|
|
సందేహలు... సమాధానాలు
 నేను ఎం.ఎ. ఆర్కియాలజీ పూర్తి చేసాను. ప్రస్తుతం వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నాను. ఆర్కియాలజీ చేసిన వారికి ప్రత్యేకంగా పోస్టులు ఏవైనా ఉంటాయా? ఉంటే ఏ విధంగా భర్తీ చేస్తారో తెలపండి? ఇతర అవకాశాల వివరాలు కూడా తెలపండి? - సుధాకర్, వరంగల్. జ ః ఆర్కియాలజీ చదివిన వారికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర , జాతీయ మ్యూజియంలు, నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ టూరిజం సంస్థలలో నియామకాలు జరుగుతుం టాయి. టూరిస్టు గైడ్లుగా కూడ వీరిని ఎంపిక చేస్తున్నారు. యుపిఎస్‌సి, ఎపిపిఎస్‌సి ల ద్వారా ఈ నియామకాలు జరుగుతుంటాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో, రీసెర్చ్ సంస్థలలో టీచింగ్ పోస్టులకు కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. అందు కు మీరు నెట్ లేదా సెట్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. l నేను బి.బి.ఎ కోర్సు 2011 లో పూర్తి చేశాను, విదేశాలలో ఎంబిఎ చేయాలని ఉంది. సివిల్స్ నా లక్ష్యం, నేను ఏమి చేయాలి సలహా ఇవ్వగలరు? - భగీరథ్, గోదావరిఖని, కరీనంగర్ జిల్లా జ ః మీరు విదేశాలలో ఎంబిఎ చేయాలనుకుంటే జిమాట్ పరీక్షకు హాజరవ్వండి. జిమాట్ స్కోర్ ఆధారంగా విదేశాలలోని మేనేజ్‌మెంట్ స్కూల్స్ ప్రవేశాలు కల్పిస్తాయి. మీరు సివిల్స్ రాయాలను కుంటే ముందుగా యు.పి.ఎస్.సి. వారి సైట్ ద్వారా సివిల్స్ పరీక్ష విధానం, సిలబస్, సబ్జెక్టులు, పాత ప్రశ్నపత్రాలు పూర్తిగా చదివి పరీక్ష విధానం పై అవగాహన ఏర్పరచుకోండి. సివిల్స్ రాయ డానికి కనీ స అర్హత డిగ్రీ అయినా పరీక్ష పి.జి స్థాయిలో ఉంటుంది. రెండు ఆప్షనల్ సబ్జెక్టులు ఎంపిక చేసుకోవాలి కాబట్టి మీరు ఎంబిఎ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాస్తే బాగుంటుంది. ఈ లోగా ఆప్షనల్స్ పై అవగాహన ఏర్పరచుకొని ప్రిపేరు కావచ్చు. l నేను సొంతంగా డైరీఫామ్ ప్రారంభించాలను కుంటున్నాను. దీనికి అవసరమైన వివరాలు ఎక్కడ లభిస్తాయి. నేను ఎస్సీ వర్గానికి చెందినవాడిని, నాకు బ్యాంకు లోను లభించే అవకాశాలు ఉంటాయా? ఇది లాభదాయకమైన కేరీర్‌గా భావించవచ్చా? - అనీల్, మెదక్. జ ః డైరీఫామ్ ప్రారంభించే వారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. సబ్సిడీ కూడా అందచేస్తుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రత్యేక రాయితీ ఇస్తూ, వారికి శిక్షణ కూడా కల్పిస్తుంది. మీరు పూర్తి వివరాలకు మీకు దగర్లోని వెటరినరీ డాక్టర్‌ను గాని వ్యవసాయ అధికారిని లేదా బ్యాంకు మేనేజర్లను సంప్రదించండి. జిల్లా కేం ద్రంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం, డి.ఆర్.డి.ఎ, ఎస్సీ కార్పోరేషన్‌లో కూడ సంప్ర దించవచ్చు. ఆయా సంస్థలు డైరీఫామ్‌కు కావలసిన ప్రాజెక్టు రిపోర్టు, శిక్షణ వివరాలు, గేదెలు, ఆవుల వివరాలు, పెట్టుబడి, సబ్సిడీ మొదలైన వివరాలు తెలుపగలరు. బ్యాంకులు రుణ వితరణలో డైరీ ఫామ్ ప్రాధాన్యత రంగం కాబట్టి త్వరితగతిన లోను అందజేస్తాయి.
Other News
|
|