Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> Studies Exams
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి

win-group-2 talangana patrika telangana culture telangana politics telangana cinemaదక్కన్ ప్రాంతాన్ని సుమారు 224 సంవత్సరాల పాటు పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపాలన, తెలంగాణా ప్రాంతంలో సామాజిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలలో అనేక మార్పులకు కారణమైంది.
నిజాం-ఉల్-ముల్క్‌తో మొదలైన పాలన ఉస్మాన్ ఆలీఖాన్‌తో అంతమైంది. పరీక్ష కోణంలో అసఫ్‌జాహీ పాలకులు చేసిన సంస్కరణలు ముఖ్యంగా మొదటి సాలార్‌జంగ్ సంస్కరణలకు సంబంధించి అనేక సార్లు ప్రశ్నలు రావడం జరిగింది.

అదే విధంగా, జాతీయోధ్యమానికి సంబంధించిన ప్రముఖమైన సంఘటనలు జరిగేటప్పుడు, హైదరాబాద్‌ను పాలించిన నిజాం గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. (ఉదా॥ 1857 తిరుగుబాటు సందర్భంలో అఫ్జలుద్దౌలా గురించి) తెలంగాణాలో సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని కల్గించటంలో దోహదపడిన పత్రికలు, రాజకీయ సంస్థలు సంఘసంస్కరణ ఉద్యమాలు, వాటి నాయకులు, ఆంధ్రజనసంఘ్, నిజాం రాష్ట్ర జనసంఘ్ ముఖ్యంగా ఆంధ్రమహాసభ సమావేశాలు జరిగిన ప్రాంతాలు, సంవత్సరాలు, హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమానికి కారణాలు, ఫలితాలు, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్, నిజాంకు వ్యతిరేకంగా జరిపిన పోరాటానికి సంబంధించి క్షుణ్ణంగా అధ్యయనం చేయగల్గితే, ఈ యూనిట్ నుండి వచ్చే అన్ని ప్రశ్నలకు అభ్యర్థులు సులభంగా సమాధానాలను గుర్తించే వీలు ఉంటుంది.
ap-history talangana patrika telangana culture telangana politics telangana cinema
1) ‘చిన్-కిలిచ్ ఖాన్’ అనే పేరు కల్గిన అసఫ్‌జాహీ వంశ స్థాపకుడు? ( )
1) నిజాం-ఉల్‌ముల్క్ 2) సలాబత్‌జంగ్
3) సికిందర్ జా 4) నాసిరుద్దౌలా
2) హైదరాబాద్‌లో వహబీ ఉద్యమానికి నేతృత్వం వహించినది? ( )
1) ఉస్మాన్ ఆలీఖాన్ 2) మహబూబ్ ఆలీఖాన్
3) ముబారిజ్ ఉద్దౌలా 4) నిజాం ఆలీఖాన్
3) ఏ నిజాం నవాబు కాలంలో నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్ లో విలీనమైంది? ( ) 1) అఫ్జల్ ఉద్దౌలా 2) నాసర్‌జంగ్
3) సికిందర్ జా 4) ఉస్మాన్ ఆలీఖాన్
4) హైదరాబాద్‌లో ప్రధమ టంకశాలను ఏర్పాటు చేసినది? 1) నిజాం ఉల్‌ముల్క్ 2) సాలార్‌జంగ్
3) సలాబత్‌జంగ్ 4) పైవారందరూ
5) మహారాష్ట్ర పీష్వా బాజీరావు తో చౌత్, సర్దేశ్‌ముఖ్ పన్నులు చెల్లించేందుకు గానూ, ‘ముసిగాంసంధి’ చేసుకున్న నిజాం నవాబు? ( )
1) నిజాం ఆలీఖాన్ 2) నాసిరుద్దౌలా
3) నిజాం ఉల్‌ముల్క్ 4) ఉస్మాన్ ఆలీఖాన్
6) సికిందర్ జా పాలనాకాలంలో ఏ బ్రిటిష్ అధికారి నిజాం రాజ్యంలో ఆర్ధిక సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది
1) థామస్ మన్రో 2) చార్లెస్ మెట్‌కాఫ్
3) సర్ ఆర్ధర్ కాటన్ 4) లార్డ్ మోయో ( )
7)


 Pramakullu3 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
తెలంగాణాలో ఏర్పాటైన తొట్టతొలి గ్రంధాలయం? ( )
1) రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయం
2) ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం
3) శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
4) తెలుగు భాషా నిలయం

ప్రీవియస్ క్వశ్చన్స్
1) ఆచార్య ఎన్.జి. రంగా తొలి కిసాన్ పాఠశాలను ఎక్కడ నెలకొల్పారు? నగూప్-2 2008) (3 )
1) గుంటూరు 2) బాపట్ల
3) నిడుబ్రోలు 4) తెనాలి
2) ఇంగ్లీషు తూర్పు ఇండియా వర్తక సంఘం మచిలీపట్నంలో ఒక ఫ్యాక్టరీని స్థాపించింది. అయితే ఆ కంపెనీకి అలా చేయడానికి అనుమతినిచ్చినదెవరు? నగూప్-2 2008) ( 3 )
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుత్‌బ్‌షా
3) మహ్మద్ కులీ కుత్‌బ్‌షా
4) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
3) హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన చందా రైల్వే స్కీమ్ ఆందోళన దేనిని సూచిస్తుంది? నగూప్-2 2008)
1) రాష్ట్రంలో ప్రజాచైతన్యం ఆరంభం ( 1 )
2) ప్రభుత్వ ఉదార విధానం
3) ముస్లిం ప్రభువర్గాల వైఖరి
4) ఇవేవి కావు
4) ‘రయ్యత్’ అనే ఉర్దూ దిన పత్రిక సంపాదకుడు? ( 1 )
నగూప్-2, 2011)
1) ఎం.నర్సింగరావు 2) షోయబుల్లాఖాన్
3) కె.వి. రంగారెడ్డి 4) ఎం.చెన్నారెడ్డి
5) హైదరాబాద్ రాష్ట్ర నిర్మాతను పేర్కొనుము? ( 1 )
నగూప్-2, 2011)
1) చిన్ ఖిలిచ్‌ఖాన్ 2) జులియర్ ఖాన్
3) మజఫర్ జంగ్ 4) నాసర్ జంగ్

8) ఆంధ్ర జన సంఘం స్థాపించబడిన సంవత్సరం? ( )
1) 1921 2) 1923
3) 1931 4) 1919
9)

 Mens5 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
ఈ క్రింది వానిలో సరిగా జతపరిచినది?
( )
1) ఆదిరాజు వీరభద్రరావు - తెలంగాణ శాసనాలు
2) సురవరం ప్రతాపరెడ్డి - ఆంధ్రుల సాంఘీక చరిత్ర
3) సబ్నవీసు - నీలగిరి పత్రిక
1) 1 మాత్రమే 2) 2 మాత్రమే
3) 1మరియు 2 4)1,2,3 సరియైనది
10) నిజాం రాజ్యంలో రాజకీయ చైతన్యం ఎప్పుడు ప్రారంభ మైంది? ( )
1) 1920 2) 1921
3) 1922 4) 1923
11) ఆంధ్రప్రాంతంలో ఏ ఉద్యమం ఉదృతంగా కొనసాగుతున్న సమయంలో తెలంగాణాలో సామాజిక, సాంస్కృతిక చైతన్యం ప్రారంభమైనది? ( )
1) సహాయ నిరాకరణ ఉద్యమం
2) వందేమాతర ఉద్యమం
3) పన్నుల నిరాకరణ ఉద్యమం
4) కోటప్పకొండ సంఘటన
12) తెలంగాణా ప్రాంతంలో సామాజిక, సాంస్కృతిక చైతన్యానికి 1892లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఆర్యసమాజ్ శాఖలోని సభ్యుడు కానివారెవరు? ( )
1) దామోదర్ సాత్ వలెకర్
2) కేశవరావ్ కరోట్‌కర్
3) డా॥ చటోపాధ్యాయ్
4) దామోదర్ చటోపాధ్యాయ
13) తెలంగాణాలో సాంఘిక, రాజకీయ చైతన్యాన్ని కల్పించ డానికి దోహదపడ్డ ప్రముఖ పత్రిక? ( )
1) భువనగిరి పత్రిక 2) నీలగిరి పత్రిక
3) కాకతీయ పత్రిక 4) 2 మరియు 3
14) హైదరాబాద్ రాష్ట్రంలో ఆదిహిందూ ఉద్యమాన్ని విస్త్రృతంగా ప్రచారం చేసిన నాయకుడు? ( )
1) కొమర్రాజు లక్ష్మణరావు 2) సురవరం ప్రతాపరెడ్డి
3) భాగ్యరెడ్డి వర్మ 4) నిజాం ఆలీ
15) మహర్షి కార్వే అధ్యక్షత వహించిన సాంఘిక సంస్కరణ సమావేశం (1921)లో ఎవరు తెలుగులో మాట్లాడటం వల్ల ఆంధ్రజనసంఘ్ ఏర్పాటు కు దారితీసింది? ( )
1) దేవులపల్లి రామానుజరావు
2) ఆలంపల్లి వేంకట రామారావు
3) పెట్టిగొప్పుల నారాయణ రావు
4) అక్కినేపల్లి రాఘవరావు
16) ‘ఆంధ్రజనసంఘ్’ నిజాం రాజ్య ఆంధ్రజనసంఘ్ గా ఎప్పుడు మార్చబడింది?
1) 1920 2) 1921 ( )
3) 1922 4) 1923
17) తెలంగాణా ప్రజల సాంఘిక సాంస్కృతిక ఆర్ధిక వికాసానికి దోహద పడిన సంఘం? ( )
1) ఆంధ్రజనసంఘ్
2) నిజాంరాజ్య ఆంధ్రజనసంఘ్
3) ఆంధ్ర మహాసభ
4) తెలంగాణా రైతుసంఘం
18)ఆంధ్రజనసంఘ్ కృషివల్ల మొదటిసారిగా 1928లో తెలుగు ప్రధాన బోధనా భాషగా ప్రవేశపెడుతూ ఏర్పాటు చేయబడ్డ పాఠశాల? ( )
1) కాకతీయ బాలికల పాఠశాల
2) నిజాం బాలుర పాఠశాల
3) హైదరాబాద్ బాలికల పాఠశాల
4) ఆంధ్ర బాలికల పాఠశాల
19) తెలంగాణాలో గొప్ప రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన ఆంధ్రజనసంఘ్ ‘సురవరం ప్రతాపరెడ్డి’ అధ్యక్షతన ఎక్కడ జరిగిన సమావేశంలో ఆంధ్రమహాసభగా పేరు మార్చబ డినది? ( )
1) హాన్మకొండ 2) జోగిపేట
3) హైదరాబాద్ 4) నల్గొండ
20) నిజాం రాజ్యంలో ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం’ ఏర్పాటు చేయాలనే రాజకీయ తీర్మానాన్ని ఆంధ్రమహాసభ ఏ సమావేశంలో తీసుకున్నది? ( )
1) షాద్‌నగర్ (1935) 2) సిరిసిల్ల(1935)
3) నిజాంబాద్ (1937) 4) పైవేవీ కావు
21) తెలుగుభాషా సంస్కృతి పట్ల అవగాహన, అభిరుచిని పెంచడానికి దోహదపడిన ‘విజ్ఞాన చంద్రికా మండలి’ని 1906లో ఏర్పాటు చేసినవారు? ( )
1) సురవరం ప్రతాపరెడ్డి 2) తారానాధ్
3) కొమర్రాజు లక్ష్మణరావు 4) మౌలానా ఆలీ
22) హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ( )
1) 1905 2) 1921
3) 1932 4) 1938
23)ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం ప్రారంభం కావడానికి కారణమైన పండుగ?
1) దీపావళి
2) దసరా
3) లష్కర్ బోనాలు
4) మహంకాళీ జాతర ( )
24) హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమం కారణంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బహిష్కరింపబడి అనంత రం రాజకీయ నాయకునిగా ఎదిగిన వారు? 1) పి.వి. నరసింహరావు 2) ధర్మభిక్షం
3) హైగ్రీవా చారి 4) పై వారందరూ ( )
25) మహాత్మాగాంధీ ఏ ఉద్యమం సందర్భంలో ‘‘మీరు చేసిన పని న్యాయపరమైనది, మీకు ప్రార్ధనా మందిరంలో జాతీయ గీతం పాడే హక్కుంది’’ అని పేర్కొన్నాడు? ( )
1) కాకినాడలో సహాయ నిరాకరణోద్యమం
2) మద్రాస్‌లో ఉప్పు సత్యాగ్రహం
3) హైదరాబాద్‌లో వందేమాతర ఉద్యమం
4) పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం
26) ‘హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్’ అనే రాజకీయ సంస్థను ఏర్పాటు చేయాలనే నిర్ణయం ఆంధ్రమహాసభ ఎన్నవ సమావేశంలో తీసుకున్నారు? ( )
1) 3వ 2) 4వ
3) 5వ 4) 6వ
27) ‘స్వామి రామానంద తీర్ధ’ అధ్యక్షతన ‘హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ( )
1) జనవరి 29,1938 2) ఫిబ్రవరి 29,1938
3) మార్చి 29, 1938 4) ఏప్రిల్ 29, 1938
28) ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పై నిజాం ప్రభుత్వం విధించిన నిషేదానికి వ్యతిరేకంగా ప్రారంభించబడిన అహింసా యుత సత్యాగ్రహానికి అధ్యక్షత వహించినది ఎవరు? ( )
1) రావి నారాయణరెడ్డి 2) నూకల రామచంద్రారెడ్డి 3) పి.వి. నరసింహారావు 4) గోవిందరావ్ నాయక్
29) హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటుకు ముందు గాంధీ హైదరాబాద్‌లో ఎప్పుడు పర్యటించాడు? ( )
1) 1932,మార్చి 9న 2) 1933,మార్చి 9న
3) 1935, మార్చి 9న 4) 1934,మార్చి 9న

 Answer5 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine