Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, June 19, 2013
 


Home >> jobs Admissions
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి

win-group-2 talangana patrika telangana culture telangana politics telangana cinemaఇదీ సిలబస్ -
1. సమాజ వికాస ప్రయోగం
2. మూడంచెల పంచాయతీరాజ్
3. 73వ,74వ రాజ్యాంగ సవరణలు-వాటి అమలుః

నవ భారత నిర్మాణంలో, ప్రజాస్వామ్య వికేంద్రీకరణలో పంచాయితీరాజ్ విప్లవాత్మక సోపానం. ప్రజలపై అధికారానికి బదులుగా ప్రజలకే అధికారం కల్పించే అట్టడుగు స్థాయిలో ‘ప్రజాస్వామ్య నారుమడి’ పంచాయతీరాజ్ దీన్ని పూర్తిగా అవగాహన చేసుకోవటంతో పాటు చారిత్రక నేపథ్యం, వివిధ కమిటీలు వాటి సిఫారసులు గురించి, సీట్ల రిజర్వేషన్లు, అధికరణాలు, అమలు తీరు గురించి చదవాలి.
1. భారత్‌లో పంచాయితీరాజ్ అంటే? ( )
1) స్థానిక ప్రభుత్వ పాలన
2) గ్రామీణ పాలన
3) గ్రామీణ స్థానిక స్వయం పాలన
4) స్థానిక పాలన
2. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి ‘స్వరాజ్’ అంటే?
1) స్వయం పాలన 2) మాస పత్రిక ( )
3) రేడియో కార్యక్రమం 4) ‘సాప్ట్‌వేర్’
3. స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రం స్థానిక సంస్థల్లో గణనీయమైన మార్పులు చేసి ‘‘జనపథ’’ వ్యవస్థను ప్రవేశపెట్టింది?
1) రాజస్థాన్ 2) కేరళ ( )
3) మధ్యప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్
4. జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు కూడా ఏ రాష్ట్రంలో పంచాయితీరాజ్ ఎలక్షన్లు జరిపారు?
1) రాజస్థాన్ 2) గుజరాత్ ( )
3) కేరళ 4) పశ్చిమ బెంగాల్
5. 73వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాను రూపొందించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్?
1) మధు దండావతే 2) మొరార్జీ దేశాయ్ ( )
3) సుష్మా స్వరాజ్ 4) సాధురాం మిర్ధా
6. పంచాయితీ సభ్యులకు ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే అనర్హత నిబంధన ఏ రాష్ట్రంలో ఉంది.? ( )
1) బీహార్ 2) తమిళనాడు
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
7. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్ తప్పని సరి చేసిన రాష్ట్రం?
1) రాజస్థాన్ 2) కేరళ ( )
3) గుజరాత్ 4) ఆంధ్రప్రదేశ్
8. యాక్టు 11, 2011 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్త పరిధిలోకి ఎవరు వస్తారు? ( )
1) జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ మరియు సభ్యులు
2) మండల్ పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సభ్యులు
3) గ్రామసభ సర్పంచ్, ఉపసర్పంచ్, సభ్యులు
4) పై వారందరు
9. జాతీయ పంచాయితీ దినోత్సవం ఎప్పుడు జరుపు కుంటారు? ( )
1) మార్చి 24 2) ఏప్రిల్ 24
3) మే 24 4) ఏప్రిల్ 23
10. ఈ క్రింది వాటిలో గ్రామం అంటే? ( )
1) పంచాయతీ ఉన్న గ్రామం
2) కలెక్టరుచే గుర్తించబడింది
3) శాసన సభచే గుర్తించబడింది
4) గవర్నర్ చేత నోటిఫై చేయబడింది
11. నిర్ణిత కాల పరిమితి ముగియు టకు ముందే ఒక పంచాయితీ రద్దుకాబడి, నూతన పంచాయితీ ఏర్పడినప్పుడు? ( )
1) నూతన పంచాయితీ కాలపరిమితి 5 సంవత్సరాలు
2) 5సం॥ కాల పరిమితిలో మిగిలిన కాలానికి మాత్రమే కొనసాగుతుంది
3) నూతన పంచాయితీ కాల పరిమితిని రాష్ట్ర శాసన సభ నిర్ణయిస్తుంది
4) 3 సం॥
12. మన రాష్ట్రానికి సంబంధించి పంచాయితీ సభ్యుల అనర్హతను విచారించు అధికారం? ( )
1) హై కోర్టు 2) రాష్ట్ర ఎన్నికల సంఘం
3) సెషన్స్ కోర్టు 4) మున్సిఫ్ కోర్టు
13. షెడ్యూల్డు కులములకు సీట్ల రిజర్వేషన్‌కు సంబంధించి 243-డి అధికరణం ఏ రాష్ట్రానికి వర్తించును?
1) జమ్ము & కాశ్మీర్ 2) అస్సోం ( )
3) మేఘాలయ 4) అరుణాచల్ ప్రదేశ్
14. ఏ రాష్ట్రంలో పంచాయితీ రాజ్ స్థానంలో ‘‘ట్రైబల్ కౌన్సిల్’’ పని చేస్తుంది?
1) అస్సోం 2) మేఘాలయ ( )
3) ఓడిశా 4) బీహార్
15. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థ ఎవరికాలంలో ప్రవేశ పెట్టారు? ( )
1) దామోదరం సంజీవయ్య 2) పి.వి. నరసింహరావు
3) నీలం సంజీవరెడ్డి 4) బూర్గుల రామకృష్ణారావు
16. ఏ రాష్ట్రంలో /రాష్ట్రాలలో పంచాయితీ సమితి కాల పరిమితి 3 సం॥ మాత్రమే ఉంది?
1) బీహార్ 2) హర్యానా ( )
3) అసోం 4) పై అన్ని రాష్ట్రాలలో
17. ఏ రాష్ట్రంలో గ్రామ,మండల, తాలుకాకు, జిల్లా స్థాయి అనే నాల్గంచెల పంచాయితీ రాజ్ వ్యవస్థ అమలులో ఉంది?
1) తమిళనాడు 2) కేరళ ( )
3) పశ్చిమ బెంగాల్ 4) కర్నాటక
18. మండల వ్యవస్థకు సంబంధించిన బిల్లును మన రాష్ట్ర శాసన సభ ఎప్పుడు ఆమోదించింది?
1) 1984 2) 1985 ( )
3) 1986 4) 1993
19. ఆ్రంధప్రదేశ్‌లో మున్సిపాలిటి చట్టం ఎపుడు అమలులోకి వచ్చింది?
1) 1953 2) 1965 ( )
3) 1989 4) 1993
20. ఈ క్రింది ఏ రాష్ట్రంలో పంచాయితీ న్యాయ అధికారాలను కలిగి ఉంది?
1) ఆంధ్రప్రదేశ్ 2) బీహార్ ( )
3) పశ్చిమ బెంగాల్ 4) జమ్ము & కాశ్మీర్
21. పంచాయితీరాజ్ వ్యవస్థ ప్రాథమిక సూత్రం?
1) వికేంద్రీకరణ
2) ప్రజాస్వామ్య కేంద్రీకరణ
3) ప్రజాస్వామ్య వికేంద్రీకరణ
4) రాజకీయ వికేంద్రీకరణ
22. న్యాయ పంచాయితీల ఏర్పాటును సిఫారసు చేసిన కమిటి?
1) రాజగోపాల్ 2) అశోక్ మెహతా ( )
3) జి.వి.కె రావు 4) ఎల్.ఎం. సింఘ్వీ
23. 11వ షెడ్యుల్‌లో కేటాయించబడిన విధులు? ( )
1) 18 విధులు 2) 29 విధులు
3) 34 విధులు 4) 27 విధులు
24. జిల్లా ప్రణాళికా మండలి గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ తెలియ చేస్తుంది? ( )
1) ఆర్టికల్ 243 2) ఆర్టికల్ 243 డి
3) ఆర్టికల్ 243 జెడ్.డి 4) ఆర్టికల్ 243 జెడ్. ఈ
25. క్రింది వాటిలో పంచాయితీరాజ్ సంస్థలకు సంబంధించిన కమిటి?
1) బల్వంతరాయ్ మెహతా కమిటి ( )
2) అశోక్ మెహతా కమిటి
3) జి.వి.కె రావు కమిటి 4) అన్నీ
26. స్థాయి సంఘాలు వేటిలో ఉంటాయి?
1) జిల్లా పరిషత్ 2) మండల ప్రజా పరిషత్
3) గ్రామ పంచాయితీ 4) 1&2
27. మున్సిపాలిటి ఎన్నికలలో పోటి చేయుటకు కనీస వయో పరిమితి?
1) 25 సం॥ 2) 21 సం॥ ( )
3) 18 సం॥ 4) 30 సం॥
28. 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తించని ప్రాంతాలు?
1) నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ ( )
2) నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ
3) నాగాలాండ్, అసోం, మిజోరాం
4) జమ్ము&కాశ్మీర్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ

ఇతర ముఖ్యమైన అంశాలు - చారిత్రక నేపథ్యం
- 1687 -దేశంలో మొదటిసారిగా మద్రాసులో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు.
- 1726- బొంబాయి, కలకత్తా నగరాలలో మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు.
- 1864 - లార్డ్ లారెన్స్ తీర్మానం స్థానిక స్వపరిపాలన సంస్థల స్థాపనకు పురికొల్పింది
- 1870 - లార్డ్ మోయో తీర్మానం ఆర్థిక వికేంద్రీకరణ తీర్మానంగా పేరెన్నిక గన్నది
- 1882 - లార్డ్ రిప్పన్ కాలంలో చేసిన తీర్మానం స్థానిక స్వపరిపాలన సంస్థల పట్ల ‘‘మాగ్నాకార్టా’’గా అభివర్ణిస్తారు
- 1907 - పాలన వికేంద్రీకరణ కోసం ‘హరోబ్‌హౌస్’ నాయకత్వంలో రాయల్ కమిషన్ ఏర్పాటు
- 1919 - మాంటేగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనను ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలో చేర్చారు.
- 1924 - కంటోన్మెంటు బోర్డుచట్టం రూపొందించారు.
- 1935 - భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనను ప్రొవెన్షియల్ జాబితాలో చేర్చారు
- 1952 - సామాజిక అభివృద్ధి కార్యక్రమం
- 1953 - నేషనల్ ఎక్స్‌టెన్షన్ సర్వీస్
- 1957 - బల్వంతరాయ్ మెహతాకమిటి- మూడంచెల పంచాయితీ వ్యవస్థకు సిఫారసు
- 1959 - పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం
- 1977 - అశోక్ మెహతా కమిటి- రెండంచెల పద్ధతికి సిఫారసు
- 1986- ఎల్.ఎమ్. సింఘ్వీ కమిటి- పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించాలని సిఫార్సు.

74వ రాజ్యాంగ సవరణ చట్టం - పట్టణ నగర పాలక సంస్థలు
(విభాగము-9A, అధికరణం 243p నుండి ZGవరకు) 243-P నిర్వచనములు
- మెట్రో పాలిటన్ ప్రాంతం - 10 లక్షలు/అంతకన్న ఎక్కువ జనాభా కల్గిన ప్రాంతం. అందుకు సంబంధించి గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేయవల్సి ఉంటుంది.
243-Q - మూడంచెల మున్సిపాలిటిల వ్యవస్థ
- నగర పంచాయితీ - గ్రామీణ ప్రాంత స్థాయి నుండి పట్టణ ప్రాంతంగా పరివర్తన చెందుతున్న ప్రాంతం
- మున్సిపల్ కౌన్సిల్ - చిన్న పట్టణ ప్రాంతాలలో ఏర్పాటు
- మున్సిపల్ కార్పోరేషన్లు - బాగా విస్తరించిన పట్టణాలకు.
243-R - మున్సిపాలిటిల నిర్మాణం, ఎన్నికలు
243-S - వార్డు కమిటిల ఏర్పాటు
- 3 లక్షలు లేక అంతకన్నా ఎక్కువ జనాభా కల్గిన మున్సిపాలిటిలలో వీటిని ఏర్పాటు చేస్తారు.
243-T - సీట్ల రిజర్వేషన్
243-U - మున్సిపాలిటిల కాల పరిమితి
243-V - సభ్యత్వానికి అనర్హతలు
243-w - మున్సిపాలిటీల అధికారములు, బాధ్యతలు

