Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Parenting
బటర్డ్ చిల్డ్రన్ బెటర్ చిల్డ్రన్

Better-Ch talangana patrika telangana culture telangana politics telangana cinemaపిల్లల్ని చీటికి మాటికి కొట్టే వారిని దారికి తెచ్చేదెలా?
తప్పు ఉన్నా, లేకున్నా విచక్షణా రహితంగా దెబ్బలు తిని తీవ్రహింసకు గురయ్యే పిల్లల్ని (bettered children) బెటర్డ్ చిల్డ్రన్ అంటారు. అలాగే విచక్షణా రహితంగా పిల్లల్ని కొట్టడం కూడా మానసిక రుగ్మతే అవుతుంది. మనిషిలో మృగత్వాన్ని బహిర్గతం చేసే ఈ ప్రవర్తనను మానసిక వైద్య పరిభాషలో ‘‘బెట్టర్డ్ బేబీ సిండ్రోమ్’’ అంటారు.

హింసావాతావరణంలో పెరిగే పిల్లల్లో ప్రవర్తనా లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. పెరుగుతున్న వయసులో మొండిగా తయారవుతారు. చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమమాట నెగ్గాలన్న పంతంతో పిల్లల్ని కొట్టడం, తీవ్రంగా హింసించడం వంటివి చేస్తారు. ఇది పిల్ల భవిష్యత్తుకే ప్రమాదకరం. బాల్యంలో ఎదుర్కొన్న అవమానాలు, అణచివేతకు గురైనవారు ప్రేమ రాహిత్యానికి దూరమై చెడు స్నేహాలు, దురలవాట్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశముంది. యుక్త వయస్సులో రాగానే తోటి పిల్లల్ని కొట్టడం, గాయపరచడం, అమ్మాయిలను వేధించడం, ర్యాగింగ్ వంటి చర్యల వల్ల ఆనందపడుతూ ఉంటారు.

‘‘పిల్లల్ని బెటర్డ్ చిల్డ్రన్ (bettered children)గా కాకుండా బెటర్ చిల్డ్రన్‌గా (better children) గా పెంచాలి’’
- పిల్లల్ని కొట్టకపోతే దారికి రారని వాదన చాలా తప్పు.
- చేతి కందిన వస్తువుల్ని కోపంతో పిల్లలపై విసరకూడదు.
- పిల్లల తప్పుల్ని రోజంతా సాగదీస్తూ పదేపదే తిట్టకూడదు.
- ఏ ఒక్క చిన్నపాటి మంచి పని చేసినాపదేపదే మెచ్చుకోండి.

మాటలతో వారిని ప్రోత్సహించాలి.
- పెద్దలు తమ మొండితనాన్ని పిల్లలపై చూపొద్దు.

చికిత్స - ‘‘బెటర్డ్ బేబీ సిండ్రోమ్’’లో తప్పంతా పిల్లలదే అని, వారికే చికిత్స చేయాలని ఆలోచించడం సరికాదు. పెద్దల ప్రేమలో మృగతత్వాన్ని ప్రభావితం చేసే ఈ రుగ్మత తల్లిద్రండులలో, ఉపాధ్యాయులలో కనిపిస్తుంది. కాబట్టి ఈ మానసిక రుగ్మత ఉన్న వారిని గుర్తించి అనుభవజ్ఞులైన మానసిక నిపుణులచే సైకలాజికల్ కౌన్సిలింగ్ లేదా సైకోథెరపి చేయించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ రుగ్మత మరీ మొండిగా ఉంటే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి.
- వ్యాసకర్త - కరీంనగర్‌లో సైకాలజిస్ట్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine