|
|
తొలకరి...కేంపస్ ప్లేస్‌మెంట్ సిరి!

రుతుపవనాల రాకతో రైతు వదనాలు కళకళలాడినట్టు ఇంజనీరింగ్ కేంపస్‌లు కంపెనీలతో కోలాహం కానున్నాయి. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ప్రతిభా వంతులను ఎంపిక చేసుకునేందుకు సాంకేతిక విద్యాలయ ప్రాంగణాలను ఇక వరుసనే కంపెనీలు సందర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కంపెనీలు కేంపస్ రిక్రూట్‌మెంట్లలో ఏ నైపుణ్యాలను పరిశీలిస్తాయో చూద్దాం.
ప్రణాళిక బద్ధమైన కృషి, సాధించాలన్న పట్టుదల.. ఇంజనీరింగ్ విద్యార్థులకు విజయాలను అందిస్తాయి. అన్ని బ్రాంచ్ విద్యార్థులకు అవసరం అయిన సంస్థలు ‘‘క్యాంపస్ ప్లేస్‌మెంట్’’ కోసం వస్తాయి. కోర్స్‌కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లోనే ఉద్యోగం తేలికగా సాధించవచ్చు. దీనికి సన్నద్దమయ్యే తీరును పరిశీలిస్తే..
క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంపిక నాలుగు దశలలో ఉంటుంది. 1. రాత పరీక్ష 2. గ్రూప్ డిస్కషన్ 3. టెక్నికల్ ఇంటర్వ్యూ 4. హెచ్ ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ
రాత పరీక్ష : ఇందులో జనరల్ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్, బేసిక్ ఇంగ్లీష్, ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు చెందిన మౌలిక అంశాలపై ప్రశ్నలు. మొదటి దశలోని రాత పరీక్ష చాలా కీలకమైంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే ఆత్మ విశ్వాసం కూడా బాగా పెరుగుతుంది. జనరల్ ఆప్టిట్యూడ్ ప్రశ్నలు విద్యార్థుల ‘రీజనింగ్’’ సామర్థ్యాన్ని పరీక్షించేవిలా ఉంటాయి. ఈ పరీక్షలో స్కోర్ చేయడానికి ‘బేసిక్స్’పై పట్టు సాధించి తర్వాత మోడల్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పరీక్షకు ముందు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రశ్నలు చేస్తే మంచిది. ఇంగ్లీష్‌లో ఎక్కువగా ‘బేసిక్స్’పై ప్రశ్నలు ఉంటాయి. ఇదే ఎక్కువగా ఉంటున్నందున నిత్యం జాతీయ ఆంగ్ల దిన పత్రికలు చదువుతూ ఒకాబులరీపై పట్టు సాధించాలి.
జీఆర్‌ఇ; జీ మ్యాట్ కోసం రూపొందించిన పుస్తకాలు; అగర్వాల్ (రీజనింగ్; క్వాంటిటేటీవ్ ఆప్టిట్యూడ్) పుస్తకాలు, ఇంటర్‌నెట్‌లోను మెటీరియల్ అందుబాటులో ఉంది.
గ్రూప్ డిస్కషన్ : రాత పరీక్ష అనంతరం బృంద చర్చ (Gorup discussion) ఉంటుంది. ఇందులో ప్రధానంగా విద్యార్థుల ఇనిషియేషన్, ఎనర్జీ లెవల్స్ పరీక్షిస్తారు. ఇచ్చిన అంశానికి రిలవెంట్‌గా అభ్యర్థి మాట్లాడుతున్నాడా? లేదా? భావ వ్యక్తీకరణ సామర్థ్యం తదితర అంశాలను పరిశీలిస్తారు. ఈ పరీక్షను తేలికగా దాటాలంటే ప్రాక్టీస్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. క్రమం తప్పకుండా ఆంగ్ల దినపత్రికలు, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ గ్రూప్ డిస్కషన్ అంశాలను పరిశీలించాలి. అలాగే స్నేహితులతో కలిసి ‘‘మాక్ గ్రూప్ డిస్కషన్’’లో పాల్గొనాలి. తాజా ఉదాహరణలు, తాజా గణాంకాలు అవసరం అయితే ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇచ్చిన అంశం పరిధిలోనే ఉంటూ, భావాలను సూటిగా స్పష్టంగా చెప్పాలి. కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఉత్సాహం చూపాలి. ‘‘హై ఎనర్జీ లెవెల్స్’’ను ప్రదర్శించాలి.
టెక్నికల్ ఇంటర్వ్యూ - రెండో సంవత్సరం వరకు ఉన్న కోర్ సబ్జెక్ట్స్‌లోని ఫండమెంట ల్స్‌ను బాగా అధ్యయనం చేయాలి. వీటిని భిన్న పరిస్థితుల్లో ఎంత మేర నైపుణ్యంతో పరిష్కరించగలరో అన్న అంశాలను తెలు సుకునేలా ప్రశ్నిస్తారు. అభ్యర్థుల నిర్వహణా సామర్ధ్యాన్ని కూడా పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. క్రమం తప్పకుండా విద్యార్థులు ‘‘మాక్ ఇంటర్యూ’’లకు హాజరుకావాలి. సీనియర్లను అడగడం, నిర్వహణ నైపుణ్యం (Ma8erial skills) ఉన్న వారితో తరచూ చర్చిస్తూ భిన్న పరిస్థితుల్లో ఎలా స్పందించాలో నేర్చు కోవాలి.
‘‘కేవలం సబ్జెక్టులో నైపుణ్యం సాధించినంత మాత్రాన సరిపోదు. వాటిని ప్రాక్టికల్‌గా ఎలా వినియో గిస్తాం అన్న అంశాన్నే పరిశీలించాలి.
హెచ్.ఆర్ ఇంటర్వ్యూ - ఇందులో ప్రధానంగా అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని పరీక్షించేలా ప్రశ్నిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎంతమేర ఉన్నాయి అన్నది అంచనా వేస్తారు. అలాగే సమన్వయం, బాడీ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలను పరిశీలిస్తారు. ఈ నైపుణ్యాలను ఒక రోజులోనో లేదా వారంలోనో పెంపొందించుకోవడం సాధ్యం కాదు. వీటిని నిత్యం సాధన చేయాలి. వివిధ అంశాలపై తరుచూ మాట్లాడడం, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్‌లో తరుచూ ‘మాక్ ఇంటర్య్వూస్’’ అటెండ్ కావడం వల్ల ఈ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చు.
సక్సెస్ టిప్స్ * సంస్థలు పరీక్ష ప్రక్రియకు ముందు ‘పవర్ పాయింట్ ప్రజంటేషన్’ ఇస్తాయి. అభ్యర్థులు తమకున్న అనుమానాలను నిర్భయంగా నివృత్తి చేసుకోవాలి. అడిగితే ఇబ్బందులొస్తాయి అన్న అపోహ సరికాదు. * నిజాయితీగా జవాబులు చెప్పాలి. నమ్మించేందుకు ప్రయత్నిస్తే ఇబ్బందులు తప్పవు * రెస్యూమ్ రెండు లేదా మూడు పేజీలకు మించరాదు. * ‘ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్’ను నిత్యం మెరుగు పరుచుకు నేందుకు యత్నించాలి. * ఇంటర్వ్యూకెళ్లే సంస్థలకు సంబంధించిన వివరాలు ముందే సేకరించుకోవాలి.
ప్రాక్టీస్‌తోనే విజయం ఉద్యోగ ఎంపిక ప్రక్రియలు అకడమిక్ పరీక్షలకు భిన్నమైనవి. ఇందులో ఎక్కువగా ప్రాక్టికల్ ఒరియంటేషన్ ఉంటుంది. అభ్యర్థుల వ్యక్తిత్వం, మానసిక సామర్థ్యం, ప్రాక్టికల్ అప్రోచ్‌లను పరిశీలిస్తారు. ఇందుకు ముందు నుంచే సన్నద్ధం కావాలి. కేవలం పుస్తకాలు చదవడం వరకే పరిమితం కారాదు. నిత్యం సీనియర్లతో, మిత్రులతో చర్చిస్తూ ఉండాలి. ఖచ్చితమైన లక్ష్యాన్ని ఎంచుకుని కృషి చేస్తే క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం తేలికగా లభిస్తుంది. - ప్రొ.శ్రీనివాస్, ప్లేస్‌మెంట్ ఆఫీసర్, జెఎన్‌టియు.
జెఎన్‌టియుకి వచ్చే కంపెనీలు సెప్టెంబర్‌లో జెఎన్‌టియు క్యాంపస్‌కు రానున్న పలు సంస్థలు TCS, WIPRO, ORACLE, ACCENTURE, IDEA CELLULAR, MAHINDRA, SR, CIVIL L&T, ACE
గ్రూప్ డిస్కషన్ టాపిక్స్ పొలిటికల్ టాపిక్స్ - కరప్షన్, యూత్ ఇన్ పాలిటిక్స్, డెమోక్రసీ మొదలైనవి. జనరల్ - రిజర్వేషన్స్, ప్రివెంటింగ్ యాక్సిడెం ట్స్ మొదలగునవి. సైన్స్ అండ్ టెక్నాలజీ - రోల్ ఆఫ్ కంప్యూటర్స్ టెక్నాలజీ ఇన్ డే టు డే లైఫ్ మొదలైనవి.
Other News
|
|