private jobs
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ !
-హైదరాబాద్ సమీపంలోని మునగనూర్ (హయత్‌నగర్ వద్ద)లో గల విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొపెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
సబ్జెక్ట్‌లు : ఫార్మస్యూటికల్స్, ఎనాలసిస్, రెగ్యులేటరీ అఫైర్స్
సంప్రదించాల్సిన చిరునామా : విజయ కాలేజీ ఆఫ్ ఫార్మసీ, మునగనూర్, వయా సంఘీనగర్ పోస్ట్, హయత్‌నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా.
-ఏఎల్‌ఎస్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ స్టాప్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనరల్ మేనేజర్ ఉద్యోగానికి కనీసం నాలుగు సంవత్సరాల అనుభవం ఉండాలి. బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగానికి మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు సేల్స్ మేనేజర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అనుభవం రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినదై ఉండాలి. అలాగే టెలీకాలర్స్, రిసెప్షనిస్ట్‌లు, ఆఫీస్ అసిస్టెంట్‌లు, కార్ డ్రైవర్ల పోస్టులకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన చిరునామా ః ఏఎల్‌ఎస్ రెడ్డి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, 103 బాలాజీ రెసిడెన్సీ, బిసైడ్ ఐసీఐసీఐ బ్యాంక్, పీర్జాదీగూడ, ఉప్పల్, హైదరాబాద్.
-సిరి హోమ్స్, టౌన్‌షిప్స్ ఏజీఎం, బిజినెస్ మేనేజర్స్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్స్, బిజినెస్ ఆఫీసర్స్, బిజినెస్ ఎగ్జిక్యూటీవ్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఆసక్తి ఉన్నవారు సంప్ర దించాల్సిన చిరునామా సిరి హౌమ్స్, టౌన్‌షిప్స్, ఫ్లాట్ నెంబర్ 201, 2వ ఫ్లోర్, వైష్ణవి నెస్ట్, బిహైండ్ టీఎంసీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్.
-ఏపీ టెక్నో కెమికల్ ఇండస్ట్రీ డిప్లమా, మెకానికల్ ఇంజినీర్లు, ఐటీఐ ఫిట్లర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలవారు [email protected] ఈమెయిల్‌ను సంప్రదించాలి.
-సెంట్ అల్పోన్సాస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మ్యాథ్స్, ఫిజికల్ సైన్సె, తెలుగు, సోషల్ సబ్జెక్టులలో ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో ఎంఏ / ఎం.ఎస్‌సీ / ఎంఈడీ చేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులను పొంది ఉండాలి. ఆంగ్లంలో మంచి అనుభవం అవసరం. పీహెచ్‌డీ, నెట్, స్లెట్ అభ్యర్థులకు ప్రాధాన్యం.
ఆసక్తి ఉన్న వారు ఈ ఆగస్ట్ 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంప్రదించాల్సిన చిరునామా ః
సెంట్ ఆల్ఫోన్సాస్ కళాశాల, హెచ్ 19, హైదరాబాద్.
ఈ మెయిల్ [email protected]
-విజ్ఞాన్ ఇంజినీరింగ్ వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ టెక్నిషియన్ పోస్టుకు అర్హత ఐటీఐ లేదా వోకేషనల్, సూపర్‌వైజర్ పోస్టుకు అర్హత బీఎస్‌సీ, బీఏ, బీకాం, ఇంటర్, ఎస్‌ఎస్‌సీ., జూనియర్ ఇంజినీర్‌కు అర్హత డిప్లమా లేదా బీఈ, బి.టెక్., జూనియర్ మేనేజర్‌కు అర్హత ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్‌సీ, ఎంకాం, ఎంఏ. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి బయోడేటాను పంపాల్సిన చిరునామా ః
విజ్ఞాన్ ఇంజనీరింగ్
జి.కె. బజార్ , ఇ.నెం. 8-1-245, ఖమ్మం.
-డిజిటెల్ టెలీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు విభిన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెలీ కాలర్స్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ : కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హులు. ఉద్యోగ అనుభవం లేని వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.
టెలీ టీం లీడర్ : టెలీ సెల్స్ రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం.
సేల్స్ కోఆర్డినేటర్ : సేల్స్ రంగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
టీం లీడర్ : ఈ ఉద్యోగానికి టీం లీడర్‌గా కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడగలగాలి. జులై 31 నుంచి ఆగస్ట్ 15 వరకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు ఇంటర్వ్యులు నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్నవారు సంప్రదించాల్సిన చిరునామా ః
డిజిటల్ టెలిసర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్,
మొదటి అంతస్తు, లాల్ బంగ్లా, అమీర్‌పేట, హైదరాబాద్.
-ఎస్‌డీటీ సంస్థ ఎలక్ట్రీషియన్స్, సైట్ సూపర్‌వైజర్స్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
ఎలక్ట్రీషియన్స్ ఉద్యోగాలకు అర్హత : ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఐటీఐ చేసి ఉండాలి. ఎంపిక అయిన వారికి భోజన వసతి సదుపాయలు కల్పించి నెలకు రూ. 6000 చెల్లిస్తారు.
సైట్ సూపర్‌వైజర్స్ : డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా బీఈ లేదా బి.టెక్(ఎలక్ట్రికల్) చదివి, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్‌లలో రెండు సంవత్సరాల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. ఎంపిక అయిన వారు గ్వాలియర్ లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ఆసక్తి ఉన్నవారు ఆగస్ట్ 3, 4 తేదీలలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
లెటెస్ట్ రెస్యూమ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హతలు, ఫోటో ఐడీ, రెసిడెన్స్ ప్రూఫ్‌లను ఓరిజినల్, జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకెవెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్వ్యులు జరిగే స్థలం ః ఎస్‌డీటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్,
బి.ఎల్.కె.ఆర్. హౌస్, ప్లాట్ నెంబరు 7, బంజారా హిల్స్, హైదరాబాద్.
Other News