private jobs
అధ్యాపక పోస్టులకు ఆహ్వానం
- సెంట్ ఆన్స్ మహిళా కళాశాల (పిజి సెంటర్) వారు, ఎంబిఎ, ఎంసిఎ విభాగాల్లో పనిచేసేందుకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకుల పోస్టుల భర్తీకి అర్హులైన వారినుంచి దరఖాస్తులు కోరుతున్నారు. విద్యార్హతలు, వేతనం ఎఐసిటిఇ నిబంధనల మేరకు ఉంటాయి. న్యూట్రిషన్ మరియు డయెటిక్స్‌లో పిజి డిప్లొమా కోర్సులో బోధించేందుకు అధ్యాపకుల కోసం కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి కలిగినవారు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతోపాటు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలతో 11-07-2012, మధ్యాహ్నం మూడు గంటలలోగా కళాశాల కార్యాల యంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.
చిరునామా : సెంట్ ఆన్స్ మహిళా కళాశాల (పిజి సెంటర్)
(కాథలిక్ క్రిస్టియన్ మైనారిటీ సంస్థ)
(ఎఐసిటిఇ అనుమతి పొందినది. ఉస్మానియా యూనివర్సి టీకి అనుబంధం.)
సంతోష్‌నగర్ కాలనీ, మెహదీపట్నం, హైదరాబాద్-28.
- కెఆర్‌కె రెడ్డి డిఇడి కళాశాలవారు, ఒక ప్రిన్సిపాల్, ఇంగ్లీషూ, తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఎడ్యుకేషన్ (ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ) విభాగాల్లో అధ్యాపకు లుగా పనిచేసేందుకు అర్హులైనవారినుంచి దరఖాస్తులు కోరు తున్నారు.
అర్హతలు :
ప్రిన్సిపాల్ : ఎంఎ/ఎంఎస్‌సి/ఎంఇడి/పిహెచ్.డితో కలిపి ఐదేళ్ళపాటు డిఇడి కళాశాలలో పనిచేసిన అనుభవం ఉండాలి.
అధ్యాపకులు : ఎంఎ/ఎంఎస్‌సి/ఎం.ఇడిల్లో 55% మార్కుల తో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఎం.పి.ఇ.డి, ఎంఎ/ఎంఎస్‌సి/బి.ఇడిలతో ఐదేళ్ళపాటు పాఠశాలలో పనిచేసిన అనుభవం ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు 07-07-2012 లోగా తమ దరఖాస్తులు పంపుకోవచ్చు.
చిరునామా : కెఆర్‌కె రెడ్డి డి.ఇడి కళాశాల
అంకిరెడ్డిపల్లి నగామం), కీసర(మండలం), రంగారెడ్డి జిల్లా - 501301.
నగరంలో కార్యాలయ చిరునామా : 3-5-4/ఎ, ఇందిరా నగర్, రామంతపూర్, హైదరాబాద్ - 500013.
ఈ మెయిల్ : [email protected]
- శ్రీ మేథ సంస్థల వారు ఈ దిగువ పేర్కొన్న బోధన / బోధనేతర పోస్టుల భర్తీకి అర్హులైన వారినుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
1. సీనియర్ టీచింగ్ స్టాఫ్ : ఎ. ఎకనామిక్స్, బి. కామర్స్.
2. జూనియర్ టీచింగ్ స్టాఫ్ : ఎ. మ్యాథ్స్, బి. ఎకనామిక్స్, సి. కామర్స్.
3. బోధనేతర సిబ్బంది : ఎ. వార్డెన్ (పురుషులు మరియు మహిళలు)
చిరునామా : 39, 40 భాగ్యనగర్ ఫేజ్-2, వాటర్ ట్యాంక్ సమీపంలో, అర్జున్ థియేటర్ ఎదురుగా, కెపిహెచ్‌బి కాలనీ, హైదరాబాద్-72.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు, తమ బయోడేటాతో వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. లేదా ఈ దిగువ పేర్కొన్న ఈ మెయిల్‌కు బయోడేటాను పంపవచ్చు.
ఈ మెయిల్ : [email protected]
వెబ్‌సైట్ ః www.srimedhav.com
- ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ దిగువ పేర్కొన్న పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతున్నది.
సూపర్‌వైజర్ : సెంట్రింగ్ పని, రియిన్‌ఫోర్స్‌మెంట్, కాంక్రీటింగ్ పనుల కోసం.
ఇన్‌చార్జ్ : ఆర్‌సిసి నిర్మాణాలు, సాంకేతిక సూపర్‌వైజర్లు/ నాన్ టెక్నికల్ సిబ్బంది, నిర్మాణ పనులకోసం.
ల్యాండ్ స్కేప్ ఆగ్రికల్చరిస్ట్ : ఎగ్రికల్చర్‌లో డిప్లొమా లేదా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఐదేళ్ళ కనీసానుభవం ఉండాలి.
డ్రాఫ్ట్స్‌మన్ మరియు కో ఆర్డినేటర్ : డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్ / సివిల్ పూర్తి చేసి ఐదేళ్ళ అనుభవం కలిగివుండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు కార్యాలయం పనిచేసే రోజుల్లో ఉదయం 11 గంటలనుంచి సాయంత్రం 5 గంటలలోగా వాకిన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. లేదా బయోడేటాను ఈ దిగువ ఈ మెయిల్ అడ్రస్‌కు పంపాలి.
ఈ మెయిల్ : [email protected]
చిరునామా : మహింద్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్.,
405 ఆదిత్య ట్రేడ్ సెంటర్,
అమీర్‌పేట్, హైదరాబాద్ - 38.
Other News