|
|
ఎ.పి.సెట్ గెట్‌రెడీ!
ఈ నెల 27న రాత పరీక్ష జరుగనున్న ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఎలిజబులిటీ టెస్ట్ (ఎపిసెట్) ఫలితాలు ఆగస్టు నెలాఖరుకల్లా వెల్లడించనున్నట్టు ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎపిసెట్ పరీక్ష ముగిసిన వెంటనే పేపర్ల కంప్యూటర్ వేల్యూయేషన్ చేపడతారు. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు పేపర్ -1, పేపర్ -2లో 40 శాతం, పేపర్-3లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బిసి అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో 35 శాతం, పేపర్ -3లో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. చివరగా ఎస్.సి, ఎస్.టి, వికలాంగ అభ్యర్థులు పేపర్-1, పేపర్-2లో35 శాతం, పేపర్-3లో 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇలా నిర్దిష్ట మార్కులు సాధించిన వారందరిలో ఎంత మంది అభ్యర్థులు ఎపిసెట్ ఉత్తీర్ణత అయ్యారనేది మోడరేషన్ కమిటీ ఖరారు చేస్తుంది. ముగ్గురు వైస్ ఛాన్సలర్లు, కాలేజీయేట్ కమిషనర్ ఒకరు ఇద్దరు యు.జి.సి అధికారులు, ఎపి సెట్ మెంబర్ సెక్రటరీ, సీనియర్ ప్రొఫెసర్ ఒకరు మొత్తం 8 మంది సభ్యులు గల మోడరేషన్ కమిటీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ నిబంధనల మేరకు ఎపిసెట్ ఫలితాలు ఖరారు చేయనుంది. కొత్తగా పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అధ్యాపక వృత్తిలో 30 ఏళ్ల పాటు కొనసాగే అభ్యర్థి తాను బోధించే సబ్జెక్టులో అత్యుత్తమ స్థానంలో ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్వహించేదే ఎపిసెట్ లేదా యుజిసి సెట్. కాబట్టి అభ్యర్థుల సబ్జెక్టు సామర్థ్యం ప్రధానంగానే ఎపిసెట్ ప్రశ్నపత్రాలు ఉంటాయి. రిజల్ట్స్ ప్రకటించే సమయంలో ఓపెన్ కేటగిరీ, రిజర్వేషన్ అభ్యర్థులు, సబ్జెక్టు ఖాళీలు వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎపిసెట్ ఫలితాలు ప్రకటిస్తారు. యుజిసి సెట్ పరీక్షల్లో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక రిజర్వేషన్ సదుపాయం లేనందున ఎపిసెట్ పరీక్ష నిర్వహణలోనూ వారికి ప్రత్యేక రిజర్వేషన్ ఉండదు.
జంబ్లింగ్‌లో పరీక్షలు పరీక్ష గదిలో ‘బెంచ్’ల వరుస క్రమంలో వెనుక కూర్చొనే అభ్యర్థి సబ్జెక్టు పేపర్, అతని ముందు కూర్చునే అభ్యర్థి సబ్జెక్టు పేపర్ వేరువేరుగా ఉండేలా జంబ్లింగ్ విధానాన్ని అనుసరి స్తున్నారు. ఎపిసెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో ప్రతి రీజినల్ సెంటర్‌లో యుజిసి అబ్జర్వర్స్ ఇద్దరు, ఎపిసెట్ అబ్జర్వర్స్ ఇద్దరు ఉండగా, ప్రతి పరీక్ష సెంటర్‌కు ఒక అబ్జర్వర్ స్థానికంగానే ఉంటూ ఎపీ సెట్ పరీక్షలు నిర్వహి స్తుంటారు. ప్రతి సబ్జెక్టులో మూడు సెట్స్ పేపర్లు రూపొంది స్తారు. అందులో ఒక కోడ్ సెట్ పేపర్ పరీక్షను ఎంపిక చేస్తారు.
 లక్షా పద్దెనిమిది వేల మంది ఎపిసెట్ నిర్వహకులు 70 వేల మంది అభ్యర్థులు ఎపిసెట్ పరీక్షకు పోటీ పడతారని అంచనా వేశారు. అంతకంటే 50 వేలు ఎక్కువగా అభ్యర్థులు పోటీపడుతూ రికార్డ్ సంఖ్యలో 1.18 లక్షల మంది ఎపిసెట్ పరీక్ష రాస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించిన నెట్ పరీక్షకు మొత్తం 7 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఇక రాష్ట్రాలు నిర్వహించే స్లెట్ పరీక్షలో మన రాష్ట్రం నిర్వహిస్తున్న ఎపిసెట్‌కు పోటీ పడిన 1.18 లక్షల మంది అభ్యర్థులే రికార్డ్. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 60 వేల అభ్యర్థులు పోటీ పడినదే అత్యధికమైనదిగా నమోదయింది. ఎపి సెట్ పరీక్షకు పోటీ పడుతున్న 1.18 లక్షల మందిలో అత్యధికంగా 18977 మంది అభ్యర్థులు లైఫ్ సైన్స్‌కు పోటీపడుతుండగా, ఆ తర్వాత వరుస క్రమంలో కెమికల్ సైన్సెస్‌కు 16,467 మంది, తెలుగు 10,816 మంది, ఇంగ్లీష్‌కు 9330 మంది ఉన్నారు. అతి తక్కువగా పోటీ పడుతున్న సబ్జెక్టు గా భాషాశాస్త్రం ( లాంగ్వే జెస్)లో 55 మంది ఎపిసెట్‌కు దరఖాస్తు చేశారు.
వైట్‌నర్ నిషేధం ఎపిసెట్ పరీక్షలో సరైన జవాబులను బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ను ఆధారంగా గుర్తించాలి. ఎవరైనా జవాబులు పొరపాటుగా గుర్తించామనో లేదా తెలియక పెట్టామనో వైట్‌నర్ (తెల్లని రంగు) రుద్దితే అట్టి జవాబు పత్రాలు వేల్యూయేషన్‌కు పరిగణనలోకి తీసుకోమని ఎపిసెట్ మెంబర్ సెక్రటరీ ప్రొ॥ స్పష్టం చేశారు. వైట్‌నర్ గాకుండా రబ్బరుతో గుర్తించిన జవాబును చెరిపినా కూడా అలాంటి సమాధాన పత్రం వేల్యూయేషన్ చేయకుండా నిలిపి వేస్తామన్నారు. ఓఎంఆర్ సమాధాన పత్రంలో ముద్రితమయ్యే అభ్యర్థి పేరు, హాల్‌టికెట్ నెంబర్, సబ్జెక్టు, పరీక్ష సెంటర్ సరిగ్గా ఉన్నాయో లేదా అభ్యర్థి చూసుకోవాలి. పరీక్ష అనంతరం పరీక్ష ప్రశ్నపత్రం బుక్‌లెట్, ఓఎంఆర్ జవాబు పత్రం ఇన్విజిలేటర్‌కు అభ్యర్థులు ఇచ్చివేయాలి. ఓఎంఆర్ జవాబు పత్రంలో బాటమ్‌షీట్ (కార్బన్‌లెస్)నుఅభ్యర్థులు పరీక్ష అనంతరం ఇంటికి తీసుకువెళ్లవచ్చు. పరీక్ష సెంటర్‌కు గంట ముందే చేరుకోవాలి. సెల్‌ఫోన్ వంటి పరికరాలు ఏవీ పరీక్ష గదిలోకి తీసుకురాకూడదు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల తర్వాత ఎవరినీ ఎపిసెట్ పరీక్షకు అనుమతించరు. ఎపిసెట్ పరీక్షలో ఎటువంటి నెగెటివ్ మార్కులు లేవు.
హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ ఈ నెల 17 నుంచి ఎపిసెట్ పరీక్ష హాల్‌టికెట్లు ఎపిసెట్ వెబ్‌సైటు www.apset.org నుంచి అభ్యర్థులు పొందే అవకాశం కల్పించారు. ఎపిసెట్ పరీక్ష ముందు రోజు వరకు అర్హత గల అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీలయినంత ముందుగానే ఎపిసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల చివరి క్షణంలో సాంకేతిక సమస్యలు ఎదురు కాకుండా ఉంటాయి. 12 రీజినల్ సెంటర్లలో 194 పరీక్ష సెంటర్లలో 1,17,793 మంది అభ్యర్థులు ఎపి సెట్ పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా 34,828 మంది అభ్యర్థులు హైదరాబాద్ కేంద్రంగా ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారన్నారు. ఆ తర్వాత వరంగల్‌లో 16,680 మంది, విశాఖపట్నంలో 11,326 మంది, గుంటూరులో 10,130 మంది అత్యధిక సంఖ్యలో ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారు. అత్యంత తక్కువగా 3,445 మంది అభ్యర్థులు నెల్లూరులో రీజినల్ సెంటర్‌లో ఎపిసెట్ పరీక్షకు హాజరుకానున్నారు.
ఎపి సెట్ పరీక్ష టైంటేబుల్ పరీక్ష తేదీ పేపర్ పరీక్ష సమయం 27 జులై, పేపర్ -1 ఉదయం 9.30 నుంచి 2012 10.45 వరకు పేపర్ -2 ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు పేపర్-3 మధ్యాహ్నం గం.1.30 నుంచి సాయంత్రం 4.00 వరకు
Other News
|
|