|
|
Home >> Exam Guidence
ఫోరెన్సిక్ సైన్స్ కెరీర్ ఎలా ఉంటుంది?
ప్ర: నేను ఇటీవల డా॥ అగ్రికల్చర్ పాలిటెక్ని క్ కోర్సులకు సంబంధించిన ప్రకటన చూశాను. ఐతే నా చదువంతా జిల్లా హెడ్‌క్వార్టర్‌లోనే జరిగింది. ఇంటర్ మధ్యలో చదువు ఆపేశాను. ఇప్పుడు నా వయస్సు 20 సం॥ వ్యవసాయం వైపు నాకు ఆసక్తి ఉంది. నేను ఈ కోర్సుకు అర్హుడినా, కాదా? తెలియచేయండి. - యాదగిరి, హైదరాబాద్ జ: డా॥ డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ వారు మెదక్ జిల్లాలోని కేడిపల్లి మండలం తునికి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ పద్ధతిలో పంటల పెంపకం, మార్కెటింగ్, పశుపోషణ తదితర అంశాలపై గ్రామీణ యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గల వ్యవసాయ పాలిటెక్నిక్‌లకు ప్రవేశ ప్రకటన ఏప్రిల్/మే నెలల్లో వస్తుంది. పదవ తరగతిలో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ప్ర: నేను రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం వృత్తిగా చేస్తున్నాను. నాకు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలు, వాటి ఉత్పత్తి ఎలా చేస్తారో తెలియచేయగలరు. దీనికి సంబంధిం చిన సమగ్ర సమాచారం ఎక్కడ లభిస్తుందో తెలుపగలరు. - సాయిరాం, రంగారెడ్డి జ: సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలకు ఇటీవల డిమాండ్ బాగా పెరిగింది. రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్‌లో గల రైతు శిక్షణా కేంద్రం(Farmers Traing centre)లో ఔత్సాహిక రైతులకు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయ విధానం, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తి సమాచారం, శిక్షణ ఇవ్వగలరు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో గల కమిషనర్ ఆఫ్ అగ్రికల్చరల్ కార్యాల యంలో కూడా సమగ్ర సమాచారం లభిస్తుంది. ప్ర: నేను సెంట్రల్ యూనివర్శిటీ వారి దూరవిద్య ప్రకటన 2012 చూశాను. 2011లో నేను బిఎ పూర్తి చేశాను. ఐతే, సెంట్రల్ యూనివర్శిటీ దూరవిద్య కోర్సుల్లో ఫోరెన్సిక్ సైన్స్ డిప్లొమా చేద్దామనుకొంటున్నాను. ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? తెలియచేయగలరు. - రమణ, భువనపల్లి జ: ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులో క్రిమినాలజీ, క్రిమినల్ లా, క్రిమినల్ ఆంత్రపాలజీ, ఫోరెన్సిక్ డిఎన్‌ఎ, ఫోరెన్సిక్ పాథాలజీ సబ్జెక్టులపై బోధన ఉంటుంది. నేర పరిశోధనలో భాగంగా సాక్షాల సేకరణలో వేలి ముద్రలు, రక్తం, వీర్యం, నోటి ద్రవాలు, మత్తు పదార్థాలు, ఆయుధాలు సేకరించడం, విశ్లేషించడం ఫోరెన్సిక్ నిపుణుల ప్రధాన విధి. ఫోరెన్సిక్ నిపుణులకు నేర పరిశోధనా సంస్థలు, పోలీసు, న్యాయ సంస్థలు, పరిశోధన సంస్థలలో అవకా శాలు ఉంటాయి. ప్ర: నేను ఎం.ఎస్సీ (కంప్యూటర్స్) పూర్తి చేశాను. జూనియర్ లెక్చరర్ పరీక్ష రాద్దామనుకుంటున్నాను. కంప్యూటర్ సిలబస్ తెలియచేయగలరు. - విజయ్‌రాజా, దేవరకొండ జ: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు జూనియర్ లెక్చరర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రకటన ఇంకా విడుదల చేయలేదు. త్వరలో విడుదల చేయనున్న నోటిఫికేషన్‌లో సిలబస్ పేర్కొనడం జరుగుతుంది. మీరు పరీక్షపై అవగాహన కోసం గతంలో ఎపిపిఎస్‌సి వారు నిర్వహిం చిన పరీక్ష సిలబస్ చూడండి. గత నోటిఫికేషన్ వివరాలు www.appsc.gov.in.లో లభిస్తాయి. ప్ర: నేను బిఎస్సీ(లైఫ్‌సైన్స్) కోర్సు పూర్తి చేశాను. ఊరగాయ పచ్చళ్లను తయారు చేసి మార్కెటింగ్ చేయాలంటే లైసెన్స్ ఎక్కడ పొందాలి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ప్రారంభించాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎక్కడ లభిస్తుందో తెలియచేయగలరు. - వెంకటేష్, కామారెడ్డి జ: చిన్న తరహా పరిశ్రమల (ssi) ప్రాజెక్ట్ రిపోర్టులు నిజామా బాద్‌లో గల జిల్లా పరిశ్రమల కేంద్రం(డిస్ట్రిక్ ఇండస్ట్రీ సెంటర్)లో లభిస్తాయి. ఇందులో మీరు చేపట్టదలచిన పరిశ్రమకు కావాల్సిన ముడి పదార్థాలు, యంత్రాలు, ప్యాకింగ్ సామగ్రి, స్థిరవ్యయాలు, చరవ్యయాలు, కావాల్సిన లైసెన్సులు, పెట్టుబడి, బ్యాంక్ రుణాలు, రాబడి, ఆదాయం, లాభం, స్థాపనలో గల ఇబ్బందులు మొ॥ అన్ని ఈ ప్రాజెక్ట్ రిపోర్టులో పొందుపరుస్తారు. జల్లాలోని డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో ఊరగాయ పచ్చళ్ళ తయారీలో శిక్షణ ఇచ్చి మార్కెటింగ్ మెలకువలు కూడా నేర్పుతున్నారు. బ్యాంక్ రుణం పొందడానికి కూడా సహకరిస్తుంది. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్‌లో గల హార్టికల్చర్ సొసైటీ వారు కూడా ఊరగాయ పచ్చళ్ళ తయారీపై శిక్షణ ఇస్తున్నారు.
Other News
|
|||||