Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Exam Guidence
GROUP-1 MAINS PAPER-2 POLITY

symbolగ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు వెలవడ్డా యి. దీనితో ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతా మా? కటాఫ్ ఎంత ఉండవచ్చు? లాంటి సందిగ్ధత లకు తెరపడింది. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ల కర్తవ్యం మెయిన్స్ మెళకువలు తెలుసుకొని ఒక పోస్టు సొంతం చేసుకోవడమే. గ్రూప్-1 మెయిన్స్‌లో పేపర్-2లో పాలిటీ సబ్జెక్టు ఎలా చదవాలి? ప్రశ్నల సరళి ఎలా ఉండవచ్చు? మనకున్న తక్కువ టైమ్‌లో పాలిటీలో గరిష్ట మార్కులు సాధించాలంటే ఎలాంటి వ్యూహాన్ని అనుసరిం చాలి? మొదలైన ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
మొట్టమొదట ఏ పోటీ పరీక్ష రాసే అభ్యర్థికైనా సిలబస్ పట్ల పూర్తి స్పష్టత ఉండాలి. సరైన దారి తెలియడంతోనే సగం విజయం చేకూరుతుంది. గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2లో పాలిటీ విభాగానికి 50 మార్కులు కేటాయించారు. ఈ విభాగాన్ని భారత రాజ్యాంగం- ఒక విహంగ వీక్షణం అని పేర్కొన్నారు. సిలబస్ ప్రారంభంలోనే విహంగ వీక్షణం అన్న పదం వాడడం జరిగింది. కాబట్టి నిర్థేశించిన సిలబస్‌పై అభ్యర్థి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. సిలబస్‌లో ప్రతి అంశాన్ని విభిన్న కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉందని కూడా గమనించాలి.

గ్రూప్-1 మెయిన్స్ మొత్తం సిలబస్‌ను 5 యూనిట్లుగా విభజించారు. మొదటి యూనిట్‌లో రాజ్యాంగ స్వభావం, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, రాజ్యాంగ ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు, భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు అని పేర్కొన్నారు. అంటే సిలబస్‌లో వాడిన ప్రతి పదం నుంచి కూడా మనం ప్రశ్నలు ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. అయితే సిలబస్‌ను అభ్యర్థి సులువుగా అర్థం చేసుకుని చదువుకోవడానికి అనుగుణంగా అమర్చుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా అభ్యర్థి మొదట భారత రాజ్యాంగ ప్రవేశికను క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రవేశిక లేదా పీఠిక భారత రాజ్యాంగానికి ఒక ఐడెంటిటీ కార్డు వంటిది అని నానీ పాల్కీవాలా పేర్కొన్నారు. ప్రవేశికలో వాడిన ప్రతి పదంపైన (ఉదా : రాజ్యాంగంలో పేర్కొనబడ్డ సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, అనే పదాలు) పది మార్కుల ప్రశ్నకు సమాధానం భిన్న కోణాల్లో ఎలా అడిగినా రాయడానికి అభ్యర్థి సన్నద్ధుడై ఉండాలి.

ఉదా :- 2011లో జరిగిన గ్రూప్-1 మెయిన్స్‌లో పాలిటీ విభాగంలో మొట్టమొదటి ప్రశ్న
భారత రాజ్యాంగ ప్రవేశికలో భారతదేశం, లౌకిక, గణతంత్ర అని పేర్కొనబడింది. ఈ ప్రకటనకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలెట్టివి? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా రాసే క్రమంలో అభ్యర్థి నుంచి శాస్త్రీయ దృక్పథంతో కూడిన నిర్దిష్టమైన సమా ధానాన్ని ఆశిస్తున్నారన్న విషయం అవగతం అవు తుంది. అభ్యర్థి మొదట లౌకిక అన్న పదాన్ని పరిచయం చేసి రాజ్యాంగంలో లౌకిక అన్న పదానికి సంబంధించిన 14, 15, 16, 25, 26, 27, 28 నిబంధనల్లో పేర్కొన్న అంశాలను ఉదహరించి భారత రాజ్యాంగ నేపథ్యంలో లౌకికతత్వాన్ని గురించి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇది 5 మార్కుల (ఒక ప్రశ్నలో సగభాగం మాత్రమే) సమాధానం మాత్రమే. మిగతా 5 మార్కులు ‘‘గణతంత్ర’’ అన్నపదానికి సంబంధించిన వివరణతో పూర్తి చేయాలి. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్థి కాన్సెప్ట్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండా లి. అదే విధంగా తనకున్న విస్తృత సమాచారాన్ని నిర్ధిష్టంగా చెప్పే నేర్పు కూడా అలవరుచుకోవాలి.

గత ప్రశ్నా పత్రంలోని ఇతర ప్రశ్నలను గమనించి నట్లయితే నేరుగా అడిగే ప్రశ్నలు దాదాపు లేవనే చెప్పాలి. ఒక వేళ ఏదైనా ప్రశ్న ఏదైనా ఒకే అంశానికి సంబంధించినది అడిగినా దానికి సమాధానం ఒకే చోట ఫుస్తకాలలో దొరికే విధంగా ఉండడం లేదు. ఉదాహరణకు 44వ రాజ్యాంగ సవరణ ఆధారంగా రాజ్యాంగంలోని ఆస్తిహక్కును వివరించండి? అన్న ప్రశ్నకు సమాధానం రాయాలంటే మౌలిక భారత రాజ్యాంగంలో (1950లో అమలులోకి వచ్చిన రాజ్యాంగం) ప్రాథమిక హక్కుగా ఉన్న ఆస్తిహక్కు 1950 నుంచి ఇప్పటి దాకా భిన్న సందర్భాలలో ఎందుకు మార్పులకు గురైందో, ప్రాథమిక హక్కుల జాబితా నుంచి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లోఎందుకు తొలగించాల్సి వచ్చిందో పూర్తిగా తెలియాలి.

అలాగే ‘‘సామ్యవాద’’ అన్న పదం ప్రవేశికలో వాడారు. కానీ, 1991లో నూతన పారిశ్రామిక విధానం తర్వాత క్రమంగా సామ్యవాద విధానాలు క్షీణించాయి. నేడు ప్రభుత్వ రంగం నామ మాత్రపు పాత్రకే పరిమితమయింది. కాబట్టి ‘‘భారతదేశంలో సామ్యవాదం అంతరించింది. వ్యాఖ్యా నించండి’’ అని ప్రశ్నించవచ్చు. ఇలాంటి ప్రశ్నలను ఎదుర్కొ వలసి వస్తే అభ్యర్థులు ఒకే కోణంలో సమాధానం రాయకుండా సామ్యవాద విధానాలు క్షీణించాయన్న వాస్తవాన్ని ఆమోదిస్తూనే భారత ప్రభుత్వం సామ్యవాద విధానాల్ని బలపరచడానికి చేపడుతున్న చర్యలను ఉదహరించాలి. ఉదాహరణకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, భారత్ నిర్మాణ్ వంటి కార్యక్రమాలకు, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం వెచ్చిస్తున్న వ్యయం పెరుగుతుందే గాని తగ్గడం లేదని గమనించాలి. భారతదేశంలో సామ్యవాదం అంతరించిందని చెప్పలేమని హేతుబద్దమైన ఉదాహరణలతో తన వాదనను సమర్దించుకోవలసి ఉంటుంది. గ్రూప్-1 పాలిటీ విషయంలో అభ్యర్థులు గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే ప్రశ్నలకు పూర్తి స్థాయి వ్యాసంలా విస్తృతంగా సమాధానాలు రాసే అస్కారం లేదు. ఎందుకంటే ప్రతి సమాధానానికి కేటాయించిన మార్కులు 10 మాత్రమే కాబట్టి విస్తృతమైన విశ్లేషణకు తావులేదు. రాసే పరిమిత సమాధానం వీలైనంత నిర్థిష్టంగా ఉండేలా చూసుకోవాలి. పాలిటీ ప్రశ్నలకు ఏదైనా పాఠ్యపుస్తకంలో నేరుగా సమాధానాలు దొరికే విధంగా ఈ మధ్య అడగడం లేదు. కాబట్టి అభ్యర్థి ఏదైనా ఒక ప్రామాణిక పుస్తకాన్ని చదివిన తర్వాత భిన్న కోణాల్లో సమాధానాలు రాయడానికి వీలుగా దిన పత్రికల్లో వచ్చే వ్యాసాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పత్రికల్లో వచ్చే వ్యాసాలు పరిశీలిస్తూ రోజువారీ పరిణామాల పట్ల ఒక అవగాహన ఏర్పర్చుకోవలసి ఉంటుంది.
వ్యాసకర్త ః హైదరాబాద్‌లో పోటీపరీక్షల శిక్షణ నిపుణులు

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine