|
|
దూసుకొస్తున్న కెరీర్ రోబోటిక్ ఇంజనీర్
రోబోలు... ప్రస్తుతం దాదాపుగా ప్రతి రంగంలోనూ వీటిని వినియోగిస్తున్నారు. మనుషులు చేసే పనులను ఈ మరమను షుల ద్వారా చేయిస్తున్నారు. వాస్తవానికి యాంత్రికంగా అవి పని చేస్తున్నా, వాటికి సరైన దిశానిర్దేశనం మాత్రం మనుషులు చేయాల్సిందే. ఇందుకు అవసరమైన సాంకేతిక ఆదేశాలను వాటికి ఇవ్వడంలో ఇంజనీర్ల కృషి ఎంతో ఉంటుంది. సాంకేతి క పరిజ్ఞానం రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో రోబో టిక్స్ ఇంజనీ రింగ్‌కు మంచి క్రేజ్ ఉంది. మనదేశంలో రోబోటిక్స్ ఇంజనీరింగ్ కోర్సులను అందిస్తున్న కాలేజీలు, కోర్సులు, చదువు పూర్తయ్యాక ఉద్యో గావకాశాలు, కెరీర్ ఎలా ఉంటుందో చూద్దాం.
రోబోట్ అంటే ఏమిటి? మెటీరి యల్స్, విడిభాగాలు, పనిముట్లు లేదా ప్రత్యేకంగా రూపొందించిన వస్తువులను వివిధ ప్రోగ్రాముల ద్వారా తీసుకెళ్తూ, పలు లక్ష్యాల కోసం ఉపయోగపడేలా తయారు చేసిన పరికరమే రోబోట్ అని రోబోట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా (1979) చెప్తోంది.
తొలి రోబో యునిమేట్ మనుషులకు కష్టతరమైన పనులను యంత్రాల ద్వారా సులభంగా చేయించుకోవాలన్న ఆలోచన రావ డంతో ఆ దిశగా అడుగులు పడ్డాయి. 1956లో ప్రముఖ ఇన్వెన్టర్, పారిశ్రామిక వేత్త జార్జి సి డేవోల్, ఇంజనీర్ జోసెఫ్ ఎఫ్ ఏంజెల్‌బెర్జర్ మధ్య జరిగిన చారిత్రాత్మక భేటీ రోబోట్స్ రూపకల్పనకు రంగం సిద్ధం చేసింది. అనంతరం బెర్జర్ ఏర్పాటు చేసిన కంపెనీ ‘యునిమేషన్’ నుంచి తొలి రోబో తయారైంది. వీటికి ఆయన పేటెంట్ హక్కులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోబోకు ‘యునిమేట్’ అని పేరు పెట్టారు. రోబోలను ప్రపంచానికి పరిచయం చేసిన ఏంజెల్‌బెర్జర్‌ను ‘రోబోల పితామహుడు’గా పిలుస్తున్నారు. ఈ యునిమేట్ రోబోలను జనరల్ మోటార్స్‌లో వేడి ఎక్కువగా ఉండే డై కాస్టింగ్ పని ప్రదేశంలో వినియోగించారు. దీంతో డైకాస్టింగ్ ప్రదేశాల్లో పని కోసం అనంతరం పలు రోబోలు అమ్ముడుపోయాయి.
 మనుషుల స్థానంలో మరమనుషులతో పని చేయించుకోవడం వల్ల డబ్బులు ఆదా కావడంతోపాటు వాటిపై విశ్వాసం పెరగడంతో రోబోలకు మంచి డిమాండ్ పెరిగింది. ఆ విధంగా రోబోల వినియోగం పెరిగింది. నేడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పలు రంగాల్లో సేవలు అందిస్తు న్నాయి. మొబైల్ రోబోట్స్, రోలింగ్ రోబోట్స్, వాకింగ్ రోబోట్సో, అటానమస్ రోబోట్స్, రిమోట్ కంట్రోల్ రోబోట్స్‌గా పలు రూపాల్లో నేడు వాటిని వినియో గిస్తున్నారు. రక్షణ, అంతరిక్ష, పారిశ్రామిక, ఇతర సేవల్లో రోబోల వినియోగం పెరిగింది.
ఏయే రంగాల్లో రోబోటిక్స్ ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతిక పరి జ్ఞానంతో మానవ జీవితంలో ప్రతి అంశంలోనూ రోబోలను వినియోగిస్తున్నారు. ఇంకా చెప్పాలం రోబోలను రోబోలే తయారు చేసే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఏయే రంగాల్లో రోబోలను వాడుతున్నారో కొన్ని ఉదాహరణలు చూద్దాం.
- వాణిజ్యం - రిటైల్, సేవలు, ఫీల్డ్స్ - ఇంటి అవసరాలు - పని మనుషులు, కారు శుభ్రం చేయడం, లాన్‌లో గడ్డికోయడం, ఇతర పనులు. - సెక్యూరిటీ - గార్డ్స్, డాగ్ గార్డ్స్, బాంబు స్నిఫర్లు, బాంబు స్వ్కాడ్స్. - సహాయం - భూకంపాలు, తుఫానులు, అడవులు తగులబడడం. - పర్యావరణం - మానవ రహిత విహంగ వాహనాలు. - రవాణా - తేలికపాటి రైలు, కార్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు. - ఆండ్రాయిడ్స్ - అసిస్టెంట్లు, మెంటర్లు, ఎడ్యుకేటర్లు. - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - ఆలోచనా మిషన్లు, సిస్టమ్స్. - మిలటరీ - చిన్న చిన్న ఆయుధాల స్టోర్లు, యు.ఎ.వి.లు
ఈ విధంగా రోబోలతో మరిన్ని పనులు చేయించుకోవచ్చు. రాబోయే రోజుల్లో రోబోల పరిశ్రమకు మెరుగైన భవిష్యత్తు అవకాశాలు న్నాయి.
 కెరీర్ ఎలా ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్‌లో భాగం గా, కొన్ని సంస్థలు రోబోటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా ఆఫర్ చేస్తున్నాయి. ఇంజనీరింగ్ లోని అన్ని బ్రాంచీల మిక్సింగే రోబోటిక్స్. రోబోటిక్స్‌లోకి వెళ్లడానికి మోకానికల్, కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ ఏ బ్రాంచీలోనైనా మంచి ఇంజనీర్‌గా మీరు ఎదగాల్సి ఉంది. రోబోటిక్స్‌పై ఆసక్తి ఉండి, తర్వాతి బిటెక్ కోర్సును ఈ విభాగంలో చేయాలనుకునే వారికి అమెరికాలోని కార్నెజీ మెలాన్ యూని వర్శిటీ బాగుంటుంది. ప్రొఫెసర్ రాజ్ రెడ్డి అధ్యక్షులుగా ఉన్న ఈ యూని వర్శిటీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే బిటెక్ స్థాయిలోనే స్పెషలైజే షన్ చేయడానికి ప్రయత్నిం చవద్దు. బిటెక్ స్థాయిలో ఇంజనీరింగ్‌లోని ఇతర సబ్జెక్టులపై తగిన శ్రద్ధ పెడుతూనే, ఈ రంగం లోని ఫండమెంటల్స్‌పై పట్టు సాధిం చండి. పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో స్పెషలైజేషన్ చేయడా నికి చాలా అవకాశముంది. మీరు పరిశ్రమలోకి వెళ్లి, మాస్టర్స్ డిగ్రీతో రావొచ్చు.
భారత్‌లో ఆఫర్ చేస్తున్న సంస్థలు మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ తో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి రోబోటిక్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆసక్తి ఉన్న వారికి ఇంటర్-డిసిప్లినరీ కోర్సుగా రోబోటిక్స్ కోర్సును అందిస్తున్నారు. దేశంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో స్పెషలైజేషన్‌ను ఆఫర్ చేస్తున్నా, అది తగిన చాయిస్‌గా లేదు. మాస్టర్స్ డిగ్రీ స్థాయిలోనే రోబోటిక్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. మనదేశంలో ఇండియన్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వంటి విద్యా, పరిశోధన సంస్థల్లో రోబోటిక్స్‌పై పనులు ప్రారంభమ య్యాయి. ప్రస్తుతం ఈ రంగానికి యువ ఇంజనీర్లు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి దేశ వ్యాప్తంగా పరీక్షలు కూడా నిర్వహి స్తున్నారు.
ముఖ్యమైన రోబోటిక్ కోర్సులు రోబోల డిజైన్, అప్లికేషన్‌తోపాటు కంప్యూటర్ సాయంతో వాటి ఆపరేషన్, ప్రాసెసింగ్‌ను రోబోటిక్స్ ఇంజనీరింగ్ డీల్ చేస్తుంది. కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్ అప్లికేషన్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, బయోలాజికల్ మెకానిక్స్, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్, తదిత రమైనవి రోబోటిక్స్‌కు అవసరం. రోబోటిక్స్ గురించి చదవాలనుకునే కంప్యూటర్, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థు లకు మాస్టర్, రీసెర్చ్ స్థాయిల్లో రోబోటిక్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నారు.
- ఎంఎస్సీ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో స్పెషలైజేషన్‌తో కంప్యూటర్ సైన్స్). - రోబోటిక్స్‌లో మాస్టర్స్ ప్రోగ్రామ్. - ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్‌లో ఎంటెక్. - రోబోటిక్స్‌లో ఎంఇ. - ఎంఇ కంప్యూటర్ సైన్స్ (రోబోటిక్స్ స్పెషలైజేషన్ సబ్జెక్టుగా) భారత్‌లో రోబోటిక్ కోర్సులు భారత్‌లోని కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు ఎం.టెక్, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో రోబోటిక్స్ కోర్సులకు అవకాశాలు కల్పిస్తు న్నాయి. బిటెక్ స్థాయిలో రోబో టిక్స్‌లో ఫండమెంటల్స్ తెలుసు కుంటే, ఎంటెక్ స్థాయిలో అందులో స్పెషలైజేషన్ చేయొచ్చు. బి.టెక్‌లో సాధ్యమైతే మెకాట్రానిక్స్ చేస్తే రోబోటిక్స్‌కు ఇది దగ్గరగా ఉంటుంది. బాధాకరమైన విషయ మేంటంటే మన ఏడు ఐఐటిల్లో మెకాట్రానిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీని ఏదీ అందించడం లేదు. అయితే కొన్ని ఇతర సంస్థలు ఉన్నాయి.
ఉపాధికి మంచి అవకాశాలు ఈ రంగంలో మంచి కెరీర్‌కు చాలా అవకాశాలున్నాయి. రోబోటిక్స్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ చేస్తే మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్, వ్యవసాయం, మైనింగ్, అణు, విద్యుత్ ప్లాంట్ నిర్వహణతో పాటు చాలా రంగాల్లో మంచి అవ కాశాలుంటాయి. దీంతోపాటు రోబో ల పరిశోధన, అభివృద్ధి (ఆర్&డి)లో వివిధ సెక్షన్లతో కలిపి పనిచేయడానికి నిపుణులు, పరిశోధకు లకు విస్తార మైన అవకాశాలున్నాయి.
మనుషుల స్థానంలో ఈ మర మనుషులతో పనులు చేయించు కోవడం వల్ల ఉపాధి, ఉద్యోగావకా శాలు తగ్గిపోతాయన్న ఆందోళనలు కొందరు వ్యక్తం చేస్తుంటారు. కానీ, వాస్తవానికి రోబోల పరిశ్రమలతో మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడ తాయి. రోబోల తయారీ కంపెనీలు, రోబోటిక్ సిస్టమ్ ఇంటిగ్రేటర్స్, వాణిజ్య అవసరాల కోసం రోబోలను ఉపయోగించడం వల్ల కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ కొత్త ఉద్యోగాల్లో చాలా వరకూ లక్షణపరంగా చూస్తే సాంకేతికమైనవి. వీటికి మెకానికల్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, టెక్నీషియన్లు, ఎలక్ట్రీషియన్లు, ట్రైనింగ్, నిర్వహణ సిబ్బంది అవసరం. కానీ, రోబోటిక్స్‌కు సంబంధించిన ప్రతి పనికీ ఇంజనీరింగ్ డిగ్రీ అవసరం లేదు. సాంకేతికంగా తక్కువ నైపుణ్యం ఉన్న వారికి రోబో పరిశ్రమల వల్ల మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేటివ్, సేల్స్, మార్కెటింగ్, ఇతర కొత్త ఉద్యోగావ కాశాలు లభిస్తాయి. పోటీతత్వాన్ని తట్టుకోవడానికి క్వాలిటీ, సేఫ్టీ, ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కంపెనీలకు రోబోలు ఉపయోగపడతాయి. ఈ విధంగా పెరిగిన ఉత్పత్తి వల్ల కొత్తగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సేల్స్, అడ్మినిస్ట్రేటివ్, ప్రోగ్రామర్స్, ఆపరేటర్స్ తదితర రకాలైన ఉపాధి లభిస్తుంది.

Other News
|
|