|
|
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి
 గ్రూప్-2 పరీక్షలో పేపర్-॥ విభాగం-1లో ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో భాగంగా, రెండవ చాప్టర్ లో క్రీ.శ మొదటి శతాబ్దం నుండి క్రీ.శ. 15వ శతాబ్ద మధ్య కాలంలో జరిగిన సంఘటనలపై పూర్తి అవగాహనను పొందాల్సి ఉంటుంది.
సమకాలీన ఆంధ్రప్రాంతంలో వివిధ రాజుల పట్ల ఉన్న సంబంధాలను కానీ, విదేశీ యాత్రికులు ఆనాడు సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల పట్ల వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుంది.
అదే విధంగా విజయనగర, కాకతీయుల భాష,సాహిత్య సేవలను, వాస్తు, శిల్పాల పట్ల ప్రధానంగా దృష్టిని సారించాల్సి ఉంటుంది. ఆంధ్రశాసనాలను, శాసన కర్తలను, ప్రముఖమైన రచనలను ప్రత్యేకంగా చదవాల్సి ఉంటుంది. ఈ అంశాలపై ప్రశ్నలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అభ్యర్ధులు రాజులను, ఆయా రాజులు పోషించిన కవులను, వారి రచనలను ఒక పట్టిక రూపంలో రూపొందించుకొని చదవాల్సి ఉంటుంది.
అదే విధంగా, దక్కన్‌లోని 5 ముస్లిం రాజ్యాల స్థాపన, ఆయా రాజుల మధ్య అంతఃకలహలు,దీన్ని ఆధారంగా యుద్ధానికి సంబంధించిన విశేషాలను అభ్యర్ధులు చదవాల్సి ఉంటుంది. 1) ఆంధ్రేతర పాలకుల నుండి, ఆంధ్రదేశానికి విముక్తి కల్పించి, ఆంధ్రదేశాన్ని ఏకం చేసిన కాకతీయ రాజు ( ) 1) రెండో బేతరాజు 2) రుద్రదేవుడు 3) రెండో ప్రోలరాజు 4) గణపతి దేవుడు 2) ‘అరిగజకేసరి’ అనే బిరుదును ధరించిన కాకతీయరాజు? 1) ప్రోలరాజు 2) రెండో బేతరాజు 3) ప్రతాప రుద్రుడు 4) దుర్గనృపతి ( ) 3) కాకతీయులపై దండెత్తిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్? 1) మహ్మద్ బిన్ తుగ్లక్ 2) ఘియాసుద్దీన్ తుగ్లక్ 3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) పైవారెవరూ కాదు ( ) 4) విజయనగర శిల్పంలో ఇస్లాం వాస్తు ప్రభావం గోచరించు నిర్మాణం ఏది? ( ) 1) పద్మమహల్ 2) హజారా రామాలయం 3) విరూపాక్ష ఆలయం 4) రామలింగేశ్వరాలయం 5) ‘యవన రాజ్యస్థాపనాచార్య’ అనే బిరుదును పొందిన విజయనగర రాజు? ( ) 1) అళియ రామరాయలు 2) ప్రౌడదేవరాయలు 3) సదాశివరాయలు 4) శ్రీ కృష్ణ దేవరాయలు 6) తెలుగులో మొదటి నాటకం ఏది? ( ) 1) రాజశేఖర చరిత్ర 2) గజేంద్ర మోక్షం 3) రఘునాధాభ్యుదయం 4) పారిజాతాపహరణం 7) ప్రముఖ కావ్యమైన ‘మధుర విజయాన్ని’ రచించిన గంగాదేవి ఏ విజయనగర రాజు ధర్మ పత్రి? ( ) 1) కంపరాయలు 2) మొదటి బుక్క రాయలు 3) హరిహరరాయలు 4) రెండవ హరిహర రాయలు 8) ‘అల్లావుద్దీన్ హసన్ గంగూ’,గా బిరుదు పొందిన బహమనీ రాజ్య స్థాపకుడు? ( ) 1) హుస్సేన్ షా 2) ఫిరోజ్‌షా బహమనీ 3) జాఫర్‌ఖాన్ 4) పైవారెవరూ కారు 9) ‘కర్పూర వసంతరాయలు’గా బిరుదుగాంచినది? ( ) 1) అనవేమారెడ్డి 2) అనపోతారెడ్డి 3) పెదకోమటి వేమారెడ్డి 4) కుమార గిరిరెడ్డి 10) ‘సంగీత చింతామణి’ ‘సాహిత్య చింతామణి’ అనే గ్రంధాలను రచించిన రెడ్డి రాజు? ( ) 1) పెదకోమటి వేమారెడ్డి 2) కుమార గిరిరెడ్డి 3) వీరభద్రారెడ్డి 4) అన వేమారెడ్డి 11) కుమారగిరిరెడ్డి రచించిన ‘వసంత రాజీయానికి’ కుమారగిరి రాజీయమనే గొప్ప వ్యాఖ్యానం రచించిన విద్వాంసుడు? ( ) 1) వీరభద్రారెడ్డి 2) రెండో కుమారగిరిరెడ్డి 3) కాటయ వేమారెడ్డి 4) రాచ వేమారెడ్డి 12)  బహమనీ రాజ్యం స్థాపించ బడిన సంవత్సరం? ( ) 1) 1346 2) 1347 3) 1336 4) 1348 13) ప్రముఖ కవి అయిన డింఢిమ భట్టును ఓడించినందున శ్రీనాధమహాకవికి కనకాభిషేకం చేసిన విజయనగర రాజు 1) శ్రీ కృష్ణదేవరాయలు 2) శ్రీరంగరాయలు ( ) 3) అళియ రామరాయలు 4) ప్రౌడదేవరాయలు 14) చైనా దేశమునకు రాయబారులను పంపి దౌత్య సంబంధాలను నెరిపిన విజయనగర రాజు? 1) శ్రీకృష్ణదేవరాయలు 2) అళయ రామరాయలు 3) మొదటి బుక్క రాయలు 4) పైవారెవరూ కారు ( ) 15) శ్రీకృష్ణ దేవరాయల భౌతిక రూపమును గూర్చి వర్ణించిన విదేశీ యాత్రికుడు? 1) డోమింగో స్ 2) బార్బోసా ( ) 3) అబ్దుల్ రజాక్ 4) న్యూనిజ్ 16) కుతుబ్‌షాహీ యుగంలో శాంతి భద్రతల నిర్వహణకై సృష్టించబడిన పదవి? 1) వజీర్ 2) కొత్వాల్ ( ) 3) దబీర్ 4) పీష్వా 17) శ్రీ కృష్ణదేవరాయల చేతిలో ఓడిపోయిన గోల్కొండ సుల్తాన్? ( ) 1) ఇబ్రహీం ఆదిల్ షా 2) హుస్సేన్ నిజాంషా 3) కులీ కుత్‌బ్‌షా 4) అలీ ఆదిల్‌షా 18)1565 లో ప్రసిద్ధిగాంచిన తళ్ళికోట యుద్ధంలో పాల్గొనని ఏకైక ముస్లి రాజ్యం? ( ) 1) గోల్కొండ 2) బీదర్ 3) బీరార్ 4) అహ్మద్‌నగర్ 19) బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్ షా తో సంధి కుదుర్చుకున్న రెడ్డి రాజు? ( ) 1) కాటయ వేమారెడ్డి 2) పెదకోమటి వేమారెడ్డి 3) కుమార గిరిరెడ్డి 4) పై వారందరూ 20) వ్యభిచారం పై కూడా పన్నును విధించి దానిపై వచ్చే పెక్కు ఆదాయాన్ని ఆనాటి పోలీస్ సిబ్బంది జీత భత్యాలకై ఖర్చు చేయటం విజయనగర సామ్రాజ్యంలో ఉండేదని ఉటంకించిన విదేశీ యాత్రికుడు? ( ) 1) అబ్దుల్ రజాక్ 2) న్యూనిజ్ 3) డోమింగోఫేస్ 4) మార్కోపోలో 21) విజయనగర రాజులకు, బహమనీ సుల్తాన్‌లకు మధ్య సుదీర్ఘ కాలంపాటు యుద్ధాలు జరిగాయి. అయితే, ఈ యుద్ధాలకు ప్రధాన కారణం? 1) దేవలయాల్లోని సంపద 2) రాయచూర్ దోబ్ ( ) 3) వ్యవసాయ భూములకోసం 4) పైవేవీకావు 22) తన కుమార్తెను బహమనీ సుల్తాన్ అయిన ఫిరోజ్‌షాకు ఇచ్చి వివాహాన్ని జరిపించిన విజయనగరరాజు? ( ) 1) మొదటి బుక్కరాయలు 2) హరిహర రాయలు 3) మొదటి దేవరాయలు 4) వెంకటపతి రాయలు 23) ఏ రెడ్డి రాజు కాలంలో రెడ్డి రాజ్యం రాజధాని ‘అద్దంకి’ నుండి ‘ కొండవీటి’ కి మార్చబడింది? 1) అన వేమారెడ్డి 2) పెద్ద కోమటి వేమారెడ్డి 3) రాచవేమారెడ్డి 4) అన పోతారెడ్డి ( ) 24) కళ్యాణ దుర్గాన్ని జయించినందువల్ల ‘కళ్యాణభూపతి’ అని బిరుదును పొందిన వెలమ నాయుడు ఎవరు? ( ) 1) అన పోతనాయకుడు 2) కుమార సింగ భూపాలుడు 3) ఇమ్మడి అనపోతనాయుడు 4) ముమ్మడి సింగమ నాయుడు 25) ఆంధ్రప్రాంతాన్ని మొత్తం ముస్లిం పాలన నుండి విముక్తి చేయడానికి ఆంధ్ర విమోచనోధ్యమానికి కేంద్రస్థానం అయిన ప్రాంతం? 1) రేకపల్లి 2) భువనగిరి ( ) 3) అద్దంకి 4) బోధన్ 26) కాకతీయ రాజులు చతుర్థకులజులనే సమాచారాన్ని అందిస్తున్న శాసనం? ( ) 1) మోటుపల్లి అభయ శాసనం 2) బయ్యారం చెరువుశాసనం 3) విప్పర్ల శాసనం 4) విలస త్రామ శాసనం 27) ముస్లిం రాజులకు బందీగా మారి ఢిల్లీకి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో నర్మదా నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్న కాకతీయ రాజు? ( ) 1) గణపతి దేవుడు 2) రుద్రదేవుడు 3) ప్రతాప రుద్రుడు 4) రెండో బేతరాజు 28) ‘నృత్య రత్నావళి, గీత రత్నావళి, నాగరత్నావళి’ని రచించినది? 1) జయపసేనాని 2) విద్యానాధుడు 3) పాల్కురికి సోమనాధుడు 4) పింగళి సూరన ( ) 29) చరిత్ర ప్రసిద్ధినొందిన పల్నాటి యుద్ధం జరిగిన సంవత్సరం? ( ) 1) క్రీ.శ 1191 2) క్రీ.శ 1182 3) క్రీ.శ 1199 4) క్రీ.శ 1185 30) ఏ రాజులకాలంలో తెలుగు భాషకు, సాహిత్యానికి విశేష ప్రోత్సాహము, గౌరవము లభించాయి? ( ) 1) తూర్పు చాళుక్యులు 2) కాకతీయులు 3) రెడ్డిరాజులు 4) ఇక్షాకులు 31) విజయనగర సామ్రాజ్య కాలంలో బిచ్చగాళ్ళపై విధింప బడిన పన్ను? ( ) 1) గణాచరి పన్ను 2) సిద్దాయం 3) మగ్గరి 4) కొండోజు పన్ను 32) శ్రీకృష్ణ దేవరాయలు ఈ క్రింది ఏ గ్రంథంలో ‘‘దేశభాష లందు తెలుగు లెస్స’’ అనే పదాన్ని ఉపయోగించాడు? 1) సత్య వధూ ప్రీణము 2) జ్ఞాన చింతామణి ( ) 3) మదాలస పరిణయం 4) ఆముక్త మాల్యద 33) ‘‘ఆంధ్రకవితా పితామహుడు’’ అనే బిరుదు ఎవరికి కలదు? ( ) 1) నంది తిమ్మన 2) అల్లసాని పెద్దన 3) మాదయగారి మల్లన 4) భట్టు మూర్తి
ఈ యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు
1) హంపిలోని రామచంద్రాలయాన్ని జనసామాన్యంలో ఏమని పిలుస్తారు? నగూప్-2 2008) (2 ) 1) విట్టలాలయం 2)హజారా రామాలయం 3) కృష్ణస్వామి ఆలయం 4) అనంతశయన ఆలయం 2) శిష్యుల మస్తిష్కంలో ధార్మిక చింతనను ప్రేరేపించడం గురువుల ధర్మంగా అశోకుడు తెల్పిన శాసనం ఎక్కడ దొరికింది? నగూప్-2 2008) ( 4 ) 1) భట్టిప్రోలు 2) రాజుల మందగిరి 3) ధాద్యకలుకము 4) ఎర్రగుడి 3) ‘‘మేరుక’’ అనేది దేనిమీద పన్ను? నగూప్-2 2011) 1) మాగాణి 2) మెట్టభూములు 3) ఎగుమతి, దిగుమతులు 4) అమ్మకం- కొనుగోలు ( 3 ) 4) రుద్రమదేవి పాలనా కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు? నగూప్-2 2011) ( 3 ) 1) డోమెంగోఫేస్ 2) నికోలో కాంటే 3) మార్కోపోలో 4) జార్డానీస్ 5) కాకతీయ రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణం ఏది? నగూప్-2 2008) ( 3 ) 1) నెల్లూరు 2) మచిలీపట్నం 3) మోటుపల్లి 4) ధరణికోట
Other News
|
|