|
|
బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌లో
-విద్యాసంస్థలు-పరిశ్రమల ఇంటరాక్షన్‌కు సిఆర్‌ఎస్ పరిశోధనల్లో విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య ఇంట రాక్షన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుం టోంది. ఇందులో భాగంగా కాంట్రాక్టు రీసెర్చ్ అండ్ సర్వీస్ పథకం (సిఆర్‌ఎస్) కింద బయోటెక్నాలజీ డిపార్టుమెంట్ (డిబిటి)- బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (బిఐఆర్‌ఎపి) ప్రతిపాదనలను ఆహ్వానించాలని నిర్ణయిం చింది. కొత్త పరిశోధనలు చేయడానికి తగిన వాతావరణం, సౌకర్యాలను కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ బయో టెక్నాలజీ డిపార్టుమెంట్ వారు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (బిఐఆర్‌ఎపి)ను ప్రారంభించారు. ఇండస్ట్రి యల్ పార్టనర్‌తో కలిసి విలువైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) కలిగిన విద్యాసంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో మద్దతు ఇవ్వాలని డిబిటి-బిఐఆర్‌ఎపి నిర్ణయించింది.
పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలు, పబ్లిక్ ఫండ్స్‌లో నడిచే పరిశోధన శాలలు, ప్రభుత్వ సంస్థలు, రీసెర్చ్ ఫౌండేషన్స్, ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో పని చేసే కంపెనీలు/పరిశ్రమలు తదితర పర్రిశమలు-విద్యాసంస్థల మధ్య ఇంటరాక్షన్‌కు తగిన మద్దతును సిఆర్‌ఎస్ ఇస్తుంది. ఈ పథకం కింద ఇప్పటికే విలువైన ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్స్/లీడ్స్ కలిగి ఉన్న ప్రభుత్వరంగ పరిశోధనా సంస్థలు, యూనివర్శిటీలు వంటివి కంపెనీలతో కలిసి నిర్దిష్ట సమయంలో ప్రత్యేకమైన పరిశోధనల కోసం సపోర్టు కోరవచ్చు. అకాడమిక్ గ్రూప్స్ దీంతోపాటు అదనంగా పరిశ్రమల నుంచి టాక్సికాలజీ, సీక్వెన్సింగ్, ప్రత్యేక పరికరాలు వాడుకోవడానికి కూడా ఈ పథకం కింద వీలు కలుగుతుంది. సిఆర్‌ఎస్ కింద ప్రతిపాదనలను పంపడానికి ఫిబ్రవరి 29 వరకూ గడువు ఉంది.
ఏ విధంగా అప్లయ్ చేయాలి? ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో మాత్రమే పంపాల్సి ఉంటుంది. పోస్టు ద్వారా పంపే ప్రతిపాదలు పరిశీలించరు. ఆన్‌లైన్‌లో ప్రతిపాదనలను పంపాలనుకునే సంస్థలు ‘ఇనిస్ట్టిట్యూషన్ యూజర్ రిజిస్ట్రేషన్’ ద్వారా బిఐఆర్‌ఎపి వద్ద రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ప్రతిపాదనలను ఏ విధంగా పంపాలన్న విషయంపై వివరాలకు www.birapdbt.in వెబ్‌సైట్ చూడొచ్చు.
Other News
|
|