Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 26, 2013
 


Home >> Studies Exams
గెలుద్దాం..యగూప్-2 పేపర్-3 ఎ.పి. ఎకానమీ


సిలబస్
1. వ్యవసాయ ఉత్పత్తుల స్వరూపం
2. మద్ధతు, సేకరణ ధరలతో సహా పాలిత ధరలు
3. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ
4. ఆంధ్రప్రదేశ్‌లో సేవారంగం ప్రాముఖ్యం
5. రవాణాకు, కమ్యూనికేషన్‌కుప్రత్యేక ప్రాధాన్యమిస్తూ సేవారంగం కూర్పు, వృద్ది
6. పర్యాటక రంగం
7. సమాచారం, జీవ సాకేంతిక విజ్ఞానం
ఈ యూనిట్‌కు సంబంధించి మన రాష్ట్రంలో ప్రధాన పంటల ఉత్పతుల సరళి, వాటికి ప్రభుత్వం కల్పిస్తున్న మద్ధతు ధరలు, పేదలకు ఆహార భద్రతను కల్పిస్తున్న ప్రజా పంపిణీకి సంబంధించి తాజా గణాంకాలను, (అదే విధంగా 2005-06 కూడా) సేవా రంగం వాటా, రవాణాలో రోడ్ల విస్తీర్ణం, పర్యాటక రంగంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలు, పర్యాటకుల సంఖ్య, సమాచార సాంకేతిక రంగం పాత్రకు సంబంధించి గణాంకాలను గుర్తుంచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌లో వీటికి సంబంధించిన సమాచారం ఉంటే ఎక్కువ శాతం ప్రశ్నలు అవే రావడానికి అవకాశం ఉంటుంది.
1. భారతదేశ ధాన్యాగారంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఆహార పంటల్లో వరి ఉత్పత్తి ఎంత శాతం? ( )
1) 60% 2) 70%
3) 80 4) 90%
2. కేంద్ర ప్రభుత్వం 2012 లో ఏ గ్రేడ్ వరి రకానికి క్వింటాకు ప్రకటించిన మద్ధతు ధర? ( )
1) రూ. 1250 2) రూ. 1260
3) రూ. 1270 4) రూ. 1280
3. ఏ కమిటి సిఫార్సుల మేరకు 1965 లో వ్యవసాయ ధరలు కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ( )
1) టి.టి కృష్ణమాచారి 2) ఎల్.కె ఝూ
3) ఎల్. కె. సింఘ్వీ 4) కుమరప్ప
4. పంటలకు కనీస మద్ధతు ధరలను ఎమ్.ఎస్.పి ప్రకటించేటప్పుడు ఎన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ( )
1) 10 2) 11
3) 12 4) 13
5. నూతన వ్యవసాయం ధరల విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ( )
1) 1984 2) 1985
3) 1986 4) 1987
6. ప్రపంచంలో అత్యధికంగా ఆహార ధాన్యాలను సేకరిస్తున్న సంస్థ?
1) ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ( )
2) ఐ.సి.ఎ.ఆర్
3) ఎఫ్.సి.ఐ
4) నాబార్డ్
7. ప్రజా పంపిణీకి అవసరమైన ఆహారధాన్యాలను కొనుగోలు చేయడానికి ఉపయోగించే ధర? ( )
1) చట్టబద్ధమైన మద్ధతు ధర 2) కనీస మద్ధతు ధర
3) జారీ ధర 4) సేకరణ ధర
8. ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజనాలను ఆశించి వస్తువులకు ధరలను నిర్ణయించి ఆధరలకే వస్తువులను విక్రయించడానికి నిబంధన విధించినప్పుడు వాటిని ఏమంటారు? ( )
1) ప్రభుత్వ ధరలు 2) పాలిత ధరలు
3) ప్రజల ధరలు 4) సబ్సీడీ ధరలు
9. 2011 నవంబర్ నాటికి మన రాష్ట్రంలో వున్న చౌక ధరల దుకాణాల సంఖ్య? ( )
1) 43,579 2) 44,579
3) 45,579 4) 46,579
10. మన రాష్ట్రంలో సగటున ప్రతి 1965 మందికి ఒక చౌక ధరల దుకాణం ఉండగా కేంద్ర ప్రభుత్వ ప్రమాణం ప్రకారం ఎంత మందికి ఒక చౌక దుకాణం కలదు?
1) 1950 2) 2000 ( )
3) 2050 4) 2100
11. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు గాను ఏ రకమైన రేషన్ కార్డులను ప్రవేశ పెడుతున్నారు? ( )
1) ఎలక్ట్రానిక్ రేషన్ కార్డ్డు
2) కార్బన్ పేపర్ రేషన్‌కార్డు
3) ఐరిస్ రేషన్ కార్డు
4) పైవేవికావు
12. బహుళ ప్రయోజనాలున్న ఆధార్ కార్డుల జారీకి సంబంధించి మన రాష్ట్రంలో ఏ మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తున్నది? ( )
1) ఆర్ధిక శాఖ 2) రెవిన్యూశాఖ
3) సాదారణ పరిపాలన 4) పౌరసరఫరాల శాఖ
13.2011-12 రెండవ సత్వర అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం ఎంత? ( )
1) 70.60 ల. హె 2) 75.70.ల.హె
3) 80.60 ల. హె 4) 85.80 ల. హె
14. పట్టు ఉత్పత్తిలో మన రాష్ట్రం స్థానం? ( )
1) 1వ స్థానం 2) 2వ స్థానం
3) 3వ స్థానం 4) నాల్గవ స్థానం
15. ఆర్ధికాభివృద్ధి పరిణామ క్రమం అనగా? ( )
1) ప్రాథమిక రంగంపై ఎక్కువ జనాభా ఆధారపడటం 2) ప్రాథమిక రంగంపై ఆధారపడిన జనాభా పారిశ్రామిక రంగానికి తరలి వెళ్ళటం
3) ప్రాథమిక రంగంపై ఆధారపడిన జనాభా పారిశ్రామిక మరియు సేవా రంగాలకు తరలి వెళ్ళటం
4పాధమిక రంగం క్షీణించి తృతీయ రంగం అభివృద్ధి చెందటం
16. 2011 మార్చి నాటికి మన రాష్ట్రంలో వున్న షెడ్యూల్డ్ బ్యాంకుల కార్యాలయాలు? ( )
1) 6,220 2) 7,330
3) 8,211 4) 9,990
17. 2011 అక్టోబర్ నాటికి మన రాష్ట్రంలో 677.90 లక్షల టెలిఫోన్ కనెక్షన్లు ఉండగా వీటిలో అత్యధికం ? ( )
1) ల్యాండ్ లైన్లు 2) వైర్‌లెస్ సెట్లు
3) పేపర్ లెస్ 4) మాగ్నటిక్ సెట్లు
18. మన రాష్ట్రంలో రోడ్‌నెట్ వర్క్ ఒక చదరపు కిలో మీటర్‌కు 0.23 కి.మీ మాత్రమే ఉన్నప్పటికీ వాహనాల వృద్ధి మాత్రం ఎంత శాతం ఉన్నది? ( )
1) 12 2) 13
3) 14 4)15
19. ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల్లో ఐ.టి రంగం వాటా 49% కాగా దేశం మొత్తం ఐటి ఎగుమతుల్లో మన రాష్ట్రం వాటా? ( )
1) 10.9% 2) 11.9%
3) 12.9% 4) 13.9%
20. భారత దేశ కోహినూర్ అని ఏ దక్షిణాది రాష్ట్ర పర్యాటక రంగాన్ని పిలుస్తారు? ( )
1) ఆంధ్రప్రదేశ్ 2) కేరళ
3) తమిళనాడు 4) కర్నాటక
21. 12వ పంచవర్ష ప్రణాళికలో సేవల రంగం వృద్ధి ఎంతగా నిర్ణయించారు?
1) 10.5% 2) 11.5%
3) 12.5% 4) 13.5%
22. రాష్ట్రంలో సమర్ధవంతమైన నీటి యాజమాన్యం లక్ష్యంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 2010-11లో ఎన్ని లక్షల హెక్టార్లకు సాగు నీరు అందింది?( )
1) 1.30 2) 1.70
3) 1.90 4) 9.33%
23. రాష్ట్ర వ్యాప్తంగా వున్న సహకార ఉమ్మడి వ్యవసాయ సంఘాలు (2,295) ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల భూమిని అభివృద్ధి చేశాయి? ( )
1) 85,567 2) 89,567
3) 92,567 4) 94,567
24. పండ్లు, కూరగాయల నిల్వ విషయంలో సరైన దానిని గుర్తించండి? ( )
1) క్షేత్ర స్థాయిలో 10% నష్టం
2) రవాణాలో 5% నష్టం
3) మొత్తంగా 30% నష్టం
4) పైవన్నీ
25. ప్రత్యేక లైవ్‌స్టాక్ అండ్ ఫిషరీస్ ప్యాకేజీ దేనికి సంబంధించింది? ( )
1) గొర్రెల వ్యాధుల నివారణ
2) మేలు జాతి ఆవుల పోషణ
3) రైతుల పునరావసానికి పశు పోషణకు
4) పైవేవీ కావు
26. ఆంధ్రప్రదేశ్ (అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్) మార్కెట్ యాక్టును ఎప్పుడు రూపొందించారు? ( )
1) 1964 2) 1965
3) 1966 4) 1967
27. మన రాష్ట్రం గుండా వెళ్తున్న 17 జాతీయ రహదారుల విస్తీర్ణం? ( )
1) 4.730 కి.మీ
2) 5.730 కి.మీ
3) 6,600 కి.మీ
4) 7.780 కి.మీ
28. భారతదేశంలోనే లోతైన రేవు ఏది? ( )
1) కృష్ణ పట్నం రేవు
2) నిజాంపట్నం రేవు
3) గంగవరం రేవు 4) విశాఖ రేవు
29. ప్రతి సం॥ సగటు ఎంతమంది పర్యాటకులు మన రాష్ట్రాన్ని సందర్శిస్తున్నారు? ( )
1) 5 మిలియన్లు 2) 6 మిలియన్లు
3) 7 మిలియన్లు 4) 8 మిలియన్లు
30. మన దేశంలో మొదటి సారిగా పర్యాటకుల కోసం వోల్వో బస్సులను ప్రవేశపెట్టిన రాష్ట్రం? ( )
1) కేరళ 2) జమ్మూ & కాశ్మీర్
3) ఆంధ్రప్రదేశ్ 4) అస్సాం
31. 2010-15 రాష్ట్ర ఐ.టి పాలసికి సంబంధించి తప్పుగా పేర్కొన్న అంశం? ( )
1) రాష్ట్ర ఎగుమతుల్లో ఐ.టి వాటా 50%
2) ఎస్సీ, ఎస్టీలకు 80% విద్యుత్ సబ్సీడీ
3) మహిళా ఐటి యూనిట్లకు 50% విద్యుత్ సబ్సీడీ
4) మహిళలకు 20 లక్షల వరకు పెట్టుబడి సబ్సీడీ
32. ఈ మధ్య వార్తలో వున్న వాన్‌పిక్ ఏ జిల్లాలో నిర్మించబడుతున్నది? ( )
1) గుంటూరు 2) ప్రకాశం
3) నెల్లూరు 4) 1మరియు 2
33. మన రాష్ట్రంలో పర్యావరణాయుత జంగిల్ క్యాంపు నిర్మాణం ఎక్కడ నెలకొల్పబడింది? ( )
1) ఇడుపుల పాయ 2) సూర్యాపేట
3) అనంతగిరి 4) పైవన్నీ
34. మన రాష్ట్రంలో మొదటి బయోటెక్నాలజీ పార్కును ఎక్కడ నెలకొల్పారు? ( )
1) షామీర్ పేట్ 2) మేడ్చల్
3) సంగారెడ్డి 4) కల్వకుర్తి
35. మన రాష్ట్రంలో ఖరీఫ్‌లో కంటే రబీలో ఎక్కువ ఉత్పత్తినిచ్చే పంట?
1) మొక్క జొన్న 2) జొన్న ( )
3) ప్రొద్దు తిరుగుడు 4) శనగలు
ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు
1. గ్రామ ప్రాంతాలకు ప్రభుత్వ సేవ ప్రయోజనాలను అతి సమీపంగా అందించడానికి గల పథకం ?
నగూప్2,2008)
1. రాజీవ్ ఇంటర్నెట్ గ్రామ పథకం ( 1 )
2. జవహర్‌లాల్ జ్ఞాన కేంద్రాలు
3. ఇ-సేవా కేంద్రాలు
4. పైవేవి కావు
2. ఆహార ధాన్యాలుగా క్రింది వానిని పరిగణిస్తారు ? నగూప్-2, 2008) ( 4 )
1. గోధుమ, బియ్యం 2. మిల్లెట్లు
3. పప్పులు 4. ఇవన్నీ
3. మార్కెట్‌లో వస్తువుల లభ్యతకు ముందే రైతులు పండిం చిన అనేక పంటలకు ప్రభుత్వం ప్రకటించే ధరలు ?
నగూప్2,2011)
1. కనిష్ట ధరలు 2. సేకరణ ధరలు ( 4 ) 3. మార్కెట్ ధరలు 4. కనిష్ట సహాయ ధరలు
4. చాలా రాష్ట్రాలలో ప్రజాపంపిణీ వ్యవస్థను నెలకొల్పుటకు గల ముఖ్య ఉద్ధేశము ? నగూప్-2,2011) ( 3 )
1.గోధుమ పంపిణీ చేయుట
2. బియ్యం మరియు నూనె పంపిణి చేయుట
3. ఆహార భద్రత కల్పించుట
4. కొరత వస్తువులకు లభ్యత చే కూర్చుట
5. ఆంధ్రప్రదేశలో క్రింది వానిలో దేని లక్ష్యం గ్రామీణ పేదల అభివృద్ధి ? నగూప్-2, 2011) ( 2 )
1. అంత్యోదయ కార్యక్రమం
2. ఐ.ఆర్.డి కార్యక్రమం
3. NRE కార్యక్రమం
4. EAS

ఆంధ్ర ప్రదేశ్ ప్రజా పంపిణీ వ్యవస్థ
(2011 నవంబర్ నాటికి)
మొత్తం చౌకధరల దుకాణాలు 44,579
వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 37,832
పట్టణ ప్రాంతాల్లో 6,747
మొత్తం రేషన్ కార్డులు 2,26,41,764
తెల్లకార్డులు 1,79,96,243
పింక్ కార్డులు 29,94,431
అంత్యోదయ అన్నా యోజన కార్డులు 15,57,800
అన్నపూర్ణ కార్డులు 93,200
తెల్లకార్డు పొందడానికి వార్షిక కుటుంబ ఆదాయం పరిమితి.
గ్రామీణ ప్రాంతాలలో రూ. 60,000
పట్టణ ప్రాంతాలలో రూ.75,000



ఆంధ్ర ప్రదేశ్ సేవారంగం
1. రోడ్లు ః
ఎ) ఆర్&బి నెట్‌వర్క్ 70,394 కి.మీ
ఇందులో జాతీయ రహదారులు 4,730 కి.మీ
బి) పంచాయతీరాజ్ రోడ్లు 1,38,781కి.మీ
2. కమ్యూనికేషన్స్ ః
ఎ) పోస్టాఫీసులు 16,150
బి) టెలిగ్రాఫ్ ఆఫీసులు 169
సి) టెలిఫోన్ కనెక్షన్లు 677.90 లక్షలు
వీటిలో మొబైల్ కనెక్షన్లు 654.42 లక్షలు
ల్యాండ్‌లైన్ కనెక్షన్లు 23,48 లక్షలు
3. టూరిజం ః
2011-12 లో పర్యాటకుల సంఖ్య 19,08 లక్షలు
ఆదాయం రూ. 59.41 కోట్లు

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine