|
|
మా అబ్బాయి మనస్తత్వానికి కంప్యూటర్ ఇంజనీరింగ్ సరిపోతుందా?
ప్ర -  మా అబ్బాయి ఎంసెట్ ఎగ్జామ్‌కు హాజరయ్యాడు. అతనిది ఒకచోట కుదురుగా కూర్చునే మనస్తత్వం కాదు. బిటెక్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఎంచుకోవాలని వాళ్ళ మమ్మీ కోరుతోంది. కంప్యూటర్ ఇంజనీర్‌గా జీవితంలో స్థిరపడి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో అబ్బాయి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా లేదా చెప్పండి? - పి. జీవన్‌రావు, చిట్యాల జ - ప్రతి విద్యార్థీ తాను ఎన్నుకున్న కోర్సు ఏదైనా, ఆ తరువాత తాను చేస్తున్న ఉద్యోగం ఏదైనా బాగా రాణించాలంటే ఏకాగ్రత, పట్టుదల, కృషి అవసరం. ఇవి ఒక ఇంజనీరింగ్ లేదా దానిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగుకే పరిమితం కాదు. కాబట్టి మీ అబ్బాయికి ఈ విషయాన్ని బోధపడే విధంగా చెప్పి ఆయన దృక్పథాన్ని మార్చాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే వారు తమ ఇష్టాన్ని పిల్లల మీద రుద్దినట్లయితే తరువాత ఇబ్బం దుల్లో పడే అవకాశముంది. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల ప్రతిభాపాటవాలను అంచనా వేసుకొని పిల్లల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకొని సబ్జెక్టుని ఎంచుకుంటే మంచిది.
ప్ర - బిటెక్ ఈసిఈ కోర్సు రెండో ఏడాది చదువుతున్న మా అబ్బాయి కమ్యూనికేషన్ ఇంజ నీరింగ్ పాఠాలు ఎంతకీ అర్థం కావడం లేదని అంటున్నాడు. కమ్యూనికేషన్ సబ్జెక్టులు ఈజీగా అర్థం కావడానికి మా బాబు ఏవైనా పుస్తకాలు ప్రిపేరయితే బావుంటుందా చెప్పండి? కమ్యూనికేషన్ సబ్జెక్టులు సులువుగా, ఇష్టంగా నేర్చుకునే పద్ధతి ఏదైనా ఉంటే తెలపండి ? - ఎస్.కార్తీక్‌రెడ్డి, తరిగొప్పల జ - బి.టెక్(ఈసిఈ) కోర్సులో కమ్యూనికేషన్‌కి సంబంధించిన వివిధ అంశాలను ఫండమెంటల్స్ మొదలుకొని అడ్వాన్స్‌డ్ విషయాలన్నిటినీ సిలబస్‌లో పొందుపరిచారు. ఏ సబ్జెక్ట్‌లోనైనా మంచి అవగాహన ఉండాలంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన మూలాంశాలను అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ సబ్జెక్టు అర్థం కావాలంటే విద్యార్థి ఫిజిక్స్, గణితంలో మంచి అవగాహన ఉండి ఉండాలి. ఆ తరువాత ఏ సబ్జెక్టులోనైనా బాగా రాణించాలంటే ఈ కింది విషయాలను పాటించాలి. - రోజు వారీ తరగతులకు అటెండ్ కావాలి. - పాఠ్యాంశాలను రోజువారీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. - సబ్జెక్టుకు సంబంధించిన ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ను చేయడం ద్వారా అవగాహనను పెంచుకోవడం. - అర్థంకాని విషయాన్ని టీచర్‌ను గానీ, తోటి విద్యార్థులను గానీ అడిగి తెలుసుకోవడం. - గైడులను చదవకుండా ఉండటం - సిలబస్‌లో పొందుపరచిన పుస్తకాలు చదవడాన్ని అలవర్చుకోవడం
కమ్యూనికేషన్‌కు సంబంధించిన కొన్ని పుస్తకాలు : 1) Electronic Communication System by George Kennedy, Bernard Davis 2) Comunication Systems by Simon Haykin 3) Electronic Communication System by Wayne Tomasi 4) Principles of Communication Systems by Tanb and Schilling
ప్ర - బిటెక్ మెకానికల్ ఇంజనీ రింగ్ మొదటి ఏడాది కోర్సు చదువుతున్నాను. నేను నాస్కా మ్ నిర్వహించే పరీక్షలు ఏమైనా హాజరు కావాల్సి ఉంటుందా? నాస్కామ్ నిర్వ హించే పరీక్షలు ఏమిటి ? కేవలం కంప్యూటర్ ఇంజనీ రింగ్ విద్యార్థులకే నాస్కామ్ పరీక్షలు అవసరమా లేక మెకా నికల్ ఇంజనీరింగ్ విద్యార్థు లు కూడా నాస్కామ్ పరీక్షలు రాయాల్సిన పరిస్థితి ఉంటుం దా తెలపండి ? - బి. కుమారి, కరీంనగర్. జ. నాస్కామ్ పరీక్షలకు, మీరు చేస్తున్న మెకానికల్ ఇంజనీరింగ్ ఎలాంటి సంబంధం లేదు. నాస్కామ్ పరీక్షలు సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినవి. కాబట్టి మీరు చదువుతున్న మెకానికల్ సబ్జెక్టుని బాగా చదువుకుని దానిలో మంచి ప్రావీణ్యత పొందండి.
Other News
|
|