జబ్స్‌లో రిటైల్ అదుర్స్

మార్కెట్ రూపురేఖలు మారుతున్నాయి. చిన్న దుకాణాలు పెద్ద మార్కెట్లుగా, ఆ తరువాత సూపర్ మార్కెట్లుగా, మరికొన్ని షాపింగ్ మాల్స్‌గా మారాయి. వస్త్రదుకాణాలు, గృహోపకరణాలు, మొబైల్ షాప్‌లు, నగల దుకాణాలు.. ఇలా విస్తృత ప్రపంచం ఏర్పడింది. ఎందరో యువతీయువకులకు ఉపాధి చూపుతోంది. పెద్దగా విద్యార్హతలు లేకపోయినా వినియోగదారులను మెప్పించగల నైపుణ్యం ఉంటే చాలు, రిటైల్ రంగంలో దూసుకుపోవచ్చు. ఇలా నైపుణ్యం పెంచేందుకు ఉద్దేశించిందే ‘‘రిటైల్ సేల్స్ అండ్ సర్వీస్’’ కోర్సు. ప్రతిష్టాత్మకమైన ‘మాక్ - గ్రాహిల్’ సంస్థతో కలిసి సంయుక్తంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఈ కోర్సును అందిస్తోంది. అపార ఉపాధి అవకాశాలు ఉన్న ఈ కోర్సుకు సంబంధించిన వివరాలు..
విభిన్న షాపింగ్ మాల్స్‌లో విధులు నిర్వహించేలా ఈ కోర్స్‌లోని అంశాలను పొందుపరిచారు. ఇందులో రిటైలింగ్ అంటే ఏమిటి? భారతదేశంలో దాని తీరుతెన్నులు, కమ్యూనికేషన్ స్కిల్స్, భిన్న వినియోగదార్లు, వారి ప్రవర్తన, విక్రయాలపై ప్రభావం చూపే అంశాలు, వినియోగ దారుల సేవ, సెల్లింగ్ టెక్నిక్స్.. తదితర అంశాలను బోధిస్తారు. ఇవన్నీ ఓ ప్రొఫెషనల్ ‘రిటైల్ మేనేజర్’కి ఉండాల్సిన లక్షణాలు.. వీటిపై బోధన ఉంటుంది.

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారి అంచనాల ప్రకారం 2012లో 20 లక్షలకు పైగా ‘రిటైల్ సేల్స్ నిపుణుల’ అవసరం ఉంటుంది. అందుకే నేషనల్ ఇన్స్‌స్టిటూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వారు ఈ కోర్సు నిర్వహిస్తున్నారు. తరగతులు 100 గంటల పాటు ఉంటాయి. ఆరు నెలల వ్య వధి ఉండే ఈ కో ర్సు చేయడానికి ఇంట ర్మీడియట్ ఉత్తీర్ణులు అయి న వారు అర్హులు. ఆరు నెలల పాటు కోర్సు ఉంటుంది. కోర్స్ టైంటేబుల్ కూడా విద్యార్థులకు పూర్తి అనువుగా ఉంటుంది. ప్రతి రోజు లేదా వారాంతంలో నిర్వహించే తరగతులకు విద్యార్థులు హాజరుకావచ్చు. కోర్సు ఫీజు రూ.7500 ఉంటుంది. కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు మెక్ గ్రాహిల్ ఎడ్యుకేషన్ ప్రైవేటు లిమిటెడ్ ఉద్యోగం చూపడంలో సహాయపడుతుంది.
మారుతున్న మార్కెట్ విధానాలతో త్వరలో మార్కెట్‌లో అంతర్జాతీయ సంస్థలు రానున్నాయి. భారతీ వాల్‌మార్ట్, బిర్లా, టాటాలకు చెందిన సంస్థలలో మెరుగైన అవకాశాలు ఉంటాయి.
ఇదే కాకుండా జువెల్లరీ, టెలీకమ్యూనికేషన్, హైపర్‌మార్కెట్స్, సూపర్ మార్కెట్స్, స్పెషాలిటీ స్టోర్స్, అప్పారెల్స్, ఫుట్‌వేర్, హెల్త్‌కేర్, ఫుడ్ రిటైల్, ఫ్లోరిస్ట్స్, వాచెస్, ఐవేర్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోబైల్స్, బుక్స్, రియల్ ఎస్టేట్, ఐటీ, హోం డెకార్, మాల్స్, సినీ ఫ్లెక్సెస్, టాయ్స్, గిఫ్ట్స్ & గ్యాలరీస్, ఫర్నీచర్ రిటైల్, యాక్సెసరీస్, పర్‌ఫ్యూమ్స్ తదితర రంగాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలుంటాయి.
కోర్సు పూర్తి చేసిన వారికి ‘‘ప్రొఫెషనల్’’ సేల్స్ బాయ్‌గా ప్రారంభ వేతనం రూ.8000 నుంచి రూ.10,000 వరకు ఇస్తున్నారు. అనుభవం, ప్రతిభ పెంచుకుంటే ఆయా సంస్థలలోనే మార్కెటింగ్ మేనేజర్ స్థాయికి ఎదగవచ్చు. సామర్ధ్యం ఉందని భావిస్తే సంస్థలు కీలక బాధ్యతలు అప్పగించేందుకు ముందు కు వస్తాయి.
ఈ కోర్సుకు సంబంధించి పరీక్షలు ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. జులై 1 నుంచి డిసెంబర్ 2012లోపు దరఖాస్తు చేసుకుంటే వారికి తరగతులు నిర్వహించి ఏప్రిల్, మే 2013లో పరీక్షలు నిర్వహిస్తారు. కోర్సుకు అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారు. కోర్సు చేయాలన్న ఆసక్తి ఉన్న వారు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఒపెన్ స్కూలింగ్ విద్యాకేంద్రం), రాజేంద్రనగర్, హైదరాబాద్ లేదా 040-24015325 ఫోన్ నెంబర్‌ను లేదా వెబ్‌సైట్ ః http://icmhyd.ap.nic.in సంప్రదించవచ్చు.
Other News