Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Sunday, May 19, 2013
 


Home >> Engeneering Plus
కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి

win-group talangana patrika telangana culture telangana politics telangana cinemasection - II : unit-III

- ఇదీ సిలబస్

1. ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణల ఆవశ్యకత, లక్ష్యాలు.
2. ఆంధ్రప్రదేశ్‌లో భూ కమతాల స్వరూపం.
3. ఆంధ్రప్రదేశ్‌లో - అడవులు, సాగునేల,
- నీటిపారుదల విస్తీర్ణం
- పంటల విధానం
4.ఆంధ్రప్రదేశ్‌లో - వ్యవసాయిక విత్త వనరులు
- వ్యవసాయ సబ్సిడీలు

ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయాధారిత రాష్ట్రం అయినందున భూ సంబంధిత విషయాల గురించి అభ్యర్థులకు లోతైన అవగాహన ఉండాలి. రాజ్యాంగంలో బలహీన వర్గాల సంక్షేమం, ఆర్థిక, సామాజిక అసమానతలను తొలగించి సర్వ సమాన సమాజం స్థాపించాలంటే, అదే విధంగా గ్రామీణ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగం వంటి సామాజిక, ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు అవసరం. పరీక్ష కోణంలో భూ సంస్కరణలకు సంబంధించి కీలకమైన చట్టాలు, కమతాల పరిమాణం, నీటి పారుదల గల సాగునేల విస్తీర్ణం. ముఖ్యంగా రాష్ట్రంలో మూడు ప్రాంతాల మధ్య నీటి పారుదల సదుపాయాల పరంగా అసమానతలను అర్ధం చేసుకోవాలి. ఏయే పంటలు ఏ ప్రాంతం, జిల్లాలో పండుతున్నాయి. భౌగోళికంగా అనుకూలిస్తున్న అంశాలను లాజికల్‌గా గుర్తు పెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్ అంశాలలో కూడా వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి తెలుసుకోవాలి.

1. భూ సంస్కరణలు అంటే? ( )
1) భూమిలేని నిరుపేదలకు భూయాజమాన్య హక్కును కల్పించడం.
2) భూమివల్ల కలిగే ప్రయోజనాలను నిరుపేదలకు పునఃపంపిణీ చేయడం.
3) వ్యవసాయ సంస్కరణలు
4) పైవన్నీ
2. స్వాతంత్య్రానికి ముందు జాతీయ కాంగ్రెస్ భూ సంస్కరణలకు సంబంధించిన తీర్మానాన్ని ఏ సమావేశంలో ప్రవేశపెట్టారు.? ( )
1) బొంబాయి 2) కలకత్తా
3) కరాచీ 4) నాగపూర్
3. భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలను రాజ్యాంగం లో ఎక్కడ గమనించవచ్చు? ( )
1) నిబంధన 38 2) నిబంధన 39
3) ఒకటో రాజ్యాంగ సవరణ 4) పైవన్నీ
4. ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా భూ సంస్కరణల అమలులో కీలకమైన మధ్యవర్తుల వ్యవస్థలను తొలగించారు.? ( )
1) మార్కండేయ 2) జస్టిస్ రావత్
3) కుమారప్ప 4) జస్టిస్ రనడే
5. ఆంధ్ర ప్రాంత కౌలుదార్ల, రైతు రక్షణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ( )
1. 1947 2. 1948
3. 1949 4.1950
6. ఆంధ్రప్రదేశ భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం-1973 ప్రకారం 5గురు సభ్యులు గల కుటుంబ యూనిట్ మాగాణి భూమిని ఎన్ని ఎకరాల వరకు కలిగిఉండవచ్చు?
1. 5-15 2. 10-20 ( )
3. 15-25 4. 10-47
7. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన భూ పునః పంపిణీలో ఏ వర్గం వారు ఎక్కువ శాతం లబ్దిదారులుగా ఉన్నారు? ( )
1. షెడ్యూల్డ్ కులాలు 2. షెడ్యూల్డ్ తెగలు
3. ఇతర వెనుకబడిన వర్గాలు 4. ముస్లీంలు
8. 2005-06 నాటికి మన రాష్ట్రంలో సగటు భూ కమత విస్తీర్ణం? ( )
1. 1.25 హెక్టార్లు 2. 1.20 హెక్టార్లు
3. 1.15 హెక్టార్లు 4. 1.10 హెక్టార్లు
9. మన రాష్ట్రంలో గరిష్టంగా ఒక హెక్టారు భూమి కలిగిన ఉపాంత రైతుల భూ కమతాలు మొత్తం భూ కమతాలలో ఎంత శాతం? ( )
1. 51.55 % 2. 58.59 %
3. 60.59 % 4. 61.59 %
10. 2005-06 నాటికి మన రాష్ట్రంలో వున్న మొత్తం భూకమతాల సంఖ్య?
1. 115.44 లక్షలు 2. 120.44 లక్షలు ( )
3. 125.44 లక్షలు 4. పైవేవీ కావు
11. ఆంధ్రప్రదేశ్‌లో అడవుల విస్తీర్ణం ఎంత (చ.కి.మీ.)? ( )
1. 60,814 (20.1%) 2. 61.814(21.1%)
3. 63.814 (23.2%) 4. 65.814 (24.1%)
12. మన రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి? ( )
1. తెలంగాణా 2. కోస్తాంధ్ర
3. రాయలసీమ 4. కోస్తాతీరం
13. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఎప్పుడు స్థాపించారు.?
1. 1974 2.1975 ( )
3. 1976 4. 1977
14. మన రాష్ట్రంలో అడవుల పెంపకం ద్వారా భూ సంరక్షణ లక్ష్యంగా రివర్‌వ్యాలీ ప్రాజెక్టును ఏ నది పరివాహక ప్రాంతంలో ఏర్పాటు చేశారు.? ( )
1. మాచ్‌ఖండ్
2. వంశధార
3. నాగావళి
4. కిన్నెరసాని
15. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణజింకల సంరక్ష ణ కేంద్రం ఎక్కడ ఉన్నది? ( )
1. వరంగల్
2. హైదరాబాద్
3. విశాఖపట్నం
4. తిరుపతి
16. మన రాష్ట్రం భౌగోళిక విస్తీర్ణం (275.04 ల.హె.)లో 2010-11లో వ్యవసాయంలో ఉపయోగ పడే నికరసాగు భూమి విస్తీర్ణం (ల.హె.లలో)? ( )
1. 71.53 2. 57.65
3. 50.34 4. 42.15
17. మనరాష్ట్రంలో 2011-12 రెండవ సత్వర అంచనాల ప్రకారం మొత్తం సాగు భూమిలో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం (ల.హె.లలో)? ( )
1. 60.60 2. 70.60
3.80.60 4. 90.60
18. దేశ ప్రధాన ధాన్యాగారంగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 2010లో 203.14 లక్షల టన్నులు కాగా 2011-12లో ఎంత? (ల.టన్నులలో)
1. 230.05 2. 220.05 ( )
3. 190.05 4. 173.05
19. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి? ( )
నీటి పారుదల సదుపాయం
1. బావుల ద్వారా : 43.33%
2. కాలువల ద్వారా : 32.3%
3. చెరువుల ద్వారా : 6.43 %
4. సూక్ష్మసేద్యం : 20.2%
1.1,2 2. 1,2,3
3. 1,2,3,4 4. 1,2
20. 2011-12 నైరుతి రుతుపవన కాలంలో మన రాష్ట్రంలో నమోదైన వర్షపాతం (మి.మీలలో)? ( )
1. 624 2. 550
3. 539 4. 524
21. పంటలు పండించేందుకు మృత్తిక యొక్క స్వభావాన్ని శాస్త్రీయంగా అంచనా వేసేందుకు గాను మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాల్లో భూసార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు?
1. 19 2. 20 ( )
3. 21 4. 22
22. పొలంబడి కార్యక్రమం యొక్క ఉద్దేశం? ( )
1. పంటలను ఆశించిన కీటకాలను నాశనం చేసేందుకు గాను పర్యావరణ అనుకూల ప్రమాణాలను పాటించడం
2. సాగు వ్యయాన్ని తగ్గించి, ఉత్పత్తి నాణ్యతను పెంచడం
3. ఉత్పత్తులకు అధిక ధరలు పొందడం
4. పైవన్నీ
23. మన రాష్ట్రంలో వరి విస్తీర్ణం, ఉత్పాదకతలలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా? ( )
1. పశ్చిమ గోదావరి 2. తూర్పుగోదావరి
3. కృష్ణ 4. కరీంనగర్
24. ఆముదాలు ఏ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు? 1. కర్నూలు 2. మహబూబ్‌నగర్ ( )
3. కరీంనగర్ 4. గుంటూరు
25. మన రాష్ట్రంలో వరి తరువాత ముఖ్యమైన ఆహార పంట
1. పొద్దుతిరుగుతు 2. మొక్కజొన్న ( )
3. జొన్న 4. రాగులు
26. మన రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1. నర్సంపేట 2. నంద్యాల ( )
3. కాకినాడ 4. బాపట్ల
27. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పండే ఆహారపంట?
1. జొన్న 2. గోధుమ ( )
3. మొక్కజొన్న 4. వరి
28. మన రాష్ట్రంలో 2010-11లో వ్యవసాయ పరపతి? ( )
1. రూ. 35,830 కోట్లు 2. రూ. 37,835 కోట్లు
3. రూ. 40,830 కోట్లు 4. రూ. 42,835 కోట్లు
29. కౌలు రైతుల సభ్యులుగా గల రైతుమిత్ర బృందాలకు 2010-11లో అందించిన రుణం? ( )
1. రూ. 29,587 కోట్లు 2. రూ. 39,587 కోట్లు
3. రూ. 49,587 కోట్లు 4. రూ. 59,587 కోట్లు
30. ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన జాతీయ ఆహార భద్రత మిషన్ ఎన్ని జిల్లాల్లో అమలు చేస్తారు? ( )
1. 23 2. 22
3. 11 4. 8
31. ఎగుమతికి ప్రధానంగా ఉపయోగపడే వర్జీనియా రకపు పొగాకు ఉత్పత్తిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ స్థానం? ( )
1. మొదటి స్థానం 2. రెండవ స్థానం
3. మూడవ స్థానం 4. నాల్గవ స్థానం
32. 2010-11లో పంపిణీ చేసిన 18.69 కిలోల క్వింటాళ్ల విత్తనాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీ ఎంత?
1. 258.25 కోట్లు 2. 278.15 కోట్లు
3. 285.25 కోట్లు 4. 292.15 కోట్లు ( )
33. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రైతులకు అందించే పరికరాలకు ఎంత సబ్సిడీ ప్రభుత్వం కల్పిస్తుంది?
1. 25 శాతం 2. 50 శాతం ( )
3. 75 శాతం 4. 90 శాతం
34. పంటల బీమా పరిధిలోకి వచ్చే ఖరీఫ్, రబీ పంటల సంఖ్య వరుసగా..?
1. 10, 15 2. 20, 10 ( )
3. 15, 20 4. 20, 15



ఆంధ్రప్రదేశ్‌లో భూ పంపిణీ కార్యక్రమం
- మొదటి విడత (జనవరి-26,2005)
ఒక లక్ష 56 వేల ఎకరాలు
- రెండవ విడత (ఆగస్టు-21, 2005)
ఒక లక్ష 69 వేల ఎకరాలు
- మూడో విడత (నవంబర్-1,2006)
ఒక లక్ష 11 వేల ఎకరాలు
- నాల్గో విడత (జనవరి-19,2008)
ఒక లక్ష 66 వేల ఎకరాలు
- ఐదవ విడత (మే-22, 2010)
6,815 ఎకరాలు
(ఈ విడతలో ప్రత్యేకంగా 5,589 ఎకరాలు
పేద మహిళలకు పంపిణీ చేశారు.)

వ్యవసాయరంగానికి సంబంధించిన ముఖ్యమైన పథకాలు
1. భూభారతి - భూమి రికార్డుల కంప్యూటరీకరణ
2. రైతు చైతన్య యాత్ర - 22 జిల్లాల్లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులను చైతన్య పర్చడం.
3. పొలంబడి కార్యక్రమం - పంటలను ఆశించే కీటకాలను నాశనం చేయడంతో పాటు పర్యావరణ అనుకూల ప్రమాణాలను పాటించడం.
4. ఆదర్శ రైతు - ప్రతి 200, 250 భూ కమతాలకు ఒక ఆదర్శరైతు చొప్పున 49,161 మందిని నియమించారు. వీరు వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించి గ్రామ స్థాయిలో ఫెసిలిటేటర్లుగా వ్యవహరిస్తారు.
5. ఆత్మ (ATMA) - వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు అమలు.
Ansa talangana patrika telangana culture telangana politics telangana cinema
ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు

1. ఇటీవలి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం సాగుబడి విస్తీర్ణంలో చెరువుల వాటా సుమారు?
నగూప్-2, 2008)
1. 10% 2. 15%
3. 20% 4. 25% ( 1 )
2. 2005-06లో ఆంధ్రప్రదేశ్‌లోని కమతాల సంఖ్య సుమారు? నగూప్-2, 2008) ( 1 )
1. 120 లక్షలు 2. 100 లక్షలు
3. 150 లక్షలు 4. 200 లక్షలు
3. పేదలకు పంపిణీ చేసిన భూమి అభివృద్ధికై రూపొందించిన భూమి అభివృద్ధి పథకము? నగూప్-2, 2011)
1. ఇందిరా జమీన్ యోజన 2. రాజీవ్‌ప్రభ ( 4 )
3. రాజీవ్ జమీన్ యోజన 4. ఇందిర ప్రభ
4. 2006-07లో ప్రస్తుత బీడు భూములుగా వున్న భూ విస్తీర్ణము (లక్షల హెక్టార్లలో)? నగూప్-2, 2011)
1. 6.95 2. 6.02 ( 2 )
3. 10.78 4. 11.60
5. భారతదేశంలో అధిక శాతం వ్యవసాయ కమతాలు ఏ వర్గానికి చెందినవి? నగూప్-2 లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2012)
1. ఉపాంత కమతాలు 2. పెద్ద కమతాలు ( 1 )
3. చిన్న కమతాలు 4. మధ్యస్థ కమతాలు

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine