Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> jobs Admissions
ప్రభావంతంగా రెస్యూమ్

resume-h talangana patrika telangana culture telangana politics telangana cinema
అక్షరాలు గుండ్రంగా ఉంటే చూడటానికి బాగుంటుంది. అలాగే బయోడేటా అందంగా కనపడితే ‘తొలిచూపు’లోనే ఆకర్షిస్తుంది. ఆ చూపులు అక్షరాల వెంట పరుగు పెట్టాలంటే విషయం చదివించగలగాలి. దానికి క్రమపద్ధతిలో ఒకదానివెంట మరొకటి పాయింట్లుగా రాయాలి. అప్పుడే ‘‘బయోడేటా’’ సమ్మోహనాస్త్రమవుతుంది.


సాఫ్ట్‌వేర్ వేగం, పాశ్చత్య ఒరవడి, విదేశీ, భారీ సంస్థల ఆర్భాటాల మధ్య వింటి నుంచి సంధించిన బాణంలా దూసుకువెళ్ళి చేరవలసిన కంపెనీని అందుకోవాలంటే ‘బయోడేటా’ సమగ్రంగా ఉండాలి. నచ్చిన ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి పక్కన పెట్టి ముందు బయోడేటాని వ్యక్తిగత, అనుభవపూర్వక విషయాలతో వెల్లడించాలి. అలాంటి బయోడేటాని ప్రతి కంపెనీ కోరుకుంటుంది.
- కరిక్యులమ్ వీటే, రెస్యూమ్‌గా పిలిచే బయోడేటా ప్రభా వితం చేసే విధంగా ప్రతిభావంతంగా ఉండాలి.
- కెరీర్ ధ్యేయం, లక్ష్యాలు, బయోడేటాలలో కనిపించాలి.
- ఏ అంశాలలో పట్టు ఉంది, బలహీన సబ్జెక్టులపై ప్రావీణ్యం సంపాదించేందుకు ఏం చేస్తున్నారు, కొత్త చదువులు ఏం చదువుతున్నారు మొదలైనవి రాయాలి.
- షార్ట్‌కట్‌లో, అబ్రివేషన్ల రూపంలో రాస్తే అవతలివారికి అర్థంకావు. అందుకని వివరంగా రాయాలి.
- ప్రతి అంశంలోనూ ఉత్సాహం తొణికిసలాడే విధంగా బయోడేటా ఉండాలి. అంటే సంస్థకు ఏ ఒక్క వర్క్ విషయంలోనే కాకుండా అప్పగించే ప్రతి పనిలోనూ ఆసక్తి చూపి బాధ్యతగా చేస్తామనే విశ్వాసం తేవాలి.
- కొత్త సంగతులు నేర్చుకుంటామనీ, మానసికంగా సానుకూలవైఖరితో వ్యవహరిస్తామనే ఆలోచనలు బయోడేటాలో గోచరించాలి.
- చేసే పనిలో నమ్మకం, వినయం, విధేయత, విజ్ఞాన అభివృద్ధి ఉంటాయన్న సంగతులు సంస్థ నిర్వాహ కులకు అర్థం కావాలి.
- బయోడేటాలో రాసే విషయాలు పై అధికారులకి విన్నవిస్తున్నట్లుగా ఉండాలి. బెదిరిస్తున్నట్లో, హెచ్చరి స్తున్నట్లో భావం స్ఫూరించకూడదు.
- అభ్యర్థనాభావం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. ఆ దృక్పథంతో బయోడేటా ఉంటే కాల్ లెటర్లు పిలవకే వస్తాయి.

ముందుచూపుతో ఆధునికీకరణ
ఇంటర్నెట్‌లో విభిన్న బయోడేటాలు దర్శనమిస్తుంటాయి. కొన్ని సంస్థలు వీటిల్లో రకాలు తయారు చేయడంతో మెళకువలు తెలుపుతున్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలలో సైతం అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వివిధ యోడేటాలు పరిశీలిస్తే అనేక కొత్త సంగతులు తెలుస్తాయి.
ఇప్పటికిప్పుడు బయోడేటా అవసరం రాకపోవచ్చు. అయితే ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు అప్లై చేస్తున్నప్పుడు బయోడేటా తప్పక కావాలి. మనమేం చేయాలనుకుంటున్నామో, ఎక్కడ చదువుకున్నామో తదితర వివరాలను మనం చెప్పకనే ఎదుటివారికి మన గురించి వివరించి అవకాశాలను ఇంటి ముందుకు తెస్తాయి. ఉద్యోగాల వేటలోకి వెళ్ళకముందే బయోడేటా సిద్ధం కావాలి. లేకుంటే హడావుడిగా అప్పటికప్పుడు మొదలుపెడితే నష్టం మనకే.

ఎప్పుడు పంపాలి ?
ఉద్యోగ ప్రకటన పడినప్పుడు బయోడేటాలను పంపటం సర్వసాధారణం. అయితే భవిష్యత్తు గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని పెద్ద కంపెనీలలో ప్రవేశించాలని భావిస్తే బయోడేటాను ప్రకటన లేకపోయినా పంపవచ్చు. బయోడేటాలో పొందు పరిచిన సబ్జెక్ట్స్, అనుభవం మొదలైనవి పరిశీలించి సిబ్బంది నియామక మేనేజర్ ఆర్డర్‌లో ఫైల్ చేస్తారు. అవసరం ఏర్పడిన వెంటనే కాల్ లెటర్ పంపుతారు.

ఉద్యోగానుభవ వివరణ
ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తుంటే దానికి ఉపయోగపడే అనుభవం ఉంటే వివరించండి. ఉదాహరణకు మీరు అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకి దరఖాస్తు చేస్తున్నారనుకోండి వాళ్ళు కనీసం 3 సంవత్సరాల అనుభవం కావా లన్నారు. కానీ మీకు ఆ ఫీల్డులో రెండేళ్ళ అనుభవం మాత్రమే ఉంది. అంటే సంవత్సరం తగ్గుతోంది కదా అని నిరుత్సాహ పడనవసరంలేదు. ఎందుకంటే సంవత్సరాలు తక్కువైనా ఏయే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారో మీకు తెలుసు. కాబట్టి దరఖాస్తులో మీ విషయ పరిజ్ఞానాన్ని పేర్కొంటే సరిపోతుంది.

అనుభవం లేనప్పుడు
కొత్తగా ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నారు. ఉదాహర ణకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్నికల్ సబ్జెక్ట్ కంటెంట్ రైటర్‌పోస్టుకి వచ్చిన ప్రకటన చూశారు. రెండేళ్ల అనుభవం కోరారు. కొత్తగా డిగ్రీ అయింది. ప్రకటించిన కంపెనీ మంచిది. ఆ అనుభవం లేకపోయినా డిగ్రీలో ఫైనల్ సెమిస్టర్‌లో ఒక కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేశారు. ఇప్పుడు బయోడేటాలో ఆ విషయాలను రాస్తే సంబంధిత సిబ్బంది తమకు ఉపకరిస్తారని గ్రహించినపుడు ఇంటర్వ్యూకి పిలుస్తారు. వీలుకానపుడు భవిష్యత్తులో పనికి వస్తుందని బయోడేటా భద్రం చేస్తారు.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine