కరెంట్ ఎగ్జామ్స్ కవరేజి
ఇదీ సిలబస్ -
ఈ యూనిట్‌కు సంబంధించిన ప్రశ్నలు ప్రధానంగా ప్రణాళికల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత, రంగం, మొత్తం పరివ్యయం, వృద్దిరేటు లక్ష్యం వృద్ధిరేటు వైఫల్యానికి కారణాలు, ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టబడిన పథకాలు, పరీక్ష కోణంలో అతి ముఖ్యమైన అంశాలు. ముఖ్యంగా ఇటీవలి ప్రణాళిక అంటే 11వ ప్రణాళికకు సంబంధించి కనీసం 4 ప్రశ్నలు రావడానికి అవకాశముంది. ఈ ప్రణాళికా కాలం ముగిసినందున దీనిని క్షుణ్ణంగా పరిశీలించాలి.
రాష్ట్ర ప్రణాళికలను చదివేటప్పుడు కేంద్ర ప్రణాళికలను కూడా సమాంతరంగా చదివితే ఎక్కువ ప్రశ్నలకు సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు.
1. ఆర్ధిక ప్రణాళికలను ప్రవేశపెట్టడం వల్ల 1930 నాటి ప్రపంచ ఆర్ధిక మాంద్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని మన దేశంతో పాటు అనేక వర్తమాన దేశాకు పంచవర్ష ప్రణాళికల రూపకల్పనకు ప్రేరణగా నిలిచిన దేశం?
1) బ్రిటన్ 2) అమెరికా ( )
3) రష్యా 4) జపాన్
2. కేంద్ర,రాష్ట్ర ప్రణాళికల రూపకల్పన వనరుల అంచనాకు సంబంధించి మార్గనిర్ధేశకాలను రూపొందించే ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1948 2) 1949 ( )
3) 1950 4) 1951
3. మన రాష్ట్రంలో సంపూర్ణంగా అమలు పర్చబడ్డ మొదటి ప్రణాళిక?
1) 2వ ప్రణాళిక 2) 3వ ప్రణాళిక ( )
3) 4వ ప్రణాళిక 4) 5వ ప్రణాళిక
4. మన రాష్ట్రంలో మొదటి సారిగా పేదరిక నిర్మూలన, స్వావలంబన ప్రధాన లక్ష్యాలుగా రూపొందించబడిన ప్రణాళిక?
1) 3వ ప్రణాళిక 2) 4వ ప్రణాళిక ( )
3) 5వ ప్రణాళిక 4) 6వ ప్రణాళిక
5. రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ (1974) చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు?
1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి ( )
3) చీఫ్ సెక్రటరీ 4) ఆర్ధిక మంత్రి
6.

ప్రణాళికల లక్ష్యాలను అమలుచేసేందుకు చేసే ఖర్చును ఏమంటారు?
1) పరి వ్యయం 2) వ్యయం ( )
3) ప్రణాళిక వ్యయం 4) ప్రణాళికేతర వ్యయం
7. ఆంధ్రప్రదేశ్ 11 ప్రణాళిక కేటాయింపు రూ.1,47,395 కోట్లు కాగా మొదటి ప్రణాళిక కేటాయింపు ఎంతగా ఉండవచ్చని అంచనా వేశారు?
1) రూ. 64.43 కోట్లు 2) రూ. 32.4 కోట్లు ( )
3) రూ. 80.4 కోట్లు 4) రూ. 96.77 కోట్లు
8. ఈ క్రింది వాటిలో 2వ ప్రణాళికకు సంబంధం లేని అంశం? ( )
1) విశాఖలో హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఏర్పాటు
2) రాష్ట్ర గిడ్డంగి సంస్థ ఏర్పాటు
3) విశాఖలో హిందూస్థాన్ షిప్‌యార్డ్ ఏర్పాటు
4) హైదరాబాద్‌లో ప్రాగాటూల్స్ ఏర్పాటు
9. మన రాష్ట్ర మొదటి మూడు పంచవర్ష ప్రణాళికల్లో అత్యధిక కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు? ( )
1) విద్యుత్ 2) సామాజిక సేవలు
3) వ్యవసాయం 4) నీటి పారుదల
10. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి 2వ ప్రణాళికలో 213 మెగావాట్లు కాగా 11వ ప్రణాళికా చివరి నాటికి ఎంతకు పెరిగింది?
1) 12,768 మె.వా 2) 13,768 మె.వా ( )
3) 14,768 మె.వా 4) 15,768 మె.వా
11. మన రాష్ట్ర ప్రణాళికలకు ఏ మార్గం ద్వారా అత్యధికంగా సుమారు 85% నిధులు సమకూరుతున్నాయి? ( )
1) ప్రపంచ బ్యాంకు రుణం
2) రాష్ట్ర బడ్జెట్ వనరులు
3) కేంద్ర ఆర్ధిక సహాయం
4) ప్రజల నుండి రుణాల రూపంలో
12. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికను ఎవరు ఆమోదించాల్సి ఉంటుంది? ( )
1) శాసనసభ 2)కేంద్ర ప్రణాళికా సంఘం
3) పార్లమెంట్ 4) రాష్ట్ర ప్రణాళికా బోర్డ్
13. నిర్ధారించిన వృద్ధిరేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును నమోదుచేసుకున్న ప్రణాళికలు?
1) 1,5,6
2) 1,5,6,7 ( )
3) 1,5,6,7,8
4) 1,5,6,7,8,10
14. మన రాష్ట్రంలో మొదటిసారిగా వికేంద్రీకృత ప్రణాళిక అను భావన ఆధారంగా జిల్లాకు కోటి రూపాయలు కేటాయించిన ప్రణాళిక?
1) 6 వ ప్రణాళిక 2) 7వ ప్రణాళిక ( )
3) 8వ ప్రణాళిక 4) 9వ ప్రణాళిక
15. ఆంధ్రప్రదేశ్ 6వ ప్రణాళికలో జరిగిన సంఘటన?
1) తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ( )
2) ప్రగతి పధం, మధ్యాహ్న భోజన పథకం
3) 20 అంశాల కార్యక్రమం
4) పైవన్నీ
16.

గరిష్ట వాస్తవిక వృద్ధి సాధించిన ప్రణాళిక ఏది?
1) 6వ ప్రణాళిక 2) 8వ ప్రణాళిక ( )
3) 9వ ప్రణాళిక 4) 10వ ప్రణాళిక
17. సూచనాత్మక ప్రణాళిక (indicative plan)అని ఏ ప్రణాళికను పిలుస్తారు?
1) 7వ ప్రణాళిక 2) 8వ ప్రణాళిక ( )
3) 9వ ప్రణాళిక 4) 10వ ప్రణాళిక
18. ఏ కారణం వల్ల 1966-69 మధ్య వార్షిక ప్రణాళికలను అమలుచేయాల్సి వచ్చింది?
1) విదేశీ దురాక్రమణలు 2) ద్రవ్యోల్బణం ( )
3) తీవ్రమైన క్షామం 4) పైవన్ని
19. 4వ ప్రణాళిక మొత్తం వ్యయంలో విద్యుత్ రంగానికి ఎంత శాతం కేటాయించారు?
1) 30 శాతం 2) 37 శాతం ( )
3) 42 శాతం 4) 48 శాతం
20. ఏ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, మహిళలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు? ( )
1) 5వ ప్రణాళిక 2) 6వ ప్రణాళిక
3) 7వ ప్రణాళిక 4) 8వ ప్రణాళిక
21. ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమైన సామాజిక మరియు కమ్యూనిటి సేవలకు మొదటి ప్రాధాన్యతనిచ్చిన ప్రణాళిక?
1) 6వ ప్రణాళిక 2) 7వ ప్రణాళిక
3) 10వ,11వ ప్రణాళిక 4) పైవన్ని
22. 8వ ప్రణాళికకు సంబంధించి తప్పుగా పేర్కొనబడిన అంశం?
1) మొదటి సారిగా మానవ వనరులఅభివృద్ధికి ప్రాధాన్యత 2) మొత్తం వ్యయంలో విద్యుత్ రంగానికి ఎక్కువ కేటాయింపులు
3) ప్రత్యేక ఏరియా అభివృద్ధి పథకం ప్రారంభమైంది
4) ఆర్ధిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి ( )
23. రాష్ట్ర వ్యవసాయ రంగం అభివృద్ధి లక్ష్యంగా రూపొందిం చిన జలయజ్ఞం ఎప్పుడు ప్రారంభమైంది? ( )
1) 2003 2) 2004
3) 2005 4) 2006
24. పదవ పంచవర్ష ప్రణాళికలో విజన్ 2020 ఏ లక్ష్యాల్ని పరిగణలోకి తీసుకున్నారు? ( )
1) జి.ఎస్.డి.పిలో 9.5% వృద్ధి
2) జనాభా వృద్ధిరేటు 0.90%
3) 2005 నాటికి సంపూర్ణ అక్షరాస్యత
4) పైవన్నీ
25. 11వ ప్రణాళికలో జలయజ్ఞానికి మొత్తం వ్యయంలో ఎంత శాతం కేటాయించారు? ( )
1) 15% 2) 19% 3) 23% 4) 27%
26. 11వ ప్రణాళికలో మొదటి ప్రాధాన్యతా రంగంగా వున్న సామాజిక సేవలకు ఎన్ని కోట్లు కేటాయించారు?
1) రూ. 34.417 2) రూ. 43,111
3) రూ. 22,582 4) రూ. 14,520
27. ఆంధ్రప్రదేశ్ 11వ ప్రణాళిక లక్ష్యాలలో తప్పుగా పేర్కొనబడినది?
1) వ్యవసాయ రంగం వృద్ధిరేటు 3.5% ( )
2) పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 8.5%
3) సేవల రంగం వృద్ధిరేటు 10.2%
4)పైవన్ని

28.
గ్రామం యూనిట్‌గా రూపొందించిన వ్యవసాయ భీమా పథకాన్ని 22 జిల్లాలకు ఎప్పుడు విస్తరించారు? ( )
1) 2005 ఖరీఫ్ 2) 2006 రబీ
3) 2007 రబీ 4) 2008 ఖరీఫ్
29.
మన రాష్ట్ర ఆదాయంలో వ్యవసాయం, సేవల రంగం వాటాలు వరుసగా మూడవ ప్రణాళిక నుండి క్రమంగా? 1) తగ్గటం, తగ్గటం 2) పెరగటం,తగ్గటం ( )
3) తగ్గటం, పెరగటం 4) పెరగటం, పెరగటం
30.
11వ ప్రణాళికలో సామాజిక రంగానికి పెద్దపీట వేయగా ఇందులో ఎక్కువ కేటాయింపులు ఏ రంగానికి దక్కాయి? 1) గృహ నిర్మాణం 2) త్రాగునీరు
3) వైద్య, ఆరోగ్యం 4) విద్య ( )
31.
11వ ప్రణాళిక కాలంలో జి.ఎస్.డి పి సగటు వృద్ధిరేటు ఎంతగా నమోదయింది? ( )
1) 8.33% 2) 8.88% 3) 9.2% 4) 9.4%
32.
ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ 11వ ప్రణాళిక సాధించిన విజయం? ( )
1) ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ద్వారా 8.5 లక్షల మందికి ఉపాధి లభించింది
2) ఐటి రంగంలో దేశంలో మొదటి స్థానం
3) సర్వ శిక్షా అభియాన్ కోసం 10 వేల కోట్లు ఖర్చు
4) రాష్ట్రీయ వికాస్ యోజనను 2009-10లో ప్రారంభించారు
ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు1.
ఆంధ్రప్రదేశ్ మొదటి పంచవర్ష ప్రణాళికలో అంచనా వేసిన పెట్టుబడి సుమారు ? నగూప్-2, 2008)
1. రూ.100 కోట్లు 2. రూ. 200 కోట్లు ( 1 )
3. రూ. 250 కోట్లు 4. రూ.300 కోట్లు
2.
ఆంధ్రప్రదేశ్ 10వ పంచవర్ష ప్రణాళికలో మొత్తంలో అత్యధిక వాటా? నగూప్-2, 2008) ( 3 )
1. ఇంధన (పవర్)రంగం 2. నీటి పారుదల రంగం
3. సాంఘిక రంగం 4. గ్రామీణాభివృద్ధి రంగం
3.
11వ పంచవర్ష ప్రణాళికలో అంచనా వేయబడిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగ సగటు వార్షిక వృద్ధి రేటు ? నగూప్-2, 2011)
1. 5.5% 2. 5.0% ( 4 )
3. 6.0% 4. 4.5%
4.
ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చాలా వరకు పంచవర్ష ప్రణాళికల విజయం దేని పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ? నగూప్-2, 2008) ( 4 )
1. సేవల రంగం 2. పారిశ్రామిక రంగం
3. ఎగుమతుల రంగం 4. వ్యవసాయ రంగం
5.
12వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమవుతుంది ? నగూప్-2, 2008)
1. ఏప్రిల్ 2012 2. మార్చి 2012 ( 1 )
3. ఆగస్టు 2012 4. జూన్ 2012

Other News