Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Friday, May 24, 2013
 


Home >> Engeneering Plus
మేజర్ ప్రాజెక్టుగా ఏ అంశం తీసుకుంటే బాగుంటుంది?

ప్ర -Engneer talangana patrika telangana culture telangana politics telangana cinema
ఈ.ఈ.ఈ. బిటెక్ ఫైనలియర్ చదువుతున్నాను. మినీ ప్రాజెక్టుగా ఎంబైడెడ్ సిస్టమ్ ఎంపిక చేసుకున్నాను. మేజర్ ప్రాజెక్టును ఏ అంశంలో తీసుకుంటే బాగుంటుందో చెప్పండి?

-కిన్నెరవాణి, ఇ.సి.ఐ.ఎల్.


జ - బి.టెక్ కోర్సులో ల్యాబ్‌లలో ప్రాక్టికల్స్ చేయడం, ఆ తరువాత మినీ, మేజర్ ప్రాజెక్టులు చేయడం, తద్వారా ప్రాక్టికల్ స్కిల్స్‌ను నేర్చుకోవడం చాలా అవసరం. మీరు చేసే ఎంబైడెడ్ సిస్టమ్స్ ప్రాజెక్టు మీరు చేసే కోర్సుకు (ఈ.ఈ.ఈ)కి సంబంధించినట్లయితే చాలా మంచిది. నిజ జీవితంలో ఈ.ఈ.ఈకి సంబంధించిన చాలా ప్రాజెక్టులు/ పరికరాలు ఎంబైడెడ్ సిస్టమ్స్ ద్వారా పని చేస్తున్నాయి. కాబట్టి ఎంబైడెడ్ సిస్టమ్‌లోప్రాజెక్టు చేయడం ద్వారా మీకు ఆ అంశాన్ని కూలకషంగా అర్థం చేసుకొని మంచి ప్రావీణ్యత పొందే అవకాశం ఉంది.

ఒకవేళ మీరు చేసే మినీ ప్రాజెక్టు ఈ అంశాన్ని కలిగి ఉండి, ఇంకా ప్రాజెక్టుని విస్తరణ చేయడానికి ఆస్కారం ఉన్నట్లయితే ఆ ప్రాజె క్టునే కొనసాగించవచ్చు. అలాం టి అవకాశం లేనప్పుడు వేరే ప్రాజెక్టును ఎంచుకోవచ్చు.

ప్ర - సి.ఎస్.సి. బిటెక్ ఫైనలియర్ తరగతులకు హాజరవుతున్నాను. ఈ ఏడాది హాజరయ్యే బోధనాం శాలు చాలా మటుకు ప్రాక్టికల్‌గా ఉంటున్నాయి. ప్రాక్టికల్‌గా నేర్చ కునే అంశాలకు, థియరిటికల్ నేర్చుకునే అంశాలకు మధ్య ఎటువంటి వ్యత్యాసాలుంటాయో చెప్పండి? నేను ఏ పద్ధతిలో చదివితే ఫైనలియర్ బిటెక్‌లో మంచి మార్కులు సాధించే అవకాశాలుంటాయో చెప్పండి?

- వి.శరణ్‌కుమార్. చేర్యాల


జ - సాధారణంగా బి.టెక్ చివరిదైన నాల్గవ సంవత్సరంలో థియరీ తక్కువగా ఉండి ప్రాక్టికల్స్, ప్రాజెక్టులు ఎక్కువగా పొందుపరిచి ఉంటాయి. మొత్తం మీద ఇంజనీరింగ్ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్ దాదాపు సమపాళల్లో ఉంటాయి.
థియరీ నేర్చుకున్న అంశాల పై ప్రాక్టికల్స్ చేయడం ద్వారా అవగాహన పెరుగుతుంది. ప్రాక్టికల్స్ చేయడం ద్వారా మీరు నేర్చుకున్న సబ్జెక్టుకు సంపూర్ణత లభిస్తుంది. ప్రాక్టికల్స్ చేయడం ద్వారా నిజ జీవితంలోని ఆ సబ్జెక్టుకు సంబంధించిన సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే ప్రతిభాపాటవాలు పెరుగుతాయి.
ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే, ఒక పెద్ద సమస్యను (Problem)ని తీసుకొని దానిని పూర్తి చేయడం ద్వారా ఒక పెద్ద సమస్యలోని క్లిష్టమైన అంశాలను, ఒక సమస్యని సాధించడానికి కావలసిన sdlc (system develpment life cycle) లోని అన్ని దశలను అర్థం చేసుకోవడం జరుగుతుంది.
కాబట్టి ప్రాక్టికల్స్‌ని, ప్రాజెక్టులను శ్రద్ధతో, నిబద్ధతతో చేసినట్లయితే మంచి మార్కులు, మంచి పరిజ్ఞానం లభిస్తాయి.

ప్ర - బిటెక్ ఈ.సి.ఈ. ఫైనలియర్ చదువుతున్నాను. ఐ.ఏ.ఎస్ కావడం నాజీవిత లక్ష్యం. ఆర్థికంగా ముందు నిలదొక్కుకోవ డానికీ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాలని అనుకుంటున్నాను. అయితే బిటెక్ కోర్సు తర్వాత ఇతర ఉన్నత కోర్సులు లేదా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాలకై ఉపయోగపడుతున్న ‘గేట్’ పరీక్షకు హాజరైతే బాగుంటుందని ఇంట్లో అంటున్నారు. ఇంతకీ ఈ రెండింటిలో ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాను. నాకు బెస్ట్ రోడ్‌మ్యాప్ ఇవ్వండి?

- బిపశాంతి, జమ్మికుంట


జ - ఇది కొంత క్లిష్టమైన ప్రశ్న. బి.టెక్ చేసిన తర్వాత చాలా మార్గాలున్నాయి. ఒకటి గేట్ పరీక్ష ద్వారా మంచి ర్యాంక్ తెచ్చుకొని పి.జి చేయడం లేదా మంచి ఉద్యోగం సాధించడం లేదా gre/toefel పరీక్షల ద్వారా విదేశాలలో పి.జి. కోర్సు చేయడం లేదా upsc/bank పరీక్షల ద్వారా ఉద్యోగం సాధించడం మొదలైన ఎన్నో మార్గాలు ఉన్నాయి.
బి.టెక్ తర్వాత ఏమి చేయడం అనేది మీ ఇష్టాయి ష్టాలను, మీ సబ్జెక్టులో నైపుణ్యాన్ని, మీ కుటుంబ ఆర్థిక పరిస్థితులను, మీ జీవిత లక్ష్యం మొదలైన ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి.
మీరు మీ లక్ష్యాన్ని కృషి, పట్టుదలతో తప్పకుండా సాధించవచ్చు. కాకపోతే ఒక ప్రత్యామ్నాయ మార్గం కూడా ఉండటం మంచిదని నా అభిప్రాయం.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine