Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Exam Guidence
గ్రూప్-2 ఇండియన్ ఎకానమీ పేపర్-3

కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి
part - I : unit-2

భారతదేశ ఆర్థికవ్యవస్థలో స్థూలపరమైన కోశ విధానాలు, ద్రవ్యం - విధులు, పారిశ్రామిక వర్తకం, వ్యవసాయ విధానాలు -లక్ష్యాలు, సహేతుక పరిమితులు, ప్రభావాలపై ప్రశ్నలుం టాయి. ఈ యూనిట్‌లో ప్రశ్నలు 15 వరకు వస్తాయి. ప్రశ్నలు అభ్యర్థుల అవగాహన శక్తిని పరీక్షించేవిగా ఉంటాయి. ద్రవ్య విధానాలు - విధులుపై ప్రశ్నలు అనుప్రయుక్త రీతిలో సాగుతాయి. వ్యవసాయక విధానాలలో ప్రశ్నలు గణాంకాల రూపంలో ఉంటాయి. పారిశ్రామిక వర్తకంలో ఇటీవల ధోరణులు ఎగుమతులు, దిగుమతులపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మీద ఈ యూనిట్ నుండి వచ్చే ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో కీలకమైనవిగా పరిగణించాలి.
1.ప్రస్తుతం దేశంలో ఎన్ని మహారత్న కంపెనీలు ఉన్నాయి?
1. 5 2. 6 ( )
3. 4 4. 16
2.ఏకస్వామ్య నిరోధక వ్యాపార పద్ధతుల (MRTP) కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ( )
1. 1969 2. 1970
3. 1981 4. 1968
3.SEBI అనునది? ( )
1.రాజ్యాంగ బద్దమైన సంస్థ 3. శాసన పరమైన వ్యవస్థ
2.సలహా మండలి 4. రాజ్యాంగేతర సంస్థ
4.మొదటి సారిగా ఏ వైస్రాయ్ కాలంలో బడ్జెట్ విధానాన్ని మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది? ( )
1.బెంటింక్ 2.డల్హౌసి
3.కానింగ్ 4.రిప్పన్
5.13వ ఆర్థిక సంఘం సిఫార్సులు ఏ కాలానికి అమలు అవుతాయి? ( )
1. 2010-15 3. 2005-10
3. 2007-12 4. 2012-17
6.విత్తలోటు అనగా? ( )
1.బడ్జెట్ లోటు + మొత్తం రుణాలు
2. రెవెన్యూ వ్యయం - రెవెన్యూ ఆదాయం
3. ప్రభుత్వం యొక్క మొత్తం వ్యయం- ప్రభుత్వం మొత్తం ఆదాయం
4. బడ్జెట్ లోటు - మొత్తం రుణాలు
7.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన శిఖరాగ్ర బ్యాంక్‌గా ఏ బ్యాంక్ పని చేస్తుంది? ( )
1. ఆర్.బి.ఐ 2. నాబార్డ్
3. సహకార బ్యాంక్‌లు 4. గ్రామీణ బ్యాంక్‌లు
8.చిన్న తరహా పరిశ్రమలకు రుణ సహాయాన్ని అందించడం, చిన్న తరహా పరిశ్రమలకు రుణాలందించే సంస్థలకు రీ ఫైనాన్స్ చేయడం కోసం 1990 ఏప్రిల్ 12న ఏ బ్యాంక్ స్థాపించారు? ( )
1. SIDBI 2. EXIM 3. HDFC 4. IDBI
9.అంతర్జాతీయ వాణిజ్యానికి పరిరక్షకురాలు (watch dog) అని పిలువబడే సంస్థ ఏది? ( )
1. GATT 2. IMF
3. WTO 4. IBRD
జతపరుచుము
10.విప్లవం రంగం ( )
1. హరిత విప్లవం a) వ్యవసాయం
2. నీలి విప్లవం b) చేపలు
3. పసుపు విప్లవం c) పాలు
4. శ్వేత విప్లవం d) నూనె గింజలు
1 2 3 4
1. a b c d
2. a b d c
3. c b a d 4. b c d a
11. మన దేశంలో హరిత విప్లవం వలన ఏమాత్రం ప్రయోజనం పొందని పంటలేవి? ( )
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. జొన్న
12. మన దేశంలో వ్యవసాయ రంగంలో ప్రధానంగా కన్పించే నిరుద్యోగం ఏ రకమైనది? ( )
1. ప్రచ్ఛన్న నిరుద్యోగం 2. అల్ప నిరుద్యోగం
3.సాంకేతిక నిరుద్యోగం 4. కాలిక నిరుద్యోగం
13. ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు? ( )
1. భారత దేశంలోవ్యవస్థ పూర్వక నిరుద్యోగిత అధికంగా ఉంది 2. భారతదేశ గ్రామీణ ప్రాంతంలో కాలిక నిరుద్యోగిత అధికంగా ఉంది.
3. భారతదేశ పారిశ్రామిక రంగంలో అల్ప ఉద్యోగిత అధికంగా ఉంది
4. భారతదేశ పట్టణ ప్రాంతంలో ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఎక్కువగా ఉంది.
14. లక్షిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS) ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ( )
1. 1996 2. 2002
3. 1997 4. 1992
15. భారతదేశంలో అములు చేయబడిన భూ సంస్కరణలలో ప్రధానాంశాలేవి? ( )
1. మధ్యవర్తుల తొలగింపు 2. కౌలు సంస్కరణలు
3. కమతాల గరిష్ట పరిమితి చట్టాలు 4. పైవన్నీ
16. సూక్ష్మ, చిన్న, మధ్య రకం సంస్థల అభివృద్ధి (MSMED) చట్టం- 2006 ప్రకారం తయారీ రంగంలో చిన్న తరహా పరిశ్రమలకు గరిష్ట పెట్టుబడి ఎంత? ( )
1. రూ. 10 లక్షల నుండి రెండు కోట్లు
2. రూ. 25 లక్షల నుండి 10 లక్షలు
3. రూ. 25 లక్షల నుండి 2 కోట్లు
4. రూ. 25 లక్షల నుండి 5 కోట్లు
17. వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో కనీస మద్ధతు ధర, సేకరణ ధర, జారీ ధరలను నిర్ణయించడానికి 1965లో ఏర్పాటు చేసినది? ( )
1. వ్యవసాయ ధరల కమిషన్
2. వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్
3. NAFED
4. పైవేవీ కాదు
18. 1951 ఏప్రిల్ 18న భూదానోధ్యమాన్ని ఆచార్య వినోభా బావే ఎక్కడి నుంచి ప్రారంభించారు? ( )
1. పోచంపల్లి (నల్లగొండ) 2. పోచంపల్లి (వరంగల్)
3. పోచంపేట (నల్లగొండ) 4. పోచంపేట (వరంగల్)
19. భూదానోధ్యమంలో మొదటి సారిగా 100 ఎకరాల భూమిని దానం చేసిన వ్యక్తి? ( )
1. మెదరి రామచంద్రారెడ్డి
2. వెదరి రామచంద్రారెడ్డి
3. గుఱ్ఱం వెంకటరెడ్డి
4. సురకంటి సత్యనారాయణరెడ్డి
food20. MAT (Minimum Alternative Tax) దేనికి సంబంధిం చింది? ( )
1. ఎక్సైజ్ పన్ను
2. సేవల పన్ను
3. వ్యక్తిగత పన్ను
4. కార్పొరేషన్ పన్ను
21.వస్తువులు మరియు సేవల పన్ను (Goods and service Tax) యొక్క ప్రధానోద్దేశ్యం ఏమిటి? ( )
1. పన్ను ఎగవేతని నిరోధించడం
2. పన్ను చెల్లింపు సులభతరం చేయడం
3. పన్ను మినహాయింపులను అడ్డుకోవడం
4. ఎక్కువ ఆదాయం సమకూర్చుకోవడం
answers22. ద్రవ్యోల్బణ కాలంలో..? ( )
1. ఆర్‌బిఐ ద్రవ్య విధానంలో భాగంగా CRRని తగ్గిస్తుంది 2. ఆర్‌బిఐ ద్రవ్య విధానంలో భాగంగా CRRని పెంచుతుంది
3. ఆర్‌బిఐ ద్రవ్య విధానంలో భాగంగా బ్యాంక్ రేటును పెంచుతుంది
4. ఆర్‌బిఐ ద్రవ్య విధానంలో భాగంగా రెపోరేటును పెంచుతుంది


మోడల్ క్వశ్చన్స్

1. మనదేశంలో ప్రతి 3 నెలలకొకసారి ద్రవ్య విధానాన్ని ఎవరు ప్రకటిస్తారు? (2)
1. ఆర్థిక మంత్రిత్వ శాఖ 2. ఆర్.బి.ఐ
3. క్యాబినెట్ 4. సెబి
2. భారతదేశంలో విత్త విధానాన్ని ప్రకటించేది?
1. ఆర్.బి.ఐ 2. ఆర్థిక మంత్రిత్వ శాఖ
3. క్యాబినెట్ 4. సెబి (2)
3. భారత పారిశ్రామిక విధాన తీర్మానాలకు రాజ్యాంగం వంటిదిగా భావించబడే ఆర్థిక తీర్మానం ఏ తేదీన ఆమోదించబడింది? (1)
1. 1956 ఏప్రిల్ 30 2. 1956 ఏప్రిల్ 1
3. 1956 మే 1 4. 1956 జనవరి 30
4. సామ్యవాద రీతి సమాజ స్థాపన ఏ పారిశ్రామిక విధా నంలోనిది? (2)
1. 1948 2. 1956
3. 1991 4. 1970
5. ఈ క్రింది వాటిలో ఏది సరైనది?
1) మొదటి పారిశ్రామిక తీర్మానం 1948 ఏప్రిల్ 6న భారత ప్రభుత్వం ప్రకటించింది.
2) 1977లో జనత ప్రభుత్వం డిసెంబర్ 23న పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించింది.
3) 1980 జూలై 3న పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకటించబడింది.
4)1991 జూలై 24న నూతన పారిశ్రామిక విధానాన్ని పార్లమెంట్ ప్రకటించింది.
1. 1,2 సరైనవి 2. 2,3 సరైనవి (3)
3. 1,2,3,4 4. 3, 4 సరైనవి
6. పి.ఎస్.ఈ. మహారత్న హోదా పొందాలంటే ఏ అర్హత లుండాలి? (2)
1. వరుసగా 3 సంవత్సరాలు లాభం పొందుతూ ఏదైనా ఒక సంవత్సరం నికరంగా లాభం రూ.5000 కోట్లు ఉండాలి.
2. రూ.15,000 కోట్ల నికర ఆస్తులు ఉండాలి.
3. వార్షిక టర్నోవర్ రూ.25,000 కోట్లు ఉండాలి.
4. స్టాక్ మార్కెట్‌లో నమోదై షేర్లు, ట్రేడింగ్ అవుతూ ఉండాలి.
1. 1,2,3 2. 1,2,3,4
3. 2,3 4. 1,3,4
7.భారతదేశంలో అతి పురాతనమైన పరిశ్రమ ఏది?(2)
1. జనపనార పరిశ్రమ 2. వస్త్ర పరిశ్రమ
3. సిమెంట్ పరిశ్రమ 4. ఇనుము, ఉక్కు పరిశ్రమ


ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు

1.ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనగా? (డిఇఒ -2008) ( 2 )
1. ఉద్యోగం లేని వ్యక్తి
2. ఒక పనికి కావాల్సిన వారికన్నా ఎక్కువ మంది పని చేయుట
3. స్త్రీలలో నిరుద్యోగిత
4. 60 సంవత్సరాలు మరియు ఆపై బడిన వారిలో నిరుద్యోగిత
2.1990 ప్రారంభ కాలంలో భారతదేశంలో సంభవించిన ఆర్థిక సంక్షభం ఈ రూపం దాల్చింది? (2005 నవంబర్ గెజిటెడ్) ( 4 )
1. సాధారణ స్థూల ఆర్థిక అసంతులనం
2. ప్రభుత్వ వ్యయం మరియు ప్రభుత్వ ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరం
3. తగినంత విదేశ వినిమయ రిజర్వు నిల్వలు లేకపోవడం
4. వ్యాపార చెల్లింపుల శేషం సంక్షోభంలో పడటం
3.కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ రాబడిని సమకూర్చు పన్ను ఏది?
(Aso-2011) ( 1 )

1. కార్పొరేట్ పన్ను 2. కస్టమ్స్ సుంకాలు
3. వ్యక్తిగత ఆదాయ పన్ను 4. సంపద పన్ను
4.ప్రత్యక్ష పన్ను విధింపులో ఒకే వ్యక్తిపై ఉండేవి పన్ను చెల్లింపు భారము మరియు..? నగూప్-2 ఎకనామిక్స్-2006)
1. తక్కువ పన్ను భారం 2. పాక్షిక భారం ( 3 )
3. మొత్తం భారం 4. భారమే కాదు
5.ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావాన్ని మొట్టమొదటి సారి ప్రవేశపెట్టినది ఎవరు? (2005 నవంబర్, గెజిటెడ్)
1. ఎ. లూయిస్ 2. ఆర్.నర్క్స్ ( 2 )
3. జె.రాబిన్‌సన్ 4. అమర్త్యసేన్
6.ఏ దేశంలో మొదటి సారిగా పారిశ్రామిక విప్లవం ఏర్పడింది?
1. ఫ్రాన్స్ 2. జర్మనీ ( 3 )
3. ఇంగ్లాండ్ 4. యు.ఎస్.ఎ.
(2007 జె.ఎల్.ఎకనామిక్స్)
7....బడ్జెట్‌లో రాబడి మరియు రుణము సమానము?
1. మిగులు 2. లోటు ( 3 )
3. సమతల 4. పైవానిలో ఏదీ కాదు
నగూప్-2, 2008)

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine