Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> Exam Guidence
ఎంసెట్-2012 స్పెషల్

doctor-మంచి కాలేజీ ఎంపిక ఎలా చేయాలి?

-అగ్రతాంబూలం ఫ్యాకల్టీకే
-నెక్ట్స్ మౌలిక సదుపాయాలు
-ప్లేస్‌మెంట్స్‌నూ ఆరా తీయండి!


దేశంలో ఎక్కడా లేనటువంటి సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు కల్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 720 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 లక్షల పై చిలుకు ఇంజనీరింగ్ బ్రాంచి సీట్లు కల్గిన ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అయితే మొత్తం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో కేవలం 20 శాతం మంది అభ్యర్థులకే ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా 80 శాతం మంది అభ్యర్థులకు సబ్జెక్టులో ‘‘సత్తా’’ లేక ఉద్యోగాలకు సెలక్ట్ కాలేక చతికిలబడిపోతున్నారు. దీనితో ‘‘రాశి కంటే వాసి ముఖ్యం’’ అనే పంథాలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. ‘‘వాడు తెచ్చుకున్న ఎంసెట్ ర్యాంకుకు ఐదారు కాలేజీల్లో ఇంజనీరింగ్ సీటు వస్తుంది. కానీ వచ్చిన చిక్కల్లా ఏ కాలేజీని ఎంపిక చేసుకోవాలి? ఎటువంటి కాలేజీలో చేరితే అబ్బాయి లేదా అమ్మాయి భవిష్యత్తుకు భరోసా ఉంటుందో?’’ అని మథన పడుతున్నారు. మంచి ఇంజనీరింగ్ కాలేజీ ఎంపికపై కొన్ని సూచనలు..

నిష్ణాతులైన అధ్యాపకులు
ఇంజనీరింగ్ విద్య అంటే సాంకేతిక విజ్ఞానం. సాంప్రదాయక కోర్సుల మాదిరిగా గాకుండా ‘ప్రాక్టికల్ టచ్’ ఎక్కువగా కనిపించేది ఇంజనీరింగ్ స్టడీస్‌లోనే. ఏ ఇంజనీరింగ్ కాలేజీలో రోజూ జరిగే ప్రతి క్లాసులో బోధించే పాఠ్యాంశం నైపుణ్యంతో ఉంటే విద్యార్థి ఆల్ రౌండర్ గ్రాడ్యుయేట్‌గా మార్కెట్లో అడుగిడుతాడు. ఏ రోజు పాఠం వినకపోయినా అసంపూర్తిగా అక్కరకు రాని ఇంజనీరింగ్ డిగ్రీతో కాలం కరిగించాల్సిందే. కాబట్టి ఇంజనీరింగ్ కోర్సు బోధించే అధ్యాపకుడు అన్ని వేళలా కీలక సూత్రాధారిగా పరిగణించాలి. ఇంజనీరింగ్ బోధించే అధ్యాపకులు అందరూ పి.హెచ్‌డి పట్టభద్రులై ఉండాలని అత్యున్నత విధాన నిర్ణయక సంస్థ అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఎ.ఐ.సి.టి.ఇ.) నిర్దేశిస్తోంది. కాబట్టి సీటు ఎంపిక చేసుకోబోనున్న కాలేజీలో అధ్యాపకులు ఎంత మంది ఉన్నారు? వారికున్న అర్హతలు ఏమిటి? బోధనానుభవం ఎంత ఉంది? ఎంత మంది అధ్యాపకులకు పి.హెచ్‌డి. డిగ్రీలు ఉన్నాయి? వారికున్న పబ్లికేషన్స్ ఏమిటి? గతంలో బెస్ట్ టీచర్ అవార్డులు లేదా ఇతర టీచింగ్ అచీవ్‌మెంట్స్ వారికేమైనా ఉన్నాయా? అనే రీతిలో కాలేజీ అధ్యాపకుల లోతుపాతులు తెలుసుకోవడం కాలేజీ ఎంపికకు ముందు అవసరం.


మౌలిక సదుపాయాలు
కాలేజీలో మౌలిక వసతులు వంటివి పరిశీలిస్తే కాలేజీ అందిస్తున్న ఇంజనీరింగ్ డిగ్రీ స్టాండర్ట్‌ను అంచనా వేయవచ్చు. కాబట్టి 8 రకాల బ్రాంచీలలో ఇంజనీరింగ్ విద్యనందిస్తున్న కాలేజీలు ప్రతి బ్రాంచికి సంబంధించి ల్యాబ్‌లు ఉన్నాయా? లేవా? అనేది చూసుకోవాలి. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ప్లేగ్రౌండ్, క్యాంటీన్ వంటివి విద్యార్థులను ఆల్‌రౌండర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్‌గా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా కాలేజీ ప్రాంగణంలోనే విద్యార్థులకు వసతి సదుపాయాలు ఉన్నాయా అనేది గమనించాలి. వసతి లేకుంటే ఇంటి నుంచి కాలేజీకి వెళ్లి రావటంతోనే రోజుకి నాలుగైదు గంటలు వృథాగా పోతుంది. తమిళనాడు, కర్నాటక వంటి రాష్ట్రాలలోని ఇంజనీరింగ్ కాలేజీలలో చాలా మటుకు వసతి సౌకర్యం కాలేజీ ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటుంది. వసతి సదుపాయం లేని కాలేజీలు మరి ముఖ్యంగా ఆడ పిల్లల తల్లిదండ్రులకు ప్రతిరోజు టెన్షన్‌గానే ఉంటుంది. ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఆన్‌లైన్‌లో జర్నల్స్ చదువుకునే ప్రత్యేక ఏర్పాటు, ఇంటర్నెట్ ఆత్యాధునిక సౌకర్యాలు, ఎల్.సి.డి ప్రొజెక్టర్లతో ఈ క్లాస్ రూమ్స్ ఏర్పాట్లు, కళాశాలలో సెమినార్లు నిర్వహించు కునే ప్రత్యేక ఆడిటోరియంల ఏర్పాటు వంటివి ఉన్నాయా? లేవా? అనేది అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు స్వయం గా లేదా ఇతర మార్గాల ద్వారా తెలుసుకోవాలి.

ప్లేస్‌మెంట్స్... ప్లేస్‌మెంట్స్...
తాను చేరబోయే ఇంజనీరింగ్ కాలేజీలో ఏ మేరకు ప్లేస్‌మెంట్స్ వచ్చాయో తెలుసుకోవాలి. ఏయే కంపెనీల ప్రతినిధులు ప్లేస్‌మెంట్స్‌కై వస్తున్నారు. వారందిస్తున్న శాలరీ ప్యాకేజీలలో కనిష్టం- గరిష్టం నగదు ఎంత వరకు లభిస్తున్నాయో పరిశీలించుకోవాలి. సదరు కాలేజీ యాజమాన్యం ప్లేస్‌మెంట్స్ ముందు విద్యార్థులకు అందిస్తున్న సాఫ్ట్‌స్కిల్స్ ఎంత వరకు ఉపయోగపడుతున్నాయో గమనించాలి. ప్లేస్‌మెంట్స్ రీత్యా కాలేజీలో ఏ స్థాయిలో అభివృద్ధి చేశారనేది విద్యార్థులు, తల్లిదం డ్రులు తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

రీసెర్చ్ ఓరియెంటేషన్
‘‘Research enables good education, good education leads to good research’’ -Abdul Kalam. అధ్యాపకులు పరిశోధనలు నిరంతరం చేసే క్రమంలో కొత్త విషయాలు కనుగొనే అవకాశాలు ఎన్నో ఉంటాయి. వాటిని తరగతి గదిలో ఎదురుగా ఉన్న యువ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు బోధిస్తే వారు మరిన్ని కొత్త ఆవిష్కరణలకు ఉద్యుక్తులవుతారు. పరిశోధనాంశాలపై అధ్యాపకులకు ఎంత ఆసక్తి ఉంటే అంత ప్రభావవంతంగా విద్యార్థులకు బోధించే నేపథ్యం వస్తుంది. అలాగే ప్రమాణాలు కల్గిన ఇంజనీరింగ్ చదువును విద్యార్థులకు అందించే అవకాశాలు రీసెర్చి వల్ల అధ్యాపకులకు మెండుగా ఉంటాయి. అమెరికాలోని ప్రయివేటు రంగాల్లో నిలిచిన కాలేజీలే టాప్ గ్రేడ్‌లో ఉంటూ ఇంజనీరింగ్ విద్యనందిస్తు న్నాయి. అలా ఎందుకు సదరు కాలేజీలు అగ్రస్థానానికి వెళ్లా యంటే పరిశోధనలే ముఖ్య కారణం. నేడు ఇంజనీరింగ్ విద్యార్థులు కాలేజీ బయట ప్రాజెక్టులకై పరుగులు తీస్తున్నారు. అంటే పరిశోధనపై పోటాపోటీగా అధ్యాపకులు వెళ్లలేని క్రమంలో ఇటువంటి రీసెర్చిలో ఇంజనీరింగ్ కాలేజీ యాజ మాన్యం ఎంత శ్రద్ధ కనబరుస్తుందనేది గమనిస్తూండాలి.

