|
|
Home >> Studies Exams
పర్యావరణంలో పిజి కోర్సు ఎక్కడ ఉంది?
l -డి.రవీంద్రగౌడ్, నకిరేకల్. జ - పర్యావరణ శాస్త్రంలో రెండేళ్ల పి.జి. కోర్సును రాష్ట్రంలోని ఎన్.ఐ.టి. వరంగల్, కాకతీయ విశ్వవిద్యాలయం వారు ఆఫర్ చేస్తున్నారు. ఒక సంవత్సరం కాలవ్యవధిలో గల పి.జి. డిప్లొమా కోర్సును ఆంధ్ర విశ్వవిద్యాలయం, డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఆఫర్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత పెరుగుతోంది కాబట్టి ఈ కోర్సుకు మంచి భవిష్యత్తు ఉండగలదు. ఈ కోర్సు చేసిన వారికి ప్రభుత్వ రంగంలో, మున్సిపాలిటీలలో, కెమికల్ డ్రగ్ పరిశ్రమల్లో, రీసెర్చ్ సంస్థల్లో అవకాశాలు లభించవచ్చు. l ‘లా’ కోర్సు చదవాలంటే తప్పనిసరిగా ‘లా’ ఎంట్రన్స్ రాయాలా? లేక ‘లా’ ఎంట్రన్స్ రాయకుండా కోర్సు చదివే అవకాశం ఉందా? నేరు ఇటీవల జరిగిన ‘లా’ ఎంట్రన్స్‌కు దరకాస్తు చేయడం ‘మిస్’ అయ్యాను. తిరిగి ఎంట్రన్స్ రాయడానికి ఇంకా ఒక సంవత్సరం వేచి ఉండకుండా ఏవైనా ఇతర సంస్థల ‘లా’ కోర్సులు చేసే మార్గముందా? తెలపండి? -సి.అవినాష్, మహబూబ్‌నగర్. జ ః రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేసే 3 సంవత్సరాల లా కోర్సు, మరియు 5 సంవత్సరాల లా కోర్సులకు విధిగా ‘ఎపి లాసెట్’ పరీక్ష రాయాలి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన లా కళాశాలల్లో ప్రవేశానికి ‘‘క్లాట్’’ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ రాయాలి. ఈ రెండు పరీక్షల గడువు తేదీ ముగిసింది. కాబట్టి మీరు ఇంకో సంవత్సరం వేచి చూడాల్సిందే. ప్రైవేట్ రంగంలోని అమిటీ విశ్వవిద్యాలయం (Amity University) వారు నోయిడా, లక్నో, జైపూర్‌లలో ఎల్.ఎల్.బి. కోర్సు ఆఫర్ చేస్తున్నారు. వివరాలకు అమిటి లా స్కూల్‌ను వెబ్‌సైట్‌లో చూడవచ్చు. లీగల్ కోర్సులలో పి.జి డిప్లొమా కోర్సులకు దూరవిద్య ద్వారా చేయవచ్చు. పి.జి, డిప్లొమా ఇన్ సైబర్ లాస్, పేటెంంట్ లాస్, కన్స్యూమర్ లాస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్, మీడియా లాస్, హుమన్ రైట్స్ లాస్ లాంటి కోర్సులను నల్సార్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా లా కళాశాల, ఆంధ్రా లా కళాశాల, నేషన్ స్కూల్ ఆఫ్ లా బెంగళూరు లాంటి సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సులు చేసిన వారికి సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ సంస్థలలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. l ఆల్ ఇండియా రేడియోలో కాని, దూరదర్శన్‌లో కాని ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు ఉంటాయా? ప్రస్తుతం నేను ఒక ప్రైవేట్ సంస్థలో ట్రాన్స్‌లేటర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. ఇతర ప్రభుత్వ సంస్థల్లో ఈ విధమైన ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాల వివరాలు తెలపండి. వాటికి కావలసిన క్వాలిఫికేషన్ వివరాలు కూడా తెలపండి. - పెనుగంచి మురళి, కోదాడ. జ- ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్, పార్లమెంట్, శాసనసభ, పబ్లిక్ సెక్టార్ బ్యాంకులలో ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంది. ట్రాన్స్‌లేటర్ కావాలంటే ఏదేని ఒక భాషలో కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ట్రాన్స్‌లేషన్ స్టడీస్‌లో డిప్లొమా ఉంటే అదనపు అర్హతగా ఉపయోగపడుతుంది. ఒకటి కంటే ఎక్కువ భాషల్లో పి.జి. చేసిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది. పి.జి., మల్టీమీడియా, జర్నలిజంలో డిప్లొమా కలిగినవారు, ఇతర భాషలు తెలిసిన వారు ఎక్కువగా రాణించగలరు. విదేశీ భాషా పరిజ్ఞానం గల వారికి కూడా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి.
Other News
|
|||||