12వ షెడ్యూల్‌లో 18 విధులను నిర్దేశించారు.
243-X మున్సిపాలిటీల ఆదాయవనరులు
243-Y -మున్సిపాలిటీల ఆర్ధిక స్థితి సమీక్షకు రాష్ట్ర ఆర్థిక సంఘం
243-Z - అకౌటింగ్ మరియు ఆడిటింగ్
243-ZA - మున్సిపాలిటిల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం
243-ZB - కేంద్ర పాలిత ప్రాంతములకు వర్తింప చేయుట
243-ZC - ఈ విభాగం నుండి కొన్ని ప్రాంతములకు మినహాయింపు
243-ZD - జిల్లా ప్రణాళిక సంఘం ఏర్పాటు
243-ZE - మెట్రో పాలిటన్ ప్రణాళిక సంఘం ఏర్పాటు
243-ZF - పాత శాసనాలు సంవత్సరం కాలం వరకు కొనసాగింపు
243-ZG - న్యాయస్థానం జోక్యంపై పరిమితులు

ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు

1. ఎవరి హయాంలో పంచాయితీలకు రాజ్యాంగ హోదా కలిగింది ? నగూప్-2, 2012 లిమిటెడ్)
1. రాజీవ్‌గాంధీ 2. చంద్రశేఖర్ ( 4 )
3. వి.పి.సింగ్ 4. పి.వి. నరసింహారావు
2. పంచాయతీరాజ్ వ్యవస్థని రాజ్యాంగంలో ఏ అధికర ణంలో పొందుపరిచారు ? ( 3 )
నగూప్-2, 2012 లిమిటెడ్)
1. 123వ అధికరణం 2. 300వ అధికరణం
3. 243వ అధికరణం 4. పైవేవీ కావు
3. 73వ రాజ్యాంగ సవరణ ఎన్ని అంచెల పంచాయతీ విధానాన్ని ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది ? ( 1 )
నగూప్-2, 2012 లిమిటెడ్)
1. మూడు 2. నాలుగు
3. రెండు 4. ఒకటి
4. రాజ్యాంగంలో 73వ సవరణ ద్వారా చేర్చిన కొత్త భాగం ? నగూప్-2, 2011) (1 )
1. IX 2. X
3. XI 4. XII
5. పంచాయితీల ఏర్పాటు ఏ ఆదేశిక సూత్రం ప్రకారం ఏర్పడింది.? నగూప్-2, 2011)
1. 34 అధికరణం 2. 38 అధికరణం ( 4 )
3. 39 అధికరణం 4. 40 అధికరణం

73వ రాజ్యాంగ సవరణ చట్టం
- 243-A - గ్రామ సభ ఏర్పాటు
- 243-B - మూడంచెల పంచాయితీల వ్యవస్థాపన
- 243-C - పంచాయితీల నిర్మాణము, ఎన్నికలు
- 243-D - పంచాయితీలలో సీట్ల రిజర్వేషన్
- 243-E - పంచాయితీల కాల పరిమితి
- 243-F - పంచాయితీ సభ్యుల అనర్హతలు
- 243-G - పంచాయితీల అధికారాలు, బాధ్యతలు
- 243-H - పంచాయితీలకు ఆదాయ వనరులు
- 243-I - రాష్ట్ర ఆర్ధిక సంఘం ఏర్పాటు
- 243-J - పంచాయితీల ఖాతాల ఆడిటింగ్
- 243-K - రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు
- 243-L - కేంద్ర పాలిత ప్రాంతములకు అన్వయించుట
- 243-M - ఈ విభాగము వర్తించని ప్రాంతములు
- 244(1) లో పేర్కొన్న షెడ్యూల్డ్ మరియు ఆదివాసి ప్రాంతములు
- 243-N - అప్పటికే ఉన్న పంచాయితీ చట్టాలు సంవత్సరం కాలం వరకు కొనసాగింపు
- 243-O - న్యాయస్థానముల జోక్యముపై పరిమితులు


 answer0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine