Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Studies Exams
ఇంటర్ ఎగ్జామ్స్‌కు ప్రిపేరయేదెలా?

inter-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaచూస్తుండగానే పాత సంవత్సరం వెళ్ళిపోయి... కొత్త సంవత్సరం వచ్చేసింది. ఇంటర్ పరీక్షలు దూసుకొచ్చేస్తున్నాయి. కేవలం ఇంటర్ ఎగ్జామ్సే అయితే స్టూడెంట్స్ బేషుగ్గా రాసేస్తారు.
కాని ఇంటర్ పరీక్షలు ఆపై వెనువెంటనే ఐఐటీ, ఎఐఇఇఇ, ఎంసెట్ ఎంట్రన్స్‌లున్నాయి.
అందుకే ఇంటర్ సిలబస్‌పై తక్కువ సమయంలో పట్టు తెచ్చుకుంటే మిగతా సమయాన్ని ఎంట్రన్స్‌లకు ఉపయోగించుకోవచ్చు. మరి, ఇంటర్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేసుకోవాలో ఫిజిక్స్ సబ్జెక్ట్‌ను ఉదాహరణగా తీసుకొని సూచనలు అందిస్తున్నాం.సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3, 2012 నుంచి మార్చి 17, 2012 వరకూ జరగనున్న నేపథ్యంలో థియరీ ప్లాన్ ప్రిపేర్ కావడానికి జనవరి మాసమే కీలకమైంది. ఫిబ్రవరి నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ 30 రోజుల కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి సిలబస్‌ను నాలుగు భాగాలుగా విభజించి ప్రిపరేషన్‌ను ప్రారంభించాలి. ఉదాహరణకు
కేవలం నాలుగు వారాల సమయం మిగిలి ఉండడం వల్ల ప్రతీ వారం ఒక్కో యూనిట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రశ్నలు చదవాల్సిన క్రమం ఈ విధంగా ఉండాలి.

1. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్
2. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్
3. వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్
4. అసెస్ యువర్‌సెల్ఫ్
5. ప్రాబ్లమ్స్ (తెలుగు అకాడమీ పుస్తకంలోని కనీసం ఉదాహరణ సమస్యలనైనా సాధన చేయాలి)
గత మూడు నాలుగు సంవత్సరాలుగా సమస్యల పై వచ్చే ప్రశ్నలు తక్కువగా ఇస్తూండడంతో అధిక ప్రాధాన్యత థియరీ పార్ట్‌కి ఇస్తే మంచిది. ఒక వారానికి సంబంధించిన సిలబస్ పూర్తి కాగానే సిలబస్‌కు సంబంధించి గతంలో ఇచ్చిన బోర్డు ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు రాసి తప్పులను సరి చూసుకోవాలి.
ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షలు, ప్రీఫైనల్-1 పరీక్ష లుంటాయి. కాబట్టి రెండు పరీక్షలు ఒకే సమయంలో జరపడం వల్ల క్వశ్చన్ పేపర్ తీసుకుని తర్వాత సాధన చేయాలి. అయితే ప్రీఫైనల్-2 పరీక్షలు తప్పక రాసి ఆన్సర్ స్క్రిప్ట్‌లను మూల్యాంకనం చేయించుకోవడం తప్పనిసరి. నిర్దేశించిన ప్రకారం సిలబస్‌ను పూర్తి చేస్తే పరీక్షా సమయానికి ఎటువంటి సందేహాలూ రాకుండా ఉంటాయి.

ఎంసెట్ ప్రిపరేషన్ :ఇంటర్మీడియట్ సిలబస్‌లో భాగంగా ప్రాబ్లమ్స్ పార్ట్‌ను సాధన చేస్తే ఎంసెట్‌లోని లెవెల్-1 ప్రిపరేషన్ కూడా పూర్తయినట్లే. మార్చి 17, 2012 నాటికి ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి కాబట్టి ఎంసెట్ పరీక్షకు దాదాపు 40 రోజులు సమయం ఉంటుంది. ఇంటర్‌లోని దాదాపు అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి అధ్యాయాల వారీగా అవగాహన ఉంటుంది. కనుక విద్యార్థు లకు కష్టమనిపించే అధ్యాయాల (ఇది విద్యార్థి విద్యార్థికి వేరుగా ఉంటుంది)లోని కీలక భావనలు మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది.
ఎంసెట్ విధానాల ప్రకారం 20 ప్రశ్నలు ఇంటర్మీడి యట్ పరీక్షలోని ‘వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్’ మాదిరిగా సులభంగా ఉంటాయి. వాటిని సరిగ్గా రాయాలంటే ఇంటర్మీడియట్ (థియరీ) భాగాన్ని బేసిక్స్ స్థాయి నుంచి నేర్చుకుంటే ఆ 20 ప్రశ్నలకు సమాధానాలు రాయడం తేలిక అవుతుంది. పది ప్రశ్నలు అప్లికేషన్ రకానికి చెందినవి. వీటికి జవాబులు రాబట్టాలంటే ఎంతో సాధన అవసరం.
సులభమైన అధ్యాయాల నుంచి వచ్చే ప్రశ్నలు ఎదుర్కోడానికి మరింత ప్రాక్టీస్ అవసరం. అందుకు మార్చి 1, 2012 నుంచి ఏప్రిల్ 30, 2012 అనువైన సమయం కనుక దీనికి సక్రమంగా వినియోగించుకోవాలి. స్థానికంగా నిర్వహించే మోడల్ పరీక్షల్లో పాల్గొని నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చు. ఎంసెట్ ర్యాంకింగ్ లో ఫిజిక్స్‌లో పొందిన మార్కులు కీలక పాత్ర పోషిస్తాయి. కనుక ఫిజిక్స్ అంటే కష్టమైనది అనే భావనను తొలగించి, ఎక్కువ దృష్టిని ఫిజిక్స్‌పై ఉంచాలి. అదే సమయంలో ఇతర ప్రధాన సబ్జెక్టులకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. పరీక్షకు సంబంధించి ప్రణాళిక కచ్చితంగా వేసుకుని అమలు జరిపితే మంచి ర్యాంక్‌ను పొందడం ఏ మాత్రం కష్టం కాదు.


unit-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinema

వ్యాసకర్త ః సుజాత, సీనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్,
గాయత్రి జూనియర్ కాలేజ్, హైదరాబాద్.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine