మార్కెటింగ్ ఆఫీసర్లు , మేనేజర్ పోస్టులు(జాబ్స్ ...జాబ్స్)
- 
బిట్స్ పిలాని, హైద్రాబాద్ క్యాంపస్ టిబిఐ సొసైటీ వారు ఈదిగువ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మేనేజింగ్ డైరెక్టర్/ జనరల్ మేనేజర్-టెక్నాలజీ బిజినెస్ ఇన్‌క్యుబేటర్. పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం, జీతం, పెర్క్స్ తదితర వివరాలకు www.bits-hyderabad.ac.in పరిశీలించండి.
అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను, బిట్స్-పిలాని, హైద్రాబాద్ క్యాంపస్, జవహర్ నగర్, షామీర్‌పేట్ మండలం, రంగారెడ్డి జిల్లా, హైద్రాబాద్ - 500078 చిరునామాకు ఈ ప్రకటన వెలువడిన పదిరోజుల్లోగా పంపుకోవచ్చు.
- స్కై రిటైల్ కాపిటల్ సంస్థవారు హైద్రాబాద్, విజయ వాడ కేంద్రాల్లో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి 30-35 సంవత్సరాల మధ్య వయసు కలిగివుండి, ఆటోమొబైల్ / ఫైనాన్షియల్ సర్వీస్ / జనరల్ ఇన్సూరెన్స్ రంగాల్లో ఎనిమిది సంవత్సరాల అనుభవం అవసరం. ముఖ్యంగా టీం హ్యాండ్లింగ్ / నేరుగా అమ్మకాలు జరపడంలో అనుభవం కలిగి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం మొత్తం మీద కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దిగువ చిరునామాకు తమ దరఖాస్తులు పంపుకోవచ్చు.
హెచ్.ఆర్. మేనేజర్, యస్.కె.ఐ రిటైల్ కాపిటల్ లిమిటెడ్
నెం.1, ఫస్ట్ ఫ్లోర్, సంబంధం స్ట్రీట్, జి.ఎన్.శెట్టి రోడ్, టి.నగర్, చెన్నై - 600017.
Email: resume@skiretail.in
- వై.పి.ఆర్ డిగ్రీ కళాశాల వారు అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ / తెలుగు / మ్యాథమెటిక్స్ / ఫిజిక్స్ / కెమిస్ట్రీ / బోటనీ / జువాలజీ / కంప్యూటర్ సైన్స్ / కామర్స్ విభాగాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి. సంబంధిత విద్యావిభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 55శాతం కనీసం మార్కులు సాధించి ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ప్రకటన వెలువడిన వారం రోజుల్లోగా ఈ దిగువ చిరునామాకు దరఖాస్తు చేసుకోవాలి. సెక్రెటరీ, వై.పి.ఆర్. డిగ్రీ కాలేజ్, సిద్ధిపేట్, మెదక్ జిల్లా.
- ఐడిఎ చర్లపల్లిలో ఉన్న ISo 9001: 2008 సర్టిఫైడ్ కంపెనీ వారు సిఎడి ఆపరేటర్, సూపర్‌వైజర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనుకుంటున్నారు. సిఎడి ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థులు సిఎడితో డిఎంఇ/సోషల్ వర్క్స్ కలిగివుండి ఇంజనీరింగ్ ఇండస్ట్రీ డిజైన్ డిపార్ట్‌మెంట్‌లో రెండేళ్ళ అనుభవం కలిగివుండాలి.
సూపర్ వైజర్ పోస్టుకు డిఎంఇతో పాటు ఫాబ్రికేషన్ / సిఎన్‌సి మెషిన్ లేజర్ / బెండింగ్ మెషిన్ / అసెంబ్లింగ్ ఎక్విప్‌మెంట్ / మెషినరీ విభాగాల్లో కనీసం మూడేళ్ళపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న ఈ మెయిల్‌కు తమ దరఖాస్తులు పంపుకోవచ్చు.
Email: rice.engneers@yahoo.in
- చీదెళ్ళ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు కొత్తూరు, బీబీ నగర్‌లలోని హెచ్‌ఎండిఎ అనుమతి పొందిన లేఅవుట్ లలో పనిచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
మార్కెటింగ్ ఆఫీసర్లు : మొత్తం 30 పోస్టులు (స్త్రీ/పు), ఫీల్డ్ అలవెన్స్‌లు+ ఇన్సెంటివ్‌లు.
అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్లు : మొత్తం 20 పోస్టులు (ఎం/ఎఫ్) - ఫీల్డ్ అలవెన్స్‌లు+ ఇన్సెంటివ్‌లు.
పై పోస్టులకు వార్షికంగా 5 నుంచి 7.5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. 30 సంవత్సరాల పైబడినవారు, విఆర్‌ఎస్, పదవీ విరమణ చేసిన వ్యక్తులు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు,గృహిణులు కూడా అర్హులే.
ఇంటర్వ్యూలు జూలై 24, 25, 26 తేదీల్లో నిర్వహించబడతాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలలోపు ఆసక్తి కలిగిన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
చిరునామా: చీదెళ్ళ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, 315, నీలగిరి బ్లాక్, ఆదిత్య ఎన్‌క్లేవ్, అమీర్‌పేట్, హైద్రాబాద్.
- కేశవ్ మెవెూరియల్ డిగ్రీ,పిజి కళాశాలవారు , కామర్స్/రసాయనశాస్త్రం (ఆర్గానిక్ మరియు అనలిటికల్) / స్టాటిస్టిక్స్ విభాగాల్లో యుజి మరియు పిజి క్లాసులకు బోధించేందుకు అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు సంబంధిత రంగాల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆసక్తి కలవారు జూలై 26 లోగా తమ దరఖాస్తులు పంపుకోవచ్చు.
చిరునామా:కేశవ్ మెవెూరియల్ డిగ్రీ,పిజి కళాశాల, నారాయణగూడ, హైద్రాబాద్.
- సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ప్రిన్సిపాల్ / లెక్చరర్ల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతున్నారు.
ప్రిన్సిపాల్ - 55 శాతం మార్కులతో ఎం.ఎ, /ఎం.ఎస్‌సి/ ఎం.ఇడి చేసినవారు అర్హులు. ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్‌లో 5 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.
లెక్చరర్లు - 55 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్, 55 శాతం మార్కులతో ఎం.ఇడి / బి.ఇడి చేసి ఉండాలి.
సబ్జెక్టులు - తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్
సపోర్టింగ్ స్టాఫ్ - క్లర్క్ - 1, జూనియర్ అసిస్టెంట్ - 1
కంప్యూటర్ ఆపరేటర్ - 1
అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను జిరాక్స్ సర్టిఫికెట్లతో కింది అడ్రస్‌కు పంపించగలరు.
సెక్రటరీ, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మన్నెగూడ x రోడ్, తురకయాంజల్ నగా॥ హయత్‌నగర్ (మం॥ రంగారెడ్డి జిల్లా.
Other News