Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> School News
ఆసక్తి గొలిపే చదువు గణితం ఇక సులువు

ప్రస్తుతం విజ్ఞానంతో పాటు సృజనాత్మకత పెంచే చదువులు చాలా అవసరం. బడికి వెళ్లి తరగతి గదిలో చెప్పే పాఠాలతోనే సరిపెట్టుకుంటే ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం కష్టం. అందుకే చిన్న తనం నుంచే సృజన్మాతకతను పెంచేలా విద్యాబోధన ఉండాలి. ముఖ్యంగా 6 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులకు ‘అబాకస్’ మ్యాథ్స్ సబ్జెక్టు పట్ల ఆసక్తి కలిగించడమే కాకుండా ఆత్మ విశ్వాసాన్ని... సృజనాత్మకతను పెంచేలా తోడ్పడుతుంది.
లెక్కలు సులభంగా చేసేందుకు చైనీయులు కనుగొన్న విధానమే అబాకస్. ఇందులో పది లెవెల్స్ ఉంటాయి. దీర్ఘచతురస్రకారంగా ఉన్న అబాకస్ ఇన్‌స్ట్రుమెంట్ సాయం తో సృజనాత్మకంగా లెక్కలు చేసే విధంగా శిక్షణ ఇస్తారు.

ప్రస్తుత పోటీ పరీక్షల వాతావరణంలో నెగ్గుకు రావాలంటే విద్యార్థులకు ఆలోచన, విశ్లేషణా సామర్ధ్యం, వేగం అవసరం. చిన్నప్పటి నుంచి ‘అబాకస్’ శిక్షణ ద్వారా వీటిని మెరుగుపరచవచ్చు. పాఠశాలలు ప్రస్తుతం పాఠాలు చెప్పడం వరకే ఆగిపోవడం లేదు. విద్యార్థులను ‘ఆల్ రౌండర్లుగా’ చేస్తున్నాయి. అబాకస్ దీనికి దోహదం చేస్తుంది. జాతీయ స్థాయి పరీక్షలైన ‘నీట్, ఐఐటీలకు ప్రాధాన్యం ఇస్తున్న దాదాపు అన్ని పాఠశాలల్లో అబాకస్ తరగతుల ఏర్పాటుకు ఇదే కారణం. కేవలం గణితం అంశానికి మాత్రమే కాకుండా అబాకస్ వల్ల పెరిగే విశ్లేషణా సామర్ధ్యం, సైన్స్ నేర్చుకోవడంలోనూ ఉపకరిస్తుంది. విద్యార్థులలో ప్రశ్నించే తత్వం అలవడుతుంది. ఇది సైన్స్‌లోని వివిధ అంశాల కాన్సెప్ట్స్‌పై చక్కటి అవగాహన కల్పిస్తుంది.
సాధారణంగా చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు అయిష్టత చూపుతారు. ఇలాంటి విద్యార్థులను ఆకట్టు కొనేందుకు కూడా అబాకస్ ఉపయోగ పడుతుంది. ఇన్‌స్ట్రుమెంట్, అందులోని బెడ్స్ (పూసలు) ఆట వస్తువులుగా ఉన్నందున విద్యార్థులకు ఆసక్తిగా ఉంటుంది. ‘ఆడుతూ’ నేర్చుకునే ఇలాంటి చదువుల వల్ల విద్యార్థులు శ్రమగా భావించరు. దీర్ఘకాలంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఊహించే శక్తి, సునిశిత పరిశీలన, సమాచార విశ్లేషణ (Information Analysis), విభిన్న విషయాలను వినడం, వేగంగా చదవడం తదితర ప్రయోజనాలు విద్యార్థులకు కలుగుతాయి.
వేదిక్ మ్యాథ్స్ వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇది ఎనిమిదో తరగతి, ఆపై విద్యార్థులకు ప్రయోజనకరం. సాధారణంగా ఎనిమిదో తరగతి నాటికి ‘గణితం’లో విద్యార్థుల ప్రతిభా పాఠవాలపై ఉపాధ్యాయులకు అవగాహన ఉంటుంది. ‘వేగం’ అందిపుచ్చుకోవడంలో వెనకబడ్డ వారిని ‘వేదిక్ మ్యాథ్స్’ శిక్షణ ద్వారా రాటు దేల్చవచ్చు. ప్రాథమికంగా గణితం పట్ల మొదటి దశలో భయం పోతుంది. ఆ తరువాత ఆలోచన సరళి మారుతుంది. ‘రైట్’ బ్రెయిన్ ఉపయోగం పెరిగి.. సృజనా త్మకంగా ఆలోచించడం విద్యార్థులకు అలవడుతుంది. ఇది ఆయా పాఠశాలలకు మంచి పేరు తెస్తుంది.
వేదిక్ మ్యాథ్స్ విద్యార్థులలో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సృజనాత్మకతను పెంపొందిస్తుంది. ఇందులో ఆసక్తిని రేకెత్తించేలా ‘‘కాన్సెప్ట్స్’’ ఉంటాయి. పైగా నేర్చుకోవ డానికి సరళమైంది కూడా. ఫలితంగా విద్యార్థులకు మంచి ప్రయోజనం ఉంటుంది.

రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అయ్యేలా..
సాధారణంగా పుస్తకాల్లో ఉండే అంశాలను చదివేందుకు లెఫ్ట్‌బ్రెయిన్ ఉపయోగపడుతుంది. అయితే రైట్ బ్రెయిన్ కేవలం ఇమేజెస్ (చిత్రాలు) మాత్రమే చూడగలుగుతుంది. జ్ఞాపకశక్తిలోనూ, సృజనాత్మకతలోనూ ఎంతో ప్రభావ వంతమైన రైట్ బ్రెయిన్‌ను సమర్ధవంతంగా వినియోగంలోకి తీసుకురావడంలోనూ అబాకస్ ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా
-చిన్నతనంలోనే గణితం పట్ల ఆసక్తిని ఏర్పర్చి భయం పోగొడుతుంది.
-కూడికలు, తీసివేతలు పెన్ను, పేపర్ లేకుండా చేసేలా సామర్ధ్యం పెరుగుతుంది.
-ఒలింపియాడ్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు ప్రయోజనకరంగా ఉంటుంది.
-విద్యార్థుల్లో ఏకాగ్రత బాగా పెరుగుతుంది.
-సృజనశక్తి, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాలు సైతం పెరిగి విద్యార్థి సంపూర్ణాభివృద్ధికి దోహదం చేస్తుంది.

ఏ లెవెల్‌లో ఏం నేర్పుతారు
లెవెల్ 1 ఎడిషన్ (కూడికలు)
లెవెల్ 2 డబుల్ డిజిట్ ఎడిషన్, సబ్‌ట్రాక్షన్, సింగిల్ డిజిట్ (మెంటల్ కాలిక్యులేషన్)
లెవల్ 3 మల్టిప్లికేషన్
లెవల్ 4 డివిజన్ మల్టిప్లికేషన్ (మెంటల్ కాలిక్యులేషన్)
లెవల్ 5 3x2 డిజిట్ మల్టిప్లికేషన్ (eg :- 121 x 24, 222 x 56)
లెవల్ 6 ఇంట్రడక్షన్ టూ డెసిమల్ నెంబర్
లెవల్ 7 డెసిమల్ నంబర్, మల్టిప్లికేషన్
లెవల్ 8 పర్సెంటేజెస్
లెవల్ 9 స్కేర్ రూట్స్
లెవెల్ 10 క్యూబ్ రూట్స్
ఇలా ఒక్కో లెవల్‌లో ఒక్కో మేథమెటికల్ ఆపరేషన్ నేర్పిస్తారు. అబాకస్ ఉపయోగిస్తూ శిక్షణ ఇచ్చి నెమ్మదిగా ఎలాంటి అబాకస్ లేదా పెన్ను, పేపర్ లేకుండా మౌఖికంగా ఊహిస్తూ లెక్కలు పూర్తి చేసేలా శిక్షణ ఉంటుంది.

వేదిక్ మ్యాథ్స్‌తో ‘‘మ్యాథ్స్ ఈజీ’’
7వ తరగతి ఆపై చదువుతున్న (10 వ తరగతి వరకు) విద్యార్థులకు వేదిక్ ‘మ్యాథ్స్’ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ‘మూడు లెవెల్స్’ ఉంటాయి.
లెవెల్ 1 మల్టిప్లికేషన్, కండిషనల్ మల్టిప్లికేషన్
లెవెల్ 2 డివిజన్, సబ్‌ట్రాక్షన్
లెవెల్ 3 స్కేర్ ఆఫ్ నంబర్స్, క్యూబ్స్, స్కేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, ఆల్ జీబ్రా
గణితం అంటే భయం ఉన్న లేదా ఆ సబ్జెక్టులో వెనకబడ్డ విద్యార్థులకు వేదిక్ మ్యాథ్స్ కోర్స్ ప్రయోజనకరంగా ఉంటుంది.

వేగం, సృజన పెరుగుతాయి
అబాకస్, వేదిక్ మ్యాథ్స్ వల్ల విద్యార్థులలో గణితం పట్ల భయం తొలగిపోతుంది. అదే విధంగా సృజనాత్మకత సైతం పెరుగుతుంది. డల్‌గా ఉండే విద్యార్థులు కూడా వేగం పుంజుకుంటారు. అన్నింటిని మించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పోటీ పరీక్షల ప్రపంచంలో ఈ కోర్స్ నేర్చుకున్న విద్యార్థుల ప్రతిభ ఖచ్చితంగా ఇనుమడిస్తుంది. అబాకస్ విద్యార్థులను పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది.
- రేనా పహ్వా
అబాకస్, వేదిక్ మ్యాథ్స్, ఇన్‌స్ట్రక్టర్

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine