|
|
Home >> Engeneering Plus
కేంపస్ ప్లేస్‌మెంట్‌లో విజయానికి ఎలా కృషిచేయాలి?
ప్ర - ఎస్.రమణయ్య, నారాయణ ఖేడ్ జ - ఆఫర్ చేసే కోర్సులలో ఏమీ వ్యత్యాసం ఉండదు. కాకపోతే కాలేజ్‌కి సంబంధించిన ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ కాలేజీని ఎన్నుకోవడం జరుగుతోంది. మంచి ర్యాంకు వచ్చిన వారు మంచి కాలేజీలను ఎంచుకోవడం జరు గుతుంది. కాబట్టి ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం వలన మంచి కాలేజీలో ప్రవేశం లభిస్తుంది. అయితే అది క్యాంప స్ కాలేజీ కావచ్చు లేదా మరే ఇతర ప్రైవేట్ కాలేజీ కూడా కావచ్చు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా ఎన్.ఐ.టి, ఐఐటిలతో థీటుగా రాణించడా నికి ప్రయ త్నం చేస్తున్నాయి. ముందు ముందు వీటిలో కొన్ని కాలేజీలు దేశంలో మంచి కాలేజీలుగా రాణించే అవకాశం ఉంది. అలాగే, సాధారణ ప్రైవేట్ కాలేజీలలో విద్యనభ్యసించే ఎంతో మంది విద్యార్ధులు తమ కృషి, పట్టుదలతో మంచి మార్కులు తెచ్చుకొని మంచి ప్రావీణ్యతను పొంది ఎంతో పైకి వచ్చిన వారున్నారు. ప్ర - మా అబ్బాయికి నానో టెక్నాలజీ లేదా ఏరోస్పేస్ టెక్నాలజీ చదువుతానంటున్నాడు. ఇతర రాష్ట్రాలకు పంపించే స్థోమత నాకు లేదు. ఇప్పటికే ఎంసెట్ పరీక్షలు రాసి ఉన్నాడు. ఎంసెట్ ద్వారా రాష్ట్రంలో సివిల్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివించాలనేది నా అభిప్రాయంగా ఉంది. ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మా అబ్బాయి భవిష్యత్తు బాగుటుంది? - జి. అనిత, అనంతారం. జ - నానోటెక్నాలజీ ఇపుడిపుడే మొదలైంది. ఏరోస్పేస్ టెక్నాలజీ చాలా కాలం నుండి అందించబడుతోంది. కాకపోతే ఈ రెండు కూడా చాలా ప్రత్యేకమైన బ్రాంచీలు. నానో టెక్నాలజీ ఇంకా పరిశోధన దశలో ఉన్నది. కాబట్టి నానోటెక్నాలజీలో B.E/B.Tech కోర్సులను, పి.హెచ్.డి కోర్సులను అందిస్తున్నారు. నానో టెక్నాలజీలో పిజి కోర్సుకి మెకానికల్, మెటీరియల్ సైన్స్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ కోర్సులలో బి.టెక్ చేసినవారు లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీలలో యం.ఎస్సీ (M.Sc) చేసినవారు అర్హులు. ఒకవేళ మీరు నానోటెక్నాలజీలో పి.జి కోర్సులు చేయాలనుకుంటే పై వానిలో ఏదో ఒక కోర్సులో B.Tech కోర్సు చేయడం మంచిది. ఇకపోతే ఏరోస్పేస్ చాలా కాలేజీలలో B.E/B.Tech కోర్సుద్వారా అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కనీసం ఒక డజను కాలేజీలలో ఈ కోర్సుని అందిస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియో గించు కోవచ్చు. ఇకపోతే సివిల్, కంప్యూటర్ సైన్స్‌లలో B.E/B.Tech కోర్సుని అందించడం సర్వసాధారణం ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అబ్బాయి ప్రతిభను, ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి రాగలరు. ప్ర - ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయని తెలిసింది. నేను యావరేజీ స్టూడెంట్‌ను. బిటెక్ కంప్యూటర్ సైన్స్ ఫైనలి యర్‌లో ఉన్నాను. రాబోయే ఫ్లేస్‌మెంట్స్‌లో ఏదో ఒక ఉద్యో గం దక్కించు కోవాలంటే నేను ఇప్పుడు ఎటువంటి కృషి చేస్తే బాగుంటుంది? - శ్రీరామక్రిష్ణ. ఘట్‌కేసర్ జ - ఏ కంపెనీ వారయినా మంచి అభ్యర్థులను ఎంచుకో వడానికి ప్రయత్నం చేస్తారు. దానికి గాను వారు ఒక రాత పరీక్షను ఆ తరువాత ఇంట ర్వ్యూలను నిర్వహించి అభ్య ర్ధులను ఎంపికచేస్తారు. ఈ పరీక్షల ద్వారా అభ్యర్ధి సబ్జెక్టు పరిజ్ఞానాన్ని, సాప్ట్ స్కిల్స్‌ని పరీక్షిస్తారు. కాబట్టి మీరు మీ సబ్జెక్టులను క్షుణ్ణంగా చదువుకొని మీ సాప్ట్ స్కిల్స్‌ని అభివృద్ధి చేసుకొని ఇంటర్వ్యూ కోసం రెడీగా ఉండండి. సాప్ట్‌స్కిల్స్ - కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, పర్సనాలిటీ మొదలైన ఎన్నో విషయాల సమ్మేళనం. వీటిని మెరుగుపర్చుకోండి.
Other News
|
|||||