Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Thursday, June 20, 2013
 


Home >> Exam Guidence
జె.ఎల్. ఇంటర్వ్యూలో గెలుపు ఎలా?

జూనియర్ లెక్చరర్ పోస్టుల ఎంపికకు తుది ఘట్టం ఇంటర్వ్యూలు ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్వ్యూకు 1ః2 నిష్పత్తిలో 2279 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. 50 మార్కులకు జరిగే ఈ మౌఖిక పరీక్ష చాలా మంది అభ్యర్థుల జయాపజయాలను నిర్దేశిస్తుంది. ఈ సందర్భంగా ఇంటర్వూ గైడెన్స్ అందిస్తున్నాం.
ఒక ఉద్యోగం నిర్వహించడానికి కావలసిన లక్షణాలు అభ్యర్థికి ఉన్నాయా లేదా అనే విషయం పరీక్షించడమే ఇంటర్వ్యూ లక్ష్యం. ఇంటర్వ్యూలో అభ్యర్థికి లోతైన విషయ అవగాహన ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. అభ్యర్థితో ఒక చక్కని సంభాషణను కొనసాగించడం ద్వారా అతనిలోని ఉత్తమ లక్షణాలను ఇంటర్వ్యూ బోర్డు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనితో పాటు జె.ఎల్ ఇంటర్వ్యూలలో అభ్యర్థి పాఠాలు ఏ విధంగా చెప్పగలరు అనేది కూడ పరీక్షిస్తారు.

ఇంటర్య్వూల సరళి
ఎపిపిఎస్‌సి నిర్వహించే ఇంటర్వ్యూలలో సాధార ణంగా, ఐదుగురు/ఆరుగురు సభ్యులుంటారు. మామూ లుగా ఒకే బోర్డు ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అయితే పోస్టుల సంఖ్య అధికంగా ఉండి ఇంటర్వ్యూలు చేయాల్సిన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు బోర్డులు కూడా ఏర్పాటు చేస్తారు. ఇటీవల జరిగిన గ్రూప్-II ఇంటర్వ్యూలలో నాలుగు బోర్డులను ఏర్పాటు చేశారు. ఎపిపిఎస్‌సి ఛైర్మన్ బోర్డుకు ఛైర్మన్‌గా ఉంటారు. ఛైర్మన్ అందుబాటులో లేని సమయంలో ఎపిపిఎస్‌సి సీనియర్ సభ్యులు బోర్డుకు నేతృత్వం వహిస్తారు. బోర్డులో ఛైర్మన్‌తోపాటు మరో నలుగురు/ఐదుగురు సభ్యులుం టారు. వీరిలో ఒకరు లేక ఇద్దరు ఎపిపిఎస్‌సి సభ్యులు కాగా మిగిలిన వారు బయటి వ్యక్తులు. వారిలో రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు ఉంటారు. వీరితోపాటు సమాజంలో ప్రముఖ వ్యక్తులలో ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. అలాగే సబ్జెక్టు నిపుణు లుంటారు. వీరు విశ్వవిద్యాలయాలలో వారి సబ్జెక్టుకు సంబంధించి మంచి ప్రావీణ్యం గలవారై ఉంటారు.

ఎపిపిఎస్‌సి నిర్వహించే అన్ని మౌఖిక పరీక్షలలో అభ్యర్థులను అడిగే పలురకాల ప్రశ్నలలో సింహభాగం బయోడేటా ఆధారంగానే ఉంటాయి. సాధారణంగా రాత పరీక్ష ఫలితాలు ప్రకటించిన అనంతరం ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులందరికీ బయోడేటా / విద్యార్హతలు వంటి అంశాలను వివరించడానికి కొన్ని నమూనా పత్రాలు పంపుతారు. ఈ నమూనా పత్రాలను పూర్తిచేసి ఎపిపిఎస్‌సికి సమర్పించాల్సి ఉంటుంది. నిజానికి ఇంటర్వ్యూ బోర్డు సభ్యులు అభ్యర్థులు పూర్తి చేసిన బయోడేటా పత్రాల ఆధారంగానే ప్రశ్నలు అడుగుతారు.

ఈ రకంగా బయోడేటా ఆధారిత ప్రశ్నలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1)సొంతపేరు ఆధారంగా
2)సొంత ఊరు ఆధారంగా
3)అభ్యర్థి ప్రాంతం ఆధారంగా
4)అభ్యర్థి కుటుంబ నేపథ్యం
5)అభ్యర్థి మౌలిక విద్యార్హతైన డిగ్రీ పూర్తయినప్పటి నుంచి ఇంటర్వ్యూకు మధ్య అతడు/ఆమె నిర్వర్తించిన కార్యకలాపాలు.
6)ఎంపిక చేసుకున్న జె.ఎల్. సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు.

ఇలా చేయండి
-ఇంటర్వ్యూలో బయోడేటా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నందున ముఖ్యంగా మీ పేరుకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకోవాలి.
-ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిపేర్లలో అత్యధికం ఊర్లపేర్లే ఉంటాయి. అంటే ప్రతి అభ్యర్థి ఇంటిపేరుతో ఎక్కడో ఒకచోట గ్రామం ఉండే అవకాశం ఉంటుంది.
-ఉదాహరణకు నందమూరి తారకరామారావు జన్మస్థలం కృష్ణాజిల్లా నిమ్మకూరు అని అందరికీ తెలుసు. అయితే ఆయన ఇంటిపేరయిన నందమూరు గ్రామం కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంది.
-కనుక మీ ఇంటిపేరుతో కూడా ఏదైనా ఊరు ఎక్కడైనా ఉందేవెూ తెలుసుకొని, దాని ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి.
-రాష్ట్రంలో చాలా వృత్తి కులాలు ఉన్నాయి. రకరకాల కారణాల వల్ల అనేక కుటుంబాలు జీవనాధారం కోసం కులవృత్తులు వదిలేసి వేరే ఉపాధి వెతుక్కుంటున్నాయి.
-ఇప్పటి తరాలకు చాలామందికి వారి కులవృత్తుల గురించి తెలిసే అవకాశం లేదు. ఆయావృత్తుల కుటుంబాల నుంచి వచ్చే అభ్యర్థులు. ఇతర అన్ని విషయాలతో పాటు వృత్తి గొప్పతనం గురించి అందులోని సాధకబాధకాల గురించి తెలుసుకోవడం అవసరం.
-ముఖ్యంగా పేరు, ఇంటిపేరు, ఊరు, వృత్తికి సంబంధిం చిన వ్యక్తిగత సమాచారం అభ్యర్థి వద్ద సంపూర్ణంగా ఉండాలి. ఇవన్నీ మన సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబిస్తాయి.

ఎగ్జామ్స్ ఆఫ్ ద వీక్
-అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఎకనామిక్స్
అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ ః 17.06.2012
-ఐబిపిఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్స్
మేనేజ్‌మెంట్ ట్రెనీస్ ః 17.06.2012
- ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్
బోర్డు - పోలీస్ కానిస్టేబుల్స్ ః 17.06.2012


అప్లికేషన్ అలర్ట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల నోటిఫికేషన్‌కు ఆన్‌లైన్ అప్లికేషన్‌ల ప్రక్రియ మే 24న ప్రారంభమయ్యింది.
వివరాలు ః హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 (సోషల్ వెల్ఫేర్)
మొత్తం పోస్టులు ః 522
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్-2 (ట్రైబల్ వెల్ఫేర్)
మొత్తం పోస్టులు ః 289
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభ తేదీ ః 24.05.2012
ఆన్‌లైన్ అప్లికేషన్లు ముగింపు తేదీ ః 24.06.2012
పరీక్ష తేదీ ః 12.08.2012
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ః www.apspsc.gov.in

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine