Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Tuesday, May 21, 2013
 


Home >> Exam Guidence
ఎస్.ఎస్.సి నుంచి భారీ నోటిఫికేషన్

- అవినీతిని రూపుమాపే ప్రక్రియలో కీలకమైన సీబీఐ
-ప్రజాస్వామ్య ప్రక్రియలో మూలస్తంభం లాంటి ఎలక్షన్ కమిషన్
- దేశ ఆర్థిక వ్యవస్థకు వాచ్‌డాగ్‌లాంటి కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్
- విదేశాలతో సంబంధాలు నెరిపే ఇండియన్ ఫారిన్ సర్వీస్

ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు చేయడం ఎవరికైనా గర్వకారణం. కేవలం ‘10+2’ విద్యార్హతతో ఆయా సంస్థల్లో కాలుమోపే అవకాశం వచ్చింది. స్టాఫ్‌సెలక్షన్ కమిషన్ ఆయా పోస్టులకు నోటిఫికేషన్ వెలువరించింది.
కంబైన్డ్ హయ్యర్ సెంకడరీ లెవెల్ (10+2) 2012 నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్కులు, డాటాఎంట్రీ ఆపరేటర్ల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏటా వేల సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రధానంగా కేంద్రంలోని నగూప్-సి) నాన్ టెక్నికల్ గ్రూప్-బి (నాన్‌గెజిటెడ్) పోస్టులను భర్తీ చేస్తుంది.
అర్హతలు 01.08.2012 నాటికి వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి ‘10+2’ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం రూ. 100 విలువ ఉన్న సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీజ్‌స్టాంప్‌ను దరఖాస్తు ఫారంలో నిర్ణీతస్థానంలో అతికించాలి. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసేవాళ్ళు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా చలానా లేదా ఎస్‌బిఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చెయ్యొచ్చు. మహిళా అభ్యర్థులు ఎస్.సి, ఎస్‌టిలు మాజీ సైనికోద్యోగులు ఫీజు చెల్లించనవసరం లేదు.
చివరి తేది 10.08.2012
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా నగూప్-x గ్రూప్-y పోస్టులను భర్తీ చేస్తుంది.) గ్రూప్-x, పోస్టులు ఎక్కువగా ఢిల్లీలో, గ్రూప్-y పోస్టులు దేశ వ్యాప్తంగా ఉంటాయి.
గ్రూప్- x డిపార్ట్‌మెంట్ ఎలక్షన్ కమిషన్, ప్రెసిడెంట్ సెక్రటేరియట్, ఇంటలిజెన్స్ బ్యూరో, సీబీఐ, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్.
గ్రూప్-y డిపార్టుమెంట్ కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్, అకౌంటెంట్ జనరల్, డిఫెన్స్ అకౌంట్స్.
పరీక్షా విధానం రెండు దశల్లో పరీక్ష ఉంటుంది.
1. రాత పరీక్ష
2. స్కిల్ టెస్ట్
రాత పరీక్ష అక్టోబర్ 21, 28 తేదీలలో నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికే స్కిల్ టెస్ట్ ఉంటుంది. రాతపరీక్షలో జనరల్ ఇంటలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్‌లలో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. సమయం 2 గంటలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పుకు 0.25 మార్కులు తీసివేస్తారు.
పరీక్ష సిలబస్ జనరల్ ఇంటలిజెన్స్ ః సిమాంటిక్ అనాలజీ, సింబాలిక్/నెంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, సిమెంటిక్ క్లాసిఫికేషన్, సింబాలిక్/నంబర్ క్లాసిపికేషన్- ఫిగరల్ క్లాసిఫికేషన్, సీమాటిక్ సిరీస్, నంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్, ప్రాబ్లం సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ & డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్ తదితర ఆధ్యాయాలుంటాయి.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ సినోనిమ్స్/ హోమోనిమ్స్, ఆంటోనిమ్స్, స్పెల్లింగ్స్ / డిటెక్టింగ్ మిస్-స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రెజెస్, ఒక వర్ట్ సబ్‌స్టిట్యూషన్ & ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ యాక్టివ్ అండ్ పాసీవ్ వాయిస్, డైరెక్ట్ & ఇన్ డైరెక్ట్ స్పీచ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్ తదితర అంశాలుంటాయి. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి.
అర్థమెటిక్ నంబర్ సిస్టమ్స్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపొర్షన్, స్క్వెయిర్ రూట్స్, యావరేజెస్, సింపుల్ & కాంపౌండ్ ఇంట్రస్ట్, ప్రాఫిట్ & లాస్, డిస్కౌంట్, టైమ్ & డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అధ్యాయాలతోపాటు అల్జీబ్రా, జామెట్రీ మెన్సురేషన్స్ ట్రిగనామెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్‌లపై కూడా ప్రశ్నలుం టాయి.
జనరల్ అవేర్‌నెస్ చరిత్ర & సంస్కృతి, భూగోళ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థ, పాలిటీ, సైన్స్ & రీసెర్చ్, కరెంట్ అఫైర్స్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్ష పూర్తి అయ్యాక డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఒక గంటలో 8000 కీ డిప్రషన్స్ చేయవలసి ఉంటుంది.ఈ పరీక్ష కేవలం క్వాలిఫయింగ్‌కు ఉద్దేశించినదే.


tur

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine