రీసెర్చ్ చేయాలంటే ఎలాంటి ఓరియంటేషన్‌తో చదవాలి?
ప్ర - ఏటా 2.5 లక్షల ఖర్చుతో మా అబ్బాయిని ఈ.ఈ.ఈ కోర్సులో చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాను. రూ.10 లక్షలు నాలుగేళ్ళ లో ఖర్చు చేసి ఇంజనీరింగ్ ఈఈఈ కోర్సు పూర్తి చేయించనున్నాను. రాబోయే కాలంలో ఈఈఈ కోర్సు చదివిన అభ్యర్థులకు కెరీర్ పరంగా అవకాశాలు ఏవిధంగా ఉంటాయని భావించ వచ్చు?
- ఎన్. రాంమోహన్‌రెడ్డి, బీబీనగర్.
జ - బి.టెక్ (ఈఈఈ) కోర్సు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సమ్మేళనం. ఒక విధంగా ఈఈఈ కోర్సు ఇ.సి.ఇ, సిఎస్.ఇ, ఐటి కోర్సులకు మూలం. ఈ కోర్సులన్నీ కూడా ఈఈఈ నుంచి పుట్టినవే. ఈ కోర్సు చేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ రంగాలలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రికల్ పవర్ ఉత్పత్తి చేసే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల లోని కంపెనీలలో వీరికి ఉద్యోగ అవకాశాలు మెండు. మన రాష్త్రంలోని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్‌కో, పవర్ డిస్ట్రిబూషన్ కంపెనీలలో ప్రతియేటా రిక్రూ ట్‌మెంట్ జరుగుతుంది. అంతే కాకుండా ఈ మధ్యన పవర్‌ని ఉత్పత్తి చేసే ఎన్నో కంపెనీలు ప్రైవేటు రంగాల్లో ప్రారంభమ య్యాయి. వాటిలో కూడా ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి. ఇవే కాకుండా ఎలక్ట్రానిక్స్, కంప్యూట ర్ రంగాలలోని ఎన్నో ఉద్యోగాలకు వీరు అర్హులు.
ప్ర -
బిటెక్ సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాను. బిటెక్ తర్వాత రీసెర్చ్ కోర్సులు చేయడం నాకు ఇష్టం. బిటెక్ నాలుగేళ్ళ ఇంజనీరింగ్ కోర్సు అధ్యయ నంలో ఎటువంటి ఓరియెంటేషన్‌తో నేను ముందుకు వెళ్ళితే రీసెర్చ్ కోర్సుల లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుందో చెప్పండి?-వి.అనుష్క శ్రీ, దేవరకొండ.
జ రీసెర్చ్ చేయాలనుకోవడం చాలా మంచిది. చాలా కారణాల వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉద్యోగ అవకాశా లకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగు తుంది. కొంత మంది విద్యార్థులు పి.జి.కోర్సుకి వెళ్లిన తరువాత ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవడం జరుగు తుంది.
మీరు మొదట్లోనే రీసెర్చ్ చేయా లని నిర్ణయించుకోవడం మంచిదే. అయితే దానికి గాను ముందు పీజీ కోర్సు చేసి ఆ తరువాత పి.హెచ్.డి చేయవలసి వస్తుంది. ఈ కార్యక్రమం చాలా పట్టుదల, కృషి, ఏకాగ్రతతో చేయవలసి ఉంటుంది. అంతే కాకుండా దీనికి పి.జి తరువాత కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అయితే ఒక్కసారి పి.హెచ్.డి చేసిన తరువాత అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఒక వేళ మీరు రీసెర్చ్ చేయాలనుకుంటే మీ పాఠ్యాంశాలను బాగా చదువుకొని సబ్జెక్టుపై మంచి పట్టు సాధించాలి. అంతేకాకుండా మీరు ఏ సబ్జెక్టు అంశంలోనైతే రీసెర్చ్ చేయాలనుకున్నారో ఆ సబ్జెక్టులోని మార్పులను, అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసు కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విష యాలన్నీ తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా జర్నల్స్‌ని అధ్యయనం చేయడం, కాన్ఫరెన్స్‌లు, వర్క్‌షాప్‌లు, సెమినార్ల లో పాల్గొనడం మొదలైన వాటి ద్వారా ఆయా సబ్జెక్టుల్లో కొత్త విషయాలు గమనిస్తూ ఉండాలి.
Other News