|
|
ఛలెంజింగ్ కోర్స్ ఛర్టర్డ్ అకౌంటెన్సీ
అకౌంటింగ్, ఆడిటింగ్, కార్పొరేట్ ఫైనాన్స్, బిజినెస్ లాస్, టాక్సేషన్, కార్పొరేట్ గవర్నెన్స్ అంశాలలో అత్యున్నత స్థాయి ఉద్యోగం చేయాలని వుందా? లేదా సొంత ప్రాక్టీసు పెట్టుకోవాలని వుందా?ఈ లక్ష్యాలను మీరు చేరుకోవాలంటే మీరు ఛార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదవాల్సిందే . సిఎ కోర్సు చదివితే భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ విదేశీ సంస్థల్లో కూడా ఉద్యోగ బాధ్యతలు చేపట్టవచ్చు. ఇక జీతభత్యాల విషయానికి వస్తే సగటు అభ్యర్ధి అంచనాలకు మించి ఉంటుంది. చార్టెర్డ్ అకౌంటెంట్లకు శాలరీ ప్యాకేజీలు సంవత్సరానికి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు అందుతున్నాయి. ప్రత్యేకంగా ఇండియాలో సి.ఎ.కోర్సులు చేసిన అభ్యర్థులకు ‘గ్లోబల్ డిమాండ్’ ఉంది. విదేశీ సంస్థలు భారత సి.ఎ. విద్యార్థులకు ఎర్ర తివాచీలు పరుస్తూ తమ సంస్థలోకి ఆహ్వానిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఎ.ఐ) పార్లమెంటు చట్టంతో 1949 జూలై 1న ఏర్పడిన చట్టబద్దసంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. దేశంలో ఛార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్‌ను రెగ్యు లేట్ చేసే అధికారాలు ఐ.సి.ఎ.ఐ. కలిగి ఉంది. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పరిధిలో ఐ.సి.ఎ.ఐ విధులు కొనసాగిస్తుంది. భారతదేశంలో 5 రీజినల్ కౌన్సిళ్లు, 126 బ్రాంచీలు, 21 చాప్టర్లతో 6.5 లక్షల మంది సిఎ విద్యార్థులతో ఐసిఎఐ దేశంలో అత్యున్నత సంస్థగా ఉంది. విదేశాలలో కూడా సి.ఎ.కోర్సు నిర్హహిస్తున్నారు. ఇక ప్రపంచంలో రెండవ అతి పెద్ద సంస్థగా ఐసిఎఐ కొనసాగుతోంది.
ఇండిపెండెంట్ ప్రొఫెషనల్ ప్రాక్టీసు - పబ్లిక్ అకౌంటింగ్ వ్యవహరాల ప్రాక్టీషనర్‌గా సి.ఎ అభ్యర్థులు కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రొప్రయిటర్ సంబంధిత కంపెనీలలో ప్రొఫెషనల్ ప్రాక్టీషనర్‌గా జాయిన్ కావచ్చు. లేదా సదరు కంపెనీలలో పార్ట్‌నర్, స్టాఫ్ మెంబర్‌గా చేరి ప్రొఫెషనల్ ప్రాక్టీసు సేవలు అందించవచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిపోర్ట్, బిజినెస్ లోన్స్ స్వీకరణలో ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ వంటి అంశాలలో సి.ఎ. అభ్యర్థులు బిజినెస్ అడ్వయిజర్లుగా సేవలు అందించవచ్చు.
మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ - వ్యాపారానికి చేయూతగా ఇండస్ట్రీ అభివృద్ధిలో చార్టెర్డ్ అకౌటెంట్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. కంపెనీ వనరుల వినియోగం, ఎఫిషియెన్సీ పెంచటం లక్ష్యాలను సాధించటంలో సి.ఎ.లు ముఖ్యపాత్ర వహిస్తున్నారు. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, స్ట్రాట్‌జిక్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ పాలసీ డిటర్మినేషన్ వంటి అంశాలలో సి.ఎ. అభ్యర్థులు సత్తా చాటి కంపెనీ వృద్ధికి ఎంతగానో తోడ్పడతారు.
 ఇండస్ట్రీ/గవర్నమెంటు ఆర్గనైజేషన్ లకు ఎంపిక కావచ్చు - ఇండస్ట్రీలు, గవర్నమెంటు ఆర్గనైజేషన్స్‌లు కీలక స్థానాలలో చార్టెర్డ్ అకౌంటెంట్లు చేరే అవకాశాలుంటాయి. చాలా మంది సిఎ అభ్యర్ధులు బిజినెస్ సంస్థలు లేదా ఇండస్ట్రీలలో అత్యున్నత స్థానాలైన సిఇఓ, సీఎఫ్‌ఓ, సిఓఓ, మెనేజింగ్ డైరెక్టర్ వంటి స్థానాలలో చేరే అవకాశాలుంటాయి.
ఛార్టర్డ్ అకౌంటెంట్‌గా క్వాలిఫై కావాలంటే..? - టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణులైన తర్వాత ముందుగా కామన్ ప్రొఫిషియన్సీ టెస్టులో పేరు నమోదు చేసుకోవాలి. - కామన్ ప్రొఫిషియన్సీ టెస్టు పాస్ కావాలి. అలాగే ఇంటర్ లేదా 10+2 ఎగ్జామ్ పాసవ్వాలి - ఇంటిగ్రెటెడ్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ కోర్సు (ఐపిసిసి) లో గ్రూప్-1 లేదా గ్రూప్-2 లేదా రెండిటికీ అభ్యర్ధి పేరు నమోదు చేసుకోవాలి. - ఐపిసిసిలో నమోదు చేసుకున్న 9నెలల్లో స్టడీ కోర్సు పూర్తి చేయాలి. - 35 గంటలు (వారం రోజుల్లో) ఓరియెంటేషన్ కోర్సు పూర్తి చేయాలి. - 100 గంటలు గల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రయినింగ్‌లో ఉత్తీర్ణత సాధించాలి. - గ్రూప్-1 లేదా రెండు గ్రూపులు ఐపిసిఈ పాస్ అయిన తర్వాత 3 ఏళ్ళ కాల పరిధికి గాను ఆర్డికల్డ్ అసిస్టెంట్‌గా రిజిస్టర్ చేసుకోవాలి. - సి.ఎ. ఫైనల్ ఎగ్జామినేషన్‌లో ఉభయ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించాలి. 3 ఏళ్ళ ఆర్టికల్ ట్రైనింగ్ పూర్తి చేయాలి. - జనరల్ మేనేజ్‌మెంట్ & కమ్యూనికేషన్ స్కిల్స్ (15రోజులు) కోర్సు పూర్తి చేయాలి. - ఐ.సి.ఎ.ఐ లో పేరు నమోదు చేసుకుని ‘‘ఛార్టెర్డ్ అకౌంటెంట్’’ గా అధికార గుర్తింపు పొందవచ్చు.
కోర్సు పూర్తి వివరాలకై సంప్రదించండి - సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ఐసిఎఐ, హైదరాబాద్ బ్రాంచ్, 11-5-398/c, రెడ్ హిల్స్, హైదరాబాద్ -500004. ఫోన్ ః 040 - 233170 26 ః 23393182. ఈమెయిల్ ః hyderabad@icai.org
10 లక్షల మంది సి.ఎ.లు అవసరం ! ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రారంభమైన నాటి నుండి నేటివరకు 1.8 లక్షల మంది ఛార్టర్డ్ అకౌంటెంట్స్ మార్కెట్లోకి వచ్చారు. ఇటీవల జరిపిన ఒక సర్వేలో రాబోయే ఐదేళ్ళలో 10 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమని ఉద్యోగాల లెక్క తేల్చారు. ఫ్రెష్ ఛార్టర్డ్ అకౌంటెంట్లకు రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు వేతన ప్యాకేజీలు వివిధ కంపెనీలు అందిస్తున్నాయి. పదిహేను ఏళ్ళ క్రితం మార్కెట్లోకి ప్రవేశిస్తున్న 100 మంది ఛార్టర్డ్ అకౌంటెంట్లతో 80 మంది వరకు సొంతంగా ప్రాక్టీసు పెట్టుకుంటే, మిగతా 20 మంది సి.ఎ ఉద్యోగాలలో కెరీర్ ప్రారంభించేవారు. నేడు ఆ పరిస్థితి ‘రివర్స్’ అయింది. నేడు 90 శాతం సి.ఎ లు ఉద్యోగాల వైపు వెళుతుండగా మిగతా 10 శాతం మంది సొంతంగా సి.ఎ ప్రాక్టీసు పెట్టుకుంటున్నారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ నుండి 10 వేల మంది అభ్యర్థులు సి.ఎ పరీక్షల లక్ష్యంగా పోటీపడుతున్నారు. జాతీయ గణంకాల ప్రకారం సి.ఎ పరీక్ష మొత్తం పేపర్లలో 22 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తున్నారు.
Other News
|
|