Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Wednesday, May 22, 2013
 


Home >> Engeneering Plus
ఇంజనీరింగ్ లో బ్రాంచ్ సెలక్షన్ ఎలా?

Eng-heading talangana patrika telangana culture telangana politics telangana cinemaఇంజనీరింగ్ బ్రాంచ్‌లకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు... నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోవడం, లేదా పరిశ్రమలోని వారిని సంప్రదించే బదులు... మార్కెట్ పరిస్థితులకు స్పందించి, అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కెరీర్... దీర్ఘకాలిక అంశం. అందువల్ల ఇప్పుడు ఎంచుకునే కోర్సు కెరీర్‌పై జీవితాంతం ప్రభావం చూపుతుంది. మరో విషయమేమంటే... తమ పిల్లల భవిష్యత్ కోసం మధ్య తరగతి తల్లిదండ్రులు తమ సర్వస్వం వెచ్చించడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా... కోర్సు ఎంపిక అత్యంత కీలకాంశం.

ఇంజనీరింగ్‌లో కొన్ని కోర్ బ్రాంచ్‌లు
- సివిల్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (ఈఈఈ)
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)
సివిల్ ఇంజనీరింగ్
ముందుగా సివిల్ ఇంజనీరింగ్‌ను తీసుకుంటే... పురాతన ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో ఇదొకటి. దీనికి సంబంధించి దాదాపు అన్ని కాలేజీల్లోనూ మంచి మౌలిక వసతులు ఉంటాయి. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కూడా అందుబాటులో ఉంటారు. ఎప్పటికీ డిమాండ్ తగ్గని కోర్సుల్లో ఇదొకటి. ఇది అద్భుతమైన కోర్సు అని కొందరంటే... ఎక్కువగా సైట్‌లో గడపాల్సి వస్తుందని, శారీరక శ్రమ అధికంగా ఉండే కోర్సని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే సివిల్ ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థికి విశ్లేషణాత్మక సామర్థ్యంతోపాటు ప్రాక్టికల్ ధోరణి ఉండాలి. దాంతోపాటు ప్రతి చిన్న అంశాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలించగలిగే నైపుణ్యం, విజువలైజేషన్ కూడా చాలా అవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్, టీంతో కలసి పనిచేయడం చాలా అవసరం. సివిల్ ఇంజనీర్లు ప్రభుత్వ విభాగాల్లో, ప్రభుత్వ రంగ కంపెనీల్లో... ఇటు ప్రైవేట్ పరంగా నిర్మాణ రంగంలోనూ కెరీర్ ప్రారంభించవచ్చు.

షార్ట్‌టర్మ్ కోర్సులు : ఆటోక్యాడ్, ఎస్.టి.ఎ.ఎ.డి., ఎ.ఎన్.వై.ఎస్ (ఎన్‌సిస్) వంటి షార్ట్‌టర్మ్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తమ ప్రతిభను, అవకాశాలను మరింతగా మెరుగు పరచుకోవచ్చు.

మెకానికల్ ఇంజనీరింగ్
మెకానికల్ ఇంజనీరింగ్... అన్నిటికంటే విస్తృతమైన బ్రాంచ్ మాత్రమే కాదు. ఎవర్‌గ్రీన్ బ్రాంచ్ అని కూడా దీనికి పేరు! పరిశ్రమలో అన్నిరకాల యంత్రాల నుంచి మొదలుపెట్టి.. స్టీమ్ ఇంజన్‌లు, ఐసీ ఇంజన్‌లు, గ్యాస్ టర్పైన్‌లు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, జెట్ ఇంజన్ల వరకూ... అన్నింటితో సంబంధమున్న సబ్జెక్టు.. మెకానికల్ ఇంజనీరింగ్. కొత్త ప్రొడక్ట్స్ డిజైనింగ్‌లో, పాత వాటి రిపేరింగ్‌లోనూ వీరిదే కీలక పాత్ర. మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులకు డ్రాయింగ్‌పై ఆసక్తి ఉండాలి. న్యూమరికల్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ చాలా అవసరం. మాథ్స్, ఫిజిక్స్ పట్ల ఇష్టముండాలి. కొంత క్రియేటివ్ మైండ్ ఉంటే... కోర్సులో ఉత్తమంగా రాణించడానికి వీలవుతుంది. మెకానికల్ ఇంజనీర్లకు ఆటోమొబైల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్, స్టీల్ ప్లాంట్‌లు, ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్, రిఫైనింగ్, స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో జాబ్స్ లభిస్తాయి. తాజాగా బీటెక్ పూర్తిచేసుకొని బయటకు వచ్చిన అభ్యర్థులు ప్రభుత్వ రంగ విభాగాల్లో... జూనియర్ ఇంజనీర్లుగా చేరి.. పదోన్నతుల ద్వారా.. అసిస్టెంట్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లుగా ఎదగొచ్చు. జీతభత్యాల విషయానికొస్తే.. రూ. 10,000ల నుంచి ప్రారంభించి... అనుభవం, ఎంబీఏ వంటి ఉన్నత విద్య ద్వారా రూ. 40,000ల వరకూ పొందవచ్చు. ప్రభుత్వ విభాగాల్లో స్కేల్‌ను బట్టి జీతభత్యాలు లభిస్తాయి.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ రంగాలకు పూనాది...ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్! ఇది విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నిర్వహణకు సంబంధించిన బ్రాంచ్. నిజానికి కరెంట్‌తో సంబంధమున్న అన్ని పరికరాలను ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పవర్ కార్పొరేషన్లలో ఎలక్ట్రికల్ మెషిన్ల డిజైన్‌లో వీరు పాలుపంచుకుంటారు. అందువల్ల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అభ్యర్థులకు అవకాశాలు ఎప్పటికీ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు కంపెనీని బట్టి వార్షిక వేతనం రెండున్నర లక్షల నుంచి పదిహేను లక్షల వరకూ ఉంటుంది.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ను చూస్తే... ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే ఏర్పాటైన కోర్సులా అనిపిస్తుంది. ఈ కోర్సు చేసిన విద్యార్థు లకు అవకాశాలు అంత విసృ్తతంగా ఉంటాయి మరి! దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో... ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది.

వాస్తవానికి కొద్దికాలంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులు అత్యధిక శాతం మంది సాప్ట్‌వేర్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకుంటు న్నారు. వీరికి జీతభత్యాలు భారీగానే ఉంటాయి. కమ్యూనికేషన్ టెక్నాలజీ, రాడార్ టెక్నాలజీ మొదలైన వాటిలోనూ అవకాశాలు బాగానే ఉన్నాయి. ప్రైవేట్ రంగానికి సంబంధించి కొంచెం మంచి కాలేజీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లోనే ఉద్యోగం లభిస్తుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... సీఎస్‌ఈ
ప్రస్తుత ట్రెండ్‌ను పరిగణనలోకి తీసుకొని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్సులకు డిమాండ్ లేదని చెప్పడం సరికాదు. ప్రతిరంగంలోనూ కంప్యూటరీకరణ వేగంగా జరుగుతున్నందున ఈ పరిస్థితి తాత్కాలికమేనని చెప్పొచ్చు. కాలేజీలకు క్యాంపస్ ఇంటర్వ్యూ లకు వెళ్తున్న టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సీఎస్‌ఈ విద్యార్థులకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అందువల్ల కోర్ సబ్జెక్టుల్లాగే ఈ రెండు బ్రాంచ్‌లనూ విద్యార్థులు తమ ప్రాధాన్యత క్రమంలో చేరుస్తున్నారు!!

ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీపైనే విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అందుకే కౌన్సిలింగ్‌లో ఆప్షన్స్‌ను ఇచ్చేటప్పుడు మనం తీసుకునే బ్రాంచీలో ఉత్తమ బోధన సిబ్బంది ఉన్నారా లేరా అనేది మొదట పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత బ్రాంచ్, కాలేజీ ఎంపికకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా కాకుండా మంచి బ్రాంచ్ వచ్చిందని బోధన సిబ్బందిలేని కాలేజీలో చేరితే ఆ విద్యార్థి ఆ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్టును ఎప్పటికీ నేర్చుకోలేడు. అందుకే కోర్సు కాలేజీ రెండూ దృష్టిలో పెట్టుకోవల్సిన అంశాలే.

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine