కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
-
డిజీ కాల్ టెలీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈదిగువ పోస్టులకు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెలీకాలర్స్/కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు (300 ఖాళీలు), జీతం రూ.8500 వరకు+ఇన్‌సెంటివ్‌లు వుంటాయి. ఫ్రెషర్లు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
టెలీ టీం లీడర్లు (50 ఖాళీలు), జీతం రూ.15 వేల వరకు + ఇన్‌సెంటివ్‌లు. కనీసం ఏడాదిపాటు డొమెస్టిక్ బిపిఒగా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఆర్.ఎం. పోస్టులకు డైరెక్ట్ సేల్స్‌లో ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులు. టీం లీడర్/బిడిఎం (50 పోస్టులు), జీతం రూ. 22 వేల వరకు + ఇన్సెంటి వ్‌లు. టీం లీడర్‌గా కనీసం రెండేళ్ళ అనుభవం ఉండాలి.
ఏ విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసివారు, అనుభవం కలిగిన లేదా ఫ్రెషర్లు, తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో ప్రావీణ్యం కలిగినవారు పై పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఇంటర్వ్యూలు జూలై 13 నుంచి 20వ తేదీ వరకు ఉదయం 9.30 గంటలనుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కొనసాగుతాయి.
చిరునామా : మొదటి అంతస్థు, లాల్ బంగ్లా, అమీర్‌పేట, హైదరాబాదు-16.
-శ్రీ దివ్య సాయి దీక్ష డి.ఇడి కళాశాల వారు ఈ దిగువ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ప్రిన్సిపాల్ (1), అధ్యాపకులు (6) .
అధ్యాపకులు, ఇంగ్లీష్, తెలుగు, గణితం, సైన్స్, సోషల్ మరియు ఎడ్యుకేషన్ (ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ) విభాగాల్లో అవసరం.
ప్రిన్సిపాల్ పోస్టుకు అభ్యర్థులు ఎంఎ / ఎం.ఎస్‌సి / ఎం.ఇడి / పిహెచ్.డి పూర్తి చేసి డి.ఇడి కళాశాలలో ఐదేళ్ళపాటు పనిచేసిన అనుభవం కలిగివుండాలి.
అధ్యాపకులు, ఎంఎ / ఎం.ఎస్‌సి / ఎం.ఇడి విభాగాల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎం.పి.ఇడి, ఎంఎ / ఎంఎస్‌సి / బిఇడిలతో కనీసం ఐదేళ్ళ పాఠశాలలో బోధనానుభవం ఉండాలి.
చిరునామా : శ్రీ దివ్య సాయి దీక్ష డి.ఇడి. కళాశాల
తూముకుంట నగామం), షామీర్‌పేట (మండలం),
రంగారెడ్డి జిల్లా, పిన్ - 500078
ప్రధాన కార్యాలయం : ఓల్డ్ అల్వాల్, హైదరాబాదు.
ఈమెయిల్ : [email protected]
- ఆదిత్య డిగ్రీ కళాశాల వారు అనుభవం కలిగిన వారినుంచి ఈ దిగువ పేర్కొన్న విభాగాల్లో అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
గణితం, భౌతికశాస్త్రం, కామర్స్, మేనేజ్ మెంట్, ఇంగ్లీష్, ఎన్విరాన్‌మెంట్ సైన్సెస్, ఫౌండేషన్ కోర్సు, అర్థమెటిక్, రీజ నింగ్, సాఫ్ట్ స్కిల్స్.
లాబ్ డిమాన్‌స్ట్రేటర్లు : విద్యార్థులకు ప్రయోగశాలల్లో మార్గ దర్శనం చేయగలిగి ఉండాలి.
అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ చేసి ఉండాలి.
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో, కాకినాడ / రాజమండ్రి / విశాఖపట్నంలలోని వీరి డిగ్రీ కళాశాలల్లో పనిచేయాల్సి ఉంటుంది. మంచి రెమ్యూనరేషన్ ప్యాకేజీలు ఉంటాయి.
ఆసక్తి కలిగినవారు తమ బయోడేటాను ఈ దిగువ చిరునామాకు లేదా ఈ-మెయిల్‌కు పంపాలి.
చిరునామా : ఆదిత్య డిగ్రీ కాలేజ్, లక్ష్మీ నారాయణ నగర్, కాకినాడ.
ఈమెయిల్ : [email protected]
- ప్రముఖ కంప్యూటర్ సర్వీస్ కంపెనీ అయిన గ్లోబల్ టెక్నాలజీస్ వారు కింది పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
సపోర్ట్ / సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ - 28 పోస్టులు
బి.ఎస్.సి/బి.ఎ/బి.కామ్ చదివిన స్త్రీ, పురుషులు అర్హులు. ప్రారంభ వేతనం రూ. 6,100 ఉంటుంది. వయస్సు 24 సం॥ లోపు ఉండాలి. 3 సం॥ బాండ్ రాయవలసి ఉంటుంది.
టెక్నీషియన్స్ / అసిస్టెంట్స్ - 65 పోస్టులు
10వ తరగతి / ఇంటర్ / ఐటిఐ పాస్ / ఫెయిల్ అయిన స్త్రీ, పురుషులు అర్హులు. ప్రారంభ వేతనం రూ. 5,100 ఉంటుంది. వయస్సు 21 సం॥ లోపు ఉండాలి. 3 సం॥ బాండ్ రాయవలసి ఉంటుంది.
10వ తరగతి ఒరిజినల్స్, ఇతర ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో 19వ తేదీన ఉదయం 10 గం.ల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.
చిరునామా - గ్లోబల్ టెక్నాలజిస్, 207, 2వ ఫ్లోర్, అన్నపూర్ణ బ్లాక్, ఆదిత్య ఎన్‌క్లేవ్, అమీర్‌పేట, హైదరాబాద్.
ఈ మెయిల్ - [email protected]
Other News