|
|
ఎక్స్‌ట్రా క్లాసులు ఎంతవరకు ఉపయోగం?
స్కూల్స్ తెరవడంతో పాటే ఎక్స్‌ట్రా క్లాసులు ప్రారంభమయ్యాయి. అంటే స్కూల్ వేళలు ముగిసిన తర్వాత పిల్లలను స్కూల్‌లోనే ఉంచి కొన్ని అదనపు క్లాసులు చెప్పడం అన్నమాట. ఈ ఎక్స్‌ట్రా క్లాసులను ఒప్పుకునే పేరెంట్స్ ఉన్నారు. స్కూల్ టైమ్‌లో చెప్పక ఇదేమిటని విసుక్కునే వారూ ఉన్నారు. ఎక్స్‌ట్రా క్లాసుల మంచి చెడుల విశ్లేషణ.
స్కూల్స్ వేళల నిబంధనలను అనుస రించి ప్రతి పాఠశాల నిర్దేశిత సమయం లోనే తమ పనివేళలు సర్దుబాటు చేసుకో వలసి ఉంది. ప్రాధమిక తరగతులకు ఉ॥ 8-30 నుండి సాయంత్రం 3-30 వరకు, ప్రాధమికోన్నత తరగతులకు ఉ॥ 9 గంటల నుంచి సాయంత్రం 4 గం॥ వరకు, ఉన్నత తరగతులకు ఉ॥ నుండి సాయంత్రం 4-40 వరకు సాధారణ పనివేళలుగా నిర్ణయించారని మనకు తెలుసు. యాజమాన్యం విద్యా శాఖ నుండి అనుమతి పొందినట్లైతే ఈ పని వేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అన్ని పాఠశాలలూ తమ పనివేళలకు అదనంగా మరో గంట లేదా రెండు గంటలు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇవి సహేతుకమైనవేనా? ఈ తరగతుల్లో ఏం బోధిస్తారు? విద్యార్థులకు ఇవి ఎంత వరకు ఉపయోగకరం? వీటి సద్వినియో గానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలా తమ పాత్రలను నిర్వహించాలి? తల్లిదండ్రు లు ఎలా స్పందించాలి? అనే అంశాలను చర్చిద్దాం.
వైయక్తిక బోధన ః విద్యా మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తలు తరగతి గదిలో వ్యక్తిగత భేదాలను అనుసరించి బోధించేందుకు ప్రాధాన్యత నిచ్చారు. మాములుగా క్లాస్‌రూమ్‌ల్లో వ్యక్తిగత బోధనకు సమయం సరిపోదు. అక్కడ ‘టీమ్ టీచింగ్’ కే ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం జరుగుతుంది. తరగతి గదిలో గుర్తించిన అభ్యసన అసమానతలను ప్రత్యేక తరగతిలో సరిదిద్దే అవకాశం ఉపాధ్యాయునికి లభిస్తుంది.
కనీస అభ్యసన స్థాయి అందించడం ః విద్యార్థులు అసలు తాము బోధించబోయే పాఠ్యాంశ జ్ఞాన స్థాయిలో ఉన్నారా? లేదా? అనే సందేహం ప్రతి టీచర్‌కు కలుగుతుంది. ‘మీరు ఫాలో అవుతున్నారా’.. . అని తరచుగా తరగతిలో ప్రశ్నిస్తూనే ఉంటారు. ‘ఫాలో’ అవ్వకపొవడం అనేది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది ః విద్యార్ధికి కనీస అభ్యసన స్థాయి లేకపోవడం, దీన్ని సవరించడానికి ప్రత్యేక అదనపు తరగతుల అవసరం ఎంతో ఉంది. ఇది విద్యా సంవత్సరం ఆరంభంలోనే జరగాలి. లేకుంటే విద్యార్ధి అభ్యాసం గాడితప్పే ప్రమాదముంది. ఇక రెండవది ః ఉపాధ్యాయుని బోధనావిధానంద. బోధనాపద్ధతి సరళంగా, విద్యార్ధి కేంద్రంగా, లైవ్ ఎగ్జాంపుల్స్ తో అహ్లాదంగా ఉన్నప్పుడు విద్యార్ధిని అభ్యసనం దిశగా మళ్లించవచ్చు. అందుకు ప్రత్యేక తరగతులు అవసరం.
హోమ్‌వర్క్ భారం తగ్గుతుంది ః అదనపు సమయంలో విద్యార్థులు తమకిచ్చిన హోంవర్క్ మొత్తాన్నయినా లేదా అందులో ఎక్కువ భాగాన్నయినా చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చేయడం వల్ల తగు సూచనలు పొందే అవకాశం ఉంటుంది.
ట్యూషన్ల అవసరం ఉండదు! స్కూల్స్‌లో అదనపు తరగతులు నిర్వహించేటప్పుడు ప్రతిరోజూ ఒక్కో తరగతికి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులను అంటే రెండు సబ్జెక్టులు కవర్ అయ్యేటట్లు ప్లాన్ చేస్తారు. ఇది ఇటు విద్యార్థులకు, అటు ఉపాధ్యాయులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. వీరు తమ సబ్జెక్టులకు ప్రాధాన్యతనిస్తూ ఇతర సబ్జెక్టులలో కూడా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఒక వారంలో అన్ని సబ్జెక్టులూ రెండుసార్లు రివిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంటికి వెళ్ళి ప్రెష్ అప్ అయి మళ్ళీ పుస్తకాల బ్యాగ్ వేసుకొని ట్యూషన్‌కు వెళ్ళే బాధ తప్పుతుంది.
ఒత్తిడి నుంచి బయటపడేదిలా! పాఠశాల యాజమాన్యం అదనపు తరగతులను ప్రయోజనా త్మకంగా నిర్వహించాల్సిన బాధ్యతను తీసుకొవాల్సి ఉంది. అదనపు తరగతులకు ముందు ఓ అరగంట మెడిటేషన్, డ్రిల్లింగ్ చేయిస్తే అప్పటి దాకా తరగతి గదిలో కూర్చున్న విద్యార్ధికి మానసికంగా, శారీరకంగా పునరుత్తేజం లభిస్తుంది. ప్రతి రోజు తప్పనిసరిగా అదనపు తరగతులలో ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి. మధ్యలో ఒక్కో విద్యార్ధిని మాట్లాడడానికి ప్రొత్సహిస్తూ వారికి సబ్జెక్టులపై గల అవగాహనను స్వేచ్చగా వెలువరించేలా చేయాలి. మొత్తానికి అదనపు తరగతులు సాధారణ తరగతులకు భిన్నంగా విద్యార్ధి స్వతంత్య్రంగా ఇన్‌వాల్వ్ అయ్యేలా నిర్వహించాలి.
ఇలా చేయండి 1.మొదటి రెండు యూనిట్ టెస్ట్‌లు, అసైన్‌మెంట్‌ల ఆధారంగా విద్యార్థుల మెరిట్‌ను మ్యాపింగ్ చేయాలి. 2.మెరిట్ మ్యాపింగ్ ఆధారంగా అదనపు తరగతుల్లో ఏయే సబ్జెక్టులకు ఎంత సమయం అవరసరమో నిర్ణయించి పీరియడ్లు కేటాయించాలి. 3.స్కూల్ లాంగ్‌బెల్ అయిన తరువాత ఓ అరగంట మెడిటేషన్, డ్రిల్లింగ్, పాటలు, ఆటలు లాంటి సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించాలి. 4.సాధారణ తరగతి గదిలో తోటిపిల్లలు ఏమనుకుంటారో అని చాలా మంది విద్యార్థులు సందేహాలు అడగరు. వారికి అదనపు తరగతులు వేదిక కావాలి. 5పతి విద్యార్థికీ ఉపాధ్యాయుల వద్ద అన్ని అంశాల గురించి చర్చించే స్వేచ్ఛను ఇవ్వాలి. 6.హోంవర్క్ చేయలేని పిల్లలను చిరునవ్వుతో మృదువుగా ప్రశ్నించి అందుకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. 7.మీ పిల్లలు ఫలానా సబ్జెక్టులో ఫాలో కావడం లేదు. అందుకే అదనపు తరగతులు నిర్వహిస్తున్నాం అని తల్లిదండ్రుల సమావేశంలో స్పష్టం చేయాలి. ఇక వారు బయటి ట్యూషన్స్ జోలికి పోరు. 8.తరగతి గది, పాఠశాల, టీచర్స్ , ప్రిన్సిపాల్ ఉన్నది తన అభివృద్ధి కోసమేనని విద్యార్ధి గ్రహించేలా చేస్తే అభ్యసనానికి నిరంతరం సంసిద్ధుడుగా ఉంటాడని గ్రహించాలి. 9.సాధారణ తరగతిలో అత్యంత ప్రతిభ చూపించే పిల్లలకు కూడా విస్తృతమైన అధ్యయనం, లోతైన విశ్లేషణ దిశగా ప్రేరణనిచ్చి టాపర్స్‌గా తీర్చిదిద్దడానికి అదనపు తరగతులను ఉపయోగించాలి.
Other News
|
|