|
|
ఇంజనీరింగ్ పరిధిని పెంచే ఇంటిగ్రేటెడ్ కోర్సులు
ప్రపంచీకరణ ప్రభావంతో ఇంత వరకూ కొన్ని పరిధుల్లో, హద్దుల్లో ఉన్న అనేక రంగాలు ఆయా హద్దులను చెరిపేసుకొని స్వేచ్ఛగా వ్యవహరించడంతో అవన్నీ సరికొత్త రూపాలను సంతరించుకున్నాయి. తద్వారా మార్కెట్ అవసరాలకు తగినట్టుగా డిమాండ్‌ను పెంచుకు న్నాయి. ఈ పరిణామాల ప్రభావం ఉన్నత విద్య మీద కూడా పడింది. ఫలితంగా సమగ్ర విద్యకు ప్రాధాన్యత పెరిగింది. కొన్ని విద్యా సంస్థలు ఈ విధానాన్ని ఇంజనీరింగ్‌లో కూడా ప్రవేశపెడు తున్నాయి. ఇంజనీరింగ్‌లో సమగ్ర విద్యా బోధన అంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లను కలిపి ఒకే కోర్స్‌గా పరిగణించడం, పాఠ్యాంశాలను కూడా సమగ్రంగా రూపొందించడం, ఈ విధమైన ప్రక్రియ ద్వారా ప్రారంభమైంది 5 సంవత్సరాల సమగ్ర ఇంజనీరింగ్ (బీటెక్+ ఎంటెక్) కోర్సు. యుజిసి వారు రూపకల్పన చేసిన ఈ సమగ్ర ఉన్నత విద్యా కోర్సుల వలన మరింత అధిక సంఖ్యలో విద్యార్థులను ఉన్నత విద్య, పరిశోధనల వైపు మళ్లించే అవకాశం లభిస్తుంది. కేంపస్ ప్లేస్‌మెంట్ల ప్రభావంతో ప్రతిభ గల విద్యార్థులు ఉద్యోగాల వైపు వెళ్లిపోతున్నారు. దాని వలన విద్యాధికులు, పరిశోధకుల కొరత ఏర్పడింది.సమగ్ర విద్యా విధానం వలన విద్యార్థికి సమయం కలిసి వస్తుంది. అంటే మామూలుగా అయితే బి.టెక్, ఎంటెక్ వేరు వేరుగా పూర్తి చేయాలంటే 6 సంవత్సరాలు పడుతుంది. కానీ సమగ్ర కోర్స్ వలన రెండు డిగ్రీలు 5 సంవత్సరాల్లో విద్యార్థి పూర్తి చేయవచ్చు. తద్వారా గేట్ వంటి పరీక్షలు రాయడం విద్యార్థికి సానుకూలమ వుతుంది. ఈ సమగ్ర విద్యా కోర్సు వలన విద్యార్థి ఒకే అంశానికి పరిమితం కాకుండా విభిన్న అంశాలలో జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సంపాదించే అవకాశం లభిస్తుంది.పలు విద్యా సంస్థలు ఈ సమగ్ర ఇంజనీరింగ్ తదితర కోర్సులను ఇప్పుడిప్పుడే ప్రారంభిం చాయి. విద్యార్థుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో ఈ తరహా విద్యా బోధన వేగంగానే విస్తరిస్తోంది. సమగ్ర విద్యా బోధన అందిస్తున్న విద్యా సంస్థలు - ఆంధ్రాయూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇసిఇ, మెకానికల్, సివిల్ బ్రాంచ్‌లలో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు. దీనికి ఏఐసిటిఇ అనుమతి ఉంది. ఈ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష ‘ఏయుసిఇటి’ నిర్వహిస్తారు. - జెఎన్‌టియు (కాకినాడ)లో అందిస్తున్న ఇంట్రిగ్రేటెడ్ కోర్సులు ఐపిఆర్, పేటెంట్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్ మొదలైన వాటిలో 5 సంవత్సరాలు, బిటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇంజనీరింగ్‌లో ఇటువంటి కోర్సులు ప్రవేశపెట్టడం ఇదే ప్రథమం. ఇది ఒక మంచి ప్రయోగం. దీని వలన ‘ఇంజనీరింగ్’ పదానికి నిర్వచనం కూడా విస్తృతమవుతుంది. - జిఎంఆర్ ఐటిలో పవర్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కొత్తగా ప్రారంభించారు. ఇది మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లు కలిసిన సమగ్ర బ్రాంచ్. ఇలా సమగ్ర విద్యా కోర్సులను ఉన్నత విద్యతో విభిన్న విధాలుగా రూపకల్పన చేసి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తయారయ్యే దిశగా నూతన విద్యా విధానం కృషి చేస్తోంది.
Other News
|
|