుడు,శుక్రుడు 4) నెప్యూన్, బుధుడు
7) భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకర రేఖలు ఏ ఖండం ద్వారా ప్రయాణిస్తాయి? ( )
1) ఆసియా 2) యూరప్
3) ఆఫ్రికా 4) ద॥ అమెరికా
8) ఈ క్రింది వానిలో మృతికా క్రమక్షయానికి కారణం కానిదేది? ( )
1) కాంటూర్ బండింగ్ 2) పోడు వ్యవసాయం
3) అడవుల నిర్మూలన 4) వరద ప్రవాహాలు
9) భారతదేశంలో ఆర్థిక ప్రాధాన్యత కల్గిన అడవులు ఏవి?
1) ఉష్ణ మండల సతత హరితారణ్యాలు ( )
2) ఉష్ణమండల ఆకురాల్చు అడవులు
3) ఆల్ఫైన్ అడవులు
4) ఋతుపవన అరణ్యాలు
10) ‘సిలికా’ అనే పదార్థము నిక్షాళనము వలన ఏర్పడు మృతిక లేవి?
1) ఒండ్రు మృత్తికలు 2) నల్ల మృత్తికలు ( )
3) ఎర్ర మృత్తికలు 4) జేగురు మృత్తికలు
11) ప్రపంచంలో అతి పెద్ద జలసంధి అయిన డేవిస్ జలసంధి ఈ దిగునున్న ఏ ప్రాంతాలను విడ దీస్తుంది?
1) కెనడా- గ్రీన్‌లాండ్ 2) కెనడా- అలస్కా ( )
3) గ్రీన్‌లాండ్- ఐస్‌లాండ్ 4) ఐస్‌లాండ్- ఐర్లాండ్
12) ‘హెర్రింగ్ పాండ్’ గా ఏ సముద్రాన్ని పిలుస్తారు? ( )
1) పసిఫిక్ మహా సముద్రం
2) హిందూ మహా సముద్రం
3) అట్లాంటిక్ మహా సముద్రం
4) ఆర్కిటిక్ సముద్రం
13) ప్రపంచంలోని ఉష్ణ మండల ఎడారులలో ఏ ఎడారిలో నైట్రేట్‌లు ఎక్కువగా లభిస్తాయి? ( )
1) సహారా ఎడారి 2) అరేబియా ఎడారి
3) సోన్రాన్ ఎడారి 4) అటకామా ఎడారి
14) కెనడా, గ్రీన్ లాండ్‌లలో నివసించే ఆదిమ తెగలను ఏమంటారు? ( )
1) పిగ్మీలు 2) కాబూలు
3) బుష్‌మెన్‌లు 4) ఎస్కిమోలు
15) తుంగభద్రానది జన్మస్థాన మేది? ( )
1) మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాలు
2) మధ్యప్రదేశ్‌లోని సాత్పుర పర్వతాలు
3) కర్ణాటకలోని వరాహ కొండలు
4) కర్ణాటకలోని నంది దుర్గ కొండలు
16) గంగా- సింధూ మైదాన ప్రాంతాలలో దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి నేలలను ఏమంటారు? ( )
1) బాబర్ 2) భంగర్
3) టెరాయి 4) ఖాదర్
17) ఉత్తర ప్రదేశ్‌లో శివాలిక్ కొండలను ఏ పేరుతో పిలుస్తారు?
1) దుద్వా కొండలు 2) సురియ కొండలు ( )
3) మిష్మీ కొండలు 4) లుషాయ్ కొండలు
18) గోదావరి నదికి చెందిన ఉపనదులలో లేనిదేది? ( ) 1) ప్రాణహిత, మంజీర 2) పెన్‌గంగా, వైన్‌గంగా
3) శబరి, ఇంద్రావతి 4) పంచగంగ, ఘట ప్రభ
19) వింద్యా, సాత్పురా పర్కతాల మధ్య నున్న పగులు లోయలో పచ్చిమంగా ప్రవహించు నది ఏది? ( )
1) నర్మదా 2) తపతి
3) లూనీ 4) మహీ
20) నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టు ఏది? ( )
1) నిజాం సాగర్ 2) శ్రీరాం సాగర్
3) సింగూరు ప్రాజెక్టు 4) జూరాల ప్రాజెక్టు
21) భారత దేశంలో అతిపెద్ద అవ్యవస్థీకృత రంగం ఏది?
1) నిర్మాణ రంగం 2) సేవారంగం ( )
3) వ్యవసాయరంగం 4) భారీ పరిశ్రమలు
22) హరిత విప్లవం వలన తక్కువ ప్రయోజనం పొందిన పంటలు ఏవి? ( )
1) పప్పు ధాన్యాలు 2) నూనె గింజలు
3) ఆహార ధాన్యాలు 4) నగదు పంటలు
23) మైకా ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశ మేది?
1) అమెరికా 2) చైనా ( )
3) బ్రెజిల్ 4) భారత్
24) జనుము వస్త్ర పరిశ్రమను మొదటి సారిగా1855లో ఏ ప్రదేశంలో ఏర్పరిచారు? ( )
1) ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూర్ వద్ద
2) పశ్చిమ బెంగాల్‌లో రిష్రా వద్ద
3) పంజాబ్‌లో లుధియానా వద్ద
4) మహారాష్ట్రలో ముంబై వద్ద
25) ఈ దిగువ పేర్కొన బడిన ఏ ఓడరేవును ‘పర్యావరణమిత్ర అంటారు? ( )
1) నవసేన ఓడరేవు 2) కాండ్లా ఓడరేవు
3) గంగవరం ఓడరేవు 4) కోచి ఓడరేవు
26) ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే కేంద్ర మండలం ఎక్కడ కలదు? ( )
1) మాలిగావ్ 2) గోరఖ్‌పూర్
3) జబల్‌పూర్ 4) బిలాస్‌పూర్
27) సముద్ర జలాల నుంచి ఇరువైపులా భూభాగం చేత వేరు చేయబడిన తీర ప్రాంతాలలోని లోతు జలాశయన్ని ఏమంటారు? ( )
1) సింధుశాఖ 2) లెగూన్
3) జలసంధి 4) అగ్రం
ముఖ్యమైన భౌగోళిక అంశాలు
- అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ - మనీలా (ఫిలిఫ్పైన్స్)
- కోకో ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్న దేశం - కోస్టారికా
- పత్తివిత్తనాలనుండి నూనె తయారీ - అమెరికా
- బంగారం ఉత్పత్తిలో ప్రధమస్థానంలో ఉన్న దేశం - దక్షిణాఫ్రికా
- పవన శక్తిని తొలిసారిగా వినియోగించుకున్న దేశం - నెదర్లాండ్స్
- ప్రపంచంలో ఉన్ని ఉత్పత్తి, ఎగుమతిలో ప్రధమస్థానం - ఆస్ట్రేలియా
- ప్రపంచంలో అతిపెద్దనది - అమెజాన్ నది(6240 కి.మీ)
- అమెరికాలో మొదటి పారిశ్రామిక ప్రాంతం - బోస్టన్
- ప్రపంచంలో అతిపెద్ద సముద్రం - దక్షిణ చైనా సముద్రం
- రెండులేక మూడు సముద్రభాగాలు కలిసినపుడు ఏర్పడే మధ్యభాగం - అగ్రం
- ఆఫ్రికాఖండంలో అతిపెద్ద మంచినీటి సరస్సు - విక్టోరియా సరస్సు
- ప్రపంచంలోనే అతి శీతల ప్రాంతం - జవోస్టాక్
ఎక్స్‌పెక్టెడ్ క్వశ్చన్స్
1) అత్యధిక వర్షపాతమును కల్గించు మేఘాలు ఏవి? (2 )
1) సిర్రస్ 2) క్యుములో నింబస్
3) సిర్రోస్ట్రాటస్ 4) నింబస్
2) పసిఫిక్ మహా సముద్రాన్ని, హిందూ మహా సముద్రంతో కలిపే జలసంధి? ( 4 )
1) టోరస్ జలసంధి 2) కుక్ జలసంధి
3) బాస్ జలసంధి 4) మలక్కా జలసంధి
3) ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం ఏది? ( 2 )
1) బాల్కన్ ద్పీపకల్పం 2) అరేబియా ద్వీపకల్పం
3) ఐబీరియా ద్వీపకల్పం 4)స్కాండినేవియన్ ద్వీపకల్పం
4) ప్రపంచంలో కెల్లా అతిపొడవైన ‘దిగ్రేట్ అట్లాంటిక్ ఓషియానిక్ రిడ్జ్’ ఏ మహా సముద్రంలో ఉంది? ( 1 )
1) అట్లాంటిక్ మహా సముద్రం
2) పసిఫిక్ మహా సముద్రం
3) హిందూ మహా సముద్రం
4) అంటార్కిటిక్ సముద్రం
5) ప్రతి రెండు పోటులు, రెండు పాటుల మధ్య కాలపరిమితి ఎంత? ( 2 )
1) 10 గంటల 12 నిమిషాలు
2) 12 గంటల 26 నిమిషాలు
3) 15 గంటల 34 నిమిషాలు
4) 24 గంటల 46 నిమిషాలు
6) తోటల పెంపకాన్ని ఏమంటారు? ( 3 )
1) ఝామ్ 2) పోడు వ్యవసాయం
3) ఎస్టేట్ ఫార్మింగ్ 4) కాంటూర్ బండింగ్
7) పొడుగు పింజల పత్తి ఉత్పత్తిలో ప్రధమ స్థానంలో ఉన్నదేశం?
1) అమెరికా 2) చైనా ( 4 )
3) భారత్ 4) ఈజిప్టు
భారత భౌగోళిక అంశాలు
- భారతదేశంలో మొదటి సారి తేయాకును పండించిన ప్రాంతం - డార్జిలింగ్
- మాంచెస్టర్ ఆఫ్ ఇండియా - అహ్మదాబాద్
- మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా - కోయం బత్తూర్
- భారతదేశంలో అతిపెద్ద లెగూన్ - చిల్కా సరస్సు
- భారతదేశంలో అతి పొడవైన, పెద్దనది - గంగానది (2525 కి.మీ.)
- భారతదేశంలో అత్యంత ఎత్తులో ఉన్న పీఠభూమి - లడక్ పీఠభూమి
- హిమాలయ పర్వత రాజ్యంగా పేరు పొందినది - నేపాల్
- రాజస్థాన్,ఆరావళి ప్రాంతాలలో కన్పించే ఉప్పునీటి సరస్సులు - దాండియాలు
- భారతదేశంలో న్యూస్ ప్రింట్‌కు ప్రసిద్ధి - నేపా నగర్
- భారతదేశంలో పేపర్ మిల్లులకు ప్రసిద్ధి - పశ్చిమ బెంగాల్
- దేశంలో అత్యంత నాణ్యమైన బొగ్గు గని
- ఝరియా (జార్ఖండ్)
ప్రీవియస్ క్వశ్చన్స్
1) నీలి విప్లవానికి దేనితో సంబంధం కలదు?
నగూప్-4 2012) ( 3 )
1) కోళ్ళపెంపకం 2) త్రాగునీరు
3) చేపలు 4) అంతరిక్ష పరిశోధన
2) సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది?
నగూప్-4 2012) ( 2 )
1) గురుడు 2) బుధుడు
3) శుక్రుడు 4) అంగారకుడు
3) భారతదేశంలో సముద్ర తీరాన్ని ఎన్ని రాష్ట్రాలు కలిగి ఉన్నాయి? నగూప్-4 2010) ( 3 )
1) 7 2) 8
3) 9 4) 10
4) భూమి వయస్సును అంచనా వేయుటకు వాడు పద్ధతి? నగూప్-4 2010) ( 2 )
1) యురేనియం డేటింగ్ 2) కార్బన్ డేటింగ్
3) అటామిక్ క్లాక్స్ 4) బయోలాజికల్ క్లాక్స్
5) ‘ప్రపంచ భూభాగంలో భారతదేశ వైశాల్యం ఎంత శాతం? నగూప్-4 1998) ( 2 )
1) 5.2% 2) 2.4%
3) 1.4% 4) 1%
6) ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లా ఎక్కువ అటవీ భూభాగాన్ని కలిగి ఉంది? నగూప్-4 1998) ( 1 )
1) ఆదిలాబాద్ 2) మెదక్
3) తూర్పు గోదావరి 4) విశాఖపట్నం
Other News