|
|
Home >> Engeneering Plus
బి.టెక్‌లో ఎలాంటి పొరపాట్లు చేయకూడదు?
ప ః మా అబ్బాయిని ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో చేర్పించాలని నిర్ణయించుకున్నాం. అబ్బాయికి, మా ఫ్యామిలీ అందరికీ బిటెక్ సి.ఎస్.ఇ. కోర్సు అంటే ఎంతో ఇష్టం. టాప్ టెన్‌లో ఒకడిగా ఇంజనీరింగ్ కోర్సు మొత్తంలో నిలబడాలంటే అకడమిక్, నాన్ అకడమిక్ పరంగా ఎటువంటి పొరపాట్లు చేయరాదో విలువైన సూచనలు చేయండి? - వై. సుజాత, రామగుండం. జ ః మన దేశంలోని ఐ.టీ. కంపెనీలు ప్రపంచంలోనే అగ్రగాములుగా నిలిచి చాలా మందికి ఉపాధిని కల్పిస్తున్నాయి. బి.టెక్. సిఎస్.ఇ చదివిన వారికి చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ నిర్ణయం మంచిదే. చదువులో బాగా రాణించాలంటే ఈ క్రింది వాటిని పాటించాలి. రోజు వారి తరగతులకు తు.చ. తప్పకుండా అటెండ్ కావాలి రోజూ చెప్పే పాఠాలను ఇంటి వద్ద చదువుకొని మీకున్న అనుమానాలను ఎప్పటికప్పు డు నివృత్తి చేసుకోవాలి. ప్రాక్టికల్స్ ప్రత్యేక శ్రద్ధతో చేసుకొని ప్రాక్టికల్ స్కిల్స్‌ని పెంపొందించుకోవాలి. రోజు వారి హోంవర్క్‌ని ఎప్పటిప్పుడు చేసుకోవాలి. లైబ్రరీలకు వెళ్లి క్లాసుల్లో చెప్పిన పాఠాలకి సంబంధించిన పుస్తకాలను, జర్నల్స్‌ని చదివి ఆయా సబ్జెక్టులలో లేటెస్ట్ అడ్వా న్స్‌డ్ విషయాలను నేర్చుకోవాలి. అంతేకాకుండా సెమినార్స్, వర్క్‌షాప్స్, కాన్ఫరెన్స్‌లలో పాల్గొని ఆయా సబ్జెక్టులలో వస్తున్న మార్పులను, అభివృద్ధిని గమనించాలి. అకడమిక్ నాలెడ్జ్‌తో పాటు సాఫ్ట్ సిల్స్‌ను అభివృద్ధి చేసుకోవాలి. ప ః బిటెక్ సివిల్ ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాను. వచ్చే ఏడాది ప్లేస్‌మెంట్స్ తగ్గుముఖం పడ్తాయని చెప్తున్నారు. ఎన్నో కొన్ని ఉద్యోగావకాశాలు ప్లేస్‌మెంట్స్‌గా వచ్చినప్పుడు, అందులో ఏదో ఒకటి నేను సొంతం చేసుకోవాలంటే రాబోయే రెండేళ్లు ఎటువంటి ఆల్‌రౌండ్ స్కిల్స్ నేర్చుకోవాలో తెలియజేయండి? - ఎన్.కార్తీక్ చంద్ర, వికారాబాద్. జ ః ప్లేస్‌మెంట్స్ తగ్గుతాయని నేను అనుకోవడం లేదు. ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్‌లో ఉద్యోగాలు పెరిగే అవకాశాలున్నాయి. మనదేశంలో ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టులు చాలా ఎక్కువగా రాబోతున్నాయి. అందులో సివిల్ ఇంజనీరింగ్ పాత్ర చాలా ముఖ్యం. ఏదేమైనా కంపెనీ వారు ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మంచి ఉద్యోగం రావాలనుకుంటే సివిల్ ఇంజనీరింగ్‌కు సంబంధించి క్షుణ్ణంగా తెలుసుకొని సబ్జెక్ట్‌లో నైపుణ్యతను పెంచుకోవాలి.పాఠ్యపుస్తకాలు, మేగజైన్స్, జర్నల్స్‌లో వస్తున్న ఆర్టికల్స్‌ని చదివి ఈ సబ్జెక్టులో వస్తున్న మార్పులు, అభివృద్ధిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అంతేకాకుండా మంచి సాఫ్ట్ స్కిల్స్ ఉండటం చాలా ముఖ్యం. సాఫ్ట్ స్కిల్స్ అంటే పాజిటివ్ ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్ సమ్మేళనం. - వి. నిషాంత్, కూకట్‌పల్లి.
Other News
|
|||||