పాత కాలేజా? కొత్త కాలేజా?
34 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభమయ్యాయి. అప్పుడు ఒకటో రెండో కాలేజీలు ఉండేవి. గత దశాబ్దిన్నర కాలంలోనే ఇంజనీరింగ్ కాలేజీల్లో సింహభాగం రాష్ట్రంలో ఏర్పాటైనవనే చెప్పాలి. సహజంగా పాత కాలేజీ అనగానే అనుభవజ్ఞులైన అధ్యాపకులుంటారు. ఇంకా ప్రతి ఏటా అభివృద్ధి పేరిట కాలేజీల్లో పలు రకాల మౌలిక వసతులు అన్నింటిని అమర్చుకుంటారు. అయితే, వీటిని ఎంత త్వరగా దాటుకుని ఉత్తమ కాలేజీగా అవతరించాలనే ఉత్సాహంతో సాగిపోతున్న నిన్న మొన్నటి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. అంటే యువ యాజమాన్యం చొరవతో కొత్త కాలేజీలు రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే చేరబోయేది కొత్తదా.. పాతదా.. అనేది గీటురాయి గాకుండా కాలేజీ యాజమాన్యం విజన్స్, మిషన్స్ ఇంజనీరింగ్‌పై ఎలా ఉందనేది గమనిస్తూ కాలేజీని ఎంపిక చేసుకోవాలి.

కాలేజీ సెలక్షన్‌కి ఏం చూడాలంటే...?
సెలక్షన్‌లో దేనికి ప్రాధాన్యత నివ్వాలి. బ్రాంచ్‌కా? కాలేజీకా? అంటే ముందు కాలేజీకే ప్రాధాన్యత నివ్వాలంటున్నారు కౌన్సిలింగ్ నిపుణులు. వాటి యాజమాన్యాలతో ప్రత్యేక సంబంధాలు కలిగి ఉండాలి. కాలేజీ ఇండస్ట్రియల్ డిపార్ట్‌మెంట్ చొరవను గమనించాలి. అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు దీర్ఘకాలం అదే కాలేజీలో పని చేస్తూ ఉన్న వారై ఉండాలి. భవనాలు, మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నదై ఉండాలి.
మార్కెట్‌లో కాలేజీకి మంచిపేరు ఉండాలి. పేరున్న ఎంఎన్‌సి కంపెనీల క్యాంపస్ సెలక్షన్ల అల్యుమిని లిస్టులో కాలేజీ ఉండాలి. బోధనతో పాటు ఇతర క్రీడా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస అంశాలలో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రత్యేక కార్యక్రమాలు కాలేజీ కలిగి ఉండాలి. సమగ్ర అభివృద్ధి పట్ల కాలేజీ మంచి శ్రద్ధ కనపరుస్తుందనే పేరు ఉండాలి. విద్యార్థులు కాలేజీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉండాలి.
ప్రాక్టికల్ అనుభవం కలిగించేలా టాప్ కంపెనీలలో వారికి ఇంటర్న్‌షిప్ చేయించే విధంగా కాలేజీ ఒప్పందాలు కలిగి ఉండాలి. ఎంపిక చేసుకునే కాలేజీకి ఈ అర్హతలు ఉన్నాయో? లేవో? ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయిం తీసుకోవాలి.

వ్యాసకర్తః వైస్ ప్రిన్సిపాల్,
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine