Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Monday, May 20, 2013
 


Home >> School News
గెలుదాం... గ్రూప్-2 పేపర్-2

ఇదీ సిలబస్ :
1. భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం
2. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, అల్ప సంఖ్యాక వర్గాలకు సదుపాయాలు
3. ఎస్.సి,ఎస్.టి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు
4. ఎస్.సి, ఎస్.టి లపై అకృత్యాల నివారణ చట్టం
5. జాతీయ రాష్ట్ర ఎస్.సి, ఎస్.టి, కమిషన్
6. మహిళా కమిషన్
7. జాతీయ, రాష్ట్రాల మైనార్టీ కమిషన్
8. మానవ హక్కుల కమిషన్
పై సిలబస్‌తో పాటుగా, వివిధ వర్గాలు, మహిళలకు రాజ్యాంగంలో కల్పించిన ప్రత్యేక రక్షణలను అధికరణలతో సహా గుర్తుంచుకోవాలి. వివిధ వర్గాల అభ్యున్నతికి ఏర్పాటు చేసిన కమిషన్‌లను, వివిధ కమిషన్‌ల అధికారులు, సభ్యుల సంఖ్య, వారి పదవీకాలం, వారిని ఎవరు నియమిస్తారు మొదలైన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టాలి.
1. ఏ అధికరణం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ కులాలు, తెగల వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించబడింది? ( )
1) ఆర్టికల్ 15 2) ఆర్టికల్ 15(4)
3) ఆర్టికల్ 16 4) ఆర్టికల్ 16(4)
2. ఏ కేసులో సుప్రీంకోర్టు రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించరాదని తీర్పు వెలువరించింది? ( )
1) నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
2) ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
3) గోపాలన్ వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం
4) కేశవానంద భారతి కేసు
3. షెడ్యూల్డ్ కులాలను నిర్ధారించే అధికారం ఎవరికి ఉంది?
1) సుప్రీంకోర్టు 2) మంత్రి మండలి ( )
3) రాజ్యసభ 4) రాష్ట్రపతి
4. రాజ్యాంగ ప్రకారం ఏ రాష్ట్రాలకు గిరిజన సంక్షేమం కోసం మంత్రి తప్పని సరి? ( )
1) బీహార్, మధ్యప్రదేశ్, మణిపూర్
2) అసోం, నాగాలాండ్, మణిపూర్
3) బీహార్, మధ్యప్రదేశ్, ఒడిశా
4) ఒడిశా, నాగాలాండ్, బీహార్
5. ప్రస్తుతం ఏ రాష్ట్రాలకు గిరిజన సంక్షేమం కోసం మంత్రిని గవర్నర్ తప్పని సరిగా నియమించాలి? ( )
1) బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్
2) జార్ఖండ్, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా
3) జార్ఖండ్, ఒడిశా, బీహార్
4) పైవి ఏవి కావు
6. 6వ షెడ్యూల్ ఏ రాష్ట్రాలలోని గిరిజనులకు ప్రత్యేక పాలనా ఏర్పాట్లను గురించి తెలియ జేస్తుంది? ( )
1) అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం
2) అసోం, ఒడిశా, బీహార్
3) అసోం, త్రిపుర, మిజోరాం
4) బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్
7. అంటరానితనం నిషేధ చట్టం ఏ సంవత్సరంలో రూపొం దించారు? ( )
1) 1955 2) 1947
3) 1950 4) 1970
8. ఎస్.సి, ఎస్.టిల వేధింపు నిరోధక చట్టం ఏ సంవత్సరంలో చేయ బడింది? ( )
1) 1984 2) 1985
3) 1987 4) 1989
9. ఎస్.సి, ఎస్.టిల వేధింపు నిరోదక చట్టం ప్రకారం విచారణ అధికారిగా ఎవరిని నియమి స్తారు? ( )
1) సర్కిల్ ఇన్స్‌పెక్టర్ 2) ఎ.సి.పి
3) డి.సి.పి 4) డి.ఎస్.పి
10. జాతీయ షెడ్యూల్డ్‌‌డ కులాలు మరియు తెగల కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు? ( )
1) ఎస్.హెచ్.రామ్‌ధాన్ 2) పి.ఎల్.పూనియా
3) యం. హనుమంతప్ప 4) దిలీప్‌సింగ్ భూరియా
11. వెనుకబడిన తరగతుల స్థితిగతులను పరిశీలించడానికి 1953లో ఎవరి అధ్యక్షతన కమిషన్ నియమించారు?
1) బి.పి. మండల్ 2) కాకా కాలేకర్ ( )
3) పొన్నస్వామి 4) ఇందిరా సహాని
12. వెనుకబడిన తరగతుల కోసం మండల్ కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం? ( )
1) జనతాదల్ 2) జనతా
3) కాంగ్రెస్ 4) ఎన్.డి.ఎ
13. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేశారు? ( )
1) 62వ సవరణ 2) 65వ సవరణ
3) 89వ సవరణ 4) 90వ సవరణ
14. మహిళలకు చట్టసభల్లో 33శాతం కల్పించటానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు? ( )
1) 103 2) 105
3) 108 4) 111
15. జాతీయ మహిళా కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1989 2) 1990
3) 1991 4) 1992
16. జాతీయ మహిళా కమిషన్ సభ్యుల పదవి కాలం?
1) 2 సం॥ 2) 3 సం॥ ( )
3) 5 సం॥ 4) 6 సం॥
17. జాతీయ మహిళా కమిషన్ తొలి అధ్యక్షురాలు?
1) జయంతి పట్నాయక్ 2) పార్థసారధి ( )
3) మోహిని గిరి 4) గిరిజా వ్యాస్
18. గృహ హింస రక్షణ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం?
1) మార్చి 8, 2008 2) మార్చి 8, 2006 ( )
3) అక్టోబర్26, 2006 4) అక్టోబర్ 26, 2007
19. ఆంధ్రప్రదేశ్ మహిళల కమిషన్ చట్టం 1998, సెక్షన్19(1) ప్రకారం కమిషన్ కనీసం ఎన్ని నెలలకొకసారి సమావేశం కావాలి?
1) 1నెల 2) 3 నెలలు ( )
3) 6 నెలలు 4) 2 నెలలు
20. జాతీయ మైనారిటీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1978 2) 1992 ( )
3) 1993 4) 1994
21. జాతీయ మైనారిటీ కమీషన్‌కు చట్టబద్దత కల్పించడానికి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు? ( )
1) 101 2) 102
3) 103 4) 104
22. జాతీయ మైనారిటీ కమిషన్‌లో ఒక ఛైర్మన్‌తో పాటుగా ఎంత మంది సభ్యులుంటారు? ( )
1) ఇద్దరు 2) ముగ్గురు 3) నలుగురు 4) ఐదుగురు
23. ప్రతి జిల్లాలో మానవ హక్కుల కోర్టుగా పరిగణింపబడేది?
1) సెషన్స్ కోర్టు 2) పంచాయితి ( )
3) గ్రామసభ 4) కలెక్టరేట్
జాతీయ స్థాయిలో వివిధ కమిటీలు
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్

- 89వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.
- ఈ కమిషన్‌లో ఒక చైర్మన్, వైస్ చైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులుంటారు.
- వీరి పదవి కాలం ః 3 సంవత్సరాలు
- ప్రస్తుత ఛైర్మన్ ః పి.ఎల్. పూనియా
జాతీయ షెడ్యూల్డు తెగలు కమిషన్
- 89వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డు కులాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు.
- ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ముగ్గురు ఇతర సభ్యులుంటారు.
- వీరి పదవి కాలం ః 3 సంవత్సరాలు.
- ప్రస్తుత ఛైర్మన్ ః రామేశ్వర్ ఓరాన్.
రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, తెగల కమిషన్
- 1993లో మన రాష్ట్రంలో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులుంటారు.
- వీరి పదవి కాలంః 3 సంవత్సరాలు
జాతీయ మైనారిటీ కమిషన్
- ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, వైస్ ఛైర్మన్,
5 గురు సభ్యులుంటారు.
- వీరి పదవీ కాలం ః 3 సంవత్సరాలు.
- ప్రస్తుత ఛైర్మన్ ః వజాహత్ హబీబుల్లా
వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
- 1953లో కాకా కాలేకర్ అధ్యక్షతన మొదటి కమిషన్
- 1978లో బి.పి. మండల్ అధ్యక్షతన రెండవ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నియామకం.
- 1993 ఏప్రిల్ 2వ తేది నుంచి ఈ కమిషన్ అమలులోకి వచ్చింది.
- ఈ కమిషన్‌లో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, నలుగురు సభ్యులుంటారు.
- వీరి పదవీ కాలం ః 3 సంవత్సరాలు.
- ప్రస్తుత ఛైర్మన్ ః జస్టిస్ మకాని నారాయణరావు
జాతీయ మహిళా కమిషన్
- 1992లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ కమిషన్‌లో ఒక ఛైర్‌పర్సన్, 5 గురు సభ్యులుంటారు.
- వీరి పదవి కాలం ః 3 సంవత్సరాలు.
- ప్రస్తుత ఛైర్మన్ ః మమతా శర్మ.
జాతీయ మానవ హక్కుల కమిషన్
- 1993లో ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- ఈ కమిషన్‌లో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులుంటారు. అలాగే జాతీయ మైనారిటీ, షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల, మహిళా కమిషన్ అధ్యక్షులు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు.
- వీరి పదవి కాలం ః 5 సం.లు లేదా 70సం॥ వయస్సు
- ప్రస్తుత ఛైర్మన్ ః జస్టిస్ కె.జి. బాలకృష్ణన్
వివిధ వర్గాల సంక్షేమం కోసం రాజ్యాంగంలో పొందుపర్చబడిన ముఖ్యమైన అధికరణాలు
- 15 - పౌరులను కుల, మత, లింగ పరంగా వివక్ష చూపరాదు
- 15(4) - సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వారు లేదా ఎస్.సి,ఎస్.టిల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేయవచ్చు.
- 15(5) - 93 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది. ఎస్.సి,ఎస్.టి, బి.సి.లకు విద్యాసంస్థలలో రిజర్వేషన్లు
- 16 - ప్రభుత్వోద్యోగాలలో అందరికి సమాన ఉద్యోగావ కాశాలు
- 16(4) - ప్రభుత్వోద్యోగాలలో రిజర్వేషన్లు
- 16(4-ఎ) - ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పదోన్నతిలో రిజర్వేషన్లు.
- 17 - అంటరానితనం నేరం.
- 23 - ట్రాఫికింగ్, వెట్టిచాకిరి, జోగిని, దేవదాసీ లాంటి సాంఘిక దురాచారాల నిషేదం.
- 24 - 14 సంవత్సరాలలోపు వయస్సుగల పిల్లల చేత ప్రమాదభరిత ఉత్పత్తి ప్రక్రియలో పని చేయించరాదు.
- 29 - అల్ప సంఖ్యాక వర్గాల వారు తమ భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే ఏర్పాట్లు.
- 30 - మైనారిటీలచే ప్రత్యేక విద్యాసంస్థల ఏర్పాటుకు అవకాశం
- 39 - స్త్రీ, పురుషులకు సమాన హక్కులు,సమాన పనికి సమాన వేతనం.
- 43(ఎ) - ఫ్యాక్టరీ నిర్వహణలో కార్మికులకు భాగస్వామ్యం
- 44 - ప్రజలందరికీ ఉమ్మడి పౌరస్మృతి.
- 46 - బలహీన వర్గాల, ఎస్.సి, ఎస్.టి ల ఆర్థికాభి వృద్ధికి, విద్యావకాశాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
- 243(డి) - పంచాయితీరాజ్ వ్యవస్థలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలకు రిజర్వేషన్లు.
- 243(టి) - మున్సిపాలిటీ వ్యవస్థలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలకు రిజర్వేషన్లు.
- 244 - షెడ్యూల్డ్ మరియు ఆదివాసి ప్రాంతాల పరిపాలన
- 330 - షెడ్యూల్డ్ కులాలు, తెగలకు లోక్‌సభలో రిజర్వేషన్లు
- 332 - రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగలు, కులాలకు రిజర్వేషన్లు.
- 335 - కేంద్ర,రాష్ట్ర సర్వీసులలో షెడ్యూల్డ్‌‌డ కులాలు, తెగలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి.
- 338 - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్
- 338(ఎ) - షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్
- 340 - వెనుకబడిన తరగతుల స్థితిగతుల అధ్యయ నానికై కమిషన్
- 341 - రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా షెడ్యూల్డ్ తెగలుగా నిర్ధారించటం లేదా తొలగించడం.
ANS
ఇదే యూనిట్ నుంచి గత ఎగ్జామ్స్‌లో
వచ్చిన ప్రశ్నలు

1. విద్యా సంస్థల్లో షెడ్యూల్డ్ కులాల వారికి, తెగల వారికి రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన అధికరణం ? నగూప్-2, 2012 లిమిటెడ్)
1. 15(4) రాజ్యాంగ అధికరణం ( 1 )
2. 16(4) రాజ్యాంగ అధికరణం
3. 29 (2) రాజ్యాంగ అధికరణం
4. 14 వ రాజ్యాంగ అధికరణం
2. కింది వానిలో ఏది రాజ్యాంగ సంస్థ ? ( 4 )
నగూప్-2, 2012 లిమిటెడ్)
1. మైనారిటీల జాతీయ కమిషన్
2. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్
3. జాతీయ అటవీ కమిషన్
4. పైవి ఏవీ కావు
3. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అధికారాలకు సంబంధించిన అధికరణం? నగూప్-2, 2011) ( 1 )
1. 338 ఎ 2. 340
3. 339 బి 4. 340 ఎ
4. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి ఉద్యోగ కాలం ? నగూప్-2, 2011) ( 2 )
1. 2 సం॥ 2. 3 సం॥
3. 4 సం॥ 4. 5 సం॥
5. జాతీయ మానవ హక్కుల సంఘం స్థాపించిన సం॥ ? నగూప్-2, 2011) ( 4 )
1. 1990 2. 1992
3. 1991 4. 1993

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine