Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Studies Exams
కరెంట్ ఎగ్జామ్ కవరేజి

win-group-2 talangana patrika telangana culture telangana politics telangana cinema ఇదీ సిలబస్ -
1. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు
2. ప్రవేశిక
3. ప్రాథమిక విధులు
4. ప్రాథమిక హక్కులు
5. ఆదేశిక సూత్రాలు

ఇండియన్ పాలిటీ నుంచి వస్తున్న ప్రశ్నలు నిత్య జీవితంతో సంబంధం ఉన్న వాటితో పాటుగా, సమగ్ర విషయ పరిజ్ఞానాన్ని, అవగాహనను పరీక్షించేవిగా ఉంటున్నాయి.
సాధించిన రాజకీయ స్వాతంత్య్రం కన్నా, సాధించాల్సిన సామాజిక, ఆర్థిక స్వాతంత్య్రం మిన్నగా, సామాజిక, ఆర్థిక, రాజకీయ నిర్మితులకు జీవం పోసి భిన్నత్వంలో ఏకత్వం శోభిల్లే విధంగా రాజ్యాంగం రూపొందించబడింది. సిలబస్‌లో రాజ్యాంగం విశిష్ట లక్షణాలను, రాజ్యాంగ సారమంతా ఇముడ్చుకున్న ప్రవేశికను, వ్యక్తి స్వేచ్ఛకు, జాతి జవస త్వాలకు మూలమైన ప్రాథమిక హక్కులను, మన బాధ్యతలను గుర్తు చేసే ప్రాథమిక విధులను, సామాజిక సంక్షేమానికి రాజ్యం కట్టుబడి ఉండేలా చేసే ఆదేశిక సూత్రాలను పేర్కొనడం జరిగింది. అభ్యర్థులు ఈ సిలబస్‌ను అర్థం చేసుకోగల్గితే మిగిలిన యూనిట్లను సులభంగా అర్థం చేసుకోవడంతోపాటు సమాచారాన్ని అనుసంధానం చేసుకోవడం, అనువర్తింప చేసుకోవడం సులభమవుతుంది.

1. జవహర్‌లాల్ నెహ్రూ ప్రతిపాదించిన లక్ష్యాలు-ఆశయాల తీర్మానాన్ని ‘‘భారత జాతి చక్రంగా’’ అభివర్ణించిందెవరు?
1. డా॥ బి.ఆర్.అంబేద్కర్ 2. కె.ఎం. మున్షీ
3. డా॥ రాజేంద్ర ప్రసాద్ 4. హెచ్.సి. ముఖర్జీ ( )
2. రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ( )
1. రెండు సార్లు 2. మూడు సార్లు
3. ఒక్కసారి 1978లో 4. ఒక్కసారి 1976లో
3. భారత రాజ్యంగపు లక్ష్యాలను, ఆశయాలను ఎందులో పొందుపర్చారు ? ( )
1. ప్రాథమిక హక్కుల్లో 2. ఆదేశిక సూత్రాల్లో
3. ప్రవేశికలో 4. అధికరణం 32లో
4. భారత్‌లో సార్వజనీన వయోజన ఓటు హక్కును ఏ సంవత్సరంలో కల్పించారు ( )
1. 1919 2. 1935
3. 1947 4. 1950
5. ద్వంద పౌరసత్వాన్ని పొందిన భారతీయులకు సంబం దించి కింది వానిలో సరికానిది. ( )
1. దేశంలోకి ఎప్పుడైనా రావచ్చు, పోవచ్చు
2. దేశంలో ఓటు వేయవచ్చు కాని పోటీ చేయరాదు
3. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమానవకాశాలుండవు
4. రాజ్యాంగబద్ధ పదవులకు అనర్హులు
6. నూతన రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి సరికానిది?( )
1. రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం
2. బిల్లు ప్రవేశపెట్టటానికి రాష్ట్రపతి ఆమోదం అవసరం
3. రాష్ట్రపతి నిర్ధేశించిన వ్యవధిలో రాష్ట్ర శాసనసభ
అభిప్రాయం తెలపాలి
4. పార్లమెంట్ సాధారణ మెజార్టీతో తీర్మానం చేయడం ద్వారా
7. విదేశీయులు భారత్‌లో పౌరసత్వం పొందేందుకు కనీసం ఎంత కాలం నివాసం ఉండాలి ? ( )
1. 2 2. 3
3. 5 4. 10
8. సింఘ్వీ కమిటీ అనంతరం ద్వంద్వ పౌరసత్వాన్ని ఎన్ని దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు వర్తింపజేశారు ?( ) 1. 15 2. 16
3. 17 4.20
9. ‘‘డబుల్ జియోపార్డీ’’ అంటే ఏమిటి ( )
1. ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్షించవచ్చు.
2. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు శిక్షించవద్దు
3. తీర్పు తర్వాత కొత్త ఆధారాలు దొరికితే పునః విచారణ
4. ఒకే రకమైన నేరానికి వేరు వేరు శిక్ష ఉండరాదు
10. ప్రాథమిక విధులను పొందుపర్చటానికి కారణం ( )
1. అత్యవసర పరిస్థితి
2. హక్కులను అర్థవంతంగా చేయటానికి
3. దేశం పట్ల బాధ్యతగా ఉండటం కోసం
4. ప్రభుత్వంపట్ల విధేయత కోసం
11. ప్రాథమిక విధులను సిఫార్సు చేసిన కమిటీ ( )
1. స్వరణ్‌జిత్ 2. స్వరణ్‌సింగ్ 3. కరణ్‌సింగ్ 4. చాగ్లా
12. ప్రాథమిక విధులు అమలులోకి వచ్చిన సంవత్సరం?( )
1. 1947 2. 1950
3. 1976 4. 1977
13. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను ఏ అధ్యాయంలో చేర్చారు? ( )
1. 3ఎ 2. 4ఎ 3. 5ఎ 4. 4బి
14. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చే అంశంపై ఏర్పడిన సబ్ కమిటీకి అధ్యక్షుడు ( )
1. జవహర్‌లాల్ నెహ్రూ 2. వల్లభాయ్ పటేల్ 3. జె.బి. కృపలానీ 4. డా॥
15. న్యాయ సమీక్షాధికారం న్యాయస్థానాలకు ఏ ప్రకరణ ద్వారా లభించింది ( )
1. 32 2. 31 3. 13 4. 368
16. ఏ అధికరణం ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తుంది?
1. 32 2. 326 3. 224 4. 226 ( )
17. ప్రాథమిక హక్కులను రద్దు చేయు అధికారం ఎవరికి కలదు?
1. పార్లమెంటు 2. సుప్రీంకోర్టు ( ) 3. రాష్ట్రపతి 4. ఎవరికీ లేదు
18. పత్రికా స్వేచ్ఛకు రక్షణ కవచంగా ఉన్న నిబంధన ఏది? ( )
1. 21 2. 32 3. 14 4. 19
19. అత్యవసర పరిస్థితుల్లో సైతం రద్దుకాని నిబంధనలు ఏవి? ( )
1. 19, 21 2. 20, 21
3. 21 మాత్రమే 4. 19, 20
20. ఆస్తి హక్కుకు సంబంధించిన అధికరణం 300ఎ, రాజ్యాంగం లో ఎక్కడ ప్రస్తావించబడింది?
1. 3వ విభాగం 2. 9వ విభాగం
3. 10వ విభాగం 4. 12వ విభాగం ( )
21. ‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ అనే సూత్రం ఎవరికి వర్తిస్తుంది? ( )
1. రాష్ట్రపతి 2. గవర్నర్
3. ప్రధానమంత్రి 4. విదేశీయులు
22. పి.డి. యాక్టు పివెంటివ్ డిటెన్షన్) కింద అరెస్టు కాబడిన వ్యక్తిని....? ( )
1. 3 మాసములకు మించి నిర్బంధంలో ఉంచరాదు
2. 6 మాసములకు మించి నిర్బంధంలో ఉంచరాదు
3. 9 మాసములకు మించి నిర్బంధంలో ఉంచరాదు
4. 12 మాసములకు మించి నిర్బంధంలో ఉంచరాదు
23. ఆదేశిక సూత్రాల తాత్వికత ఏది? ( )
1. రాజ్యాంగం ఆకర్షణీయతను పెంచటం
2. న్యాయ వ్యవస్థకు కరదీపం
3. సంక్షేమ రాజ్యం స్థాపన
4. పై మూడు
24. ఆదేశిక సూత్రాలను నూతన సంవత్సరపు ఆడంబరపు తీర్మానాలుగా అభివర్ణించింది ? ( )
1. కే.సి.వేర్ 2. సెతాల్వాడ్
3. నసీరుద్దీన్ 4. హెచ్.జె.కానియా
25. ఏ అధికరణం రాజ్యం, ప్రజాసంక్షేమానికి పట్టం కట్టాలని హితబోధ చేస్తుంది ( )
1. 40 2. 32
3. 3 4. 21
26. 21ఎ అధికరణం ద్వారా హక్కుగా మల్చిన నిర్బంధ ఉచిత విద్య 86వ రాజ్యాంగ సవరణకు పూర్వం ఏ అధికరణంలో ప్రస్తావించబడింది ? ( )
1. 39 2. 46 3. 44 4. 45
27. ఆదేశిక సూత్రాల సవరణకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది? ( )
1. సాధారణ మెజార్టీతో రాజ్యాంగ సవరణ
2. ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ
3. రాజ్యాంగ సవరణ అవసరంలేదు, తీర్మానం మాత్రమే
4. సవరించటం సాధ్యం కాదు

ఫ్యాక్ట్ ఫైల్
భారత రాజ్యాంగం ఆధారాలు

భారత ప్రభుత్వ చట్టం - 1935 -
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన
- గవర్నర్
- పబ్లిక్ సర్వీస్ కమిషన్లు
- అత్యవసర పరిస్థితికి సంబంధించిన విషయాలు
బ్రిటన్ రాజ్యాంగం
- సమన్యాయ పాలన -సభాహక్కులు
- పార్లమెంటరీ ప్రభుత్వ విధానం
- ద్విసభా విధానం - స్పీకర్ వ్యవస్థ
- ఏక పౌరసత్వం
అమెరికా రాజ్యాంగం
- న్యాయ సమీక్ష-రాజ్యాంగ అధిక్యత
- స్వతంత్ర న్యాయ శాఖపాథమిక హక్కులు
- ఉపరాష్ట్రపతి పదవి
- రాష్ట్రపతి తొలగింపు
- సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపు
ఐరిష్ రాజ్యాంగం
- ఆదేశిక స్రూతాలు
- రాష్ట్రపతి ఎన్నిక విధానం
- రాజ్యసభకు సభ్యులను నామినేట్ చేసే విధానం
కెనడా రాజ్యాంగం
- బలమైన కేంద్రం గల సమాఖ్య - కేంద్రానికి అవశిష్టాధికారాలు
- కేంద్రం ద్వారా గవర్నర్ల నియామకం
- సుప్రీం కోర్టు సలహాపూర్వక పరిధి
ఆస్ట్రేలియా రాజ్యాంగం
- ఉభయ సభల సంయుక్త సమావేశం
- ఉమ్మడి జాబిత
జర్మనీ వైమర్ రాజ్యాంగం
- అత్యవసర పరిస్థితి సమయంలోప్రాథమిక హక్కులను సస్పెండ్ చేయటం.
రష్యా రాజ్యాంగం
- ప్రాథమిక విధులు
- ప్రవేశికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, న్యాయ భావన
ఫ్రాన్స్ రాజ్యాంగం
- గణతంత్ర వ్యవస్థ
- ప్రవేశికలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
దక్షిణాఫ్రికా రాజ్యాంగం
- రాజ్యాంగ సవరణ విధానం
- రాజ్యసభ సభ్యుల ఎన్నిక
జపాన్ రాజ్యాంగం
- చట్టం నిర్ధేశించిన విధానం

ఎక్స్‌పెక్ట్‌డ్ క్వశ్చన్స్
1. రాజ్యాంగ సభలో వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ క్రింది వాటిలో తప్పుగా జతప ర్చబడినది? ( 3 )
1. రూల్స్ కమిటి - డాక్టర్ రాజేంద్రప్రసాద్
2. అడ్వయిజరీ కమిటి - వల్లభ్‌బాయ్ పటేల్
3. స్టీరింగ్ కమిటి - జవహర్‌లాల్ నెహ్రూ
4. ప్రాథమిక హక్కుల ఉప సంఘం - జె.బి.కృపాలానీ
2. ద్వంద్వ పౌర సత్వంను సిఫార్సు చేసిన కమిటి ఏది?
1. ఎల్.ఎం.సింఘ్వీ కమిటీ 2. పాలన సంస్కరణల కమిటీ
3. సర్కారియా కమిషన్ 4. సంతానం కమిటి ( 1 )
3. భారత రాజ్యాంగం ప్రకారం ఈ క్రింది వానిలో ఏక కేంద్ర లక్షణము ఏది? ( 4 )
1. స్వతంత్ర న్యాయ వ్యవస్థ
2. కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ
3. రాజ్యాంగం యొక్క సర్వాధికారం
4. బలమైన కేంద్రమును ఏర్పాటు చేయుట
4. భారత రాజ్యాంగం విభాగంలో చింతన, భావప్రకటన, విశ్వాసం, నమ్మకం ప్రార్థన, స్వేశ్చ అనే పదాలున్నాయి?
1. ప్రాథమిక హక్కులు 2. ఆదేశ సూత్రాలు ( 3 )
3. పీఠిక 4. కేంద్ర న్యాయస్థానం
5. భారత రాజ్యాంగంలో సమాఖ్య లక్షణం కానిది? ( 3 )
1. సమాఖ్య ప్రభుత్వం 2. పార్లమెంటరీ ప్రభుత్వం
3. అధ్యక్ష ప్రభుత్వం 4. స్వతంత్ర న్యాయస్థానం

ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు

1. ‘‘స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం’’ నినాదం దేనికి సంబంధించింది ?(2012 గ్రూప్-II) ( 3 )
1. అమెరికా స్వాత్రంత్య పోరాటం
2. చైనా విప్లవం 3. ఫ్రెంచ్ విప్లవం
4. రష్యన్ విప్లవం
2. 14 సంవత్సరాలలోపు పిల్లలను ప్రమాదకర పనుల్లో పెట్టటం దేని ఉల్లంఘన? ( 4 )
1. సమానత్వపు హక్కు
2. ప్రాణ, వ్యక్తి స్వాతంత్య్ర హక్కు
3. సమానత్వ హక్కు
4. దోపిడీ వ్యతిరేక హక్కు
3. కానిస్టిట్యూషనలిజం ?(201లగూప్-II) ( 4 )
1. రాజ్యంగంలో ఇమిడి ఉంది
2. ప్రభుత్వ పెత్తనం
3. డెపోటిజం
4. ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు
4. భారత రాజ్యాంగం? (2011 గ్రూప్-II) ( 2 )
1. నిజమైన సమాఖ్య లక్షణం గలదు
2. ఏక కేంద్ర సమాఖ్య లక్షణం
3. అనేక సమాఖ్య లక్షణాలు
4. నిజమైన ఏక కేంద్రం
5. (4-A) అధికరణం దేని కోసం?(201లగూప్-II)
1. వికలాంగులకు రిజర్వేషన్ ( 4 )
2. స్త్రీల రిజర్వేషన్
3. ఎస్.సి/ఎస్.టి రిజర్వేషన్
4. పదోన్నతిలో రిజర్వేషన్


 Answer02 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema



 Answer03 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine