|
|
అభ్యసనా విధానాలను నిర్ణయించే సమ్మిళిత విద్య
డియస్‌సి పరీక్షా విధానంలో విద్యా దృక్పథాలు నూతన పాఠ్య విషయం. సమ్మిళిత విద్య అనే పాఠ్యాంశంలో విద్యార్థులలో వివిధ స్థాయిలు గల పిల్లలకు అందివ్వాల్సిన విద్యా విధానాలు గురించి ప్రశ్నలుంటాయి. ముఖ్యంగా మానసిక వైకల్యం గల పిల్లలకు అందించాల్సిన విద్యావిధానాలు, వివిధ శాస్త్రవేత్తల నిర్వచనాలు, వివిధ అభ్యసన మూల్యాంకన నికషలు, అభ్యసన వైకల్య రకాలు వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. 1. జాతీయ అక్షరాస్యతా ఉద్యమ కార్యక్రమం ద్వారా భారతదేశంలో 15 సం. నుంచి 35 సం॥ వయస్సు మధ్య ఉన్న ఎంత మంది నిరక్షరాస్యత గలవారిని అక్షరాస్యులుగా చేయడానికి పూనుకున్నారు? ( ) 1. 50 మిలియన్లు 2. 60 మిలియన్లు 3. 70 మిలియన్లు 4. 80 మిలియన్లు 2. సమ్మేళిత విద్యలో వైకల్యాల రకాలలో లేనివారు? ( ) 1. బహుళవైకల్యం గల వారు 2. మానసిక వైకల్యం గల వారు 3. అభ్యసన వైకల్యం గల వారు 4. పై ఏదీ కాదు 3. ఎవరి నిర్వచనం ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల తెలివి తేటలు వారి సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి? ( ) 1. వెష్లర్ 2. లూయీస్ 3. సెరాసన్ 4. కోబర్టీస్ 4. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్.సి.ఐ) చట్టము ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? ( ) 1. 1992 2. 1993 3. 1994 4. 1995 5. ఏ సమావేశం ద్వారా ‘‘అందకీ విద్య’’ అనే నినాదంతో 2000 సంవత్సరంలో ‘‘ప్రాథమిక విద్య- ప్రాథమిక హక్కు’’ అనే అంశంను ముందుకు తీసుకుని రావటం జరిగింది? ( ) 1. ఫ్రాన్స్ సమావేశం 2. డాకర్ సమావేశం 3. బర్మా సమావేశం 4. బొంబాయి సమావేశం 6. చలన సంబంధ వైకల్యాల దృష్ఠ్యా బాధపడుతున్న వారి కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడికల్లి హ్యండీకాప్డ్ (ఎన్.ఐ.ఓ.పి.హెచ్)ని ఎక్కడ నెలక్పొరు? 1. మైసూర్ 2. బెంగుళూరు ( ) 3. కలకత్తా 4. ముంబాయి 7. ఎవరి స్కేలు ప్రకారం అధ్యయన పరీక్షలలో వచ్చిన పాయింట్స్ వరుసగా 68,70 వచ్చిన వ్యక్తులను మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు? ( ) 1. బాటియా 2. వెష్లర్ 3. లైకర్ట్ 4. యాంగ్ 8. ఎన్.ఎస్.ఎస్.ఓ లెక్కల ప్రకారం మనదేశ జనాభాలో ఎంత మంది వికలాంగులు ఉన్నారని అంచనా? 1. 18,491,000 2. 16,498,000 3. 19,483,000 4. 15,497,000 9. 1990 సంవత్సరంలో ఎక్కడ జరిగిన ప్రపంచ సదస్సు ‘ అందరికీ విద్య’ను ప్రాథమిక హక్కుగా ప్రకటించారు? 1. డాకర్ సమావేశం ( ) 2. జోమ్ తియన్ సమావేశం 3. మయన్మార్ సమావేశం 4. యు.ఎన్.ఓ. సమావేశం 10. ‘‘వెష్లర్ స్కేలు’’ విధానం ప్రకారం ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలలో మానసిక వైకల్యం లక్షణాలు తెలుస్తాయి? ( ) 1. 12 సం॥ 2. 14సం॥ 3. 16 సం॥ 4. 18 సం॥ 11. మానసిక వైకల్యం గల పిల్లల వ్యక్తిగత విద్యా ప్రణాళిక సూచనలలో ఎన్ని నెలలకు ఒకసారి మానసిక వైకల్య వికాస స్థాయిని అంచనా వేయాలి? ( ) 1. ప్రతి 4 లేదా 6 నెలలకి 2. ప్రతి 8 నెలలకి 3. ప్రతి 7 నెలలకి 4. ప్రతి 2 లేదా 5 నెలలకి 12. మానసిక వైకల్యం ఉన్న విద్యార్థి బోధనలో ప్రత్యేక క్రమ పద్ధతిలో లక్ష్యాలను ఏర్పరచుకోవాలని, విశ్లేషణ ద్వారా బోధించాలని అభివర్ణించినదెవరు? ( ) 1. షోలె (1987) 2. మెకర్థి (1987) 3. సెవరాన్ (1997) 4. డోరిన్‌కేతన్ (1990) 13. వ్యక్తి యొక్క మానసిక ఎదుగుదలను స్థంబింపజేసి వయసుకు సరిపడు తెలివి లేని లక్షణాన్ని ప్రదర్శింపజేసే పరిస్థితిని మానసిక వైకల్యం అని నిర్వచించినదెవరు? 1. యు.ఎస్.ఓ - 1954 2. సెరాసన్ - 1980 ( ) 3. 1935 - చట్టం 4. ఎన్.ఎన్.ఎస్.ఓ 14. సమ్మిళిత విద్య లక్ష్యంలో భాగంగా ఎన్ని రకాలైన వైకల్యాలను అధ్యయనం చేశారు? ( ) 1. 5 రకాలు 2. 6 రకాలు 3. 10 రకాలు 12 రకాలు 15. అభ్యసన వైకల్యం గల వారిలో ఎంత శాతం మంది దాదా పుగా ‘‘బాషా పరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు? 1. 50 % 2. 60 % ( ) 3. 90 % 4. 80 % 16. రాష్ట్రాల వారిగా విశ్లేషణ చూసినట్లయితే ప్రతి లక్ష మందిలో మానసిక వైకల్యం ఉన్న వారి సంఖ్య ఎక్కువగా గల ప్రాంతం ఏది? ( ) 1. జమ్మూ & కాశ్మీర్ 2. లక్షదీవులు 3. డయ్యూ & డామన్ 4. ఢిల్లీ 17. ఎన్.ఎస్.ఎస్.ఓ ప్రకారం 2002 సంవత్సరంలో అంచనా లో అధిక శాతం వైకల్యాలున్న వర్గం సుమారుగా 57% ఎవరున్నారు? ( ) 1. బహుళ వైకల్యాలు 2. అధ్యయన వైకల్యాలు 3. చలన వైకల్యాలు 4. దృష్టి వైకల్యాలు 18. మానసిక వైకల్యం గల వారి సంఖ్య ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? ( ) 1. అరుణాచల్ ప్రదేశ్ 2. సిక్కిం 3. గోవా 4. మిజోరాం 19. ఎవరి అంచనాల ప్రకారం 1997లో 150 మిలియన్ల ప్రజలు దృష్టిలోపానికి గురైనట్లు నివేదించారు? ( ) 1. ఎన్.ఎస్.ఎస్.ఓ 2. 1995 చట్టం 3. యునెస్కో 1935 4. డబ్ల్యు.హెచ్.ఓ 20. సాధారణంగా కూడా ఎంత శాతం మంది పిల్లలకు ఏదో ఒక అభ్యసన వైకల్యం ఉంటుందని అంచనా? 1. 6% 2. 8% ( ) 3. 12% 4. 20% 21. అభ్యసన వైకల్యాలు గల వారిని సమస్య స్థాయిని బట్టి ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ( ) 1. 4 రకాలుగా 2. 6 రకాలుగా 3. 8 రకాలుగా 4. 3 రకాలుగా 22. 2001 జనాభా లెక్కల ప్రకారం బహుళ అంగవైకల్యం గల వారి జనాభా సుమారు ఎంత శాతం ఉన్నారు? ( ) 1. 8 % 2. 10% 3. 12% 4. 15% 23. వివిధ వైకల్యాలున్న వారితో పోల్చినప్పుడు మానసిక వైక ల్యం ఉన్నవారి సంఖ్య మన దేశంలో ఎలా ఉన్నారు? ( ) 1. ఎక్కువగా 2. తక్కువగా 3. సమానం 4. ఏదీకాదు 24. ‘‘అల్ప బుద్దులు’’ గల వారి యొక్క ప్రజ్ఞలబ్ధి సుమారు ఎంత? ( ) 1. 0-25 2. 25-50 3. 50-70 4. 70-90 25. మానసిక వైకల్యానికి సబంధించి క్రింది వాటిలో అపోహ ఏది? ( ) 1. మానసిక వైకల్యం అనేది అంటువ్యాధి 2. ఇది వంశపారంపర్య సమస్య 3. మెదడు యొక్క ఆపరేషన్ చేసి తగ్గించవచచ్చు 4. పైవన్నీ 26. బాగా వినగలుగుతున్న చెవిలో 60 డి.హెచ్.ఎల్ గాని, లేదా అంతకంటే ఎక్కువ లోపం ఉన్నచో వారిని వినికిడి లోపం ఉన్న వైకల్యంగా నిర్వచించినది? ( ) 1. పి.డబ్ల్యు.డి చట్టం (1995) 2. డబ్యు.హెచ్.ఓ (1999) 3. ఎన్.ఎస్.ఎస్.ఓ (2001) 4. యు.ఎన్.ఓ (2000) 27. ఎనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక విద్యార్థి దృష్టి బలహీనత మరియు శ్రవణ బలహీనతతో పాటు బుద్ధి మాంద్యం కలిగి ఉన్నాడు. అయితే ఆ విద్యార్థి ఏ కోవకు చెందిన వైకల్యం కిందికి వస్తాడు? ( ) 1. మానసిక వైకల్యం 2. దృష్టి వైకల్యం 3. బహుళ వైకల్యం 4. అభ్యసన వైకల్యం 28. ఎముకల క్షయవ్యాధి, మూర్చవ్యాధి, పోలియో లాంటి వ్యాధులు చలన వైకల్యాలు అని నిర్వచించినది? ( ) 1. 1995 చట్టం 2. ఐ.డి.ఇ.ఎ. 1997 3. ఎన్.ఐ.ఓ.హెచ్ 1996 4. డబ్ల్యు. హెచ్.ఓ. 29. 12 సంవత్సరాల రాము అనే అబ్బాయికి సాన్నం చెయ్య డం, బట్టలు ఉతకడం, ధరించడం లాంటి విషయా లలో కూడా ఇతరుల సహాయం అవసరం అయితే అతని మానసిక తీవ్రత స్థాయి ఏది? 1. తీవ్ర మానసిక స్థాయి 2. అతి తీవ్ర మానసిక స్థాయి 3. మిత స్థాయి. 4. తక్కువ స్థాయి ( ) 30. మానసిక వైకల్యాలున్న వారి కోసం ఏర్పాటు చేసిన ఎన్.ఐ. ఎమ్.హెచ్ ఉన్న ప్రదేశం ఏది? ( ) 1. మెదక్ 2. సికింద్రాబాద్ 3. జైపూర్ 4. విశాఖపట్నం 31. ఒక వ్యక్తి చికిత్స అనంతరం కూడా సరైన దృష్టి పొందలేక పోతే ఆ వ్యక్తికి దృష్టిమాంద్యం ఉన్నట్లు పేర్కొన్న వారు? 1. హెచ్. స్నెల్లెర్ 2. బ్రెయిలీ ( ) 3. ఆర్నెకార్న్ 4. 1995 చట్టం 32. ఆంధ్రప్రదేశ్‌లో వినికిడి లోపం ఉన్న వారు ఎంత మంది ఉన్నట్లు అంచనా వేశారు? ( ) 1. 58,732 2. 69,642 3. 70,407 4. 73,373 33. క్రెటివిజమ్ రావడానికి కారణమైనది? ( ) 1. క్రోమోజోమ్స్ 2. ఎంజైమ్స్ 3. ఎండోక్రైన్ గ్రంధి 4. అంటువ్యాధి 34. ఏ సంవత్సరములో విద్యా హక్కుల సదస్సులో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన సమావేశం వైకల్యాలపై చర్చ జరిపారు? 1. 1969 2. 1989 ( ) 3. 1979 4. 1997 35. డబ్ల్యు,హెచ్,ఓ అంచనా ప్రకారం (1997)లో ఎన్ని మిలి యన్ల దృష్టి లోపం ఉన్నవారు ఉన్నట్లు అంచనా? ( ) 1. 60 మిలియన్లు 2. 40 మిలియన్లు 3. 50 మిలియన్లు 4. 38 మిలియన్లు 36. ఎన్.ఎస్.ఎస్.బి 2001 గణాంకాల ప్రకారము ఎన్ని మిలియన్ల ప్రజలు మొత్తం వికలాంగులు ఉన్నారు? 1. 21.9 మిలియన్లు 2. 39.1 మిలియన్లు 3. 29.1 మిలియన్లు 4. 31.9 మిలియన్లు 37. పాఠశాల వయస్సున్న వారిలో సుమారుగా ఎంత శాతం మంది అభ్యసన వైకల్యాల సమస్యతో బాధపడు తున్నారు? ( ) 1. 10% 2. 12% 3. 14% 4. 16% 38. మన దేశంలో మొత్తం వికలాంగులలో వినికిడి లోపం ఉన్న వారు ఎంత మంది ఉన్నట్లు గణాంకాల ద్వారా తేలింది? 1. 12,61,722 2. 9,61,722 ( ) 3. 10.58,722 4. 11,61,722 39. మానసిక వైకల్యం గల వారికోసం విద్యాబోధన జరగడంలో సరైనది ఏది? ( ) 1. వినిపించడం ద్వారా 2. రాయించడం ద్వారా 3. చిత్రాల ద్వారా 4. పాటల ద్వారా
సమ్మిళిత విద్యాకార్యక్రమాలు 1. మానసిక వైకల్యం గల విద్యార్థులను వేరు వేరు పాఠశాలలకు పంపిస్తారు. 2. సాధారణ పాఠశాలలోనే రెగ్యులర్‌గా పనిచేసే ఉపా ధ్యాయునితో పాటు ప్రత్యేక ఉపాధ్యాయుడు కూడా ఉంటారు. 3. వీరి కోసం ఎంపిక చేయబడిన అన్ని పాఠశాలలు 3 కి.మీల పరిధిలోనే ఉంటాయి. 4. IGNOU భోజ్ ఓపెన్ యూనివర్సిటీ (MPBOU)ల దూర విద్య ద్వారా వృత్తి విద్యా శిక్షణలలో పనిచేస్తూ ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. 5. Home based Education Model ద్వారా పిల్లవాడు పాఠశాలకు వెళ్లలేకపోతే, విద్యను అతని దగ్గరకు తీసుకువస్తారు. 6. సమ్మిళిత విద్యలో బలహీనత, దాని తీవ్రతతో సంబంధం లేకుండా అందరికీ విద్యను అందిస్తారు. 7. పాఠ్యప్రణాళిక తయారీలో, అమలులో, తల్లిదండ్రుల ప్రమేయం ఉంటుంది. 8. ప్రతివిద్యార్థిని వారికి వికలాంగులనే ముద్రలేకుండా చూడడం. 9. మానసిక వికలాంగులకు సంబంధించి శిక్షణ బుద్ధి మాంద్యునికి తెలిసిన నైపుణ్యాలతో ప్రారంభించి తెలియని అవసర నైపుణ్యాల్లోకి ప్రవేశం కల్పించాలి. 10. ప్రతి 4 లేదా 6 నెలలకొకసారి మానసిక వైకల్యాన్ని వికాస స్థాయిని అంచనా వేయాలి.
 సమైక్య విద్య - భారత ప్రభుత్వం 1974 సం॥ National Edu cational Disabled children అనేపథకాన్ని సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్రారంభించి ఒక మోస్త్తరు లోపం గల శిశువులను ఎంపిక చేసిన పాఠశాలలో సాధారణ విద్యార్థులతో కలిపి విద్యను అందించడం ప్రారంభించింది. - ఒక మోస్త్తరు లోపం గల పిల్లలను ఎంపిక చేసిన సాధారణ పాఠశాలల్లో చేర్చి బోధించే విద్యను సమైక్య విద్య/ సమీకృత విద్య Integrated విద్య అని అంటారు. - ఒక మోస్తరు లోపం గల పిల్లలు సాధారణ విద్యార్థు లతో సాధారణ పాఠశాల పరిస్థితులకు సర్ధుభాటు చేసుకోగల్గితే వారినే చేర్చుకుంటారు. - ఒక మోస్త్తరు లోపం గల పిల్లలు సాధారణ విద్యార్థులతో సాధారణ పాఠశాల పరిస్థితులకు సర్దుబాటు చేసుకోగల్గితే వారినే చేర్చుకుంటారు. - సాధారణ ఉపాధ్యాయులు, సంచార ఉపా ధ్యాయులు - సామూహిక బోధన చేయాలి. - యూనిట్ నికషలు, త్రైమాసిక, అర్థ సంవత్సర, వార్షిక పరీక్షలు. - ఒక మోస్త్తరు లోపమున్న పిల్లలు సాధారణ విద్యార్థు లతో పాటు కలిసి అభ్యసించవచ్చు.. - ఒక మోస్త్తరు లోపమున్న పిల్లలు సాధారణ విద్యా ర్థులు, ప్రతిభావంతులతో పోటీపడి అభ్యసించలేదు.

Other News
|
|