Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
Sponsor Namasthe Telangana Telugu Daily From Online
Namasthe telangana Videos
Saturday, May 25, 2013
 


Home >> School News
ఉపాధ్యాయ విద్యకు ఊతం ఇచ్చే జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి సంస్థలు

kids talangana patrika telangana culture telangana politics telangana cinemaడియస్‌సి ఎస్.జి.టి, స్కూల్ అసిస్టెంట్స్ ఇతర కేటగిరి రాతపరీక్షల్లో కొత్తగా ప్రవేశపెట్టిన విద్యా దృక్పథాలు (పరస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్)లో మొత్తం ఐదు అధ్యాయాలున్నాయి. వీటి నుంచి 10 మార్కులకు గాను 20 ప్రశ్నలు ఇస్తారు. ఈ ఐదు అధ్యాయాలలో కీలకమైన ఉపాధ్యాయ సాధికారత (Teacher Empowerment) నుంచి నాలుగైదు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో ఉపాధ్యాయ విద్యకు పాటు పడుతున్న ఉపాధ్యాయ సంస్థలపై ప్రాక్టీసు ప్రశ్నలు అందిస్తున్నాం.

1. ఉపాధ్యాయ విద్యకు సంబంధించి వృత్తిపూర్వ, వృత్యంతర శిక్షణ విద్యా ప్రణాళిక, మూల్యాంకన విషయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇచ్చే సంస్థ కిందివాటిలో? ( )
1. ఎన్‌సిఇఆర్‌టి 2. ఎన్‌సిటిఇ
3. ఎస్‌ఐఇటి 4. ఎస్‌సిఇఆర్‌టి
2. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సిటిఇ)ని ఎప్పుడు ప్రారంభించారు? ( )
1. 1973 2. 1993
3. 1983 4. 1989
3. ఎన్‌సిటిఇ సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో లేనిది?( )
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చేత అమలు చేసే ప్రణాళికా పథకాల అభివృద్ధిని సమీక్షించడం
2. ఉపాధ్యాయ విద్యలో ఉన్నత స్థాయిలు చేరడానికి ప్రభుత్వానికి తగిన సూచనలు చేయడం
3. రాష్ట్రాల విద్యా బోర్డులకు ప్రశ్నాపత్రాల రూపకల్పనలో సహకరించడం
4. ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి తగిన స్థాయిలో ఉంచడం
4. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎప్పుడు చట్టబద్ధ మైన సంస్థగా రూపొందినది? ( )
1. 1993 2. 1983
3. 1973 4. 1963
5. ఎన్‌సిటిఇ ఎక్కడ ప్రారంభించారు? ( )
1. బెంగుళూరు 2. ముంబై
3. ఢిల్లీ 4. చెన్నై
6. జాతీయ విద్య, పరిశోధన శిక్షణా మండలి కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయం ప్రతిపత్తిగల సంస్థగా ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? ( )
1. 1981 2. 1991
3. 1971 4. 1961
7. ఎన్‌సిఇఆర్‌టి సంస్థకు ఎవరు అధ్యక్షులుగా వ్యవహ రిస్తారు? ( ) 1. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి 2. కేంద్ర విద్యాశాఖ మంత్రి
3. రాష్ట్ర గవర్నర్ 4. కేంద్ర సమాచార మంత్రి
8. ఎన్‌సిఇఆర్‌టికి అనుబంధంగా దేశంలోని నాలుగు నగరాల్లో రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్వహి స్తున్నారు. ఇందులో తప్పుగా ఉన్న నగరం ఏది? ( )
1 కలకత్తా 2. మైసూరు
3. భోపాల్ 4. ఆజ్మీర్
9. జాతీయ విద్య, పరిశోధన, శిక్షణ మండలి నిర్వహించే కార్యకలాపాలలో సరికానిది ఏది? ( )
1. యునిసెఫ్ సహకారంతో విజ్ఞాన శాస్త్ర బోధనా సామాగ్రి మెరుగుపర్చడం
2. పాఠశాల విద్యకు చెందిన జాతీయ విద్యా ప్రణాళికా చట్రం రూపొం దించడంలో సూచనలు అందించడం
3. రాష్ట్రాల విద్యా బోర్డులకు ప్రశ్నాపత్రాల రూపకల్పనలో సూచనలివ్వడం
4. ఉపాధ్యాయ నైతిక నియమావళిని రూపొందించి అమలు చేయడం.
10.


 Progr0 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema
జాతీయ, ప్రాంతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థల బోధనా పద్ధతులపై, మూల్యాంకన విధానంపై నూత న ప్రమేయాలపై వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించే సంస్థ ఏది? ( )
1. ఎన్‌సిటిఇ
2. ఎన్‌సిఇఆర్‌టి
3. ఎస్‌ఐఇటి
4. ఎస్‌ఆర్‌సి
11. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్‌సి) వారి సిలబస్‌ననుసరించి 1 నుంచి 12వ తరగతి వరకూ అన్ని సబ్జెక్టులకు ఇంగ్లిష్, హిందీ భాషలలో పాఠ్య గ్రంథాలు తయారు చేయడం, ప్రచురించడం ఎవరి బాధ్యత? ( )
1. జాతీయ విద్య, పరిశోధన శిక్షణా మండలి
2. రాష్ట్ర వనరుల కేంద్రం
3. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి
4. జిల్లా విద్యా శిక్షణా సంస్థ
12. ఎన్‌సిఇఆర్‌టిలో భాగంగా కేంద్రీయ విద్యా వికాస కేంద్రం సిఐఇటి సంస్థ ఎప్పుడు ప్రారంభించింది? ( )
1. 1971 2. 1972
3. 1982 4. 1992
13. విద్యా శాస్త్ర విషయాలకు సంబంధించి, దూర విద్యా కార్యక్రమాలకు సంబంధించి విద్యా, సాంకేతిక, శాస్త్ర సామాగ్రికి సంబంధించి రాష్ట్ర స్థాయి సంస్థలకు సలహా కేంద్రంగా పని చేస్తున్న సంస్థ? ( )
1. ఎస్‌సిఇఆర్‌టి 2. సిఐఇటి
3. ఎన్‌సిఇఆర్‌టి 4. ఎస్‌సిటిఇ
14. కేంద్రీయ దృశ్యమశవణ విద్యా వికాస కేంద్రానికి సంబంధించి సరికానిది? ( )
1. పరిశోధనా-మూల్యాంకన విషయాలపై ఎస్‌ఐఇటికి శిక్షణ ఇస్తుంది.
2. విద్యా సాంకేతిక శాస్త్రాలపై శిక్షణ ఇస్తుంది.
3. ఆడియో-వీడియో కార్యక్రమాల నిర్వహణలో శిక్షణ ఇస్తుంది.
4. పాఠ్య ప్రణాళికా, వాచకాలు తయారు చేయడం
15. కేంద్రీయ దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రము ఎన్‌సిఇఆర్‌టి ఆవరణలోని ఎక్కడ నిర్వహించడం జరుగుతుంది? ( )
1. చాచా నెహ్రూ భవన్‌లో 2. గాంధీ భవన్‌లో
3. సాంకేతిక భవన్‌లో 4. విద్యాభవన్‌లో
16. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణ మండలి ఎక్కడ స్థాపించారు? ( )
1. విశాఖపట్నం 2. హైదరాబాద్
3. వరంగల్ 4. కర్నూలు
17. రాష్ట్రంలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థల విద్యా విషయక, పాలన, నిర్వహణ వ్యవహారాల పర్యవేక్షణకు బాధ్యత వహించే సంస్థ? ( )
1. ఎస్‌సిటిఇ 2 ఎస్‌ఐఇటి
3. ఎస్‌సిఇఆర్‌టి 4. ఎస్‌ఆర్‌సి
18. ఎస్‌సిఇఆర్‌టి సంస్థ నిర్వహించే కార్యక్రమాలలో సరైనవి? ( )
1. విద్యార్థులలో, ఉపాధ్యాయులలో వైజ్ఞానిక, పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడం.
2. రాష్ట్ర విద్యా ప్రణాళికను, పాఠ్య ప్రణాళికను తయారు చేయడం
3. వివిధ స్థాయిలో మూల్యాంకన పద్ధతులను సమీక్షించడం
4. పై అన్నీ
19. మన రాష్ట్రంలో దృశ్యమశవణ విద్యావికాస కేంద్రంను హైదరాబాద్‌లో ఎప్పుడు స్థాపించారు? ( )
1. 1982 2. 1985
3. 1992 4. 1995
20. ఎస్‌సిఇఆర్‌టి సంస్థ ప్రధాన ఉద్దేశాలలో లేనిది? ( )
1. పాఠ్య పుస్తకాలను సిద్ధం చేయడం
2. వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం
3. విద్యా సాంకేతిక శాస్త్రాంశాలపై శిక్షణనివ్వడం
4 మూల్యాంకన పద్ధతులను అభివృద్ధి పర్చడం

 Table40 tenalgana News talangana patrika telangana culture telangana politics telangana cinema

Other News
Most Viewed galleries


Home | About | Archives | Tarrif | Feedback | Contact | Font Help | Site Map
© 2011 Telangana Publications Pvt.Ltd
News Photo Galleries Features
Latest News
Telangana News
Seemandhra News
National News
International News
Festivals gallery
Actress gallery
Cinema gallery
Fashion gallery
Political gallery
Sports gallery
Zindagi
Turning Point
Mee Features
Life Style
Sunday magazine