|
|
బయాలజీ విభాగంలో కీలకం కణశాస్త్రం
డియస్‌సి పరీక్షా విధానంలో బయాలజీ విభాగం ఒకటి. సబ్జెక్టు ఏదైనా కంటెంట్‌కు ప్రాధాన్యమున్న విషయం తెలిసిందే. ప్రశ్నలు 6వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల నుంచి వస్తాయి. అయితే వీటి స్థాయి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. జి.కె. పరెస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, మెథడాలజీలు ప్రాధాన్యమున్నవే అయినప్పటికీ మార్కుల పరంగా, ప్రశ్నల స్థాయి పరంగా కంటెంట్ విభాగం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. అభ్యర్థులు కంటెంట్ విభాగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి చదవాల్సి ఉంటుంది. ఈ దిగువనీయబడిన ప్రశ్నలు మీ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకోవడానికి ఉపయోగపడతాయి. 1. మైక్రోగ్రాఫియా గ్రంథకర్త ఎవరు? ( ) 1. లీవెన్ హక్ 2. రాబర్ట్ హుక్ 3. జకారియస్ జాన్సన్ 4. డుజార్టిన్ 2. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఎం.జె ష్లీడన్ ఏ దేశస్తుడు? 1. అమెరికా 2. రష్యా 3. జర్మనీ 4. జెకొస్లోవేకియా 3. జీవ పదార్ధాన్ని జీవ క్రియ కేంద్రంగా అభివర్ణించినది? ( ) 1. రాబర్ట్ హుక్ 2. రాబర్ట్‌బ్రౌన్ 3. వాన్‌మోల్ 4. ట్రైలామెల్లార్ 4. ప్లూయిడ్ మొజాయిక్ నమూనాను ప్రతిపాదించినది? ( ) 1. సింగర్ & నికోలసన్ 2. డానియల్లి, డేవ్‌సన్ 3. సింగర్, డేవ్‌సన్ 4. నికోలస్, డేవ్‌సన్ 5. ఏ రకమైన శైవలాల్లో గోధుమ వర్ణద్రవ్యం ప్రముఖంగా ఉంటుంది? ( ) 1. క్లోరోపైసి 2. రోడోపైసి 3. సయనోపైసి 4. ఫియోపైసి 6. హరితరేణువులను తొలుత ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు? ( ) 1. సాక్స్ 2. షింపర్ 3. బెండా 4. లీవెన్‌హక్ 7. మైటోకాండ్రియాను కనుగొన్నది? ( ) 1. ఆల్ట్‌మన్ 2. కొల్లికర్ 3. బెండా 4. షింపర్ 8. Power House of the Cell అని ఏ కణాంగాన్ని అంటారు? ( ) 1. హరితరేణువు 2. గాల్జీ సంక్షిష్టం 3. అంతర్జీవ ద్రవ్యజాలం 4. మైటోకాండ్రియా 9. శ్వాసక్రియకు తోడ్పడే కణాంగం ఏది? ( ) 1. హరితరేణువులు 2. మైటోకాండ్రియా 3. గాల్జీ సంక్లిష్టం 4. రైబోజోమ్స్ 10. కణంలో కనిపించే అతి సూక్ష్మమైన వల వంటి నిర్మాణం ఏది? 1. అంతర్జీవ ద్రవ్యజాలం 2. గాల్జీ సంక్లిష్టం 3. పెరాక్సీ జోమ్స్ 4. రైబోజోమ్స్ 11. ప్రోటీన్ల సంశ్లేషణకు పరోక్షంగా సహాయపడే కణాంగం? ( ) 1. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం 2. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం 3. గాల్జీ సంక్లిష్టం 4. పెరాక్సీసోమ్‌లు 12. సార్వత్రిక కణాంతాలు అని వేటినంటారు? ( ) 1. ప్లాస్టిడ్స్ 2. హరితరేణువులు 3. మైటోకాండ్రియా 4. రైబోజోమ్‌లు 13. కణంలో అన్ని కణాంగాలకంటే పరిమాణంలో చిన్నవిగా ఉండేవి ఏవి? ( ) 1. పెరాకీసజోమ్స్ 2. లైసోసోమ్స్ 3. రైబోజోమ్స్ 4. అంతర్జీవ ద్రవ్యజాలం 14. రైబోజోమ్‌లను కనుగొన్నది? ( ) 1. పెలెడె 2. రోడిన్ 3. డీడూవె 4. బెండా 15. రైబోజోమ్‌లోని రెండు ఉప ప్రమాణాలు ఏ అయాన్ సహాయంతో అతుక్కొని ఉంటాయి? ( ) 1. కాల్షియం 2. మెగ్నీషియం 3. పెర్రస్ 4. ఏదీకాదు 16. రైబోజోమ్‌లను ఏ కణాంగాలుగా పిలుస్తారు? ( ) 1. సార్వత్రిక కణాంగాలు, పురాతన కణాంగాలు 2. సార్వత్రిక కణాంగాలు, బహురూపకత కణాంగాలు 3. పురాతన కణాంగాలు, బహురూపకత కణాంగాలు 4. 2 మరియు 3 17. కణకవచం ఉత్పత్తికి అవసరయ్యే గ్లూకోజ్, హీమోసెల్యులోజ్ వంటి పదార్దాల సంశ్లేషణలో తోడ్పడే కణాంగం? ( ) 1. కేంద్రకం 2. గాల్జీ సంక్లిష్టం 3. E.R 4. స్పీరోజోమ్స్ 18. కణంలో గుండ్రని నిర్మాణాలతో ఒకే ప్రమాణ త్వచం ఆవరించి ఉండే కణాంగాలు? ( ) 1. గాల్జి సంక్లిష్టం 2. రైసోసోమ్స్ 3. రైబోజోమ్స్ 4. స్పీరోజోమ్స్ 19. క్రిస్టియన్ డిడూవే అనే శాస్త్రవేత్త ఏ కణాంగాన్ని కనుగొన్నారు? 1. లైసోసోమ్‌లు 2. స్పీరోజోమ్స్ 3. ఎర్గోజోమ్స్ 4. గాల్జిసంక్లిష్టం 20. Suicidal bags of the cell అని ఏ కణాంగాన్ని అంటారు? ( ) 1. రైబోజోమ్స్ 2. స్వీరోజోమ్స్ 3. లైసోసోమ్స్ 4. ఎర్గోజోమ్స్ 21. ఒకే లైపోప్రోటీన్ పొరతో ఆచ్చాదితమై ఉన్న గోళాకార కోశాలు? 1. లైసోసోమ్‌లు 2. క్రోమోసోమ్‌లు 3. పెరక్సీసోమ్స్ 4. ఎర్గోజోమ్స్ 22. పెరాక్సీసోమ్‌లను కనుగొన్నది? ( ) 1. డిడూవె 2. రోడిన్ 3. వాన్‌మోల్ 4. బ్రౌన్ 23. కణంలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష పదార్దాలను విడగొట్టి కణాన్ని సంరక్షించేవి? ( ) 1. గాల్జీ సంక్లిష్టం 2. స్పెరోజోమ్స్ 3. పెరాక్సీజోమ్స్ 4. ఎర్గోజోమ్స్ 24. c3 మొక్కల పత్రాల్లో కాంతి శ్వాసక్రియలో పాల్గొనే కణాంగము? 1. పెరాక్సీజోమ్స్ 2. లైసోసోమ్స్ 3. ఎర్గోజోమ్స్ 4. గాల్జీ సంక్లిష్టం 25. కొవ్వు పదార్దాలను పిండి పదార్దాలుగా మార్చడంలో పాల్గొనే కణాంగాలు? ( ) 1. స్పైరోజోమ్స్ 2. పెరాక్సీజోమ్స్ 3. గ్లై ఆక్సాసోమ్స్ 4. ఎర్గోజోమ్స్ 26. గ్లై ఆక్సీజోమ్స్‌ను కనుగొన్నది ఎవరు? ( ) 1. రోడిన్ 2. బ్రైడెన్‌బాక్ 3. బ్రౌన్ 4. వాన్‌మోల్ 27. రిక్తికను ఆవరించిఉండే పొరను ఏమంటారు? ( ) 1. పెరిప్లాస్టిడియల్ 2. పెరిమైటోకాండ్రియల్ 3. టోనోప్లాస్ట్ 4. టోనోప్లాజమ్ 28. రిక్తికను కనుగొన్న శాస్త్రవేత్త? ( ) 1. బ్రెడెన్ బాక్ 2. రోడిన్ 3. స్పలాంజని 4. పాషా 29. రిక్తికలోని కణరసంలో ఉండే వర్ణద్రవ్యం? ( ) 1. లైకోపిన్ 2. ఆంధోసయనిన్ 3. పైకోఎరిద్రిన్ 4. పైకోసయనిన్ 30. store house of the cell అని ఏ కణాంగాన్ని పిలుస్తారు? 1. కేంద్రకం 2. క్రోమోసోమ్‌లు ( ) 3. రిక్తిక 4. ఎర్గోజోమ్స్ 31. కేంద్రకంను కనుగొన్నది? ( ) 1. రాబర్ట్‌బ్రౌన్ 2. రాబర్ట్ హుక్ 3. ట్లెమింగ్ 4. స్టెలాంజని 32. స్పైరోగైరాలోని పత్రకణంలో ఎన్ని కేంద్రకాలుంటాయి? ( ) 1. 1 2. 2 3. 3 4. 4 33. కేంద్రకంలో వివిధ భాగాలను అధ్యయనం చేయడానికి ఏ దశ అనుకూలమైనది? ( ) 1. ప్రధమదశ 2. మధ్యస్థ దశ 3. చలన దశ 4. అంత దశ 34. క్రోమోజోమ్‌లను ఏ పదార్థంచే అభిరంజనం చేస్తారు? 1. ఫారిమ్ ఆమ్లము 2. ప్యూయల్బిన్ ( ) 3. ఎసిటిక్ ఆమ్లము 4. పొటాషియం డై క్రోమేట్ 35. కేంద్రకాంశంను కనుగొన్నది? ( ) 1. వాల్టేయర్ 2. నాగేలి 3. ఫాంటానా 4. బౌన్ 36. కణ మేధస్సు అని పిలవబడే కణాంగము? ( ) 1. కేంద్రకం 2. క్రోమోజోమ్‌లు 3. రిక్తిక 4. రైబోజోమ్స్ 37. లైసోసోమ్‌లు ఎక్కువగా ఉంటే కణాలు? ( ) 1. ఎర్రరక్తకణాలు 2. విసర్జక కణాలు 3. గ్రంధి కణాలు 4. జీర్ణక్రియజరిగే కణాలు 38. స్రావకణాలలో అధికంగా ఉండే కణాంగాలు? ( ) 1. గాల్జీదేహాలు 2. ER 3. మైటోకాండ్రియన్‌లు 4.ప్లాస్టిడ్స్ 39. ప్లాస్టిడ్స్‌లు ఈ జీవులలో ఉండవు? ( ) 1. బాక్టీరియాలు 2. నీలిఆకుప్చ శైవలాలు 3. శిలింద్రాలు 4. పై అన్నింటిలో 40. మధ్య పటలికలో అత్యధికంగా ఉండేది? ( ) 1. పొటాషియం (K) 2.కాల్షియం (Ca) 3. మెగ్నీషియం (Mg) 4. సోడియం (Na) 41. క్రోమోజోమ్‌లను మొదటగా ఏ మొక్కలో గుర్తించారు? ( ) 1. రియోడిస్కలర్ 2. చెరకు 3. ట్రాడెష్కాంషియా 4. ఓక్ 42. క్రోమోజోమ్‌లను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త? ( ) 1. వాల్టేయర్ 2. హాఫ్ మెయిష్టర్ 3. ప్లెమింగ్ 4. సట్టన్ 43. క్రోమోసోమ్ సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ( ) 1. వాల్టేయర్ 2. సట్టన్, హాఫ్ మెయిష్టర్ 3. ష్లెడర్ & ష్వాన్ 4. సట్టన్ & బొవెరి 44. ట్రిల్లియమ్ అనే మొక్క మధ్యస్థ దశలోని క్రోమోజోమ్‌లు ఎంత పొడవు ఉంటాయి? ( ) 1.10u 2. 30u 3. 40u 4. 50u 45. వరిలో ఉండే క్రోమోజోమ్‌ల సంఖ్య? ( ) 1. 14 2. 16 3. 24 4. 60 46. అత్యధిక సంఖ్యలో క్రోమోజోమ్‌లు ఏమొక్కలో ఉంటాయి? 1. శఖారమ్ 2. ఓఫియోగ్లాసమ్ ( ) 3. అలియమ్ 4. హాప్లొపాపస్‌గ్రాసిలిస్ 47. జియామేస్ అను మొక్కలో ఏకస్థితిక క్రోమోజోమ్‌ల సంఖ్య సుమారుగా..? ( ) 1. 10 2. 20 3. 5 4. 2 48. ఓఫియోగ్లాసమ్ అను మొక్క ఏ విభాగానికి చెందుతుంది? 1. శైవలం 2. శిలీంద్రం ( ) 3. బ్రయోఫైటా 4. టెరిడోఫైటా
ప్రీవియస్ క్వశ్చన్స్ 1. ఒక మొక్క సంయుక్త బీజంలో 30 జతల క్రోమోజోములు ఉన్నాయి. అ మొక్క శరీర కణాలు ఒక్కొక్కదానిలో ఉండే క్రోమోజోముల మొత్తం? (డీఎస్సీ-2009) ( 3 ) 1. 15 2. 45 3. 60 4. 30 2. ‘కణంలో స్వయం విచ్ఛిత్తి సంచులు’ అని పిలువడే భాగం? (డీఎస్సీ-2009) 1. గాల్జి సంక్లిష్టం 2. మైటోకాండ్రియా 3. రైబోసోమ్‌లు 4. లైసోసోములు ( 4 ) 3. ప్రతి ప్రసరణ కణజాలంలో ఆకు అడుగు భాగం వైపు ఉండే కణజాలము? (డీఎస్సీ-2006) ( 4 ) 1. స్తంభ కణజాలము 2. దారు కణజాలము 3. పోషక కణజాలము 4. స్పంజి కణజాలము 4. కణశ్వాసక్రియలో గ్లూకోజ్, కొవ్వు ఆమ్లాలు? ( 4 ) (డీఎస్సీ-2006) 1. ఆక్సీకరణ చెంది శక్తిని ఉత్పత్తి చేయవు 2. క్షయకరణ తదుపరి ఆక్సీకరణ చెంది శక్తిని ఉత్పత్తి చేస్తాయి 3.క్షయకరణ చెంది శక్తిని ఉత్పత్తి చేస్తాయి 4. ఆక్సీకరణ చెంది శక్తిని ఉత్పత్తి చేస్తాయి 5. దృఢ కణజాలంలో కణాల కణకవచాలు దీనితో నిర్మితమవుతాయి? (డీఎస్సీ-2003) ( 3 ) 1.సెల్యులోజ్ 2. రెనిన్ 3. లిగ్నిన్ 4. పెక్టిన్ 6. ద్వినామీకరణ విధానంతో వర్గీకరణానికి ప్రాథమిక ప్రమాణం? (డీఎస్సీ-2003) ( 1 ) 1. జాతి 2. ప్రజాతి 3. కుటుంబం 4.వర్గం 7. కణాలలో కేంద్రకం లేని అతి ప్రాథమిక జీవులను కలిగిన రాజ్యం? (డీఎస్సీ-2002) ( 2 ) 1. ఆనియేలియా 2. మొనెరా 3. ప్రొటిష్ట 4. ప్లాంటె 8. జంతుకణంలో ఉండి వృక్షకణంలో లేని కణాంగము? (డీఎస్సీ-2002) 1. ప్లాస్టిడ్‌లు 2. సెంట్రియోలు 3. కణకవచము 4. రిక్తికలు ( 2 )

Other News
|
|