|
|
2600 ఎక్సయిజ్ కానిస్టేబుల్ పోస్టులు రెడీ!
జూలైలో నోటిఫికేషన్ ఆర్నెళ్లుగా ఎదురుచూస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల ర్తీ నోటిఫికేషన్ జులై మొదటి వారంలో వెలువడనున్నది. గత పోస్టులు, తాజాగా మంజూరైన ఖాళీలతో సహా భారీ సంఖ్యలో 2606 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది. కొద్ది రోజుల క్రితం 1172 అదనపు ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులు మంజూరైన వెంటనే ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు సమావేశమై కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దరఖాస్తులు స్వీకరించడం, దరఖాస్తుల స్క్రూటీని చేపట్టడం, అర్హత గల అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయడం వంటివి ఆన్‌లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. కేంద్రీకృత విధానంలో ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ ఉన్నతాధికారులు ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ప్రకటించి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో కోరతారు.
మొత్తం 2006 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులలో 33 1/3 శాతం ఖాళీలు మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేస్తారు. టెన్త్‌క్లాసు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడవచ్చు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు. ఎస్.సి, ఎస్.టి, బిసి అభ్యర్థులకు 5 ఏళ్లు వయోః పరిమితి సడలింపు ఉంటుంది. కటాఫ్ తేదీ 2012, జూలై 1. పురుష అభ్యర్థులు కనీసం 165 సెం.మీ. ఎత్తు ఉండాలి, గాలి పీల్చినప్పుడు ఛాతి 81 సెం.మీ. విస్తీర్ణం ఉండాలి. ఇక మహిళా అభ్యర్థులు కనీసం 152.5 సెం.మీ. ఎత్తు కలిగి ఉండాలి. కనీసం 45.5 కిలోల బరువు ఉండాలి. జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఖాళీలలో 80 శాతం స్థానిక అభ్యర్థులతో భర్తీ చేస్తారు. మిగతా 20 శాతం ళీలకు ఓపెన్ పద్ధతిలో స్థానికులు లేదా ఇతర జిల్లాల అభ్యర్థులైన స్థానికే తరులు ఎవరైనా మెరిట్ ఆధారంగా ఎంపిక కావచ్చు.
ఎంపిక విధానం 4 కిలోమీటర్ల పరుగు పందాన్ని 20 నిమిషాల వ్యవధిలో పురుష అభ్యర్థులు పూర్తి చేయాలి. ఇక మహిళా అభ్యర్థులు 2 కిలోమీటర్ల పరుగు పందాన్ని 18 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పరుగు పందెంలో అర్హత సాధించిన అభ్యర్థులనే తదుపరి శారీరక సామర్ధ్య పరీక్షలకు అనుమతిస్తారు. సివిల్ కానిస్టేబుల్ తరహాలోనే 100 మీటర్లు పరుగును 15 సెకండ్లలో పూర్తి చేయాలి. హైజంప్‌లో 1.20 మీటర్లు ఎత్తు దాటాలి. 3.80 మీటర్లు దూరం లాంగ్ జంప్ చేయాలి. 7.76 కిలోల బరువు గల షాట్‌పుట్ 5.60 మీటర్లు దూరం విసరాలి. చివరగా 800 మీటర్లు పరుగును 2 నిమిషాల 50 సెకండ్లలో పూర్తి చేయాలి. ఈ శరీర సామర్ధ్య పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్షకు అనుమతిస్తారు. రాత పరీక్ష మార్కుల మెరిట్ ఆధారంగానే ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక జరుగనుందనే సంగతి అభ్యర్థులకు తెలిసిందే. ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఆప్టిట్యూడ్ విభాగంలో 50 ప్రశ్నలకు 50 మార్కులుంటాయి. మిగతా 50 మార్కులు జనరల్ నాలెడ్జ్ (కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఇండియన హిస్టరీ, సివిక్స్ అండ్ జనరల్ సైన్స్ అంశాలు) విభాగంలో 50 ప్రశ్నలుంటాయి. రెండు విభాగాలలో మొత్తం 100 మార్కులకు అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాద్యమాల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రశ్నపత్నాన్ని రూపొందించనున్నారు.
-మద్దోజు శ్రీనివాస్
Other News
|
|