Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 18, 2013
 


Home >> Exam Guidence
రూరల్ బ్యాంక్‌జాబ్ అందుకోండి ఇలా!

bankబ్యాంక్ జాబ్ అంటే ఆసక్తే గాని సెలక్షన్ వస్తే దేశంలో ఎక్కడెక్కడికో పోవాలన్న బెంగలేదు. మీ ప్రాంతంలోనే మీ ఊరికి సమీపంలోనే బ్యాంక్ జాబ్ అందించే జాతీయ బ్యాంకుల అనుబంధ గ్రామీణ బ్యాంక్‌ల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
ఉమ్మడిగా 19 జాతీయ బ్యాంకులకు పీ.ఓ, క్లర్ల్ పరీక్షలు నిర్వహించిన తరహాలోనే దేశ వ్యాప్తంగా ఉన్న 82 గ్రామీణ బ్యాంకులకు ఉమ్మడిగా ఆఫీసర్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు విడివిడిగా ఐబీపీఎస్ పరీక్షలు నిర్వహించనుంది. జాతీయ బ్యాంకులు స్పాన్సర్లుగా ఉన్న గ్రామీణ బ్యాంకులు మన రాష్ట్రంలో ఐదు ఉన్నాయి. ఆ బ్యాంకుల్లో ఖాళీల అంశం ఎక్కడా పేర్కొనక పోయినా వేల సంఖ్యలోనే ఉంటాయి అనేది అంచనా.

జాతీయ బ్యాంకులకు భిన్నంగా గ్రామీణ బ్యాంకుల్లో ఎక్కడో దూరంగా ఉద్యోగం చేయనవసరంలేదు. అలాగే బదిలీలు సైతం దగ్గరలోనే ఉన్న ప్రాంతాలకు ఉంటాయి. జీత భత్యాల విషయంలో గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల జీతాలు కూడా వాణిజ్య బ్యాంక్ ఉద్యోగుల జీతాలకు ఏ మాత్రం తీసిపోవు. సుమారు రెండు నెలల పాటు ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తే ఉజ్వల భవిత సొంతం అవుతుంది.
ఆఫీసర్ స్కేల్ - 1 ఉద్యోగానికి సెప్టెంబర్ 2న, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి సెప్టెంబర్ 9న పరీక్ష నిర్వహిస్తారు.
విద్యార్హతతో పాటు, ప్రశ్నల సంఖ్య, సమయం, సిలబస్‌లో పేర్కొన్న అంశాలు, ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఒకేలా ఉన్నాయి. అయితే ప్రశ్నల స్థాయిలో మాత్రం వ్యత్యాసం ఉంటుంది.
రీజనింగ్, ఆర్థమెటిక్, ఇంగ్లీష్ విభాగాల్లో అడిగే ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. అయితే జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్‌లో మాత్రం రెండింటికీ ఒకే స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రీజనింగ్ విభాగంలో ప్రశ్నలు వెర్బల్, నాన్ వెర్బల్‌గా విభజించవచ్చు. ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు నాన్ వెర్బల్ రీజనింగ్ ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వెర్బల్ రీజనింగ్‌లో అల్ఫాబెట్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, పజిల్ టెస్ట్ తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి.
ex :- 1. In a class of 42 students, If Datta got 21st from top, what is big rank from bottom (Office Assistants)
2. In a class of 42, If Aditya got 18 from top, and vamshi got 24 from bottom, how many students are there between them. (Officers)
ఇలా ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది.

village_tableఆర్థమెటిక్ ః ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షకు న్యూమరికల్ ఎబిలిటీ అని స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి BODMAS సూత్రం ఆధారంగా 20-25 ప్రశ్నలు రావచ్చు. వేగంగా చేయడం కోసం రోజు కనీసం 100 లెక్కలు, ‘BODMAS’ ఆధారంగా ఉన్న ప్రశ్నలను చేయాలి.ఆఫీసర్స్ పరీక్షకు, ఆఫీస్ అసిస్టెంట్‌కు పర్సెంటేజీ, యావరే జెస్, సింపుల్, కాంపాండ్ ఇంట్రస్ట్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ మెన్సురేషన్, ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ తదితర విభాగాల నుంచి 10- 15 ప్రశ్నలు రావచ్చు. అకడమిక్ తరహాలో సూత్రాలపై అధారప డకుండా ‘షార్ట్‌కట్’ పద్ధతులను నేర్చుకోవాలి.
ఆఫీసర్స్ పరీక్షలో డాటా ఇంటర్ ప్రిటేషన్ పై కూడా ప్రశ్నలు వస్తాయి. కనీసం 5 ప్రశ్నలు రావచ్చు. బార్స్, పై చార్ట్స్, లీనియర్ గ్రాఫ్స్‌ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అర్థమెటిక్‌లో మొదట షార్ట్‌కట్స్ కాకుండా బేసిక్స్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి.

exam_tableఇంగ్లీష్‌లో రాణించడానికి గతంలోలా కేవలం గ్రామర్ బుక్స్‌పైనే ఆధారపడితే సరిపోదు. యూసేజ్ పైనా ప్రశ్నలు ఉంటున్నందున హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ పత్రికలను రోజూ చదువుతూ ఒకాబులరీ పెంచుకోవాలి. ఒకే పదాన్ని భిన్న సంధర్బాల్లో ఎలా వాడుతున్నారో పరిశీలిస్తే ‘‘క్లోజ్ టెస్ట్, కాంప్రహెన్షన్’’ విభాగాలను సులభంగా పూర్తి చేయొచ్చు. దిన పత్రిక చదవడం వల్ల జనరల్ అవేర్‌నెస్ విభాగానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
జనరల్ అవేర్‌నెస్‌లో కరెంట్ అఫైర్స్‌తో పాటు బ్యాంకింగ్, బేసిక్ ఎకానమీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. బ్యాంక్‌లో వాడే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్ వంటి పదాలను తెలుసుకోవాలి. వాటికి సంబంధించి తాజా విలువలు గుర్తుంచుకోవాలి.

కరెంట్ అఫైర్స్‌లో తాజా స్పోర్ట్స్ ప్రశ్నలు కూడా వస్తున్నందున లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ చదవాల్సి ఉంటుంది. అట్లాగే వివిధ క్రీడలకు చెందిన ట్రోఫీలు (ఉదా :-అజ్లాన్ షా ట్రోఫీ- హాకీ, సీకే నాయుడు ట్రోఫీ మకికెట్) వివిధ క్రీడలకు చెందిన పదాలను గుర్తుం చుకోవాలి. తేదీలు వాటి ప్రాముఖ్యం (ఉదా :-జూన్ 5- పర్యావరణ దినం, ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం)పై ఒకటి లేదా రెండు ప్రశ్నలు వస్తున్నందున వాటిని నేర్చుకోవాలి.
కంప్యూటర్ నాలెడ్జ్ విభాగంలో కంప్యూటర్ ఇంట్రడక్షన్, ఇన్‌ఫుట్, అవుట్‌పుట్ డివైసెస్, ఇంటర్‌నెట్, మెమోరీ స్టోరేజ్ కాన్సెప్ట్స్, ఎం.ఎస్ ఆఫీస్, నెట్‌వర్క్ సెక్యూరిటీ తదితర అంశాలపై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలుంటాయి.

అర్హతలు ః ఆఫీసర్ స్కేలు -1, ఆఫీస్ అసిస్టెంట్ డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు -18 నుంచి 28 సం.లు (01.06.2012 నాటికి) ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సం.లు, ఓబిసి అభ్యర్థులకు 3 సం.ల సడలింపు)
దరఖాస్తుకు చివరి తేదీ ః 25-06-2012 వెబ్‌సైట్ ః www.ibps.in
ఫీజు వివరాలు : ఆఫీసర్ స్కేల్ -1 ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి అభ్యర్థులకు రూ. 50, ఇతరులకు రూ. 450. ఆఫీస్ అసిస్టెంట్ : ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు రూ.50, ఇతరులకు రూ.350.


టిప్స్ & ట్రిక్స్
-ఒక్కో విభాగంలో 40 ప్రశ్నలే అడుగుతున్నా. రీజనింగ్, అర్ధమెటిక్‌లకు 45 నిమిషాలు కేటాయిస్తే.. ఒక్కో ప్రశ్నను పూర్తి చేయడానికి 60 సెకన్లకు మించిన సమయం అందు బాటులో ఉంటుంది. కాబట్టి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. (నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి)
-సిట్టింగ్ అరెంజ్‌మెంట్, పజిల్ వంటి ప్రశ్నలు రీజనింగ్‌లో వస్తాయి. ఇందులో ఒకే డేటాపై 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 1 నిమిషం సమయం అనుకున్నా.. ఆయా పజిల్స్‌ను 3-4 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను వాటిని ఎక్కువ సంఖ్యలో ప్రాక్టీస్ చేయాలి.
-ప్రతి రోజూ ‘BODMAS’ పై అధారపడిన సమస్యలను కనీసం 100 ప్రాక్టీస్ చేస్తే న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ విభాగాలను తక్కువ సమయంలో పూర్తి చేయొచ్చు.
-జనరల్ అవేర్‌నెస్‌లో ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన పరిణామాలను అడిగే అవకాశం ఉంది.

వ్యాసకర్త ః సుబోధ్ ఇనిస్టిట్యూట్ ఫ్యాకల్టీ

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine