|
|
గెలుద్దాం.. గ్రూప్-2 పేపర్-3 ఎ.పి. ఎకానమీ
సిలబస్ :1. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల వృద్ధి, స్వరూపం 2. ఫ్యాక్టరీలు, చిన్న, అల్పతరహా రంగాలు 3. వాటి తులనాత్మక పరిశీలన, వృద్ధి 4. బలహీనతలు, సమస్యలు, సంస్థాగతమైనవి, సంస్థాగతం కానివి 5. ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల వృద్ధి, స్వరూపం 6. మొత్తం పరపతులలో సహకార సంఘాల వాటా 7. తగినంత పరపతి 8. సమస్యలు ఒక రాష్ట్ర అభివృద్దిని నిర్ణయించే పారిశ్రామికరంగం ప్రజల జీవన ప్రమాణాన్ని కూడా అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. మన రాష్ట్రం ఖనిజ సంపదకు నిలయమైనందున అనేక జాతీయ స్థాయి పరిశ్రమలు కూడా నెలకొల్పడంతో ఉపాధి కల్పనతో పాటు ప్రాంతీయ, ఆర్ధిక అసమానతల తొలగింపు నకు కూడా దోహదపడుతున్నాయి. నిరక్షరాస్యత, నైపుణ్యం లేని కార్మికులకు ఫ్యాక్టరీలు, చిన్న, అల్ప తరహా పరిశ్రమలు ప్రధాన జీవనాధారంగా ఉంటున్నాయి. పరీక్ష కోణంలో రాష్ట్రంలో ప్రధాన ఖనిజ సంపద నెలకొన్న ప్రాంతాలు, పరిశ్రమలు, ప్రదేశాలు, పరిశ్రమల సంఖ్య, కార్మికుల సంఖ్య, పరిశ్రమల వృద్ధి తీరుకు సంబంధించిన గణాంకాలు, వాటి సమస్యలకు కారణాలు, వీటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అదే విధంగా మన రాష్ట్రంలో సహకార సంఘాల రకాలు, అవి వ్యవసాయానికి అందిస్తున్న సహకారం, వివిధ సంస్థలు సహకార రంగం విఫలమవడానికి కారణాలు. ప్రభుత్వం ఈ రంగాలలో సంస్కరణలకు చేస్తున్న కృషి ముఖ్యమైన అంశాలు. 1. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక శాఖను, పారిశ్రామికాభివృద్ధి కార్పోరేషన్‌ను ఎప్పుడు స్థాపించారు? ( ) 1) 1956 2) 1958 3) 1960 4) 1962 2. ఒక ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ప్రధానంగా దోహదపడే అంశం? ( ) 1) నీటి లభ్యత 2) ఖనిజాల లభ్యత 3) భూమి లభ్యత 4) కార్మికుల లభ్యత 3. 1956లో ఆంధ్రప్రదేశ్ ఆదాయంలో పారిశ్రామిక రంగం వాటా? ( ) 1) 10% 2) 11% 3) 12% 4) 13% 4. ఈ క్రింది వాటిలో ఏది రాష్ట్రం ఏర్పడే నాటికే ఉంది? ( ) 1) ఆల్విన్ కంపెనీ 2) హిందూస్తాన్ షిప్ యార్డ్ 3) నిజాం షుగర్ ఫ్యాక్టరీ 4) పైవన్నీ 5. మన రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ఏ రకమైన పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి చెందాయి? ( ) 1) ఔషధాలు 2) ఇంజనీరింగ్ 3) వ్యవసాయధారిత 4) ఎలక్ట్రికల్ & కెమికల్ 6. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (1954) మొదటి యూనిట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయగా రెండవ యూనిట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ( ) 1) విశాఖపట్నం 1980 2) మచిలీపట్నం 1987 3) హైదరాబాద్ 1989 4) రెండవ యూనిట్ ఏర్పాటు చేయలేదు 7. రాష్ట్ర అర్థ గణాంక శాఖ పారిశ్రామిక ఉత్పత్తుల సూచీని తయారు చేయడానికి గాను ఎన్ని పరిశ్రమల నుండి ఉత్పత్తి గణాంకాలను సేకరిస్తుంది? ( ) 1) 540 2) 541 3) 543 4) 545 8. 1975 లో ఏర్పాటు చేసిన నేషనల్ ధర్మల్ పవర్ కార్పోరేషన్ కార్యాలయం ఉన్న పాంత్రం? ( ) 1) హైదరాబాద్ 2) రామగుండం 3) విశాఖపట్నం 4) పైవన్నీ 9. మన రాష్ట్రంలోని ఏ సంస్థను రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ అని పిలుస్తారు? ( ) 1) మిశ్రధాతు నిగం 2) విశాఖ స్టీల్ ప్లాంట్ 3) సదరన్ పెస్టిసైడ్స్ 4) హిందుస్థాన్ మెషిన్ టూల్స్ 10. మైనర్ ఖనిజాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఖనిజాల ఉత్పత్తిలో ఎన్నవ స్థానంలో ఉన్నది? ( ) 1) మొదటి 2) రెండవ 3) నాల్గవ 4) మూడవ 11. దేశంలో ఉత్పత్తి అవుతున్న ఖనిజాలలో రాష్ట్రం వాటా? 1) 5% 2) 10% ( ) 3) 15% 4) 20% 12. మన రాష్ట్రంలోని మైనింగ్ ద్వారా ఏటా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత? ( ) 1) రూ. 1000 కోట్లు 2) రూ. 1100 కోట్లు 3) రూ. 1200 కోట్లు 4) రూ. 1300 కోట్లు 13. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సహయం అందించే లక్ష్యంతో ఏ సం॥ జిల్లా పారిశ్రామిక కేంద్రా లను ఏర్పాటు చేశారు? 1) 1976 2) 1977 ( ) 3) 1978 4) 1979 14. పరిశ్రమల అనుమతులు, క్లియరెన్స్‌ల కోసం 2002లో రూపొందించిన చట్టం? ( ) 1) ఇండస్ట్రియల్ క్లియరెన్స్ యాక్టు 2) ఇండస్ట్రియల్ సర్టిఫికెట్ యాక్ట్ 3) ఇండస్ట్రియల్ సింగిల్ విండో క్లియరెన్స్ యాక్టు 4) పైవన్నీ 15. మన రాష్ట్రంలో 2011 నవంబర్ నాటికి వున్న 24,1974 సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమలలో పని చేస్తున్న కార్మికుల సంఖ్య? ( ) 1) 2,92,821 2) 3,92,821 3) 4,92,821 4) 5,92,821 16. సంఖ్యాపరంగా చిన్న తరహ పరిశ్రమల విషయంలో దేశంలో మనరాష్ట్రం స్థానం? ( ) 1) 2వ 2) 3వ 3) 4వ 4) 5వ 17. 1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం ఫ్యాక్టరీ అనగా ? ( ) 1) విద్యుత్ లేకుండా వస్తూత్పత్తి జరిగితే అందులో కార్మికులు 10కి మించి ఉండాలి 2) విద్యుత్‌తో వస్తూత్పత్తి జరిగితే అందులో కార్మికులు 10కి మించి ఉండాలి 3) ఫ్యాక్టరీలో వస్తువులు ఉత్పత్తి జరిగితే అందులో కార్మికులు 10కి మించి ఉండాలి 4) ఫైవన్నీ 18. 2006లో రూపొందించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి చట్టం ప్రకారం సూక్ష్మ పరిశ్రమలపై గరిష్ట పెట్టుబడి పరిమితి ఎంత? ( ) 1) యంత్రాలపై రూ. 25 లక్షల పెట్టుబడి 2) సేవలపై రూ. 10 లక్షల పెట్టుబడి 3) వస్తుసేవలపై రూ. 50 లక్షలు 4) 1 & 2 19. రాష్ట్రంలో ఎక్కువ పరిశ్రమలు ఉన్న జిల్లా రంగారెడ్డి కాగా అతి తక్కువ పరిశ్రమల గల జిల్లా? ( ) 1) శ్రీకాకుళం 2) విజయనగరం 3) మహబూబ్‌నగర్ 4) ఆదిలాబాద్ 20. ఆంధ్రప్రదేశ్ 2010-15 పారిశ్రామిక తీర్మానం ప్రకారం పరిశ్రమల రంగ వృద్ధి రేటు ఎంత సాధించాలి? ( ) 1) 10%-12% 2) 12%-14% 3) 14%-14% 4) 16%-18% 21. వెనుక బడిన జిల్లాలో పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక వేత్తలను ఆకర్షించి ప్రొత్సహించేందుకు గాను 2003 నుండి కేంద్ర ప్రభుత్వ వృద్ధి కేంద్రాలను గుర్తించిన వాటిలో మన రాష్ట్రంలోని ప్రాంతం ఏది? 1) బొబ్బిలి, ఒంగోలు 2) హిందూపురం 3) జడ్చర్ల 4) పైవన్నీ 22. మన రాష్ట్రంలో 2010-11 ఆర్ధిక సంవత్సరపు సత్వర అంచనాల ప్రకారం పారిశ్రామిక రంగం వృద్ధిరేటు? ( ) 1) 6.33% 2) 7.33% 3) 8.33% 4) 9.33% 23. 2004-05 లో పారిశ్రామిక రంగం వాటా 24.3% కాగా 2011-2012 లో ఎంతకు పెరిగింది? ( ) 1) 24.8% 2) 25% 3) 25.8% 4) 26% 24. మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు ఖాయిలా పడటానికి కారణం కాని అంశం? ( ) 1) అవస్థాపన సదుపాయాలు లేక పోవడం 2) కఠినమైన కార్మిక చట్టాలు 3) తగినంత పరపతి లేకపోవడం 4)ఈ పరిశ్రమల వస్తూత్పత్తులను ప్రజలు తిరస్కరించడం 25. మన రాష్ట్రంలో 114 సెజ్‌లకు అనుమతి లభించగా, వాటిలో 75 సెజ్‌లను నోటిఫై చేయగా ఎన్ని సెజ్‌లు పనులు ప్రారంభించాయి? ( ) 1) 27 2) 29 3) 32 4) 42 26. కేంద్ర ప్రభుత్వం యొక్క 2004 నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో చిన్న తరహా పరిశ్రమలు ఖాయిలా పడటానికి ప్రధాన కారణం? 1) ఉత్పత్తులకు తగిన డిమాండ్ లేకపోవడం ( ) 2) ఆర్ధిక కారణాలు 3) యాజమాన్య-కార్మికుల మధ్య వివాదాలు 4) పైవన్నీ 27. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏ సంవత్సరంలో సహకార సంఘాల చట్టం రూపొందించారు? ( ) 1) 1961 2) 1962 3) 1963 4) 1964 28. మన రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ పరపతిలో వాణిజ్య బ్యాంకుల వాటా? ( ) 1) 70% 2) 74% 3) 78% 4) 82% 29. సహకార పరపతి సంస్థల పునరుద్ధరణకై వేసిన కమిటి? 1) శంకర్ మీనన్ 2) స్వామి నాథన్ ( ) 3) వైద్యనాధన్ 4) కుమారప్ప 30. సహకార రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య? ( ) 1) వనరుల కొరత 2) శాసన, విధాన పరమైన సహాయం లేకపోవడం 3) సభ్యుల్లో చైతన్యం కొరవడటం 4) పైవన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పరిశ్రమలు
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పరిశ్రమ పేరు. నెలకొల్పబడిన సం॥ నెలకొల్పబడిన ప్రాంతం సింధియా స్టీం నావిగేషన్ కంపెనీ 1952 విశాఖపట్నం (హిందుస్తాన్ షిప్ యార్డ్) నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ 1958 హైదరాబాద్ కార్పొరేషన్ లిమిటెడ్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1963 కడప హిందూస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ 1965 హైదరాబాద్ భారత్ హెవీ వెస్సల్స్ & ప్లేట్స్ లిమిటెడ్ 1966 విశాఖపట్నం ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(Ecil) 1967 హైదరాబాద్ సదరన్ పెస్టిసైడ్స్ 1980 కొవ్వూరు (పశ్చిమగోదావరి) ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో వచ్చిన ప్రశ్నలు 1. 2006 ఎమ్.ఎస్.ఎమ్.ఇ.డి (MSMED) చట్టం ప్రకారం చిన్న పరిశ్రమల యంత్ర పరికరాలలో ఉండే స్థిర పెట్టుబడి ? నగూప్-2, 2008) (3) 1. రూ.25 లక్షల వరకు 2. రూ. 25 లక్షల నుంచి రూ.1 కోటి వరకు 3. రూ. 25 లక్షల నుంచి రూ. 5 కోట్ల వరకు 4. రూ. 2. 1/2 కోట్లు మించకుండా 2. పరస్పర సహయ సహకార సంఘాల చట్టాన్ని (MACS AEF) ఆంధ్రప్రదేశ్ ఆమోదించిన సంవత్సరం ? నగూప్-2, 2008) (1) 1. 1995 2. 1998 3. 2005 4. 2006  3. గత దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పరపతి సమకూర్చిన పెద్ద మార్గము ? నగూప్-2, 2011) 1. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (2) 2. వాణిజ్య బ్యాంకులు 3. సహకార బ్యాంకులు 4. నాబార్డు 4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక విధానంలో (2005) మార్పులు చేయడానికి ఉద్దేశించిన చట్టం ? (1) నగూప్-2,2008) 1. సహకార చట్టం 2. పరిశ్రమల చట్టం 3. ఎమ్‌ఆర్‌టిపి చట్టం 4. పరిశ్రమల లైసెన్సింగ్ చట్టం 5. భారతదేశంలో అత్యధికంగా మైకా ఉత్పత్తి చేసే రాష్ట్రం ? నగూప్-2, 2008) 1. తమిళనాడు 2. ఉత్తర ప్రదేశ్ (4) 3. మధ్యప్రదేశ్ 4. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఏర్పాటు చేసిన పరిశ్రమలు, ఏర్పాటు చేసిన సంవత్సరం 1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ : 1958 2. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ : 1961 3. ఆంధ్రప్రదేశ్ తోళ్ళ పరిశ్రమ అభివృద్ధి సంస్థ : 1973 4. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ : 1976 5. ఆంధ్రప్రదేశ్ బెవరేజేస్ కార్పోరేషన్ లిమిటెడ్ : 1986
Other News
|
|